new showroom
-
డిసెంబర్ 20 నాటికి 3200: సీఈఓ ట్వీట్
ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లను కొనుగోలు చేసిన కస్టమర్లతో అసంతృప్తి పెరిగిపోతున్న తరుణంలో.. కంపెనీ సీఈఓ భవిష్ అగర్వాల్ ఓ శుభవార్త చెప్పారు. వాహనాల సర్వీసుల్లో జాప్యం కలగకుండా చూడటానికి దేశ వ్యాప్తంగా మరో 3,200 సర్వీస్ సెంటర్లను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. దీనికి సంబంధించిన ట్వీట్ కూడా నెట్టింట్లో వైరల్ అవుతోంది.డిసెంబర్ 20 నాటికి 3,200 కొత్త స్టోర్స్ ప్రారంభించనున్నట్లు భవిష్ అగర్వాల్ వెల్లడించారు. ఆ తరువాత కంపెనీ మొత్తం నెట్వర్క్ 4,000 అవుట్లెట్లకు చేరుకుంటుంది.ప్రస్తుతం దేశంలో ఓలా స్టోర్లు కేవలం 800 మాత్రమే ఉన్నాయి. వీటి సంఖ్య త్వరలోనే 4,000లకు చేరుకుంటుంది. వినియోగదారులకు మరింత చేరువ కావడమే లక్ష్యంగా సీఈఓ ఈ నిర్ణయం తీసుకున్నారు. కొత్తగా ప్రారంభం కానున్న స్టోర్లలో సర్వీస్ కూడా లభిస్తుంది. కాబట్టి కస్టమర్లు నిశ్చింతగా.. తమ వాహనంలో ఏర్పడ్డ సమస్యలను పరిష్కరించుకోవచ్చు.ఓలా ఎలక్ట్రిక్ ప్రస్తుతం దేశీయ మార్కెట్లో ఓలా ఎస్1 ఎక్స్, ఓలా ఎస్1 ప్రో, ఓలా ఎస్1 ఎయిర్ వంటి స్కూటర్లను విక్రయిస్తోంది. ఇవి కాకుండా మరో మూడు (ఓలా ఎస్1 జెడ్, ఓలా గిగ్, ఓలా గిగ్ ప్లస్) స్కూటర్లను కంపెనీ ఇటీవలే లాంచ్ చేసింది. ఇవి త్వరలోనే అమ్మకానికి రానున్నాయి. కాగా కంపెనీ ఎలక్ట్రిక్ కార్ల విభాగంలోకి కూడా అడుగు పెట్టడానికి యోచిస్తోంది. ఇది బహుశా వచ్చే ఏడాది మార్కెట్లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.Taking the Electric revolution to the next level this month.Going from 800 stores right now to 4000 stores this month itself. Goal to be as close to our customers as possible.All stores opening together on 20th Dec across India. Probably the biggest single day store opening…— Bhavish Aggarwal (@bhash) December 2, 2024 -
విస్తరణ బాటలో కల్యాణ్ జ్యుయలర్స్
న్యూఢిల్లీ: దక్షిణాదియేతర మార్కెట్లలో కార్యకలాపాలను గణనీయంగా విస్తరిస్తున్నట్లు కల్యాణ్ జ్యుయలర్స్ వెల్లడించింది. దీపావళిలోగా కొత్తగా 20 షోరూమ్‌లను ప్రారంభించనున్నట్లు స్టాక్ ఎక్సే్చంజీలకు తెలిపింది. అలాగే తమ తొలి ఎఫ్‌వోసీవో (ఫ్రాంచైజీ ఓన్డ్ కంపెనీ ఆపరేటెడ్) షోరూమ్‌ను ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో మధ్యప్రాచ్యంలో ప్రారంభించనున్నట్లు సంస్థ వివరించింది. అలాగే వచ్చే ఆరు నెలల్లో తమ ఆన్లైన్ జ్యుయలరీ ప్లాట్‌ఫాం క్యాండియర్‌కి సంబంధించి 20 ఫిజికల్ షోరూమ్‌లను కూడా ప్రారంభించనున్నట్లు తెలిపింది. ఈ ఏడాది జూన్ 30 నాటికి దేశ విదేశాల్లో కంపెనీ మొత్తం షోరూమ్‌ల సంఖ్య 194కి చేరింది. -
ప్రపంచ వ్యాప్తంగా జోస్ అలుక్కాస్ భారీ విస్తరణ
హైదరాబాద్: ప్రముఖ జ్యువెలరీ రిటైల్ చైన్ జోస్ అలుక్కాస్ రూ.5,500 కోట్లతో ప్రపంచ వ్యాప్తంగా భారీ విస్తరణ ప్రణాళికకు శ్రీకారం చుట్టింది. ప్రపంచ వ్యాప్తంగా 100 కొత్త షోరూమ్‌లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. దేశంలోని ఒక జ్యువెల్లరీ రిటైల్ బ్రాండ్ రానున్న 8 సంవత్సరాల్లో చేపడుతున్న భారీ విస్తరణ కార్యక్రమం ఇదని వివరించింది. నిధులు, రియల్టీ సమకూరితే 4 సంవత్సరాల్లోనే తమ విస్తరణ కార్యక్రమం పూర్తవుతుందని వివరించింది. సంస్థ విస్తరణ ప్రణాళికకు సంబంధించి చెన్నైలో జరిగిన మీడియా సమావేశంలో జోస్ అలుక్కాస్ మేనేజింగ్ డైరెక్టర్లు జాన్ అలుక్కా, వర్గీస్ అలుక్కా, చైర్మన్ జోస్ అలుక్కా, నటుడు ఆర్ మాధవన్, కంపెనీ ఎండీ పాల్ అలుక్కా పాల్గొన్నారు. (చిత్రంలో ఎడమ నుంచి). ప్రస్తుతం 50 స్టోర్లను కలిగిన జ్యువెల్లరీ గ్రూప్ గ్లోబల్ అంబాసిడర్‌గా నటుడు మాధవన్ ఉన్నారు. నటి కీర్తి సురేశ్‌ను కూడా సంస్థ ప్రచారకర్తగా నియమించుకుంది. -
మూడేళ్లలో సగం ఎస్‌యూవీలే
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశంలో స్పోర్ట్ యుటిలిటీ వెహికల్స్ (ఎస్యూవీ) హవా నడుస్తోంది. అభివృద్ధి చెందిన మార్కెట్లలో ఎస్‌యూవీల వాటా 35–38 శాతం ఉంటే.. భారత్‌లో ఇది 42 శాతమని బీవైడీ ఇండియా ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వెహికిల్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సంజయ్ గోపాలకృష్ణన్ తెలిపారు. భారత్‌లో సంస్థ మూడవ షోరూం మోడీ బీవైడీని హైదరాబాద్‌లో శుక్రవారం ప్రారంభించిన సందర్భంగా సాక్షి బిజినెస్ బ్యూరోతో మాట్లాడారు. మూడేళ్లలో ఎస్‌యూవీల వాటా 50 శాతానికి చేరుతుందన్నారు. హ్యాచ్‌బ్యాక్‌ల ధరలోనే రూ. 6–7 లక్షల నుంచే ఈ మోడళ్లు లభ్యం కావడం ఈ స్థాయి అమ్మకాలకు కారణమని చెప్పారు. ఆయనింకా ఏమన్నారంటే.. ధర ప్రాధాన్యత కాదు.. ప్యాసింజర్ వెహికల్స్ విషయంలో హైదరాబాద్ విభిన్న మార్కెట్. ఇక్కడి మార్కెట్లో ఏం జరుగుతుందో అంచనా వేయలేం. గడిచిన అయిదేళ్లలో హైదరాబాద్ విపణి గణనీయంగా వృద్ధి చెందింది. విక్రయాల పరంగా ఢిల్లీ, బెంగళూరు తర్వాత భాగ్యనగరి టాప్‌లో నిలిచింది. కారు కొనుగోలు నిర్ణయం విషయంలో ఒకప్పుడు ధర ప్రామాణికంగా ఉండేది. ప్రాధాన్యత క్రమంలో ఇప్పుడు బ్రాండ్, ఎక్స్టీరియర్స్, ఇంటీరియర్స్, ఫీచర్స్, సేఫ్టీ తర్వాత ధర నిలిచింది. దేశవ్యాప్తంగా జూలైలో ప్యాసింజర్ కార్లు 2,50,972 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఈ ఏడాది 50,000 యూనిట్లు.. దేశంలో సగటున నెలకు అన్ని బ్రాండ్లవి కలిపి 3,500 ఎలక్ట్రిక్ కార్లు అమ్ముడవుతున్నాయి. ఈ ఏడాది జూలై నాటికి 26,000 యూనిట్లు రోడ్డెక్కాయి. 2022లో దేశవ్యాప్తంగా 50,000 ఎలక్ట్రిక్ కార్లు అమ్ముడవుతాయని అంచనా. ప్యాసింజర్ వాహన రంగంలో ఈవీల వాటా 2 శాతమే. ఇది 2030 నాటికి 30 శాతానికి చేరనుంది. ఇక ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వాహన విక్రయాల్లో టాప్–1 ర్యాంక్ కోసం హైదరాబాద్, బెంగళూరు పోటీపడుతున్నాయి. ఈ–ప్యాసింజర్ వెహికల్స్‌లో దక్షిణాది వాటా 50–60 శాతంగా ఉంది. కస్టమర్లు తమ రెండవ కారుగా ఈవీని కొనుగోలు చేస్తున్నారు. భారీ లక్ష్యంతో.. అంతర్జాతీయంగా అందుబాటులో ఉన్న కార్లను భారత్‌లో పరిచయం చేస్తాం. బీవైడీ ఎలక్ట్రిక్ కారు ఈ6ను 2021 నవంబర్‌లో ప్రవేశపెట్టాం. 450 యూనిట్లు విక్రయించాం. ఒకసారి చార్జింగ్ చేస్తే ఈ కారు 520 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. దీపావళికి ప్రీమియం ఈ–ఎస్‌యూవీని ప్రకటించనున్నాం. జనవరి నుంచి డెలివరీలు ఉంటాయి. 2030 నాటికి ఈ–ప్యాసింజర్ వెహికల్స్ రంగంలో దేశంలో 30 శాతం మార్కెట్‌ను కైవసం చేసుకుంటాం. బీవైడీ భారత్‌లో ఇప్పటివరకు సుమారు రూ.1,185 కోట్లు వెచ్చించింది. -
మంచిర్యాలలో మలబార్ గోల్డ్ కొత్త షోరూం
మంచిర్యాల: ప్రముఖ బంగారం, వజ్రాల ఆభరణాల తయారీ సంస్థ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఆగస్టు 26న మంచిర్యాలలో కొత్త షోరూంను ఏర్పాటు చేసింది. దీంతో తెలంగాణలో ఈ కంపెనీ మొత్తం షోరూంల సంఖ్య పదిహేనుకు చేరింది. కేపీఆర్ ప్లాజా, గంగా రెడ్డి రోడ్, మార్కెట్ ఏరియాలో నిర్మించిన కొత్త షోరూంను మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు, మున్సిపాలిటీ చైర్మన్ ముకేష్ గౌడ్లు ప్రారంభించారు. మంచిర్యాల పరిసర ప్రాంతాల్లోని ప్రజలకు అసమానమైన డిజైన్లు, సాటిలేని నాణ్యత, సేవా నైపుణ్యంతో ప్రత్యేక ఆభరణాల షాపింగ్ అనుభూతిని అందిస్తామని ప్రారంభోత్సవం సందర్భంగా మలబార్ గ్రూప్ చైర్మన్ ఎంపీ అహ్మద్ తెలిపారు. -
బెంగళూరులో కల్యాణ్ జువెలర్స్ కొత్త షోరూం
ఐటీ సిటీ బెంగళూరులోని మారతహళ్లిలో తన కొత్త షోరూమ్‌ను కల్యాణ్ జ్యువెలర్స్ ప్రారంభించింది. సంస్థ బ్రాండ్ అంబాసిడర్లు హీరో అక్కినేని నాగార్జున, కన్నడ హీరో శివరాజ్ కుమార్ కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా భారీఎత్తున అభిమానులు తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో కల్యాణ్ జ్యువెల్లర్స్ చైర్మన్, ఎండీ టీఎస్ కల్యాణరామన్, ఈడీ రమేశ్ కల్యాణరామన్ పాల్గొన్నారు. బెంగళూరులో కల్యాణ్ జ్యువెల్లర్స్ తన తొలి షోరూమ్‌ను 2010లో ప్రారంభించింది. ప్రస్తుతం మారతహళ్లి శాఖతో కలుపుకుని కర్ణాటక వ్యాప్తంగా 14 షోరూమ్‌లు ఉన్నాయి. -
రూ.600 కోట్లతో కళ్యాణ్ జ్యుయలర్స్ విస్తరణ
హైదరాబాద్: కళ్యాణ్ జ్యుయలర్స్ త్వరలో 14 కొత్త షోరూమ్‌లను ప్రారంభిస్తోంది. ఈ 14 షోరూమ్‌ల ఏర్పాటుకు రూ.600 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నట్లు సంస్థ ఒక ప్రకటనలో తెలియజేసింది. భారత్‌లో 7, ఖతర్‌లో 7 చొప్పున వీటిని ఏర్పాటు చేస్తామని కంపెనీ సీఎండీ టి.ఎస్.కళ్యాణరామన్ పేర్కొన్నారు. చెన్నైలో 2, కోల్‌కతాలో 2, రాజస్థాన్‌లో మూడు చొప్పున షోరూమ్‌లను ఏర్పాటు చేయనున్నామని, దీంతో ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి తమ షోరూమ్‌ల సంఖ్య వందకు చేరుకుంటుందని ఆయన తెలియజేశారు. ఈ ఆర్థిక సంవత్సరం చివరినాటికి రూ.13,000 కోట్ల టర్నోవర్ సాధించడం లక్ష్యమని పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే 8 కొత్త షోరూమ్‌లను ఏర్పాటు చేశామన్నారు.