హైదరాబాద్: ప్రముఖ రిటైల్ చైన్ బీ న్యూ మొబైల్ స్టోర్ రెడ్‌మీ 12సీ, 12 సిరీస్ స్మార్ట్ ఫోన్లను అందుబాటులోకి తెచ్చింది. సినీ నటి దక్ష నాగర్కర్ గురువారం రెడ్‌మీ 12సీ స్మార్ట్‌ఫోన్‌ను గ్రాండ్‌గా లాంచ్ చేశారు. ‘‘బీ న్యూ స్టోర్స్ అద్భుతమైన ఆఫర్లతో రెడ్ మీ 12సీ స్మార్ట్‌ఫోన్లను తక్కువ ధరకే అందిస్తుంది.
కస్టమర్లు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి’’ అని నాగర్కర్ కోరారు. ఆవిష్కరణ కార్యక్రమంలో కంపెనీ సీఎండీ బాలాజీ చౌదరి, సీఈఓ సాయి నిఖిలేశ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాయి నితేశ్‌తో పాటు రెడ్‌మీ ప్రతినిధులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment