Kalyan Jewelers
-
ఒకే విమానంలో చిరంజీవి, నాగార్జున.. ఎక్కడికి వెళ్లారంటే..?
టాలీవుడ్ అగ్ర హీరోలు చిరంజీవి, నాగార్జున ఒకే ఫ్రేమ్‌లో కనిపించి ఫ్యాన్స్‌ను ఫిదా చేశారు. ఆదివారం వారిద్దరూ కలిసి హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో కేరళ వెళ్లారు. దీంతో వారు ఎక్కడికి వెళ్తున్నారంటూ నెటిజన్లు ఆరా తీశారు. మెగాస్టార్, కింగ్ నాగార్జున నడుచుకుంటూ వెళ్తున్న వీడియో కూడా ఒకటి నెట్టింట వైరల్ అయింది. వారి అభిమానులు తెగ షేర్ చేస్తున్నారు కూడా.చిరంజీవి, నాగార్జున ఇద్దరూ కలిసి కేరళలోని త్రిశూర్ వెళ్లారు. కళ్యాణ్ జ్యువెలర్స్ అధినేత T. S. కళ్యాణరామన్ ఆహ్వానం మేరకు వారి ఇంట్లో జరుగుతున్న దసరా సంబరాల్లో పాల్గొన్నారు. త్రిశూర్‌లో దేవి నవరాత్రి ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతాయని, ఈ క్రమంలో తమ ఇంట్లో కూడా చాలా గ్రాండ్‌గా నిర్వహిస్తామని కళ్యాణ్ జ్యువెలర్స్ అధినేత ప్రత్యేక ఆహ్వానం పంపడంతో వారిద్దరూ వెళ్లారు. T. S. కళ్యాణరామన్ కుటుంబంతో కలిసి దిగిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.ఇక సినిమాల విషయానికొస్తే మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర టీజర్ తాజాగానే విడుదలైంది. ఇప్పటి వరకు సుమారు 30 మిలియన్ల వ్యూస్‌తో దూసుకుపోతుంది. వచ్చే ఏడాదిలో ఈ చిత్రం విడుదల కానుంది. ఇక నాగార్జున కుబేర, కూలీ సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. -
విస్తరణ బాటలో కల్యాణ్ జ్యుయలర్స్
ముంబై: వచ్చే ఆర్థిక సంపత్సరం ప్రథమార్ధంలో దక్షిణాదియేతర మార్కెట్లలోకి కార్యకలాపాలను గణనీయంగా విస్తరించనున్నట్లు ఆభరణాల విక్రయ సంస్థ కల్యాణ్ జ్యుయలర్స్ ఇండియా ఈడీ రమేష్ కల్యాణరామన్ తెలిపా రు. ఇందుకోసం ఫ్రాంచైజీ విధానాన్ని ఎంచుకో వాలని నిర్ణయించినట్లు ఆయన పేర్కొన్నారు. ముందుగా 2025 నుంచి ఈ విధానంలో విస్త రించాలని భావించినప్పటికీ గత 3–4 త్రైమాసికాలుగా నెలకొన్న డిమాండ్‌ను చూసి.. అంతక న్నా ముందుగానే అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. ముందుగా 2–3 స్టోర్స్‌తో కార్యకలాపాల విస్తరణను ప్రయోగాత్మకంగా పరీక్షించనున్నట్లు పేర్కొన్నారు. ఫ్రాం చైజీ మోడల్లో స్టోర్ ఏర్పాటు వ్యయం సుమారు రూ. 20 కోట్లుగా ఉంటుందని తెలిపా రు. ఇందులో సింహభాగం వాటా ఉత్పత్తులదే ఉంటుందని, పెట్టుబడి వ్యయాలు తక్కువగానే ఉంటాయని వివరించా రు. ప్రస్తుతం కంపెనీకి 21 రాష్ట్రాలు, నాలుగు దేశాల్లో 151 సొంత షోరూమ్‌లు ఉన్నాయి. వీటిలో 121 స్టోర్స్ భారత్‌లో ఉన్నాయి. -
కల్యాణ్ జ్యుయలర్స్ లాభం రూ. 69 కోట్లు
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ఆభరణాల సంస్థ కల్యాణ్ జ్యుయలర్స్ ఇండియా రూ. 69 కోట్ల నికర లాభం ప్రకటించింది. గత క్యూ2లో కంపెనీ రూ. 136 కోట్ల నష్టం నమోదు చేసింది. తాజాగా కోవిడ్–19 పరమైన ఆంక్షలు తగ్గడం, ఆర్థిక వ్యవస్థ రికవరీ తదితర అంశాలు అమ్మకాలకు ఊతమిచ్చినట్లు కంపెనీ తెలిపింది. సమీక్షా కాలంలో ఆదాయం రూ. 1,798 కోట్ల నుంచి 61 శాతం ఎగిసి రూ. 2,889 కోట్లకు పెరిగింది. క్యూ2లో కంపెనీ పటిష్టమైన పనితీరు కనపర్చిందని, కోవిడ్–19పరమైన ఆంక్షలు సడలింపుతో పాటు వినియోగదారుల సెంటిమెంట్ మెరుగుపడుతుండటంతో ప్రస్తుత త్రైమాసికంలో కూడా అమ్మకాలు మరింతగా వృద్ధి చెందవచ్చని కల్యాణ్ జ్యుయలర్స్ ఇండియా ఈడీ రమేష్ కల్యాణరామన్ తెలిపారు. బీఎస్ఈలో బుధవారం కంపెనీ షేరు సుమారు 4 శాతం పెరిగి రూ. 81.50 వద్ద క్లోజయ్యింది. -
కళ్యాణ్ జ్యుయలర్స్ 3వ షోరూమ్
ఆభరణాల రిటైల్ చెయిన్ కళ్యాణ్ జ్యూయలర్స్ హైదరాబాద్‌లో తన మూడవ షోరూమ్‌ను ప్రారంభించనుంది. ఈ నెల 21న (బుధవారం) ఏ.ఎస్ రావునగర్‌లో సంస్థ బ్రాండ్ అంబాసిడర్ అక్కినేని నాగార్జున చేతుల మీదుగా ఉదయం 11 గంటలకు షోరూమ్ ప్రారంభోత్సవం జరగనుందని వెల్లడించింది. అంతర్జాతీయంగా ఇది 138 షోరూమ్ కానుండగా, తెలంగాణలో నాలుగవ షోరూమ్ అని కంపెనీ చైర్మన్, ఎండీ టీ ఎస్ కళ్యాణరామన్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ప్రారంభోత్సవంలో భాగంగా మేకింగ్ చార్జీలపై 3 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. కోటి రూపాయిల వరకు ఇన్స్టెంట్ రిడీమ్ వోచర్లను ఇస్తున్నాం. ఇంతేకాకుండా, వీక్లీ బంపర్ బహుమతిలో లక్ష రూపాయిల ఆభరణాలను అందిస్తున్నాం’ అని వెల్లడించారు. -
బెంగళూరులో కల్యాణ్ జువెలర్స్ కొత్త షోరూం
ఐటీ సిటీ బెంగళూరులోని మారతహళ్లిలో తన కొత్త షోరూమ్‌ను కల్యాణ్ జ్యువెలర్స్ ప్రారంభించింది. సంస్థ బ్రాండ్ అంబాసిడర్లు హీరో అక్కినేని నాగార్జున, కన్నడ హీరో శివరాజ్ కుమార్ కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా భారీఎత్తున అభిమానులు తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో కల్యాణ్ జ్యువెల్లర్స్ చైర్మన్, ఎండీ టీఎస్ కల్యాణరామన్, ఈడీ రమేశ్ కల్యాణరామన్ పాల్గొన్నారు. బెంగళూరులో కల్యాణ్ జ్యువెల్లర్స్ తన తొలి షోరూమ్‌ను 2010లో ప్రారంభించింది. ప్రస్తుతం మారతహళ్లి శాఖతో కలుపుకుని కర్ణాటక వ్యాప్తంగా 14 షోరూమ్‌లు ఉన్నాయి. -
ల్యాణ్ జ్యుయలర్స్ చేతికి ‘కెండేరే’
న్యూఢిల్లీ: ‘కల్యాణ్ జ్యుయలర్స్’ తాజాగా ఆన్లైన్ జువెలరీ సంస్థ ‘కెండేరే’ను కొనుగోలు చేసింది. డీల్ విలువ రూ.35– రూ.40 కోట్ల శ్రేణిలో ఉండొచ్చని విశ్వసనీయ వర్గాల సమాచారం. వేగంగా అభివృద్ధి చెందుతోన్న ఆన్లైన్ మార్కెట్ విభాగంలో స్థానాన్ని కలిగి ఉండాలనే లక్ష్యంతో కల్యాణ్ జ్యూయెలర్స్ ఈ కొనుగోలు జరిపినట్లు తెలుస్తోంది. ‘కెండెరే’‘కాందేరే’ 2013లో ఏర్పాటయ్యింది. ఇది 4,000కుపైగా జువెలరీ డిజైన్లతో కూడిన పోర్ట్‌ఫోలియోతో ఇండియా, అమెరికా, యూకే దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. -
కల్యాణ్ జ్యూయలర్స్‌లోకి వార్బర్గ్ రూ.500 కోట్లు
త్వరలో ఈ కామర్స్ సెగ్మెంట్లోకి న్యూఢిల్లీ: ఆభరణాల రిటైల్ చెయిన్ కల్యాణ్ జ్యూయలర్స్ కంపెనీలో అంతర్జాతీయ ప్రైవేట్ ఈక్విటీ దిగ్గజం వార్బర్గ్ పిన్కస్ రూ.500 కోట్లు పెట్టుబడులు పెడుతోంది. దేశీయంగా, అంతర్జాతీయంగా నెట్వర్క్ విస్తరణకు ఈ నిధులు వినియోగిస్తామని కల్యాణ్ జ్యూయలర్స్ తెలిపింది. 2014లో తమ కంపెనీలో వార్బర్గ్ పిన్కస్ రూ.1,200 కోట్లు ఇన్వెస్ట్ చేసిందని, తాజా ఇన్వెస్ట్‌మెంట్‌తో ఈ సంస్థ మొత్తం పెట్టుబడులు రూ.1,700 కోట్లకు పెరిగాయని కల్యాణ్ జ్యూయలర్స్ సీఎండీ టి. ఎస్. కల్యాణరామన్ చెప్పారు. దేశ, విదేశాల్లో ప్రస్తుతం 106 షోరూమ్‌లను నిర్వహిస్తున్నామని, తమ షోరూమ్‌ల సంఖ్యను రెట్టింపు (200కు పైగా) చేయనున్నామని, దీనికి కావలసిన నిధులను ఈక్విటీ, రుణ, అంతర్గత వనరుల ద్వారా సమీకరించుకుంటామని వివరించారు. త్వరలో ఈ కామర్స్ సెగ్మెంట్లోకి ప్రవేశించనున్నామని పేర్కొన్నారు. నగదు లావాదేవీలపై ఆంక్షలు, వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) అమలు కారణంగా నిర్వహణ సామర్థ్యాలులు మెరుగుపడతాయని తెలిపారు. -
రూ.600 కోట్లతో కళ్యాణ్ జ్యుయలర్స్ విస్తరణ
హైదరాబాద్: కళ్యాణ్ జ్యుయలర్స్ త్వరలో 14 కొత్త షోరూమ్‌లను ప్రారంభిస్తోంది. ఈ 14 షోరూమ్‌ల ఏర్పాటుకు రూ.600 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నట్లు సంస్థ ఒక ప్రకటనలో తెలియజేసింది. భారత్‌లో 7, ఖతర్‌లో 7 చొప్పున వీటిని ఏర్పాటు చేస్తామని కంపెనీ సీఎండీ టి.ఎస్.కళ్యాణరామన్ పేర్కొన్నారు. చెన్నైలో 2, కోల్‌కతాలో 2, రాజస్థాన్‌లో మూడు చొప్పున షోరూమ్‌లను ఏర్పాటు చేయనున్నామని, దీంతో ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి తమ షోరూమ్‌ల సంఖ్య వందకు చేరుకుంటుందని ఆయన తెలియజేశారు. ఈ ఆర్థిక సంవత్సరం చివరినాటికి రూ.13,000 కోట్ల టర్నోవర్ సాధించడం లక్ష్యమని పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే 8 కొత్త షోరూమ్‌లను ఏర్పాటు చేశామన్నారు.