new store
-
మూడు రోజులకు ఒక టాటా స్టార్‌బక్స్
ముంబై: టాటా కన్జ్యూమర్, స్టార్‌బక్స్ జాయింట్ వెంచర్ కంపెనీ టాటా స్టార్‌బక్స్ (కాఫీ ఔట్లెట్స్) భారీ విస్తరణ ప్రణాళికలను ప్రకటించింది. ప్రతి మూడు రోజులకు ఒక కొత్త స్టోర్‌ను ప్రారంభించనున్నట్టు తెలిపింది. 2028 నాటికి దేశవ్యాప్తంగా తమ నిర్వహణలోని స్టోర్లను 1,000కి పెంచుకోవాలనే లక్ష్యంతో ఉన్నట్టు ప్రకటించింది. స్థానిక భాగస్వాములకు నైపుణ్య శిక్షణతో ఉపాధి కల్పించడం, కొత్త స్టోర్ల ప్రారంభంతో కస్టమర్లకు మెరుగైన అనుభవాన్ని అందించడం, ప్రపంచవ్యాప్తంగా స్టార్‌బక్స్ కస్టమర్లు భారత కాఫీ రుచులను ఆస్వాదించేలా ప్రోత్సహించడం తమ విధానంలో భాగంగా ఉంటాయని వెల్లడించింది. ఇరు సంస్థలు 2012లో చెరో సగం వాటాతో కూడిన జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేయడం గమనార్హం. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 54 పట్టణాల్లో 390 స్టోర్లను నిర్వహిస్తూ, 4,300 మందికి ఉపాధి కల్పిస్తోంది. 2028 నాటికి వెయ్యి స్టోర్ల లక్ష్యాన్ని సాధించేందుకు వీలుగా ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లోకి విస్తరిస్తామని, ఎయిర్పోర్టుల్లోనూ స్టోర్లను ప్రారంభిస్తామని, ఉద్యోగుల సంఖ్యను 8,600కు పెంచుకుంటామని ప్రకటించింది. మహిళలకు శిక్షణ ఫుడ్ అండ్ బేవరేజెస్ (ఎఫ్అండ్బీ) పరిశ్రమలో కెరీర్ కోరుకునే మహిళలకు వృత్తిపరమైన శిక్షణ అందిస్తున్నట్టు టాటా స్టార్‌బక్స్ ప్రకటించింది. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, ముంబైలో స్టోర్లలో పనిచేస్తూనే నేర్చుకునే అవకాశం కల్పిస్తున్నట్టు తెలిపింది. ఉద్యోగులకు వారంలో ఐదు రోజుల పని విధానాన్ని అమలు చేస్తున్న తొలి ఎఫ్అండ్బీ కంపెనీ తమదేనని పేర్కొంది. -
బట్టలు కొంటే బంగారం! హైదరాబాద్‌లో టాటా బ్రాండ్ నాలుగో స్టోర్
హైదరాబాద్: టాటా గ్రూప్‌లో భాగమైన సంప్రదాయ దుస్తుల బ్రాండ్ తనైరా హైదరాబాద్‌లో తమ కార్యకలాపాలను మరింత విస్తరించింది. నగరంలో తమ నాలుగో స్టోర్‌ను ఏర్పాటు చేసింది. సుమారు 4,000 చ.అ. విస్తీర్ణంలో ఏర్పాటైన స్టోర్‌ను సంస్థ రిటైల్ హెడ్ అనిర్బన్ బెనర్జీ, సౌత్ రీజనల్ బిజినెస్ హెడ్ శరద్ ఆర్ దీన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జూన్ 16 నుంచి 20 వరకు ప్రత్యేక గోల్డ్ కాయిన్ ఆఫర్ ప్రకటించారు. రూ. 20,000 విలువైన కొనుగోళ్లు చేసే కస్టమర్లకు 0.2 గ్రాముల తనిష్క్ బంగారం నాణెం అందించనున్నట్లు సంస్థ వెల్లడించింది. -
బీ న్యూ స్టోర్లలో రియల్మీ 11ప్రో ప్లస్ సిరీస్ స్మార్ట్ఫోన్లు
హైదరాబాద్: మల్టీ బ్రాండ్ మొబైల్స్ రిటైల్ చెయిన్ బీ న్యూ మొబైల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్టోర్లలో రియల్మీ 11 ప్రో ప్లస్ సిరీస్ స్మార్ట్‌ఫోన్ అందుబాటులోకి వచ్చింది. హైదరాబాద్‌లోని మాదాపూర్ బీ న్యూ స్టోర్‌లో గురువారం నటి వర్ష బొల్లమ్మ ఈ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేశారు. బజాజ్, టీవీఎస్ క్రెడిట్, హెచ్డీబీ, బీనౌ, క్లెవర్పే ద్వారా నెలవారీ వాయిదా పద్ధతిలో ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. జీరో ఫైనాన్స్ కూడా అందుబాటులో ఉంది. ఈ అవకాశాన్ని కస్టమర్లు సద్వినియోగం చేసుకోవాలని బీ న్యూ స్టోర్ సీఎండీ బాలాజీ చౌదరి కోరారు. ఆవిష్కరణ కార్యక్రమంలో సంస్థ సీఈఓ సాయి నిఖిలేశ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాయి నితేష్‌తో పాటు రియల్మీ సౌతిండియా సేల్స్ హెడ్ వేణు మాధవ్‌లు పాల్గొన్నారు. -
బీ న్యూ మొబైల్స్ స్టోర్‌లో రెడ్మీ 12సి సిరీస్ ఫోన్లు
హైదరాబాద్: ప్రముఖ రిటైల్ చైన్ బీ న్యూ మొబైల్ స్టోర్ రెడ్మీ 12సీ, 12 సిరీస్ స్మార్ట్ ఫోన్లను అందుబాటులోకి తెచ్చింది. సినీ నటి దక్ష నాగర్కర్ గురువారం రెడ్మీ 12సీ స్మార్ట్‌ఫోన్‌ను గ్రాండ్‌గా లాంచ్ చేశారు. ‘‘బీ న్యూ స్టోర్స్ అద్భుతమైన ఆఫర్లతో రెడ్ మీ 12సీ స్మార్ట్ఫోన్లను తక్కువ ధరకే అందిస్తుంది. కస్టమర్లు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి’’ అని నాగర్కర్ కోరారు. ఆవిష్కరణ కార్యక్రమంలో కంపెనీ సీఎండీ బాలాజీ చౌదరి, సీఈఓ సాయి నిఖిలేశ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాయి నితేశ్తో పాటు రెడ్మీ ప్రతినిధులు పాల్గొన్నారు. -
ఆన్‌లైన్‌లోకి గోదావరి కట్స్
సాక్షి, బిజినెస్ బ్యూరో: మాంసాహార ఉత్పత్తులు విక్రయించే గోదావరి కట్స్ సంస్థ ఆన్లైన్, ఆఫ్‌లైన్‌లో కార్యకలాపాలను మరింతగా విస్తరిస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఏడు స్టోర్స్ ఉండగా, త్వరలోనే కొంపల్లి తదితర ప్రాంతాల్లో మరో నాలుగు ఏర్పాటు చేయనున్నట్లు సహ వ్యవస్థాపకుడు నిహాల్ వెల్లడించారు. 2 నెలల్లో హైదరాబాద్ వ్యాప్తంగా డెలివరీ సేవలను ప్రారంభిస్తున్నామని, సొంతంగా 50 మందితో డెలివరీ బృందాన్ని ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. ఎక్స్‌ప్రెస్ డెలివరీ కింద 2 గంటల్లో ఇంటికి డెలివరీ చేస్తామన్నారు. ఆండ్రాయిడ్, ఐఓఎస్ యాప్‌లతో పాటు వెబ్సైట్ నుంచి కూడా ఆర్డర్ ఇవ్వొచ్చని నిహాల్ చెప్పారు. ప్రస్తుతం రోజుకు 1,000 వరకూ ఆర్డర్లు వస్తున్నాయని ఆయన తెలిపారు. కస్టమర్లకు ఆయా