సాక్షి, హైదరాబాద్ : రిలయన్స్ రిటైల్‌కు చెందిన భారీ సూపర్ మార్కెట్ చైన్ రిలయన్స్ స్మార్ట్ విస్తరణ ప్రణాళికల్లో భాగంగా హైదరాబాద్‌లోని పీర్జాదిగూడ, చాంద్రాయణగుట్టలో నూతన స్టోర్‌లను లాంఛ్ చేసింది. కిరాణా, పండ్లు, కూరగాయలు, కిచెన్ వేర్ సహా గృహావసరాలకు అవసరమైన వస్తువులు ఈ స్టోర్స్‌లో అందుబాటులో ఉంటాయి.
ఇక పీర్జాదిగూడ స్టోర్ 7900 చదరపు అడుగుల్లో, చాంద్రాయణగుట్ట స్టోర్ 17,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో కస్టమర్లకు సౌకర్యవంతమైన షాపింగ్ అనుభూతిని కలిగిస్తాయని సంస్థ ఓ ప్రకటనలో పేర్కొంది. కిరాణా సహా వివిధ వస్తువులపై భారీ ఆఫర్లు, డిస్కౌంట్లను కస్టమర్లకు అందించనున్నట్టు తెలిపింది. దేశవ్యాప్తంగా వందకు పైగా నగరాల్లో 150 రిలయన్స్ స్మార్ట్ స్టోర్లు వినియోగదారులకు మెరుగైన సేవలు అందిస్తున్నాయని వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment