Bnew
-
బీ న్యూ మొబైల్స్ స్టోర్‌లో రెడ్మీ 12సి సిరీస్ ఫోన్లు
హైదరాబాద్: ప్రముఖ రిటైల్ చైన్ బీ న్యూ మొబైల్ స్టోర్ రెడ్మీ 12సీ, 12 సిరీస్ స్మార్ట్ ఫోన్లను అందుబాటులోకి తెచ్చింది. సినీ నటి దక్ష నాగర్కర్ గురువారం రెడ్మీ 12సీ స్మార్ట్‌ఫోన్‌ను గ్రాండ్‌గా లాంచ్ చేశారు. ‘‘బీ న్యూ స్టోర్స్ అద్భుతమైన ఆఫర్లతో రెడ్ మీ 12సీ స్మార్ట్ఫోన్లను తక్కువ ధరకే అందిస్తుంది. కస్టమర్లు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి’’ అని నాగర్కర్ కోరారు. ఆవిష్కరణ కార్యక్రమంలో కంపెనీ సీఎండీ బాలాజీ చౌదరి, సీఈఓ సాయి నిఖిలేశ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాయి నితేశ్తో పాటు రెడ్మీ ప్రతినిధులు పాల్గొన్నారు. -
‘బి న్యూ మొబైల్స్’ వార్షికోత్సవ ఆఫర్లు
హైదరాబాద్: గొలుసుకట్టు మొబైల్ విక్రయశాలల సంస్థ ‘బి న్యూ మొబైల్స్’ సంస్థ ఎనిమిదో వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఆకర్షణీయమైన ఆఫర్లను ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల్లో 2014లో కార్యకలాపాలు ప్రారంభించిన ఈ సంస్థ షోరూమ్‌ల సంఖ్యను 108కు పెంచుకుంది. అంతేకాదు ఈ నెలలోనే కొత్తగా 10 షోరూమ్‌లను ప్రారంభించబోతున్నట్టు ‘బి న్యూ మొబైల్స్’ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ యర్రగుంట్ల సాయి నిఖిలేష్ తెలిపారు. శామ్సంగ్, ఐఫోన్, రెడ్మీ, రియల్మీ, వన్‌ప్లస్ వన్, వివో, ఒప్పో, తదితర ఎన్నో బ్రాండ్ల మొబైల్ ఫోన్లను అతి తక్కువ ధరలకు విక్రయిస్తున్నట్టు చెప్పారు. అన్ని ప్రముఖ బ్రాండ్ల టెలివిజన్లతోపాటు, ల్యాప్‌టాప్‌లు, హోం థియేటర్లు, వాటర్ ప్యూరిఫయర్లు, కెమెరాలు, స్మార్ట్‌వాచ్‌లను అందుబాటులో ఉంచినట్టు తెలిపారు. అమెజాన్ పే ద్వారా చేసే కొనుగోళ్లపై రూ.900 వరకు క్యాష్‌బ్యాక్ ఇస్తున్నట్టు చెప్పారు. ఐసీఐసీఐ కార్డ్‌తో కొనుగోలు చేస్తే రూ.1,500 తక్షణ క్యాష్‌బ్యాక్.. జస్ట్‌మనీ ద్వారా కొనుగోలు చేస్తే ఒక నెల ఈఎంఐ ఉచితంగా ఇస్తున్నట్టు పేర్కొన్నారు. పేటీఎం ద్వారా కొనుగోళ్లపై 11శాతం క్యాష్ బ్యాక్ తదితర ఆఫర్లను ఇస్తున్నట్టు చెప్పారు. -
బి–న్యూ మొబైల్స్ ‘సెంచరీ’!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మల్టీ బ్రాండ్ మొబైల్స్ రిటైల్ చైన్ బి–న్యూ మొబైల్స్ 100 స్టోర్ల మైలురాయిని అధిగమించింది. ఆంధ్రప్రదేశ్‌లోని వైజాగ్‌లో సోమవారం రెండు ఔట్లెట్లను ప్రారంభించింది. తద్వారా సంస్థ కేంద్రాల సంఖ్య 101కి చేరుకుంది. తెలుగు రాష్ట్రాల్లో 50 లక్షల పైచిలుకు కస్టమర్లతో విజయవంతంగా కార్యకలాపాలు సాగిస్తున్నట్టు బి–న్యూ మొబైల్స్ సీఎండీ వై.డి.బాలాజీ చౌదరి ఈ సందర్భంగా తెలిపారు. 2014లో విజ యవాడలో తొలి స్టోర్‌తో మొబైల్స్ విక్రయాల్లోకి అడుగుపెట్టామని చెప్పారు. ఏపీలో 82, తెలంగాణలో 19 ఔట్లెట్లను నిర్వహిస్తున్నామన్నారు. వచ్చే ఏడాదికల్లా రెండింతలు.. గత ఆర్థిక సంవత్సరంలో బి–న్యూ మొబైల్స్ రూ.700 కోట్ల టర్నోవర్ సాధించింది. 2021–22లో రూ.1,000 కోట్లు ఆశిస్తున్నామని కంపెనీ ఈడీ వై.సాయి నిఖిలేశ్ తెలిపారు. ‘2022 డిసెంబరు నాటికి ఏపీ, తెలంగాణలో మరో 100 స్టోర్లను ప్రారంభిస్తాం. ఇందుకు రూ.50 కోట్లు వెచ్చిస్తాం. ఒక్క హైదరాబాద్‌లోనే 25 ఔట్లెట్లను తెరుస్తాం. ప్రస్తుతం సంస్థలో 700 పైచిలుకు సిబ్బంది ఉన్నారు. అన్ని స్టోర్లలో విస్తృత శ్రేణి మొబైల్స్ అందుబాటులో ఉంచాం. ప్రత్యక్షంగా చూసుకునేందుకు వీలుగా ప్రతి కేంద్రంలో లైవ్ డిస్ప్లే ఏర్పాటు చేశాం. ఆన్లైన్లో బుక్ చేసుకున్న కస్టమర్లకు రెండు గంటల్లో మొబైల్‌ను చేరవేస్తున్నాం’ అని వివరించారు. స్టోర్‌ను ప్రారంభిస్తున్న బాలాజీ చౌదరి, నిఖిలేశ్ తదితరులు -
బీన్యూలో సంక్రాంతి ఆఫర్లు
అనంతపురం : అన్ని వర్గాల ప్రజలకు సెల్ఫోన్లను అందుబాటులోకి తెచ్చేందుకు బీ-న్యూ సంస్థ సంక్రాంతి సందర్భంగా వినూత్న ఆఫర్లను అందిస్తున్నట్లు సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ వై.డి. బాలాజీ చౌదరి తెలిపారు. ఈమేరకు శుక్రవారం వారు ఓ ప్రకటన విడుదల చేశారు. స్మార్ట్‌ఫోన్ ద్వారా తమ బ్యాంకింగ్ లావాదేవీలను జరిపేందుకు వీలుగా తక్కువ ధరకు వివిధ మోడళ్ల సెల్ ఫోన్లను బీ-న్యూ సంస్థ అందుబాటులో ఉంచిందన్నారు. పలు మోడళ్ల ఫోన్లకు బజాజ్ ఫైనాన్స్ ద్వారా నెలవారీ చెల్లించే సదుపాయం ఉందన్నారు. అంతేకాక అన్ని రకాల డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా చెల్లింపు చేసే అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పారు. రూ.699కే డ్యూయల్ సిమ్ ఫోన్ కొనుగోలు చేస్తే లంచ్‌బాక్స్, రూ.999 డ్యూయల్‌సిమ్ ఫోన్‌తో ట్రావెల్ బ్యాగ్, రూ.1399కు సెల్‌ఫోన్‌తోపాటు టేబుల్ ఫ్యాన్, రూ.4499కే 4జీ టెక్నాలజీ కలిగిన సెల్‌ఫోన్‌కు జియో సిమ్ అందిస్తున్నట్లు తెలిపారు. సంక్రాంతి సందర్భంగా అందిస్తున్న ఈ ఆఫర్లను వినియోగదారులు ఉపయోగించుకోవాలని ఆయన ఆప్రకటనలో తెలిపారు.