![Five BJP Workers Arrested Slipper Thrown Tamil Nadu Finance Minister - Sakshi](/styles/webp/s3/article_images/2022/08/13/tamp.jpg.webp?itok=XGCziu1k)
చెన్నై: తమిళనాడు ఆర్థిక మంత్రి పళనివేల్ త్యాగ రాజన్ కారుపై చెప్పులు విసిరి ఘెరంగా అవమానించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆర్థిక మంత్రి జమ్ము కాశ్మీర్‌లోని రాజౌరి జిల్లాలో ఉగ్రవాదులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో విధి నిర్వహణలో మరణించిన రైఫిల్‌మెన్ డి లక్ష్మణన్‌కి నివాళులర్పించేందుకు మధురై వచ్చారు.
ఆ సమయంలోనే ఒక మహిళ కిందకి వంగి ఆర్థిక మంత్రి కారుపై చెప్పులు విసిరి అవమానించింది. వాస్తవానికి కారు విండ్ మూసి ఉండటంతో ఆయన త్రుటిలో తప్పించుకున్నారు. ఆ రోజు నివాళులర్పించేందుకు ఉద్దేశించిన స్థలం అంతా బీజేపీ కార్యకర్తలతో నిండిపోయిందని డీఎంకే పార్టీ అధికారి అన్నారు. ఆ రోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె అన్నామలై కూడా నివాళ్లులర్పించేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు.
ఇలాంటి గౌరవ వందన కార్యక్రమాల్లో కలెక్టర్‌తో సహా నియమించబడిన సభ్యులు మాత్రమే ఇందులో భాగం కావలి. కానీ బీజేపీ అధ్యక్షుడు అన్నామలై ఫోటోల పిచ్చితో మిలటరీ ప్రోటోకాల్ ఉల్లంఘంచి మరీ నివాళులర్పించేందుకు ముందుకు వచ్చారు. ఆ సమయంలోనే ఆర్థిక మంత్రి పళనివేల్‌కి ఈ చేదు అనుభవం ఎదురైంది. పైగా అప్పుడే కొంతమంది బీజేపీ కార్యకర్తలు ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు కూడా చేశారు.
దీంతో పోలీసు ఈ ఘటనకు కారణమైన ఐదుగురు అనుమానిత వ్యక్తులను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. ఐతే ఆ ఐదుగురు బీజీపీ పార్టీ సభ్యులేనని పోలీసులు తెలిపారు. ఇంకా దర్యాప్తు జరుగుతుందని వాళ్లు ఎందుకు ఇలా చేశారో కారణాలు తెలియలేదని వెల్లడించారు. వాస్తవానికి ఆ సమయంలో రెజిమెంట్ మాత్రమే చివరిగా నివాళులర్పిస్తారు. పేరు వస్తుందని ఇలా ఫోటోల కోసం దేశభక్తి పేరుతో సైనికులకు నివాళులర్పించడం సరి కాదని, కావాలంటే సైనిక సేవ చేయండి అంటూ బీజేపీ అధ్యక్షుడికి డీఎంకే పార్టీ అధికారి గట్టి కౌంటరిచ్చారు.
(చదవండి: ఐదు వేల మందితో.. ప్రపంచంలో అతిపెద్ద ‘జాతీయ జెండా మానవహారం’)
Comments
Please login to add a commentAdd a comment