విద్యార్థితో బూట్లు నాకించాడు.. | Arunachal student beaten up, made to lick shoes in Bengaluru | Sakshi
Sakshi News home page

విద్యార్థితో బూట్లు నాకించాడు..

Published Mon, Mar 13 2017 12:29 PM | Last Updated on Mon, Aug 20 2018 5:23 PM

విద్యార్థితో బూట్లు నాకించాడు.. - Sakshi

విద్యార్థితో బూట్లు నాకించాడు..

బెంగళూరు: అరుణాచల్ ప్రదేశ్‌ విద్యార్థిపై దాడి చేసి అనుచితంగా ప్రవర్తించిన హేమంత్ కుమార్ అనే వ్యక్తి బెయిల్ పై విడుదలయ్యాడు. తన పట్ల హేమంత్ అమానుషంగా ప్రవర్తించాడని అతడి ఇంట్లో అద్దెకు ఉంటున్న హిగియో గుంటెయ్‌ అనే విద్యార్థి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. నీళ్లు ఎక్కువగా వాడేస్తున్నాడని విద్యార్థిపై హేమంత్ దాడికి పాల్పడ్డాడు. అక్కడితో ఆగకుండా అతడితో బూట్లు నాకించేందుకు ప్రయత్నించాడు.

మార్చి 6న చోటుచేసుకున్న ఈ ఘటనపై కేసు నమోదు చేయడంతో నిందితుడు పోలీసులు ఎదుట లొంగిపోయాడు. బెయిల్ లభించడంతో ఈరోజు జైలు నుంచి విడుదలయ్యాడు. బాధితుడు క్రైస్ట్ యూనివర్సిటీలో చదువుతున్నాడు.

ఈ ఘటనపై బాధితుడి తండ్రి స్పందించాడు. జరిగిన ఘటన అమానవీయమైందని పేర్కొన్నాడు. పోలీసులపై తనకు నమ్మకం ఉందని, నిందితుడిని తగినవిధంగా శిక్షిస్తారన్న నమ్మకాన్ని వ్యక్తం చేశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement