supermarket
-
నీట్‌గా మీట్
ఆహారం, పరిసరాల పరిశుభ్రత పట్ల ప్రజల్లో రోజురోజుకు అవగాహన పెరుగుతోంది. ప్రజల అభిరుచికి తగ్గట్లే వ్యాపారస్తులు కూడా అధునాతన సదుపాయాలు అందుబాటులోకి తెస్తున్నారు. ఇప్పటికే పట్టణాల్లో సంతలు సూపర్ మార్కెట్లలోకి వచ్చాయి. ఇక మాంసం దుకాణాలు కూడా నీట్‌గా మారుతున్నాయి. బహుళజాతి సంస్థలతో పాటు స్థానిక వ్యాపారులు కూడా కస్టమర్లను ఆకర్షించడానికి నీట్నెస్ మెయింటైన్ చేస్తున్నారు. అలాంటి మాంసాహార ఉత్పత్తులు కొనడానికే ప్రజలు కూడా ఆసక్తి చూపుతున్నారు. మాంసాహార ఉత్పత్తులను కొన్ని సంస్థలు ఇప్పటికే ఆన్లైన్లో అందుబాటులోకి తీసుకొచ్చాయి. వీటికి దీటుగా పట్టణ ప్రాంతాల్లో తాజా, ఫ్రోజెన్ ఉత్పత్తులు అందించడానికి నాన్ వెజ్ స్టోర్స్, మార్ట్ల ఏర్పాటుకు ఔత్సాహికులు ముందుకొస్తున్నారు. – సాక్షి, అమరావతిమీట్ మార్ట్‌కు రూ.30 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు ఔత్సాహికులు పెట్టుబడులు పెడుతున్నారు. కొందరు నేరుగా మార్టులు నడుపుతుంటే.. మరి కొందరు ఫ్రాంచైజీ తరహాలో ఈ మార్ట్లను విస్తరిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో నిరుద్యోగ యువత ముందుకొస్తున్నారు. కేవలం చేపలు, కోడి, మేక మాంసాలకే పరిమితం కాకుండా అన్ని రకాల మాంసాహార ఉత్పత్తులు ఒకే చోట అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ తరహా మార్ట్లు రాష్ట్రంలోని ప్రధాన నగరాలు, పట్టణ ప్రాంతాల్లో 50కు పైగా ఉన్నాయి. ఈ మార్టుల ద్వారా రాష్ట్రంలో రోజుకు సగటున ఐదారు కోట్ల రూపాయలకు పైగా వ్యాపారం జరుగు తోందని అంచనా వేస్తున్నారు. ఉన్నత, ఎగువ మధ్య తరగతి ప్రజలుండే ప్రాంతాలే లక్ష్యంగా మార్టుల యజమానులు షాప్స్ ఓపెన్ చేస్తు న్నారు. విశాఖ, విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, కాకినాడ, ఏలూరు, నెల్లూరు, తిరుపతి వంటి నగరాల్లో ఇవి బాగా విస్తరిస్తున్నాయి.మీట్ మార్టుల ప్రత్యేకతలు ఇవే.. » కబేళాలతో పాటు డ్రెస్సింగ్, ప్యాకింగ్ ఇలా ప్రతీ దాంట్ అంతర్జాతీయ ప్రమాణాలు» పరిసరాలన్నీ అత్యంత పరిశుభ్రంగా ఉంచడంతో పాటు సిబ్బందికి ప్రత్యేక డ్రెస్ కోడ్» వచ్చే ప్రతీ కస్టమర్ కళ్లెదుటే వారికి కావాల్సినట్టుగా కట్ చేసి ప్యాకింగ్» మటన్, చికెన్, ఫిష్ తదితరాలకు ఏ పార్ట్ (భాగం) కావాలంటే ఆ పార్టులు వేరుగా విక్రయం » బిర్యానీ, తందూరీ వంటి వంటకాలకు తగినట్టుగా కట్ చేసి ప్యాకింగ్» రెడీ టూ కుక్కు వీలుగా మసాలాలు అద్ది మరీ అందించడండోర్ డెలివరీకి ప్రత్యేకంగా కాల్ సెంటర్» రాష్ట్రంలో మీట్ మార్టులు 50» రోజుకు సగటున జరుగుతున్న వ్యాపారం (రూ. కోట్లలో) 5- 6 » ఒక్కో మీట్ మార్టుకు పెట్టుబడి (రూ.