విస్తరణ బాటలో కల్యాణ్‌ జ్యుయలర్స్‌ | Kalyan Jewellers to open 20 showrooms | Sakshi
Sakshi News home page

విస్తరణ బాటలో కల్యాణ్‌ జ్యుయలర్స్‌

Jul 8 2023 6:27 AM | Updated on Jul 8 2023 6:27 AM

Kalyan Jewellers to open 20 showrooms - Sakshi

న్యూఢిల్లీ: దక్షిణాదియేతర మార్కెట్లలో కార్యకలాపాలను గణనీయంగా విస్తరిస్తున్నట్లు కల్యాణ్‌ జ్యుయలర్స్‌ వెల్లడించింది. దీపావళిలోగా కొత్తగా 20 షోరూమ్‌లను ప్రారంభించనున్నట్లు స్టాక్‌ ఎక్సే్చంజీలకు తెలిపింది.

అలాగే తమ తొలి ఎఫ్‌వోసీవో (ఫ్రాంచైజీ ఓన్డ్‌ కంపెనీ ఆపరేటెడ్‌) షోరూమ్‌ను ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో మధ్యప్రాచ్యంలో ప్రారంభించనున్నట్లు సంస్థ వివరించింది. అలాగే వచ్చే ఆరు నెలల్లో తమ ఆన్‌లైన్‌ జ్యుయలరీ ప్లాట్‌ఫాం క్యాండియర్‌కి సంబంధించి 20 ఫిజికల్‌ షోరూమ్‌లను కూడా ప్రారంభించనున్నట్లు తెలిపింది. ఈ ఏడాది జూన్‌ 30 నాటికి దేశ విదేశాల్లో కంపెనీ మొత్తం షోరూమ్‌ల సంఖ్య 194కి చేరింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement