
ముంబై: వచ్చే ఆర్థిక సంపత్సరం ప్రథమార్ధంలో దక్షిణాదియేతర మార్కెట్లలోకి కార్యకలాపాలను గణనీయంగా విస్తరించనున్నట్లు ఆభరణాల విక్రయ సంస్థ కల్యాణ్ జ్యుయలర్స్ ఇండియా ఈడీ రమేష్ కల్యాణరామన్ తెలిపా రు. ఇందుకోసం ఫ్రాంచైజీ విధానాన్ని ఎంచుకో వాలని నిర్ణయించినట్లు ఆయన పేర్కొన్నారు. ముందుగా 2025 నుంచి ఈ విధానంలో విస్త రించాలని భావించినప్పటికీ గత 3–4 త్రైమాసికాలుగా నెలకొన్న డిమాండ్‌ను చూసి.. అంతక న్నా ముందుగానే అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. ముందుగా 2–3 స్టోర్స్‌తో కార్యకలాపాల విస్తరణను ప్రయోగాత్మకంగా పరీక్షించనున్నట్లు పేర్కొన్నారు. ఫ్రాం చైజీ మోడల్‌లో స్టోర్ ఏర్పాటు వ్యయం సుమారు రూ. 20 కోట్లుగా ఉంటుందని తెలిపా రు. ఇందులో సింహభాగం వాటా ఉత్పత్తులదే ఉంటుందని, పెట్టుబడి వ్యయాలు తక్కువగానే ఉంటాయని వివరించా రు. ప్రస్తుతం కంపెనీకి 21 రాష్ట్రాలు, నాలుగు దేశాల్లో 151 సొంత షోరూమ్‌లు ఉన్నాయి. వీటిలో 121 స్టోర్స్ భారత్‌లో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment