
ప్రతీకాత్మక చిత్రం
భోపాల్: తనను చెరపట్టబోయిన కామాంధుడి పాలిట అపరకాళికలా మారింది ఆ యువతి. చెప్పు తీసుకుని తన జోలికి వచ్చిన వాడి తుప్పురేగొట్టింది. అంతటితో ఊరుకోక.. రోడ్డు మీద వాడి చేత క్షమాపణ చెప్పించింది. ఆమె తెగువను ప్రశంసిస్తున్నారు జనాలు. ఆ వివరాలు..
మధ్యప్రదేశ్ రాజ్‌గఢ్ ప్రాంతానికి చెందిన సదరు మహిళ చాపిహేరా ప్రాంతంలో బ్యూటీపార్లర్ నడుపుతుంది. ఈ క్రమంలో ఆమె రెండు రోజుల క్రితం సాయంత్రం ఇంటికి వెళ్తుండగా రోడ్డు మీద ఓ వ్యక్తి ఆమెను ఢీకొన్నాడు. ఆ సమయంలో నిందితుడు బాగా తాగి ఉన్నాడు. మహిళను ఢీకొట్టడమేకాక ఆమెతో గొడవపడ్డాడు. అనంతరం ఆమెను లైంగికంగా వేధించసాగాడు. సదరు మహిళ ఎన్నిసార్లు హెచ్చరించినా ఆ మూర్ఖుడు తన బుద్ధి మార్చుకోలేదు.
(చదవండి: మహిళ పోలీస్ అధికారి బాత్రూమ్‌లో కెమెరా.. స్నానం చేస్తుండగా..)
ఓపిక నశించిన సదరు మహిళ బస్టాండ్ సమీపంలో.. నడి రోడ్డు మీద ఆ మృగాడిని చెప్పు తీసుకొని కొట్టింది. మత్తు దిగేదాకా చెప్పు దెబ్బలు కొడుతూనే ఉంది. స్పృహ వచ్చి.. పారిపోదామాని భావించిన నిందితుడిను అలాగే పట్టుకుని.. తనకు క్షమాపణ చెప్పేవరకు వదిలిపెట్టలేదు. నిందితుడు కింద కూర్చొని.. దండం పెడితే కానీ అతడిని వదలలేదు.
(చదవండి: మాట్లాడాలని పిలిచి బాలిక కంట్లో యాసిడ్ పోసి..)
చివరగా.. నన్ను తక్కువ అంచాన వేశావ్.. నీలాంటి నీచులకు ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు. ఇంకోసారి కనిపించావో నా చేతుల్లో చచ్చావే అని హెచ్చరించి మరి వదిలిపెట్టింది. ఇక సదరు మహిళ మృగాడిని కొడుతున్న సమయంలో చాలా మంది గుమికూడారు. ఆమె చేస్తున్న పనిని ప్రశంసించారు.
చదవండి: మైనర్‌పై లైంగికదాడికి యత్నం: ‘దిశ’తో అరగంటలో నిందితుడు అరెస్ట్
Comments
Please login to add a commentAdd a comment