lick shoes
-
'యూరిన్ పోసి.. ఎమ్మెల్యే కాళ్లు నాకించారు..' దళితునిపై దారుణం..
జైపూర్: రాజస్థాన్‌లో దారుణం జరిగింది. రక్షించాల్సిన పోలీసే ఓ దళిత వ్యక్తిపై అమానవీయంగా ప్రవర్తించాడు. బాధితునిపై యూరిన్ పోశాడు. అంతేకాకుండా స్థానిక ఎమ్మెల్యే కాళ్లు నాకించాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై క్రై బ్రాంచ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే గోపాల్ మీనా, పోలీసు అధికారి శివకుమార్ భరద్వాజపై కేసు నమోదు చేశారు. తాను పొలంలో పనిచేస్తుండగా.. పోలీసులు వచ్చి ఓ గదిలోకి తీసుకెళ్లారని బాధితుడు(51) ఫిర్యాదులో తెలిపారు. అక్కడ డీఎస్పీ శివ కుమార్ భరద్వాజ తనపై యూరిన్ పోసి అవమానించాడని పేర్కొన్నాడు. అంతేకాకుండా స్థానిక ఎమ్మెల్యే గోపాల్ మీనా ఆ ప్రాంతానికి రాజని.. అతని మాటకు ఎదురులేదని చెప్తూ ఎమ్మెల్యే బూట్లు నాకించారని పోలీసులకు తెలిపాడు. తన ఫోన్‌ను లాక్కున్నారని బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించినట్లు పోలీసులకు తెలిపాడు. మొదట పోలీసులు ఫిర్యాదు కూడా తీసుకోలేదని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. తాను నేరుగా కోర్టునే ఆశ్రయించినట్లు తెలిపాడు. ఫిర్యాదు చేసిననాటి నుంచి బెదిరింపులు వస్తున్నాయని నిందితులకు భయపడే జూన్ 30న ఈ ఘటన జరగగా.. జులై 27న ఫిర్యాదు చేసినట్లు బాధితుడు వెల్లడించాడు. తన కుటుంబ సభ్యులను కూడా వేదిస్తున్నారని తెలిపాడు. అయితే.. దళిత వ్యక్తిపై నిందితులు ఈ ఘటనకు పాల్పడటానికి కారణాలు మాత్రం ఇంకా తెలియలేదు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదీ చదవండి: నవాబ్ మాలిక్‌కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు.. -
అమానవీయ ఘటన.. దళితునితో చెప్పులు నాకించి..
లక్నో: మధ్యప్రదేశ్‌లో గిరిజన వ్యక్తిపై యూరినేషన్ సంఘటన మరవకముందే ఉత్తరప్రదేశ్‌లో మరో అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి దళిత యువకునితో చెప్పులు నాకించాడు. అనంతరం బాధితున్ని కుంజీలు తీయించాడు. అతనిపై పరుష పదజాలంతో బూతులు తిడుతూ దాడి చేశాడు. ఈ ఘటన సోనభద్ర జిల్లాలో వెలుగులోకి రాగా.. పోలీసులు అప్రమత్తమయ్యారు. నిందితున్ని అరెస్టు చేశారు. Video: Dalit Man Slapped, Forced To Lick Slipper In Uttar Pradesh https://t.co/AR6lx8dCSH pic.twitter.com/1wMGWNS06C — NDTV News feed (@ndtvfeed) July 8, 2023 దళిత వ్యక్తి తన మామయ్య ఇంట్లో ఎలక్ట్రిసిటీ సమస్య కారణంగా లైన్మెన్ తేజ్‌బలి సింగ్‌ని ఇంటికి పిలిచారు. ఈ అంశంలో వివాదం రాగా.. తేజ్‌బలి సింగ్ రెచ్చిపోయాడు. దళిత వ్యక్తితో చెప్పులు నాకించాడు. కుంజీలు తీయించాడు. ఆ తర్వాత అతనిపై దాడి చేశాడు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కాగా.. నెటిజన్లు ఫైరవుతున్నారు. ఈ ఘటనపై పోలీసుల అప్రమత్తమయ్యారు. కేసు నమోదు చేసి నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు. ఇదీ చదవండి: మధ్యప్రదేశ్‌లో మరో వికృత చేష్ట.. వీడియో వైరల్ -
విద్యార్థితో బూట్లు నాకించాడు..
-
విద్యార్థిపై దాడి.. ముఖ్యమంత్రి దిగ్భ్రాంతి
బెంగళూరు: అరుణాచల్ ప్రదేశ్ విద్యార్థిపై దాడి ఘటన పట్ల కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దారుణమైన ఘటనపై పోలీసులు వెంటనే రంగంలోకి దిగి చర్యలు తీసుకున్నారని, దాడికి కారణమైన నిందితుడిని అరెస్టు చేశారని ఆయన సోమవారం సాయంత్రం ట్విట్టర్లో పేర్కొన్నారు. నీళ్లు ఎక్కువగా వాడేస్తున్నాడని అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన హిగియో గుంటెయ్ అనే విద్యార్థిపై అతని ఇంటి యజమాని హేమంత్‌కుమార్ దాడికి పాల్పడ్డాడు. అక్కడితో ఆగకుండా అతడితో బూట్లు నాకించేందుకు ప్రయత్నించాడు. ఈ ఘటనపై సదరు విద్యార్థి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెలుగులోకి వచ్చింది. మార్చి 6న చోటుచేసుకున్న ఈ ఘటనపై కేసు నమోదు కావడంతో నిందితుడు పోలీసులు ఎదుట లొంగిపోయాడు. అతనికి బెయిల్ లభించడంతో సోమవారం జైలు నుంచి విడుదలయ్యాడు. బాధితుడు హిగియో క్రైస్ట్ యూనివర్సిటీలో చదువుతున్నాడు. ఈశాన్య భారత విద్యార్థిపై జరిగిన ఈ అమానుష దాడిని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిరెన్ రిజిజు సైతం తీవ్రంగా ఖండించారు. -
విద్యార్థితో బూట్లు నాకించాడు..
బెంగళూరు: అరుణాచల్ ప్రదేశ్ విద్యార్థిపై దాడి చేసి అనుచితంగా ప్రవర్తించిన హేమంత్ కుమార్ అనే వ్యక్తి బెయిల్ పై విడుదలయ్యాడు. తన పట్ల హేమంత్ అమానుషంగా ప్రవర్తించాడని అతడి ఇంట్లో అద్దెకు ఉంటున్న హిగియో గుంటెయ్ అనే విద్యార్థి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. నీళ్లు ఎక్కువగా వాడేస్తున్నాడని విద్యార్థిపై హేమంత్ దాడికి పాల్పడ్డాడు. అక్కడితో ఆగకుండా అతడితో బూట్లు నాకించేందుకు ప్రయత్నించాడు. మార్చి 6న చోటుచేసుకున్న ఈ ఘటనపై కేసు నమోదు చేయడంతో నిందితుడు పోలీసులు ఎదుట లొంగిపోయాడు. బెయిల్ లభించడంతో ఈరోజు జైలు నుంచి విడుదలయ్యాడు. బాధితుడు క్రైస్ట్ యూనివర్సిటీలో చదువుతున్నాడు. ఈ ఘటనపై బాధితుడి తండ్రి స్పందించాడు. జరిగిన ఘటన అమానవీయమైందని పేర్కొన్నాడు. పోలీసులపై తనకు నమ్మకం ఉందని, నిందితుడిని తగినవిధంగా శిక్షిస్తారన్న నమ్మకాన్ని వ్యక్తం చేశాడు.