slipper
-
అమానవీయ ఘటన.. దళితునితో చెప్పులు నాకించి..
లక్నో: మధ్యప్రదేశ్‌లో గిరిజన వ్యక్తిపై యూరినేషన్ సంఘటన మరవకముందే ఉత్తరప్రదేశ్‌లో మరో అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి దళిత యువకునితో చెప్పులు నాకించాడు. అనంతరం బాధితున్ని కుంజీలు తీయించాడు. అతనిపై పరుష పదజాలంతో బూతులు తిడుతూ దాడి చేశాడు. ఈ ఘటన సోనభద్ర జిల్లాలో వెలుగులోకి రాగా.. పోలీసులు అప్రమత్తమయ్యారు. నిందితున్ని అరెస్టు చేశారు. Video: Dalit Man Slapped, Forced To Lick Slipper In Uttar Pradesh https://t.co/AR6lx8dCSH pic.twitter.com/1wMGWNS06C — NDTV News feed (@ndtvfeed) July 8, 2023 దళిత వ్యక్తి తన మామయ్య ఇంట్లో ఎలక్ట్రిసిటీ సమస్య కారణంగా లైన్మెన్ తేజ్‌బలి సింగ్‌ని ఇంటికి పిలిచారు. ఈ అంశంలో వివాదం రాగా.. తేజ్‌బలి సింగ్ రెచ్చిపోయాడు. దళిత వ్యక్తితో చెప్పులు నాకించాడు. కుంజీలు తీయించాడు. ఆ తర్వాత అతనిపై దాడి చేశాడు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కాగా.. నెటిజన్లు ఫైరవుతున్నారు. ఈ ఘటనపై పోలీసుల అప్రమత్తమయ్యారు. కేసు నమోదు చేసి నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు. ఇదీ చదవండి: మధ్యప్రదేశ్‌లో మరో వికృత చేష్ట.. వీడియో వైరల్ -
వైరల్ వీడియో: చెప్పు తీసుకొని పాము పరార్
-
పిల్లల కథ: ఎవరికి విలువ?
ఒకరోజు ఒంటరిగా ఒక మూల కూర్చొని బాధపడుతున్న చెప్పుల దగ్గరకు టోపీ వచ్చి ‘ఏం చెప్పుమామా! దిగాలుగా ఉన్నావు’ అని పలకరించింది. దానికి జవాబుగా చెప్పు ‘ఏంలేదు అల్లుడు! రోజంతా నన్ను తొక్కి తొక్కి.. నా నారతీసి చివరికి ఇలా మూలనపడేస్తున్నారు ఈ మనుషులు. వాళ్ళ బరువు మోయలేక, వాళ్లు తిరిగే దారిలో ముళ్ళు, రాళ్ళ దెబ్బలు, మురుగు వాసన భరించలేక అలసిపోతున్నాను. నా మీద జాలి కూడా ఉండదు. అవసరం తీరిపోగానే, కనీసం శుభ్రం చేయకుండానే పక్కన ఇలా పడేస్తారు’ అని ఏడవసాగింది. చెప్పు వేదన విని టోపీ కళ్ళల్లో నీళ్ళు చిమ్మాయి. ‘నా బాధ ఎవరోతో చెప్పుకోను మామా! నన్ను ఎండలో మాడ్చేసి, వర్షంలో తడిపేసి నాలో తేజస్సు మొత్తం హరించేస్తున్నారు. అవసరం తీరాక నన్ను కూడా ఏదో ఒక మూల పడేస్తారు. అవసరం ఉన్నంత వరకే మన ఉపయోగం. తర్వాత మనల్ని పట్టించుకునే నాథుడే ఉండడు’ అంటూ వాపోయింది టోపీ. వీళ్ల సంభాషణ మధ్యలోకి బట్టలు వచ్చాయి.. ‘మీ పని పరవాలేదు కానీ మాకు మరీ నరకం. ఎండ, వాన, చలి అని తేడా లేకుండా రోజంతా పని చేస్తాం. దుమ్ము, ధూళి, చెమట వాసన భరించలేకపోతున్నాం. కాస్త రంగు మారితే మమ్మల్ని పక్కన పడేస్తున్నారు’ అంటూ భోరున కన్నీరు కార్చాయి. చెప్పు, టోపీ, బట్టల వేదనాభరితమైన సంభాషణను పక్క నుండి వింటున్న బంగారం వారందరినీ పిలిచింది. ‘మీరంతా పిచ్చివాళ్ళలా ఆలోచించకండి.. నన్ను ఈ మనుషులు ఆడంబరం కోసం మీ అందరి కన్నా ఎక్కువ డబ్బులు పోసి కొని, తమ దర్జా చూపడానికి వేడుకల్లో నన్ను అలంకరించుకుని, తర్వాత బీరువాలో దాచేస్తుంటారు. మనల్ని తమ అవసరం కోసం మనిషి తయారుచేశారని మనం గుర్తుంచుకోవాలి. మీరు నిరంతరం మనిషికి ఉపయోగపడతారు. నేను కేవలం ఆడంబరం కోసం మాత్రమే ఉపయోగపడతాను. ఒక్కో సమయంలో ఒక్కో వస్తువుకు ప్రాధాన్యం ఉంటుంది. ఈ సృష్టిలో ఏది కూడా ప్రాధాన్యం లేకుండా ఉండదు. సమయాన్ని బట్టి వాటికి విలువ ఉంటుంది. అందుచేత మీరు అనవసరంగా ఆలోచించి, మీ విలువను మీరు తగ్గించుకుని బాధపడకండి’ అని హితబోధ చేసింది. ఆ మాటలు విన్న మిగతా వస్తువులు వాటి విలువ తగ్గలేదని తెలుసుకుని బంగారానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఆనందంగా సేదతీరాయి. అదేవిధంగా ఈ సృష్టిలో మనిషి కూడా ఏదో ఒక సమయంలో తన విలువ కాపాడుకోవడానికి ప్రయత్నిస్తూ, ఎదుటివారిని బాధపెడుతుంటారు. ఈ భూమిపై పుట్టిన ప్రతి జీవరాశికి ఒక ప్రాధాన్యం ఉంటుంది. అది మనతో పాటు ఎదుటివారికి కూడా ఉపయోగపడుతుంది. ఆ విషయాన్ని మనమంతా గుర్తించి ఆనందంగా జీవిద్దాం. అందరికీ ఆనందాన్ని పంచుదాం. ఇతరులను గౌరవిస్తూ ముందడుగు వేస్తేనే ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం జరుగుతుంది. మరిన్ని పిల్లల కథల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
మంత్రి కారు పై చెప్పులు విసిరి అవమానించిన బీజేపీ కార్యకర్తలు అరెస్టు
చెన్నై: తమిళనాడు ఆర్థిక మంత్రి పళనివేల్ త్యాగ రాజన్ కారుపై చెప్పులు విసిరి ఘెరంగా అవమానించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆర్థిక మంత్రి జమ్ము కాశ్మీర్‌లోని రాజౌరి జిల్లాలో ఉగ్రవాదులతో జరిగిన ఎన్కౌంటర్లో విధి నిర్వహణలో మరణించిన రైఫిల్‌మెన్ డి లక్ష్మణన్‌కి నివాళులర్పించేందుకు మధురై వచ్చారు. ఆ సమయంలోనే ఒక మహిళ కిందకి వంగి ఆర్థిక మంత్రి కారుపై చెప్పులు విసిరి అవమానించింది. వాస్తవానికి కారు విండ్ మూసి ఉండటంతో ఆయన త్రుటిలో తప్పించుకున్నారు. ఆ రోజు నివాళులర్పించేందుకు ఉద్దేశించిన స్థలం అంతా బీజేపీ కార్యకర్తలతో నిండిపోయిందని డీఎంకే పార్టీ అధికారి అన్నారు. ఆ రోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె అన్నామలై కూడా నివాళ్లులర్పించేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు. ఇలాంటి గౌరవ వందన కార్యక్రమాల్లో కలెక్టర్‌తో సహా నియమించబడిన సభ్యులు మాత్రమే ఇందులో భాగం కావలి. కానీ బీజేపీ అధ్యక్షుడు అన్నామలై ఫోటోల పిచ్చితో మిలటరీ ప్రోటోకాల్ ఉల్లంఘంచి మరీ నివాళులర్పించేందుకు ముందుకు వచ్చారు. ఆ సమయంలోనే ఆర్థిక మంత్రి పళనివేల్‌కి ఈ చేదు అనుభవం ఎదురైంది. పైగా అప్పుడే కొంతమంది బీజేపీ కార్యకర్తలు ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు కూడా చేశారు. దీంతో పోలీసు ఈ ఘటనకు కారణమైన ఐదుగురు అనుమానిత వ్యక్తులను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. ఐతే ఆ ఐదుగురు బీజీపీ పార్టీ సభ్యులేనని పోలీసులు తెలిపారు. ఇంకా దర్యాప్తు జరుగుతుందని వాళ్లు ఎందుకు ఇలా చేశారో కారణాలు తెలియలేదని వెల్లడించారు. వాస్తవానికి ఆ సమయంలో రెజిమెంట్ మాత్రమే చివరిగా నివాళులర్పిస్తారు. పేరు వస్తుందని ఇలా ఫోటోల కోసం దేశభక్తి పేరుతో సైనికులకు నివాళులర్పించడం సరి కాదని, కావాలంటే సైనిక సేవ చేయండి అంటూ బీజేపీ అధ్యక్షుడికి డీఎంకే పార్టీ అధికారి గట్టి కౌంటరిచ్చారు. (చదవండి: ఐదు వేల మందితో.. ప్రపంచంలో అతిపెద్ద ‘జాతీయ జెండా మానవహారం’) -
వివాహేతర సంబంధం, హత్య కేసు.. నిందితుడిని పట్టించిన ‘చెప్పు’
ముంబై: వివాహేతర సంబంధం ఓ వ్యక్తి హత్యకు దారి తీసింది. దాదాపు 15 రోజులుగా కేసు చేధించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు పోలీసులు. ఈ క్రమంలో వారికి దొరికిన ‘చెప్పు’.. కేసును పరిష్కరించింది.. నిందితులను పట్టించింది. ఈ సంఘటన పుణెలో చోటు చేసుకుంది. ఆ వివరాలు.. బవ్ధాన్ ప్రాంతానికి చెందిన 27 ఏళ్ల వ్యక్తి 2021, అక్టోబర్ 22 నుంచి కనిపించకుండా పోయాడు. ఈ క్రమంలో అతడి తల్లి దీని గురించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు కిడ్నాప్ సహా పలు యాంగిల్స్‌లో దర్యాప్తు కొనసాగించారు. ఈ క్రమంలో పోలీసులుకు తప్పిపోయిన వ్యక్తి చెప్పు.. ఓ ఇంటి ముందు కనిపించింది. ఆ ఇంట్లో ఉంటున్న వ్యక్తిని స్టేషన్‌కు పిలిపించారు పోలీసులు. (చదవండి: ‘నన్ను తక్కువ అంచనా వేశావ్’: మృగాడికి చుక్కలు చూపించిన మహిళ) దర్యాప్తులో పోలీసులకు షాకింగ్ విషయాలు తెలిశాయి. తప్పిపోయిన వ్యక్తిని సదరు ఇంటి యమజాని హత్య చేశానని తెలిపాడు. చంపేటంత కోపం ఏంటని ఆరా తీయగా.. హత్య గావించబడిని వ్యక్తికి తన భార్యతో వివాహేతర సంబంధం ఉందని.. అందుకే అతడిని చంపేశానని తెలిపాడు. అక్టోబర్ 21న చనిపోయిన వ్యక్తి మొబైల్ నంబర్ నుంచి తన భార్యకు రెండు మిస్డ్ కాల్స్ వచ్చాయని తెలిపాడు నిందితుడు. (చదవండి: భూతవైద్యం చేసే మహిళతో ‘సంబంధం’.. ఇటీవల దూరం పెట్టడంతో...) అంతేకాక అదేరోజు రాత్రి బాధితుడు తన ఇంటికి వచ్చి భార్యను కలిశాడని వెల్లడించాడు. వారి బంధం గురించి తెలిసిన నిందితుడు.. మరో ఇద్దరి సాయంతో బాధితుడిని హత్య చేశాడు. కత్తితో పొడిచి చంపాడు. ఆ తర్వాత మృతదేహాన్ని తగలబెట్టాడు. ప్రస్తుతం పోలీసులు ఇద్దరిని పుణెలో అరెస్ట్ చేయగా.. మరో వ్యక్తిని మధ్యప్రదేశ్‌లో అదుపులోకి తీసుకున్నారు. చదవండి: తొమ్మిదేళ్ల క్రితం పెళ్లి.. ఏడాదిగా మరో పరిచయం.. ప్రియుడితో కలిసి -
సర్పంచ్‌ని చెప్పుతో కొట్టిన మహిళా ఉపసర్పంచ్
నిర్మల్: సర్పంచ్‌పై మహిళా ఉపసర్పంచ్ చెప్పుతో దాడి చేసిన ఘటన నిర్మల్ జిల్లలాలో గురువారం చోటు చేసుకుంది. ఆ వివరాలు.. నిర్మల్ జిల్లా మహాగామ్ గ్రామంలో చెక్కులపై ఫోర్జరీ సంతకాలు చేస్తున్నారనే ఆరోపణపై గురువారం విచారణ చేస్తున్నారు. ఈ క్రమంలో సర్పంచ్ రాకేష్‌కు, ఉప సర్పంచ్ శారదకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. (చదవండి: వేరే మహిళతో భర్త సంబంధం.. సర్పంచ్ తట్టుకోలేక..) ఈ క్రమంలో సర్పంచ్, ఉపసర్పంచ్ వర్గీయుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఈ క్రమంలో ఉప సర్పంచ్ శారద.. సర్పంచ్ రమేష్‌ని చెప్పుతో కొట్టింది. -
‘నన్ను తక్కువ అంచనా వేశావ్’: మృగాడికి చుక్కలు చూపించిన మహిళ
భోపాల్: తనను చెరపట్టబోయిన కామాంధుడి పాలిట అపరకాళికలా మారింది ఆ యువతి. చెప్పు తీసుకుని తన జోలికి వచ్చిన వాడి తుప్పురేగొట్టింది. అంతటితో ఊరుకోక.. రోడ్డు మీద వాడి చేత క్షమాపణ చెప్పించింది. ఆమె తెగువను ప్రశంసిస్తున్నారు జనాలు. ఆ వివరాలు.. మధ్యప్రదేశ్ రాజ్‌గఢ్ ప్రాంతానికి చెందిన సదరు మహిళ చాపిహేరా ప్రాంతంలో బ్యూటీపార్లర్ నడుపుతుంది. ఈ క్రమంలో ఆమె రెండు రోజుల క్రితం సాయంత్రం ఇంటికి వెళ్తుండగా రోడ్డు మీద ఓ వ్యక్తి ఆమెను ఢీకొన్నాడు. ఆ సమయంలో నిందితుడు బాగా తాగి ఉన్నాడు. మహిళను ఢీకొట్టడమేకాక ఆమెతో గొడవపడ్డాడు. అనంతరం ఆమెను లైంగికంగా వేధించసాగాడు. సదరు మహిళ ఎన్నిసార్లు హెచ్చరించినా ఆ మూర్ఖుడు తన బుద్ధి మార్చుకోలేదు. (చదవండి: మహిళ పోలీస్ అధికారి బాత్రూమ్లో కెమెరా.. స్నానం చేస్తుండగా..) ఓపిక నశించిన సదరు మహిళ బస్టాండ్ సమీపంలో.. నడి రోడ్డు మీద ఆ మృగాడిని చెప్పు తీసుకొని కొట్టింది. మత్తు దిగేదాకా చెప్పు దెబ్బలు కొడుతూనే ఉంది. స్పృహ వచ్చి.. పారిపోదామాని భావించిన నిందితుడిను అలాగే పట్టుకుని.. తనకు క్షమాపణ చెప్పేవరకు వదిలిపెట్టలేదు. నిందితుడు కింద కూర్చొని.. దండం పెడితే కానీ అతడిని వదలలేదు. (చదవండి: మాట్లాడాలని పిలిచి బాలిక కంట్లో యాసిడ్ పోసి..) చివరగా.. నన్ను తక్కువ అంచాన వేశావ్.. నీలాంటి నీచులకు ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు. ఇంకోసారి కనిపించావో నా చేతుల్లో చచ్చావే అని హెచ్చరించి మరి వదిలిపెట్టింది. ఇక సదరు మహిళ మృగాడిని కొడుతున్న సమయంలో చాలా మంది గుమికూడారు. ఆమె చేస్తున్న పనిని ప్రశంసించారు. చదవండి: మైనర్‌పై లైంగికదాడికి యత్నం: ‘దిశ’తో అరగంటలో నిందితుడు అరెస్ట్ -
ఆ హీరో తల్లి నన్ను చెప్పుతో కొట్టడానికి ప్రయత్నించింది: రేఖ
సినీ పరిశ్రమలో ప్రేమించడం, విడిపోవడం సర్వసాధారణం అన్నట్లు కనిపిస్తాయి. ఇక ఎవరైనా హీరో-హీరోయిన్ కాస్త సన్నిహితంగా ఉంటే చాలు వారి మధ్య ఏదో నడుస్తుందనే ప్రచారం జోరుగా సాగుతుంది. ఈ ధోరణే ఎప్పటి నుంచో ఉంది. 1970 దశకంలో ఇలాంటి లవ్‌ట్రాక్ వార్తలు ఎక్కువగా అప్పటి హీరోయిన్ రేఖ గురించి వచ్చేవి. అందం, అభినయంతో ఉత్తమ నటిగా ఎందరో అభిమానాన్ని, ఎన్నో అవార్డులను దక్కించుకున్న రేఖ గురించి.. మీడియాలో మాత్రం ఎక్కువగా వచ్చే వార్తలు ఆమె లవ్ ట్రాక్‌కు సంబంధించినవే. రేఖ-వినోద్ మెహ్రాల లవ్ ట్రాక్ కూడా ఇలానే వార్తల్లో నిలిచింది. వినోద్ మెహ్రా, రేఖతో పీకల్లోతు ప్రేమలో పడిపోయాడు. కానీ ఆయన కుటుంబం మాత్రం రేఖను అంగీకరించలేదు. ముఖ్యంగా వినోద్ మెహ్రా తల్లి వీరిద్దరి బంధాన్ని గట్టిగా వ్యతిరేకంచేవారు. రేఖ పట్ల ఆమె వ్యతిరేకత ఎంత తీవ్రంగా ఉండేదో తెలిపే సంఘటనకు సంబంధించిన వార్త ఒకటి అప్పట్లో మీడియాలో వచ్చింది. ఆ క్లిప్పింగ్‌లోని వివరాలు.. (చదవండి: ‘పెళ్లైన మగాడి వెంట పడొచ్చా’.. రేఖ ఆన్సర్) పీకల్లోతు ప్రేమలో మునగిపోయిన రేఖ-వినోద్మెహ్రాలు ఎవరికి చెప్పకుండా రహస్యంగా కోల్‌కతాలో వివాహం చేసుకున్నారు. అనంతరం వినోద్ మెహ్రా.. రేఖను తీసుకుని తన ఇంటికి వచ్చాడు. తల్లికి తాను పెళ్లి చేసుకున్న విషయం చెప్పాడు. ఈ వార్త విని వినోద్ తల్లి అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. రేఖ మీదకు ఆమెకు ఎంత కోపం వచ్చిందంటే.. తన చెప్పు తీసుకుని రేఖను కొట్టడానికి వెళ్లారు. తల్లిని శాంతిపజేసేందుకు వినోద్ మెహ్రా ఎంతో ప్రయత్నించాడు. కానీ ఆమె ఆగ్రహం చల్లారలేదు. రేఖను తీవ్రంగా అవమానించారు. వీటిని తట్టుకోలేకపోయిన రేఖ కన్నీరుపెట్టుకుంటూ వినోద్ ఇంటి నుంచి వెళ్లిపోయారు. (చదవండి: వైరల్: పాక్ పీఎం, బాలీవుడ్ హీరోయిన్ లవ్ స్టోరి) ఇంతటి అవమానం జరిగిన తర్వాత కూడా కొన్ని రోజుల పాటు రేఖ-వినోద్ మ్రెహా మాట్లాడుకుంటూనే ఉన్నారు. ఆ తర్వాత ఇద్దరు పరస్పర అంగీకారంతో విడిపోయారు. అనంతరం 1988లో వినోద్ మెహ్రా మరో మహిళను వివాహం చేసుకున్నాడు. దీని గురించి 1973లో రేఖ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘వినోద్ మెహ్రా తల్లి దృష్టిలో నేను కేవలం ఓ నటిని మాత్రమే కాదు.. ఎన్నో అపవాదులు ముటగట్టుకున్న ఓ మహిళను. గతంలో ఎన్నో చేదు అనుభవాలు కలిగిన మహిళను వినోద్ తల్లి తన కోడలిగా అంగీకరించడానికి ఇష్టపడలేదు’’ అని చెప్పుకొచ్చారు రేఖ. ఆ తర్వాత రేఖ.. ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త ముఖేష్‌ను వివాహం చేసుకున్నారు. అయితే అది కూడా ఎక్కువ కాలం సాగలేదు. పెళ్లైన ఏడు నెలలకే అతను ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పుడు కూడా అందరూ రేఖనే అనుమానించారు. ఇక వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్న రేఖ.. బయటకు మాత్రం చిరునవ్వులు చిందిస్తూ.. సందడి చేస్తూ కనిపిస్తారు. చదవండి: అమితాబ్-రేఖల లవ్ ట్రాక్: జయా బచ్చన్ ఏమన్నారంటే -
