
సాక్షి, చెన్నై : బీజేపీకి చెందిన మహిళా నేత ఒకరు ఆలయంలో అనుచితంగా ప్రవర్తించారు. కరపత్రాలను పంచుతున్న కొంతమంది రైతులపైనా, వారి నాయకుడిపైనా చెప్పుతో దాడికి పాల్పడ్డారు. ఈ దృశ్యాలు కెమెరా కంటికి చిక్కారు. పైగా ఆమె దాడి చేయడమే కాకుండా తనకు ఇబ్బంది కలిగించిన వారిపై కేసులు నమోదు చేయాలంటూ చిర్రుబుర్రులాడారు. వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని తూత్తుకుడి జిల్లాలోగల ఆలయానికి నెళ్లయమ్మాల్ అనే ఆ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు వచ్చారు. అదే సమయంలో కొంతమంది రైతుల అసోసియేషన్ అదే ఆలయంలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కరపత్రాలు పంచుతున్నారు.
జన్యుపరమైన మార్పులు చేసే వ్యవసాయాన్ని కేంద్రం ఆధరించడంపై వారు నిరసన వ్యక్తం చేస్తూ కరపత్రాలు ఇస్తున్నారు. ఆ సమయంలో అక్కడే ఉన్న నెళ్లయమ్మాల్ వారితో వాగ్వాదానికి దిగారు. వారిపై దుర్భాషలాడారు. ఆ రైతులంతా కూడా పెద్ద వయసులో ఉన్నారని కూడా చూడకుండా తన చెప్పును తీసుకొని వారిపై దాడికి పాల్పడ్డారు. అంతేకాదు.. మున్ముందు భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొంటావని కూడా ఆమె ఆ రైతు నాయకుడిని బెదిరించారు. అయితే, ఆ రైతులపై కేసులు నమోదు చేసినట్లు బీజేపీ రాష్ట్ర విభాగం చెప్పింది. రైతుల అసోసియేషన్ అధ్యక్షుడు అయ్యకన్ను ఆమెను వ్యభిచారి అంటూ దుర్భాషలాడారని, అందుకే అక్కడ పరిణామాలు చోటు కేసుకున్నాయని, దర్యాప్తు చేయాలని పోలీసులను కోరినట్లు వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment