రూ.600 కోట్లతో కళ్యాణ్ జ్యుయలర్స్ విస్తరణ | kalyan jewellers opening new show rooms | Sakshi
Sakshi News home page

రూ.600 కోట్లతో కళ్యాణ్ జ్యుయలర్స్ విస్తరణ

Published Thu, Jan 28 2016 1:42 AM | Last Updated on Sun, Sep 3 2017 4:25 PM

రూ.600 కోట్లతో కళ్యాణ్ జ్యుయలర్స్ విస్తరణ

రూ.600 కోట్లతో కళ్యాణ్ జ్యుయలర్స్ విస్తరణ

హైదరాబాద్: కళ్యాణ్ జ్యుయలర్స్ త్వరలో 14 కొత్త షోరూమ్‌లను ప్రారంభిస్తోంది. ఈ 14 షోరూమ్‌ల ఏర్పాటుకు రూ.600 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నట్లు సంస్థ ఒక ప్రకటనలో తెలియజేసింది. భారత్‌లో  7, ఖతర్‌లో 7 చొప్పున వీటిని ఏర్పాటు చేస్తామని కంపెనీ సీఎండీ టి.ఎస్.కళ్యాణరామన్ పేర్కొన్నారు.

 చెన్నైలో 2, కోల్‌కతాలో 2, రాజస్థాన్‌లో మూడు చొప్పున షోరూమ్‌లను ఏర్పాటు చేయనున్నామని, దీంతో ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి తమ షోరూమ్‌ల సంఖ్య వందకు చేరుకుంటుందని ఆయన తెలియజేశారు. ఈ ఆర్థిక సంవత్సరం చివరినాటికి రూ.13,000 కోట్ల టర్నోవర్ సాధించడం లక్ష్యమని పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే 8 కొత్త షోరూమ్‌లను ఏర్పాటు చేశామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement