ఎదురుదాడే సమాధానమా? | BJP fired on trs government | Sakshi
Sakshi News home page

ఎదురుదాడే సమాధానమా?

Published Fri, Mar 3 2017 3:15 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

BJP fired on trs government

టీఆర్‌ఎస్‌ తీరుపై బీజేపీ ఫైర్‌
సాక్షి, హైదరాబాద్‌: రైతుల ఆత్మహత్యలు, ఉద్యోగాల భర్తీ, పార్టీ ఫిరాయింపుల సమస్యలపై ప్రతిపక్షాలు లేవనెత్తే ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండా ఎదురుదాడి చేయడమే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం, పార్టీ విధానమా అని బీజేపీ ప్రశ్నించింది. సింగరేణిలో కాంట్రాక్ట్‌ కార్మికులు లేరంటూ ప్రభుత్వం, టీఆర్‌ఎస్‌ చేస్తున్న ప్రకటనలపై ఏ గని దగ్గరైనా బహిరంగ చర్చకు సిద్ధమని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి సవాల్‌ విసిరారు.

గురు వారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. సింగరేణిలో 25 వేల మంది కాంట్రాక్ట్‌ కార్మికులు పనిచేస్తున్నారని, అందుకు విరుద్ధంగా కాంట్రాక్ట్‌ కార్మికులు లేరంటూ సీఎం కేసీఆర్‌ అసెంబ్లీలో చేసిన ప్రకటనను తప్పుబడుతున్నామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement