పిల్లలు దైవంతో సమానం అంటారు. నిజమే మరి.. కల్లాకపటం లేని మనసులు వారివి. ప్రకృతిని పూర్తిగా ఆస్వాదించడం వారి నుంచే నేర్చుకోవాలి. పెద్దలు చేసే పనులను అనుకరిస్తూ వారు చేసే అల్లరి ఒక్కోసారి నవ్వు తెప్పిస్తుంటుంది.. మరోసారి అబ్బురపరుస్తుంటుంది. ప్రస్తుతం ఇలాంటి ఫోటో ఒకటి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ‘స్లిప్పర్ సెల్ఫీ’గా వైరలవుతోన్న ఈ ఫోటోలో ఐదుగురు చిన్నారులు చిరునవ్వులు చిందిస్తూ ఉండగా.. వారిలో ఒక పిల్లాడు చెప్పు(స్లిప్పర్)తో సెల్ఫీ తీస్తున్నాడు. ఈ చిన్నారుల సృజనకు నెటిజన్లే కాక బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా ఫిదా అయ్యారు. అంతే వెంటనే ఆ ఫొటోను ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేస్తున్నారు. ‘మీరు ఎంచుకున్న దాని బట్టే మీరు సంతోషంగా ఉంటారు’ అనే క్యాప్షన్‌తో ఈ ఫోటోను షేర్ చేశారు బాలీవుడ్ నటుడు బొమన్ ఇరానీ.
అయితే సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ మాత్రం ఇది ఫొటోషాప్‌లో ఎడిట్ చేసిన ఫోటో కావొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. ‘నేనిలా అంటున్నందుకు క్షమించండి. ఇది ఫొటోషాప్ చేసిన చిత్రమని నాకనిపిస్తుంది. స్లిప్పర్ పట్టుకున్న చేతికి, మరో చేతికి తేడా ఉన్నట్లు అనిపిస్తుంది’ అంటూ అమితాబ్ ట్వీట్ చేశారు. కానీ చాలామంది నెటిజన్లు బిగ్‌బీతో ఏకీభవించడం లేదు. ‘అమిత్ జీ.. అది ఫొటో షాప్ చేసిన చిత్రం కాదు. నేను క్రాస్ చెక్ చేయించా. అది నిజమైందే’ అంటూ ఓ నెటిజన్ బిగ్ బీకి సమాధానమిచ్చాడు.
.. with due respect and apology .. i feel this is photoshopped .. notice that the hand that holds the chappal is different than the rest of his body in size .. to his other hand by his side !!
— Amitabh Bachchan (@SrBachchan) February 3, 2019
Comments
Please login to add a commentAdd a comment