లక్నో: మధ్యప్రదేశ్‌లో గిరిజన వ్యక్తిపై యూరినేషన్ సంఘటన మరవకముందే ఉత్తరప్రదేశ్‌లో మరో అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి దళిత యువకునితో చెప్పులు నాకించాడు. అనంతరం బాధితున్ని కుంజీలు తీయించాడు. అతనిపై పరుష పదజాలంతో బూతులు తిడుతూ దాడి చేశాడు. ఈ ఘటన సోనభద్ర జిల్లాలో వెలుగులోకి రాగా.. పోలీసులు అప్రమత్తమయ్యారు. నిందితున్ని అరెస్టు చేశారు.
Video: Dalit Man Slapped, Forced To Lick Slipper In Uttar Pradesh https://t.co/AR6lx8dCSH pic.twitter.com/1wMGWNS06C
— NDTV News feed (@ndtvfeed) July 8, 2023
దళిత వ్యక్తి తన మామయ్య ఇంట్లో ఎలక్ట్రిసిటీ సమస్య కారణంగా లైన్మెన్ తేజ్‌బలి సింగ్‌ని ఇంటికి పిలిచారు. ఈ అంశంలో వివాదం రాగా.. తేజ్‌బలి సింగ్ రెచ్చిపోయాడు. దళిత వ్యక్తితో చెప్పులు నాకించాడు. కుంజీలు తీయించాడు. ఆ తర్వాత అతనిపై దాడి చేశాడు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కాగా.. నెటిజన్లు ఫైరవుతున్నారు. ఈ ఘటనపై పోలీసుల అప్రమత్తమయ్యారు. కేసు నమోదు చేసి నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు.
ఇదీ చదవండి: మధ్యప్రదేశ్‌లో మరో వికృత చేష్ట.. వీడియో వైరల్
Comments
Please login to add a commentAdd a comment