ఉత్పత్తులతో తయారు చేసే వంటకాల గురించి వివరించేందుకు ప్రతి స్టోర్‌లో ఒక చెఫ్ అందుబాటులో ఉంటారని నిహాల్ పేర్కొన్నారు. కరోనాతో హైజీన్ ఫుడ్‌కు ప్రాధాన్యం పెరిగిన నేపథ్యంలో నాణ్యమైన మాంసాహార ఉత్పత్తులను అందించే లక్ష్యంతో గతేడాది జూన్‌లో గోదావరి కట్స్‌ను ప్రారంభించినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం 50కి పైగా మాంసాహార ఉత్పత్తులను విక్రయిస్తున్నట్లు వివరించారు. 20 రకాల సముద్ర ఉత్పత్తుల కోసం కాకినాడ, వైజాగ్ తదితర ప్రాంతాల్లో 200 మంది జాలర్లతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు. సాల్మన్, లాబ్‌స్టర్ మొదలైన వాటిని నార్వే నుంచి దిగుమతి చేసుకుంటున్నామని, అలాగే సీజన్‌ను బట్టి ఉత్పత్తులను గుజరాత్, ముంబై వంటి ప్రాంతాల నుంచి తెప్పిస్తున్నామని నిహాల్ వివరించారు. -
విస్తరణ బాటలో కల్యాణ్ జ్యుయలర్స్
ముంబై: వచ్చే ఆర్థిక సంపత్సరం ప్రథమార్ధంలో దక్షిణాదియేతర మార్కెట్లలోకి కార్యకలాపాలను గణనీయంగా విస్తరించనున్నట్లు ఆభరణాల విక్రయ సంస్థ కల్యాణ్ జ్యుయలర్స్ ఇండియా ఈడీ రమేష్ కల్యాణరామన్ తెలిపా రు. ఇందుకోసం ఫ్రాంచైజీ విధానాన్ని ఎంచుకో వాలని నిర్ణయించినట్లు ఆయన పేర్కొన్నారు. ముందుగా 2025 నుంచి ఈ విధానంలో విస్త రించాలని భావించినప్పటికీ గత 3–4 త్రైమాసికాలుగా నెలకొన్న డిమాండ్‌ను చూసి.. అంతక న్నా ముందుగానే అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. ముందుగా 2–3 స్టోర్స్‌తో కార్యకలాపాల విస్తరణను ప్రయోగాత్మకంగా పరీక్షించనున్నట్లు పేర్కొన్నారు. ఫ్రాం చైజీ మోడల్లో స్టోర్ ఏర్పాటు వ్యయం సుమారు రూ. 20 కోట్లుగా ఉంటుందని తెలిపా రు. ఇందులో సింహభాగం వాటా ఉత్పత్తులదే ఉంటుందని, పెట్టుబడి వ్యయాలు తక్కువగానే ఉంటాయని వివరించా రు. ప్రస్తుతం కంపెనీకి 21 రాష్ట్రాలు, నాలుగు దేశాల్లో 151 సొంత షోరూమ్‌లు ఉన్నాయి. వీటిలో 121 స్టోర్స్ భారత్‌లో ఉన్నాయి. -
పోటీ కన్నా కస్టమర్లకే ప్రాధాన్యం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఈ–కామర్స్‌లో ఇతర సంస్థలతో పోటీ కన్నా మెరుగైన సేవలందిస్తూ కస్టమర్లకు మరింత చేరువ కావడానికే ప్రాధాన్యమిస్తామని ఫ్లిప్‌కార్ట్ హోల్‌సేల్, వాల్‌మార్ట్ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఆదర్శ్ మీనన్ తెలిపారు. కిరాణా, చిన్న.. మధ్య తరహా సంస్థలు, రైతులకు తోడ్పాటు అందించేందుకు కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు. గురువారం తిరుపతిలో బెస్ట్‌ప్రైస్ స్టోర్ ప్రారంభం సందర్భంగా ఆయన ఈ విషయాలు తెలిపారు. దేశీయంగా ఇది 29వ బెస్ట్‌ప్రైస్ స్టోర్ కాగా, ఆంధ్రప్రదేశ్‌లో ఇది ఆరోదని మీనన్ చెప్పారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 10 బెస్ట్‌ప్రైస్ స్టోర్స్ ఉన్నాయని తెలిపారు. స్థానికంగా కొనుగోళ్లు జరపడం, ఉపాధి అవకాశాలు కల్పించడం ద్వారా స్థానిక ఎకానమీ వృద్ధికి తమ స్టోర్స్ ఇతోధికంగా తోడ్పడగలవని వివరించారు. తిరుపతిలో కొత్త స్టోర్‌తో ప్రత్యక్షంగా, పరోక్షంగా 2,000 పైచిలుకు ఉద్యోగాల కల్పన జరగగలదని మీనన్ చెప్పారు. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ఈ స్టోర్‌ను ప్రారంభించారు. సుమారు 56,000 చ.అ.ల విస్తీర్ణంలో ఇది ఏర్పాటైంది. ‘సులభతరంగా వ్యాపారాల నిర్వహణకు అనువైన పరిస్థితులు కల్పించే విషయంలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉంటోంది. ఫ్లిప్‌కార్ట్ గ్రూప్‌తో రాష్ట్రానికి దీర్ఘకాలిక సంబంధాలు ఉన్నాయి. కొత్త స్టోర్‌తో తిరుపతిలో కొత్తగా ఉద్యోగాల కల్పన, ఇతరత్రా అవకాశాలు రాగలవు‘ అని రామచంద్రా రెడ్డి తెలిపారు. మరోవైపు, ఫ్లిప్‌కార్ట్ హోల్‌సేల్ విభాగం సర్వీసులు 16 నగరాల్లో అందుబాటులో ఉన్నాయని మీనన్ చెప్పారు. -
కీలక నిర్ణయం : సంతల్లో షావోమి
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో చైనా వ్యతిరేక సెంటిమెంట్ రోజు రోజుకు పెరుగుతున్న సమయంలో చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షావోమీ కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని మారుమూల ప్రాంతాలకు కూడా తమ విక్రయాలను విస్తరించాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఎంఐస్టోర్ ఆన్ వీల్స్ అనే సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. తద్వారా గ్రామీణ భారతీయ వినియోగదారులను చేరుకోవాలని యోచిస్తోంది. దేశంలో స్మార్ట్‌ఫోన్ విక్రయాల్లో టాప్ బ్రాండ్ షావోమి ట్రావెలింగ్ స్టోర్ ప్రారంభించింది. అంటే గ్రామీణులకు చేరువయ్యేలా నిర్దిష్ట ప్రదేశాల్లో ఆగుతూ, వారాంతపు సంతలు, ఉత్సవాల్లో తమ ఉత్పత్తులను విక్రయిస్తూ షావోమి సంత నిర్వహిస్తుందన్నమాట. ఇందులో స్మార్ట్ఫోన్లతోపాటు, స్మార్ట్ టీవీలు, సీసీటీవీ కెమెరాలు, ఇయర్ ఫోన్లు, సన్ గ్లాసెస్, పవర్ బ్యాంకులు ఇలా పలు ఉత్పత్తులను విక్రయించనున్నట్లు షావోమి సోమవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. "ఎంఐస్టోర్-ఆన్-వీల్స్" ను ప్రారంభించడం సంతోషంగా ఉందని షావోమి ఇండియా సీఎండీ మనుకుమార్ జైన్ వెల్లడించారు. మూవింగ్ స్టోర్ ద్వారా రీటైల్ అనుభవాన్ని గ్రామీణులకు చేరువ చేస్తున్నామని ట్వీట్ చేశారు. అంతేకాదు ఈ ప్రాజెక్టును కేవలం 40 రోజుల్లో పూర్తి చేసిన తమ ఆఫ్‌లైన్ బృందానికి ధన్యవాదాలు తెలిపారు. మేడిన్ ఇండియా ఉత్పత్తులకు తాము 100 శాతం కట్టుబడి ఉన్నామని మరో ట్వీట్ లో జైన్ వెల్లడించారు. అన్ని ఉత్పత్తులను ఇండియాలో తయారు చేయడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. మేక్ ఇన్ ఇ్ండియా, మేక్ ఫర్ ఇండియన్స్, మేడ్ బై ఇండియన్స్ అంటూ ట్వీట్ చేశారు. తమ స్టోర్-ఆన్-వీల్స్ అవుట్లెట్లు ప్రస్తుత కరోనా సమయంలో పూర్తిగా సురక్షితంగా ఉంటాయని ఎంఐ ఇండియా సీఓఓ మురళీకృష్ణన్ తెలిపారు. అతిపెద్ద సింగిల్ బ్రాండ్ రిటైల్ నెట్వర్క్ ఉన్న తాము ఈ కొత్త ప్రయోగం ద్వారా దేశంలోని మారుమూల ప్రాంతాలకు కూడా చేరుకోనున్నామని చెప్పారు. కాగా కరోనా సంక్షోభం, లాక్ డౌన్, ఇండో-చైనా సరిహద్దు ఉద్రిక్తతలు, చైనా ఉత్పత్తులపై నిషేధం డిమాండ్ లాంటి ఎదురుదెబ్బల మధ్య కూడా షావోమి జూన్ త్రైమాసికంలో స్మార్ట్ ఫోన్ విక్రయాల్లో అగ్రస్థానంలో నిలిచింది. "Mi"les to go before we sleep! Excited to launch "#MiStore-on-wheels", an innovative concept that brings #retail experience to the heart of #India, connecting villages through a moving store. So proud of our #offline #team who completed this project in just 40 days. I ❤️ Mi pic.twitter.com/7OECCNnlgb — Manu Kumar Jain (@manukumarjain) September 21, 2020 -
హైదరాబాద్‌లో రిలయన్స్ స్మార్ట్ న్యూ స్టోర్స్
సాక్షి, హైదరాబాద్ : రిలయన్స్ రిటైల్‌కు చెందిన భారీ సూపర్ మార్కెట్ చైన్ రిలయన్స్ స్మార్ట్ విస్తరణ ప్రణాళికల్లో భాగంగా హైదరాబాద్‌లోని పీర్జాదిగూడ, చాంద్రాయణగుట్టలో నూతన స్టోర్లను లాంఛ్ చేసింది. కిరాణా, పండ్లు, కూరగాయలు, కిచెన్ వేర్ సహా గృహావసరాలకు అవసరమైన వస్తువులు ఈ స్టోర్స్‌లో అందుబాటులో ఉంటాయి. ఇక పీర్జాదిగూడ స్టోర్ 7900 చదరపు అడుగుల్లో, చాంద్రాయణగుట్ట స్టోర్ 17,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో కస్టమర్లకు సౌకర్యవంతమైన షాపింగ్ అనుభూతిని కలిగిస్తాయని సంస్థ ఓ ప్రకటనలో పేర్కొంది. కిరాణా సహా వివిధ వస్తువులపై భారీ ఆఫర్లు, డిస్కౌంట్లను కస్టమర్లకు అందించనున్నట్టు తెలిపింది. దేశవ్యాప్తంగా వందకు పైగా నగరాల్లో 150 రిలయన్స్ స్మార్ట్ స్టోర్లు వినియోగదారులకు మెరుగైన సేవలు అందిస్తున్నాయని వెల్లడించింది. -
మెగా డీల్ అనంతరం కొత్తగా 50 స్టోర్లు
న్యూఢిల్లీ : దేశీయ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ను తన సొంతం చేసుకుంటున్నట్టు మెగా డీల్‌ను ప్రకటించిన అనంతరం అమెరికా రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్ భారత్‌లో తన స్టోర్ల విస్తరణ ప్రణాళికను ప్రకటించింది. వచ్చే నాలుగు-ఐదేళ్లలో కొత్తగా 50 స్టోర్లను ఏర్పాటు చేయనున్నట్టు గురువారం తెలిపింది. తన హోల్‌సేల్ క్యాష్ అండ్ క్యారీ బిజినెస్‌లను వృద్ధి చేయడం కొనసాగించనున్నట్టు పేర్కొంది. ప్రస్తుతం వాల్‌మార్ట్‌కు భారత్‌లో 21 స్టోర్లు ఉన్నాయి. వచ్చే నాలుగు నుంచి ఐదేళ్లలో మరో 50 కొత్త స్టోర్లను ఏర్పాటు చేస్తాం అని వాల్‌మార్ట్ ఇండియా అధ్యక్షుడు, సీఈవో క్రిష్ అయ్యర్ ప్రకటించారు. ఈ ఏడాది 5 స్టోర్లను ఏర్పాటు చేయనున్నామని, క్రమంగా వృద్ధి చెందుతూ ఏడాదికి 12 నుంచి 15 స్టోర్లను ప్రారంభించనున్నట్టు తెలిపారు. వాల్‌మార్ట్ 9 రాష్ట్రాల్లో 19 నగరాల్లో తన కార్యకలాపాలను కొనసాగిస్తోంది. అవే భౌగోళిక ప్రాంతాల్లో భవిష్యత్తులో తమ స్టోర్లను విస్తరించనున్నట్టు అయ్యర్ చెప్పారు. ముఖ్యంగా పంజాబ్, హర్యానా, ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎక్కువగా ఫోకస్ చేయనున్నట్టు పేర్కొన్నారు. మరోవైపు ఫ్లిప్‌కార్ట్‌ను వాల్‌మార్ట్‌ను సొంతం చేసుకున్న నేపథ్యంలో కంపెనీ పేరులో ఎలాంటి మార్పు ఉండబోదని స్పష్టంచేసింది. నిన్ననే(బుధవారం) ఫ్లిప్‌కార్ట్‌లో 77 శాతం వాటాను తాము కొనుగోలు చేయబోతున్నట్టు వాల్‌మార్ట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందుకోసం 16 బిలియన్ డాలర్లను (దాదాపు రూ.1,05,000 కోట్లు) చెల్లించడానికి వాటాదారులతో ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలిపింది. ప్రస్తుత డీల్ ప్రకారం చూస్తే... ఫ్లిప్‌కార్ట్ కంపెనీ విలువ(వేల్యుయేషన్) 20.8 బిలియన్ డాలర్లు. అంటే మన కరెన్సీలో సుమారు రూ.1,40,000 కోట్లు. -
ఈ ఏడాది కొత్తగా షావోమి 6 స్మార్ట్ఫోన్లు
దేశీయ మార్కెట్లో చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ షావోమి దూసుకుపోతోంది. కొత్త కొత్త ప్రొడక్ట్‌లతో తన సత్తా చాటుకుంటోంది. ఇక షావోమి స్మార్ట్ఫోన్లకు భారత్‌లో వస్తున్న స్పందన అంతా ఇంతా కానిది. తాజాగా ఈ ఏడాది షావోమి 6 స్మార్ట్ఫోన్లను లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది. ఈ విషయాన్ని షావోమి గ్లోబల్ వైస్-ప్రెసిడెంట్, ఇండియా హెడ్ మను కుమార్ జైన్ లైవ్‌మింట్‌లో తెలిపారు. కేవలం ఆరు స్మార్ట్ఫోన్ల లాంచింగ్ మాత్రమే కాక, 100 ఎక్స్‌క్లూజివ్ స్టోర్లను కూడా షావోమి లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు పేర్కొన్నారు. కొత్త ప్రొడక్ట్ కేటగిరీల విడుదలతో పాటు, సాఫ్ట్‌వేర్‌పై, ఇంటర్నెట్ స్టార్టప్‌లపై కూడా ఎక్కువగా పెట్టుబడులు పెట్టబోతున్నట్టు చెప్పారు. భారత్‌లో షావోమి పెట్టుబడులు పెంచడం అంత ఆశ్చర్యకరమైన విషయం కాదని, చైనా తర్వాత అతిపెద్ద మార్కెట్‌గా షావోమినే ఉందని తెలిసింది. భారత్‌లో అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ బ్రాండుగా కూడా షావోమి నిలుస్తోంది. శాంసంగ్‌ను వెనక్కి నెట్టేసి మరీ షావోమి భారత్ మార్కెట్లోకి టాప్ బ్రాండుగా దూసుకొచ్చేసింది. ఆరేళ్లలో షావోమి టాప్ బ్రాండుగా నిలువడం ఇదే తొలిసారి. రెండు స్వచ్ఛంద రీసెర్చ్ సంస్థలు విడుదల చేసిన డేటాలో ఈ విషయం వెల్లడైంది. ప్రస్తుతం రెడ్మి 5 స్మార్ట్‌ఫోన్‌ను భారత్‌లో మార్చి 14న లాంచ్ చేయబోతుంది. రెడ్మి 4కు సక్సెసర్‌గా ఇది మార్కెట్లోకి వస్తోంది. మోస్ట్ అఫర్డబుల్ బెజెల్-లెస్ ఫోన్‌గా ఇది అలరించబోతుంది. కేవలం స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోనే కాక, ఇటు స్మార్ట్‌టీవీ మార్కెట్లోనూ తన పాగా వేయాలని చూస్తోంది. 55 అంగుళాల ఎంఐ టీవీ4 లాంచింగ్ అనంతరం, మరో రెండు అఫర్డబుల్ స్మార్ట్‌టీవీలను షావోమి లాంచ్ చేసింది. 32 అంగుళాలు, 43 అంగుళాలలో ఎంఐ టీవీ 4ఏ స్మార్ట్‌టీవీను మార్కెట్లోకి తీసుకొచ్చింది. 43 అంగుళాల టీవీ ధర రూ.22,999 కాగ, 32 అంగుళాల ఎంఐ టీవీ 4ఏ ధర 13,999 రూపాయలు. -
న్యూ లుక్ తో అదరగొట్టనున్న యాపిల్ స్టోర్లు
శాన్ ఫ్రాన్సిస్కో : ఐ ఫోన్ ప్రేమికులను ఆకట్టుకునే దిశగా యాపిల్ తన స్టోర్ల కోసం ఒక కొత్త స్టైలిష్ ప్రొడక్ట్ ను పరిచయం చేస్తోంది. తన విక్రయ సంస్థలకు కొత్త రూపును అందించడానికి ఈ స్టైలిస్ ప్రొడక్ట్ ను తీసుకొచ్చినట్టు చెబుతోంది. ప్రపంచవ్యాప్తంగా 480 స్టోర్లు ఉన్న ఐఫోన్ తయారీదారి యాపిల్, శాన్ ప్రాన్సిస్కో నగరంలోని స్టోర్ ను న్యూ లుక్ అద్దడం కోసమే ఈ స్టైలిస్ తో రీడిజైన్ చేసిందట. ఈ రీ డిజైన్ స్టోర్ ను శనివారం నుంచి ప్రజలకు అందుబాటులో తేనున్నట్టు కంపెనీ వెల్లడించింది. మొత్తం గాజు, మెటల్, చెక్కతో అందంగా దీన్ని రీ డిజైన్ చేశారట.ఈ ప్రత్యేకతలతోనే భవిష్యత్తులో ప్రారంభించబోయే తమ కొత్త స్టోర్లు కూడా ఉంటాయని యాపిల్ ప్రతినిధులు శాన్ ప్రాన్సిస్కో ఈవెంట్ చెప్పారు. కాగా యాపిల్ మొదటిసారి ఐఫోన్ అమ్మకాలను, రెవెన్యూలను కోల్పోయింది. ఈ నేపథ్యంలో తన కొత్తదనంతో మళ్లీ మార్కెట్లను ఆకట్టుకోవాలని యాపిల్ ప్రయత్నిస్తోంది. సిలికాన్ వ్యాలీలో వచ్చే ఏడాది యాపిల్ ప్రారంభించబోయే కొత్త ప్రధాన కార్యాలయాన్ని ఈ ఫీచర్లతోనే రూపొందించనున్నట్టు తెలుస్తోంది. -
హైదరాబాద్‌లో అమెరికన్లగ్జరీ బ్రాండ్స్టోర్