సీఎంని స్టాలిన్ చెప్పుతో పోల్చిన నాయకుడు
చెన్నై: మరో రెండు వారాల్లో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో పార్టీలన్ని ప్రచారంతో హోరెత్తిస్తున్నాయి. అధికార, ప్రతిపక్షాలు ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నాయి. తాజాగా, ముఖ్యమంత్రి పళనిస్వామిపై కేంద్ర మాజీ మంత్రి, డీఎంకే నేత రాజా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘సీఎం పళనిస్వామి.. డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ కాలికి వేసుకున్న చెప్పు పాటి విలువ కూడా చేయరు’ అంటూ రాజా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయ దుమారం రేపుతున్నాయి. ‘ఒకప్పుడు బెల్లం మార్కెట్లో కూలీగా పనిచేసి పళనిస్వామికి స్టాలిన్‌తో పోటీయా.. పళని కంటే స్టాలిన్ వేసుకునే చెప్పుకు విలువ ఎక్కువ.. అలాంటిది తనకు స్టాలిన్నే సవాల్ చేసే ధైర్యం ఉందా. నెహ్రూ, ఇందిరా గాంధీ, మోదీ సైతం చేయలేని సాహసం పళనిస్వామి చేస్తున్నాడంటే అందుకు కారణం డబ్బు. రాష్ట్రాన్ని లూటీ చేసిన తనను పార్టీని రక్షిస్తుందని భావిస్తున్నాడు. అటువంటి వ్యక్తి స్టాలిన్‌ను అడ్డుకుంటాను అంటున్నాడు. అదే జరిగితే సీఎం వాహనం తన నివాసం నుంచి కార్యాలయానికి వెళ్లదని నేను సవినయంగా మనవిజేస్తున్నాను’ అన్నాడు రాజా. డీఎంకే నేత రాజా చేసిన వ్యాఖ్యలను తనకు అనుకూలంగా మలచుకునే ప్రయత్నం చేస్తున్నారు పళనిస్వామి. తాను ఒక రైతునని, పేద కుటుంబం నుంచి వచ్చానని, అందువల్ల వినయంగా ఉంటానంటూ ప్రజల్లో తన మీద సానుభూతి పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే క్రమంలో 2జీ స్పెక్ట్రం కుంభకోణాన్ని ప్రస్తావించిన సీఎం.. కంటికి కనిపించని గాలితో కూడా కుంభకోణాలు చేసిన ఏకైక పార్టీ డీఎంకే అని ధ్వజమెత్తారు. ఈ క్రమంలో మదురై జిల్లా మెలూర్‌లోని ఎన్నికల ప్రచారంలో పళనిస్వామి మాట్లాడుతూ..‘నేను కష్టపడి ముఖ్యమంత్రి స్థాయికి వచ్చాను. కానీ స్టాలిన్ తండ్రి సీఎంగా ఉన్నందున ఆయన సిల్వర్ స్పూన్‌తో పుట్టారు. రాజా మాట్లాడిన భాష ఎలా ఉందో చూడండి.. నా విలువ స్టాలిన్ ధరించే చెప్పు కన్నా తక్కువని.. పొగరుగా మాట్లాడుతున్నారు. ఒక ముఖ్యమంత్రిని చెప్పుతో పోల్చి వారు ఎంతటి సంస్కారహీనులో నిరూపించుకున్నారు. నేను ఒక రైతును, మా పేదలు అలానే ఉంటారు.. మేము కష్టపడి పనిచేస్తాం.. మేం కొనుక్కోగలిగింది మాత్రమే కొనుగోలు చేస్తాం... కానీ వారు రూ. 1.76 లక్షల కోట్ల అవినీతి కుంభకోణం వెనుక ఉన్నారు. కాబట్టి కోరుకున్నది కొనుక్కుంటారు’ అంటూ పళనిస్వామి రాజాకు కౌంటర్ ఇచ్చారు. చదవండి: కింది స్థాయి నుంచి వచ్చా..: సీఎం -
ఆకతాయిల ఆగడాలకు ‘చెప్పు’ దెబ్బ
సాక్షి ప్రతినిధి, చెన్నై: అమ్మాయి కదా అని హద్దుమీరారో అలారం మోగుతుంది. తాకేందుకు ప్రయత్నించారో షాక్ కొడుతుంది. మాన, ప్రాణాలను కాపాడుకునేలా మహిళల పాదరక్షల్లో అమర్చే ఎలక్ట్రానిక్ పరికరాన్ని తమిళనాడుకు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థినులు రూపొందించారు. వివరాలు.. తంజావూరుకు చెందిన బీఈ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ పట్టభద్రురాలైన అమృతగణేష్ (33) 600కు పైగా పరికరాలను తయారుచేసింది. తంజావూరులోని ఒక ప్రయివేటు ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థినులు సంగీత, సౌందర్య, వినోదిని, విద్యార్థి మణికంఠన్‌లు అమృతగణేష్‌తో కలిసి అనేక పరిశోధనలు చేశారు. వేధింపుల బారినుంచి మహిళలు తమను తాము కాపాడుకునేందుకు వైర్లెస్ రిసీవర్, బ్యాటరీ, ఎలక్ట్రోడులను వినియోగించి పాదరక్షల్లో ఇమిడేలా ఒక పరికరాన్ని తయారుచేశారు. మహిళలు వేధింపులకు గురికాగానే వారు ధరించిన చెప్పుల్లోని ఆ పరికరం నుంచి వంద మీటర్ల వరకు వినిపించేలా అలారం మోగుతుంది. అంతేగాక ఆ చెప్పును నిందితునికి తాకిస్తే షాక్‌కు గురయ్యేలా తీర్చిదిద్దారు. ఈ పరికరానికి చార్జింగ్ చేయాల్సిన పనిలేదు. నడిచేటప్పుడే రీచార్జ్ అవుతుంది. ఈ పరికరాన్ని సెల్‌ఫోన్, రిస్ట్‌వాచ్‌లలో కూడా అమర్చుకోవచ్చు. (చదవండి: ఐటీ అధికారుల ముందుకు అర్చన కల్పత్తి) -
‘స్లిప్పర్ సెల్ఫీ’కి సోషల్ మీడియా ఫిదా
పిల్లలు దైవంతో సమానం అంటారు. నిజమే మరి.. కల్లాకపటం లేని మనసులు వారివి. ప్రకృతిని పూర్తిగా ఆస్వాదించడం వారి నుంచే నేర్చుకోవాలి. పెద్దలు చేసే పనులను అనుకరిస్తూ వారు చేసే అల్లరి ఒక్కోసారి నవ్వు తెప్పిస్తుంటుంది.. మరోసారి అబ్బురపరుస్తుంటుంది. ప్రస్తుతం ఇలాంటి ఫోటో ఒకటి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ‘స్లిప్పర్ సెల్ఫీ’గా వైరలవుతోన్న ఈ ఫోటోలో ఐదుగురు చిన్నారులు చిరునవ్వులు చిందిస్తూ ఉండగా.. వారిలో ఒక పిల్లాడు చెప్పు(స్లిప్పర్)తో సెల్ఫీ తీస్తున్నాడు. ఈ చిన్నారుల సృజనకు నెటిజన్లే కాక బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా ఫిదా అయ్యారు. అంతే వెంటనే ఆ ఫొటోను ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేస్తున్నారు. ‘మీరు ఎంచుకున్న దాని బట్టే మీరు సంతోషంగా ఉంటారు’ అనే క్యాప్షన్‌తో ఈ ఫోటోను షేర్ చేశారు బాలీవుడ్ నటుడు బొమన్ ఇరానీ. అయితే సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ మాత్రం ఇది ఫొటోషాప్‌లో ఎడిట్ చేసిన ఫోటో కావొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. ‘నేనిలా అంటున్నందుకు క్షమించండి. ఇది ఫొటోషాప్ చేసిన చిత్రమని నాకనిపిస్తుంది. స్లిప్పర్ పట్టుకున్న చేతికి, మరో చేతికి తేడా ఉన్నట్లు అనిపిస్తుంది’ అంటూ అమితాబ్ ట్వీట్ చేశారు. కానీ చాలామంది నెటిజన్లు బిగ్‌బీతో ఏకీభవించడం లేదు. ‘అమిత్ జీ.. అది ఫొటో షాప్ చేసిన చిత్రం కాదు. నేను క్రాస్ చెక్ చేయించా. అది నిజమైందే’ అంటూ ఓ నెటిజన్ బిగ్ బీకి సమాధానమిచ్చాడు. .. with due respect and apology .. i feel this is photoshopped .. notice that the hand that holds the chappal is different than the rest of his body in size .. to his other hand by his side !! — Amitabh Bachchan (@SrBachchan) February 3, 2019 -
ఆమెను వ్యభిచారి అన్నారు.. కేసు పెట్టాం
-
ఆమెను వ్యభిచారి అన్నారు.. కేసు పెట్టాం
సాక్షి, చెన్నై : బీజేపీకి చెందిన మహిళా నేత ఒకరు ఆలయంలో అనుచితంగా ప్రవర్తించారు. కరపత్రాలను పంచుతున్న కొంతమంది రైతులపైనా, వారి నాయకుడిపైనా చెప్పుతో దాడికి పాల్పడ్డారు. ఈ దృశ్యాలు కెమెరా కంటికి చిక్కారు. పైగా ఆమె దాడి చేయడమే కాకుండా తనకు ఇబ్బంది కలిగించిన వారిపై కేసులు నమోదు చేయాలంటూ చిర్రుబుర్రులాడారు. వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని తూత్తుకుడి జిల్లాలోగల ఆలయానికి నెళ్లయమ్మాల్ అనే ఆ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు వచ్చారు. అదే సమయంలో కొంతమంది రైతుల అసోసియేషన్ అదే ఆలయంలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కరపత్రాలు పంచుతున్నారు. జన్యుపరమైన మార్పులు చేసే వ్యవసాయాన్ని కేంద్రం ఆధరించడంపై వారు నిరసన వ్యక్తం చేస్తూ కరపత్రాలు ఇస్తున్నారు. ఆ సమయంలో అక్కడే ఉన్న నెళ్లయమ్మాల్ వారితో వాగ్వాదానికి దిగారు. వారిపై దుర్భాషలాడారు. ఆ రైతులంతా కూడా పెద్ద వయసులో ఉన్నారని కూడా చూడకుండా తన చెప్పును తీసుకొని వారిపై దాడికి పాల్పడ్డారు. అంతేకాదు.. మున్ముందు భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొంటావని కూడా ఆమె ఆ రైతు నాయకుడిని బెదిరించారు. అయితే, ఆ రైతులపై కేసులు నమోదు చేసినట్లు బీజేపీ రాష్ట్ర విభాగం చెప్పింది. రైతుల అసోసియేషన్ అధ్యక్షుడు అయ్యకన్ను ఆమెను వ్యభిచారి అంటూ దుర్భాషలాడారని, అందుకే అక్కడ పరిణామాలు చోటు కేసుకున్నాయని, దర్యాప్తు చేయాలని పోలీసులను కోరినట్లు వెల్లడించింది. -
ప్రియురాలి చెప్పుదెబ్బకు ప్రియుడికి జ్ఞానోదయం
-
పోకిరోడికి చెప్పుతో గుణపాఠం చెప్పిన మహిళ
-
'పొన్నాలకు చెప్పు చూపించాడు'
వరంగల్ : రాజకీయ నేతలపై చెప్పులు విసిరే సంస్కృతి నానాటికీ ఎక్కువ అవుతోంది. ... విషయం తెల్సిందే. తాజాగా తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యకు సోమవారం చేదు అనుభవం ఎదురైంది. జనగామలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయనకు వీవర్స్ కాలనీలో ఓ యువకుడు చెప్పు చూపించి తన నిరసన తెలిపాడు. దాంతో ఆగ్రహించిన కాంగ్రెస్ కార్యకర్తలు ఆ వ్యక్తిపై దాడి చేశారు. పోలీసులు ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు.