Ramesh kalyanaraman
-
విస్తరణ బాటలో కల్యాణ్ జ్యుయలర్స్
ముంబై: వచ్చే ఆర్థిక సంపత్సరం ప్రథమార్ధంలో దక్షిణాదియేతర మార్కెట్లలోకి కార్యకలాపాలను గణనీయంగా విస్తరించనున్నట్లు ఆభరణాల విక్రయ సంస్థ కల్యాణ్ జ్యుయలర్స్ ఇండియా ఈడీ రమేష్ కల్యాణరామన్ తెలిపా రు. ఇందుకోసం ఫ్రాంచైజీ విధానాన్ని ఎంచుకో వాలని నిర్ణయించినట్లు ఆయన పేర్కొన్నారు. ముందుగా 2025 నుంచి ఈ విధానంలో విస్త రించాలని భావించినప్పటికీ గత 3–4 త్రైమాసికాలుగా నెలకొన్న డిమాండ్‌ను చూసి.. అంతక న్నా ముందుగానే అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. ముందుగా 2–3 స్టోర్స్‌తో కార్యకలాపాల విస్తరణను ప్రయోగాత్మకంగా పరీక్షించనున్నట్లు పేర్కొన్నారు. ఫ్రాం చైజీ మోడల్లో స్టోర్ ఏర్పాటు వ్యయం సుమారు రూ. 20 కోట్లుగా ఉంటుందని తెలిపా రు. ఇందులో సింహభాగం వాటా ఉత్పత్తులదే ఉంటుందని, పెట్టుబడి వ్యయాలు తక్కువగానే ఉంటాయని వివరించా రు. ప్రస్తుతం కంపెనీకి 21 రాష్ట్రాలు, నాలుగు దేశాల్లో 151 సొంత షోరూమ్‌లు ఉన్నాయి. వీటిలో 121 స్టోర్స్ భారత్‌లో ఉన్నాయి. -
కల్యాణ్ జ్యుయలర్స్ లాభం రూ. 69 కోట్లు
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ఆభరణాల సంస్థ కల్యాణ్ జ్యుయలర్స్ ఇండియా రూ. 69 కోట్ల నికర లాభం ప్రకటించింది. గత క్యూ2లో కంపెనీ రూ. 136 కోట్ల నష్టం నమోదు చేసింది. తాజాగా కోవిడ్–19 పరమైన ఆంక్షలు తగ్గడం, ఆర్థిక వ్యవస్థ రికవరీ తదితర అంశాలు అమ్మకాలకు ఊతమిచ్చినట్లు కంపెనీ తెలిపింది. సమీక్షా కాలంలో ఆదాయం రూ. 1,798 కోట్ల నుంచి 61 శాతం ఎగిసి రూ. 2,889 కోట్లకు పెరిగింది. క్యూ2లో కంపెనీ పటిష్టమైన పనితీరు కనపర్చిందని, కోవిడ్–19పరమైన ఆంక్షలు సడలింపుతో పాటు వినియోగదారుల సెంటిమెంట్ మెరుగుపడుతుండటంతో ప్రస్తుత త్రైమాసికంలో కూడా అమ్మకాలు మరింతగా వృద్ధి చెందవచ్చని కల్యాణ్ జ్యుయలర్స్ ఇండియా ఈడీ రమేష్ కల్యాణరామన్ తెలిపారు. బీఎస్ఈలో బుధవారం కంపెనీ షేరు సుమారు 4 శాతం పెరిగి రూ. 81.50 వద్ద క్లోజయ్యింది. -
కల్యాణ్ జ్యువెలర్స్ ‘అపూర్వ డైమండ్ కలెక్షన్’
హైదరాబాద్: ప్రముఖ ఆభరణాల విక్రయ సంస్థ ‘కల్యాణ్ జ్యువెలర్స్’ తాజాగా వినియోగదారుల కోసం ‘అపూర్వ డైమండ్ కలెక్షన్’ను ఏర్పాటు చేసింది. ఇందులోని ఆభరణాలను సాంప్రదాయ పద్ధతుల్లో రూపొందించామని, వాటిల్లో నాణ్యమైన డైమండ్స్‌ను పొందుపరిచామని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ కలెక్షన్ ధర రూ.5 లక్షలు- రూ.10 లక్షల ధరల శ్రేణిలో ఉంటుందని తెలియజేసింది. మహిళలకు డైమండ్ ఆభరణాలపై మక్కువ ఎక్కువని, వాటిని వివిధ కార్యక్రమాల్లో ధరించాలని భావిస్తారని, అలాంటి వారికి ‘అపూర్వ డైమండ్ కలెక్షన్’ సరిగ్గా సరిపోతుందని కల్యాణ్ జ్యువెలర్స్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ (మార్కెటింగ్) రమేశ్ కల్యాణరామన్ తెలిపారు.