ల్లో) 30 - 50 లక్షల వరకుశుచి, శుభ్రత ముఖ్యంశుచి, శుభ్రత ఉంటే కాస్త ధర ఎక్కువైనా వెనుకాడడం లేదు. విజయవాడ నగరంలో పెద్ద ఎత్తున ఫిష్, మటన్ మార్ట్లు అందుబాటులోకి వచ్చాయి. బ్రతికున్న చేపలే కాదు.. శుభ్రమైన వాతావరణంలో కోడి, మేక మాంసంతో పాటు తాజాగా బతికి ఉన్న అన్ని రకాల రొయ్యలు ఈ మార్టుల్లో దొరుకుతున్నాయి. –ఎం.హరినాథ్, రిటైర్డ్ డీఈ, పంటకాలవ రోడ్, విజయవాడప్రజల్లో ఆదరణ బాగుందిగత కొన్నేళ్లుగా మత్స్య ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేస్తున్నాను. రెండేళ్ల క్రితం ఈ రంగంలోకి అడుగు పెట్టా. తొలుత విశాఖలో ది హైపర్ మీటన్ స్టోర్ ఏర్పాటు చేశాను. ప్రస్తుతం విశాఖలో నాలుగు, కాకినాడ, విజయవాడల్లో ఒక్కొక్కటి చొప్పున ఉన్నాయి. ఒక్కో మార్ట్‌కు రూ. 40 లక్షల వరకు పెట్టుబడి పెట్టాను. 50 మందికి ఉపాధి కల్పించా. నెలకు రూ.12 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు అమ్మకాలు జరుగుతున్నాయి. ప్రజలు ఇప్పుడిప్పుడే అలవాటు పడుతున్నారు. ఆదరణ బాగానే ఉంది. ఆన్లైన్లో బుకింగ్‌కు కూడా అవకాశం ఉంది. డోర్ డెలివరీ చేస్తున్నాం. భవిష్యత్‌లో మిగిలిన నగరాల్లో కూడా విస్తరించే దిశగా ముందుకెళ్తున్నాం. – పసల పర్వేష్, ఎం.డీ, హైపర్ మీటన్ స్టోర్ -
ఐపీఓకు రానున్న ప్రముఖ సంస్థ..?
ప్రముఖ సూపర్‌మార్కెట్ సంస్థగా విశాల్‌మార్ట్ తొలి పబ్లిక్ ఇష్యూ (ఐపీఓ)కు రాబోతున్నట్లు తెలిసింది. విశాల్ మెగామార్ట్ 1 బిలియన్ డాలర్ల (సుమారు రూ.8,300 కోట్ల) నిధుల సమీకరణ కోసం తొలి పబ్లిక్ ఇష్యూ (ఐపీఓ)కు రానుందని సమాచారం. విశాల్మార్కెట్ పలు నగరాల్లో 560 సూపర్మార్కెట్లు నిర్వహిస్తోంది. ఈ సంస్థ విలువను 5 బిలియన్ డాలర్లుగా (రూ.41,500 కోట్లు) పరిగణించి, ఐపీఓకు రావాలని సంస్థ యోచిస్తున్నట్లు తెలిసింది. విశాల్ మెగామార్ట్‌లో స్విట్జర్లాండ్ పార్ట్నర్స్ గ్రూప్ పీజీహెచ్ఎన్.ఎస్, మన దేశానికి చెందిన కేదారా క్యాపిటల్‌కు కలిపి మెజార్టీ వాటా ఉంది. ఐపీఓలో ఈ రెండు సంస్థలు షేర్లు విక్రయిస్తాయని తెలుస్తోంది. ఇదీ చదవండి: కంపెనీని బురిడీ కొట్టించి గ్యాంబ్లింగ్.. అసలేం జరిగిందంటే.. ఈ రెండు ప్రైవేటు ఈక్విటీ సంస్థలు కలిపి విశాల్ మెగామార్ట్‌లో ఎంత వాటా కలిగి ఉన్నాయి? ఎంతమేరకు విక్రయిస్తాయనేది తెలియాల్సి ఉంది. విశాల్ మెగామార్ట్ సీఈఓ గుణేందర్ కపూర్ ఐపీఓ వివరాలు వెల్లడించేందుకు నిరాకరించారని రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది. -
Russia-Ukraine war: యుద్ధ వ్యతిరేక లేబుళ్లు అంటించినందుకు.. రష్యా కళాకారిణికి ఏడేళ్ల జైలు
మాస్కో: సూపర్మార్కెట్లోని వస్తువులపై ఉండే ధరల లేబుళ్లను తొలగించి, వాటి స్థానంలో యుద్ధ వ్యతిరేక నినాదాలున్న లేబుళ్లు అంటించిన నేరంపై ఓ కళాకారిణికి రష్యా కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. గత ఏడాది ఉక్రెయిన్‌పై రష్యా దాడులు మొదలయ్యాక.. సెయింట్ పీటర్స్బర్గ్కు చెందిన సాషా స్కోచిలెంకో(33) అనే కళాకారిణి స్థానిక ఫెమినిస్టు బృందం పిలుపు మేరకు స్థానిక సూపర్మార్కెట్లోని వస్తువుల ధర లేబుళ్లను తీసేసి..‘రష్యా ఆర్మీ మరియుపోల్‌లోని స్కూల్‌పై బాంబు వేసింది’... ‘రష్యా ఫాసిస్ట్ రాజ్యంగా మారి ఉక్రెయిన్‌పై దాడి చేసినందుకు మా ముత్తాత రెండో ప్రపంచ యుద్ధంలో పోరాడలేదు’ అంటూ రాసి ఉన్న కొన్ని లేబుళ్లను అంటించింది. ఈ నేరానికి అధికారులు గత ఏడాది ఏప్రిల్ అదుపులోకి తీసుకున్నారు. యుద్ధానికి వ్యతిరేకంగా ఎలాంటి వైఖరి తీసుకున్నా కఠిన శిక్షలకు అవకాశం కల్పిస్తూ పుతిన్ ప్రభుత్వం చట్టాలు తీసుకువచి్చంది. ఈ చట్టాలు అమల్లోకి వచ్చాక జరిగిన మొట్టమొదటి అరెస్ట్ ఇది. దీంతో, విచారణ సుదీర్ఘంగా సాగింది. తనపై వచి్చన ఆరోపణలను సాషా అంగీకరించింది కూడా. తీవ్ర అరోగ్య సమస్యలతో బాధపడుతున్న సాషా జైలులోనే చనిపోయే ప్రమాదముందని ఆమె తరఫు లాయర్లు తెలిపారు. అయినప్పటికీ జడ్జి ఏడేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచి్చనట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని ప్రభుత్వ టీవీలో లైవ్‌లో వ్యతిరేకించారన్న ఆరోపణలపై కోర్టు ఒకటి మరినా అనే జర్నలిస్టుకు ఎనిమిదిన్నరేళ్ల జైలు శిక్ష విధించింది. యుద్ధాన్ని నిరసించిన వ్లాదిమిర్ కారా ముర్జా అనే ప్రతిపక్ష నేతకు ఏప్రిల్‌లో 25 ఏళ్ల జైలు శిక్ష పడింది. -
బాలీవుడ్ స్టార్ బిల్డింగ్‌లో సూపర్‌మార్కెట్: నెలకు అద్దె ఎంతో తెలుసా?
ముంబైలోని బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్‌కు చెందిన ఇంటిని IIT గ్రాడ్యుయేట్లు లీజుకు తీసుకున్నారు. ఇక్కడ సూపర్ మార్కెట్‌ను ఏర్పాటు చేశారు. ముంబైలోని శాంతాక్రూజ్ పరిసరాల్లో సల్మాన్ నాలుగంతస్తుల కమర్షియల్ బిల్డింగ్‌లో "ఫుడ్ స్క్వేర్" అనే సూపర్ మార్కెట్ కొలువు దీరింది. మయాంక్ గుప్తా, లలిత్ ఝవార్ ఐఐటీ బాంబే గ్రాడ్యుయేట్లు దీన్ని షురూ చేశారు. మనీ కంట్రోల్ నివేదిక ప్రకారం లీజుకు తీసుకున్న 25వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్లకు గాను నెలకు అద్దె రూ. 90 లక్షలు. తొలి 12 నెలలకు అద్దె రూ. 90 లక్షలు. ఏడాది తర్వాత రూ. 1 కోటికి పెరుగుతుందని భవిష్యత్తులో మరింత పెరగవచ్చని తెలుస్తోంది. స్వయంగా రైతులమైన తమకు గత ఐదేళ్లకు పైగా మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాలలో పెద్ద ఎత్తున ఆక్వాపోనిక్స్, స్థిరమైన నేల ఆధారిత వ్యవసాయ క్షేత్రాలను నిర్వహిస్తున్న అనుభవం ఉందని ఫుడ్ స్క్వేర్ జనరల్ డైరెక్టర్, సహ వ్యవస్థాపకుడు మయాంక్ గుప్తా తెలిపారు. "ఫుడ్ స్క్వేర్" ప్రపంచం నలుమూలల నుండి పండ్లు, కూరగాయలను అందిస్తుంది, 350 రకాల చీజ్‌లను కూడా అందిస్తుంది. గుప్తా, ఝవార్ 2019లో భారతదేశంలోని కొల్హాపూర్‌లో "ల్యాండ్‌క్రాఫ్ట్ ఆగ్రో"ని స్థాపించగా ఇప్పటివరకు 3.6 మిలియన్ల పెట్టుబడులను సాధించగలిగారు. 2012లో దాదాపు రూ. 120 కోట్లతో ఆస్తిని వ్యాపార ప్రయోజనాల కోసం ఉపయోగించాలనే ఉద్దేశ్యంతో దీన్ని కొనుగోలు చేసినట్టు సమాచారం. ఫ్యూచర్ గ్రూప్‌నకు చెందిన ఫుల్హాల్కు జూలై 2017లో లీజుకు ఇచ్చారు. సల్మాన్ తండ్రి సలీం ఖాన్ ఈ రిటైల్ చైన్ ఫుడ్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. అయితే ప్రస్తుతం అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఫ్యూచర్ గ్రూప్ సల్మాన్‌కు కూడా రూ.2.40 కోట్లు బకాయిపడింది. దీంతో తమ ఒప్పందాన్ని రద్దు చేయాలంటూ నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ (NCLAT) ఆశ్రయించారు. ఈ క్రమంలో ఏప్రిల్‌లో సల్మాన్ఖు అనుకూలంగా తీర్పు రావడంతో కొన్ని నెలల క్రితం ఫుడ్ హాల్ ఖాళీ చేసింది. ఇప్పుడు ఈ స్థానంలో ఫుడ్ స్క్వేర్ ఈ స్థానంలో చేరింది. సల్మాన్ ఖాన్ నికర విలువ పలు నివేదికల ప్రకారం సల్మాన్ ఖాన్ నికర విలువ 2850 కోట్లు. సినిమాలతోపాటు, సల్మాన్ పలు బ్రాండ్ ఎండార్స్మెంట్ల ద్వారా కోట్లాది రూపాయిలు ఆర్జిస్తాడు. ఒక్కో బ్రాండ్ ఎండార్స్మెంట్ కోసం రూ.6 నుంచి 7 కోట్లు వసూలు చేస్తాడు. వార్షిక సంపాదన దాదాపు రూ.220 కోట్లు. ఆదాయం నెలకు 16 కోట్లు. సల్మాన్‌కు ముంబైలో ఆస్తి ఉండటమే కాకుండా దుబాయ్‌లో కోట్లాది రూపాయల ఆస్తి ఉన్న సంగతి తెలిసిందే. -
జగనన్న మహిళా మార్టులు అద్భుతం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేసిన జగనన్న మహిళా మార్టుల నిర్వహణ అద్భుతంగా ఉందని కేరళకు చెందిన అధికారులు కితాబిచ్చారు. అతి తక్కువ పెట్టుబడితో స్వయం సహాయక సంఘాల మహిళలు సూపర్ మార్కెట్లను ఏర్పాటు చేయడంతో పాటు ఇంత ఘన విజయం సాధించడం దేశంలో ఎక్కడా చూడలేదని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మహిళలను స్వయం శక్తిగా తీర్చిదిది్దన పట్టణ పేదరిక నిర్మూలనా సంస్థ (మెప్మా) కృషిని అభినందించారు. ఈ తరహా మార్టులను కేరళ రాష్ట్రంలోనూ ప్రవేశపెడతామని పేర్కొన్నారు. ఏపీలోని స్వయం సహాయక సంఘాల మహిళల ప్రగతిని, స్థితిగతులను పరిశీలించేందుకు గతనెలలో కేరళకు చెందిన కుడుంబశ్రీ విభాగం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జాఫర్ మాలిక్ ఆధ్వర్యంలో అధికారులు రాష్ట్రంలో పర్యటించారు. అందులో భాగంగా వారు శ్రీకాకుళంలోని జగనన్న మహిళా మార్టును, విశాఖపట్నంలోని అర్బన్ మార్కెట్లను పరిశీలించారు. నిర్వహణకు ఏకీకృత సాఫ్ట్వేర్ రెండేళ్ల క్రితం పైలట్ ప్రాజెక్టుగా తొలి జగనన్న మహిళా మార్టును పులివెందులలో ‘మెప్మా’ ఏర్పా టు చేసింది. తర్వాత వివిధ దశల్లో రాయచోటి, అద్దంకి, పుంగనూరు, తిరుపతి, చిత్తూరు, శ్రీకాకుళంలో మొత్తం 7 మహిళా మార్టులను అందుబాటులోకి తెచ్చారు. అన్ని స్టోర్లలోనూ స్థానిక పట్టణా ల్లోని స్వయం సహాయక సంఘాల్లోని ఒక్కో మహిళా రూ.150 చొప్పున వాటాగా పెట్టారు. ఒక్కో స్టోర్‌లో 8 వేల నుంచి గరిష్టంగా 37 వేల మంది వరకు వాటాదారులుగా ఉన్నారు. ఒక్కో మార్ట్ నెలకు రూ.13.50 లక్షల నుంచి రూ.32.56 లక్షల వరకు అమ్మకాలు చేస్తున్నాయి. మొత్తం అన్ని మార్టుల నిర్వహణకు మెప్మా అధికారులు ప్రత్యేకంగా సాఫ్ట్‌వేర్‌ను రూపొందించారు. ప్రతి వస్తువు అమ్మకంపై వచ్చే లాభాలు సైతం కంప్యూటర్లో కనిపిస్తుండడంతో 7 మార్టుల సంఘాలు అమ్మకాలు చేసేందుకు పోటీ పడుతున్నాయి. మన మార్ట్ మోడల్ నచ్చింది.. జగనన్న మహిళా మార్టుల పనితీరు కేరళ అధికారులకు బాగా నచ్చింది. త్వరలో గుంటూరు, రాజమండ్రి, ఒంగోలు, మంగళగిరి, విజయవాడల్లోనూ జగనన్న మహిళా మార్టులను ఏర్పాటు చేస్తాం. లాభాలు ఆశించకుండా నాణ్యమైన సరుకులను అందిస్తుండడంతో మార్టులకు మంచి ఆదరణ లభిస్తోంది. – విజయలక్ష్మి, మెప్మా ఎండీ -
ఆహార సంక్షోభం దిశగా బ్రిటన్
గుడ్లు, మాంసానికి కటకట ఏర్పడింది. పాల ఉత్పత్తుల సరఫరా భారీగా పడిపోయింది. కూరగాయలు, పండ్ల సంగతి వేరేగా చెప్పనక్కర్లేదు. దుంపలు పండడమే లేదు. డిమాండ్‌కు సరిపడా పంటల ఉత్పత్తిలేక బ్రిటన్‌లో ఆహార సంక్షోభం ముంచుకొస్తోంది. ధరాభారంతో రైతులు, సామాన్యులు కుదేలైపోతున్నారు. కొన్ని సూపర్ మార్కెట్లలో గుడ్లకి రేషన్ పెట్టేశారు. ఇదే పరిమితి ఇతర ఆహార పదార్థాలపై విధించే పరిస్థితులొస్తాయన్న ఆందోళన ఎక్కువ అవుతోంది. బ్రిటన్ ఆహార సంక్షోభం దిశగా అడుగులు వేస్తోంది. బ్రెగ్జిట్ నుంచి దేశానికి మొదలైన ఆర్థిక కష్టాల పరంపర కొనసాగుతోంది. కోవిడ్, రష్యా–ఉక్రెయిన్ యుద్ధం, వాతావరణ మార్పులు వంటివి పంట దిగుబడులు, నిత్యావసర వస్తువుల ధరలపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. తాజాగా దేశాన్ని ఊపేసిన ఏవియాన్ ఫ్లూతో గుడ్లకు తీవ్ర కొరత ఏర్పడింది. కొన్ని సూపర్ మార్కెట్లలో గుడ్లు అమ్మకంపై పరిమితులు విధించారు. బంగాళదుంపలు దొరకడం లేదు. టమాట దిగుబడులు కనీవినీ ఎరుగని రీతిలో పడిపోయాయి. బ్రాసిల్, యాపిల్స్, దోసకాయలు, ఇతర కూరగాయల దిగుబడి భారీగా తగ్గిపోయాయి. గత 45 ఏళ్లలో ఈ స్థాయిలో పంట దిగుబడులు తగ్గిపోవడం ఈ ఏడాదే జరిగింది. 27% పెరిగిపోయిన పంట ఉత్పత్తి వ్యయం ఏడాది వ్యవధిలో పంటల ఉత్పత్తికయ్యే ఖర్చు 27 శాతం పెరిగింది. చమురు, ఎరువులు, పశుపోషణ, కోళ్ల పెంపకం వంటి ఖర్చులు తడిసిమోపెడు కావడంతో రైతన్నలు పంటల్ని పండించే పరిస్థితులు లేవని చేతులెత్తేస్తున్నారు. డీజిల్ ధరలు 2019తో పోలిస్తే 75 శాతం పెరిగిపోవడం రైతన్నలపై పెనుభారం మోపింది. ప్రభుత్వం జోక్యం కల్పించుకొని రైతులను ఆదుకోకపోతే బ్రిటన్‌లో కనీవినీ ఎరుగని ఆహార సంక్షోభం ఏర్పడుతుందని జాతీయ రైతు యూనియన్ (ఎన్ఎఫ్యూ) హెచ్చరించింది. 2019తో పోల్చి చూస్తే రిజిస్టర్డ్ వ్యవసాయ కంపెనీల సంఖ్య 7 వేలు తగ్గిపోయిందని వెల్లడించింది. పనివాళ్ల కొరత సైతం రైతులపై ఒత్తిడి పెంచుతున్నాయి. మాంసం, గుడ్లు, పాల ఉత్పత్తుల పరిశ్రమలు కుదేలైపోయాయి. ఎన్నో సూపర్ మార్కెట్లలో ర్యాక్‌లన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. బ్రిటన్‌లో పాలు, వెన్న సరఫరా చేసే అతి పెద్ద సంస్థ ఆర్లా ఫుడ్స్ డిమాండ్‌కు సరిపడా సరఫరా ఇక చేయడం కష్టమని తేల్చి చెప్పింది. పశుపోషణకయ్యే వ్యయం భారీగా పెరగడంతో రైతులు పాలు సరఫరా చేయడం లేదని తెలిపింది. వాతావరణ మార్పుల ప్రభావం పంటలపై పడుతోంది. బంగాళదుంపలు, ఇతర దుంప కూరలు సరిగా పండడం లేదని జేమ్స్ హట్టన్ ఇనిస్టిట్యూట్ ప్రొఫెసర్ లెస్లీ వెల్లడించారు. బంగాళదుంపల ధరలు రెట్టింపయ్యే రోజు ఎంతో దూరంలో లేదని ఆయన అంచనా వేశారు. వాతావరణ మార్పులు, ఇంధనం ధరల ప్రభావంతో ఈ ఏడాది ఆహార ఉత్పత్తులు 11% శాతం మేరకు తగ్గిపోయాయని ఇంధన, పర్యావరణ నిఘా విభాగం నివేదిక వెల్లడించింది. బ్రిటిష్ రిటైల్ కన్సోర్టియమ్లో ఫుడ్ అండ్ సస్టయినబులిటీ డైరెక్టర్ ఆండ్రూ ఒపె రిటైల్ మార్కెట్లు నిత్యావసరల కొరతతో కళ తప్పినప్పటికీ సంక్షోభం వచ్చే పరిస్థితులు వచ్చే అవకాశం లేదని ఆశాభావం వ్యక్తం చేశారు. బ్రిటన్ ప్రభుత్వం రైతులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ పరిస్థితుల్ని అంచనా వేస్తోందని, ఆహార భద్రతకు రిషి సునాక్ సర్కార్ అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని చెప్పారు. నవంబర్‌లో ద్రవ్యోల్బణం అత్యధికంగా 14.6 శాతానికి చేరుకున్నప్పటికీ అక్టోబర్‌తో పోలిస్తే 0.1 శాతం తగ్గిందని, గత రెండేళ్లలో ధరలు తగ్గడం ఇదే తొలిసారని ఆయన వివరించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ కళ తప్పిన క్రిస్మస్ క్రిస్మస్ పండుగ దగ్గరకొస్తుంటే సామాన్యుల్లో ఈ సారి ఆ హుషారు కనిపించడం లేదు. సాధారణంగా క్రిస్మస్కు నెల రోజుల ముందు నుంచే మార్కెట్లు జనంతో కళకళలాడుతుంటాయి. కానీ ఈ సారి మార్కెట్లు బోసిపోయి కనిపిస్తున్నాయి. విద్యుత్ బిల్లుల భారం భరించలేక ఎందరో చిరు వ్యాపారులు గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నారు. ధరలు ఆకాశాన్నంటడం, కావల్సిన వస్తువులకి కొరత ఏర్పడడంతో ప్రజలు ఉన్నంతలో బతుకుని నెట్టుకొస్తున్నారు. ఒక కుటుంబంపై నెలవారి నిత్యావసరాల ధరల భారం 34 పౌండ్లు. అంటే 3,400 రూపాయల వరకు పడుతోంది. దీంతో సామాన్య ప్రజల పరిస్థితి వర్ణనాతీతంగా మారింది. -
సూపర్ మార్కెట్లో టీమిండియా క్రికెటర్ గొడవ
టీమిండియా మహిళా క్రికెటర్ రాజేశ్వరి గైక్వాడ్ తన చర్యలతో వార్తల్లో నిలిచింది. ఒక సూపర్ మార్కెట్లో సిబ్బందితో గొడవపడింది. తన స్నేహితులతో కలిసి సూపర్ మార్కెట్‌కు వచ్చిన ఆమె ఏదో విషయమై సిబ్బందితో వాగ్వాదానికి దిగింది. కాసేపటికే ఆ గొడవ పెద్దదిగా మారింది. ఎంతలా అంటే రాజేశ్వరి గైక్వాడ్ కోపంతో ఊగిపోతూ వారిపై దాడి చేసే వరకు వెళ్లింది. కర్నాటకలోని బీజాపూర్‌లో ఈ ఘటన జరిగింది. గొడవ చేసిన తర్వాత రాజేశ్వరి గైక్వాడ్ అక్కడి నుంచి వెళ్లిపోయినప్పటికి తర్వాత ఆమె సన్నిహితులు వచ్చి సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు. ఈ గొడవకు సంబంధించిందంతా అక్కడి సీసీటీవీ ఫుటేజీల్లో రికార్డయింది.దీంతో సూపర్ మార్కెట్ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేయాలని భావించారు. అయితే ఆ తర్వాత రాజేశ్వరితోపాటు సూపర్ మార్కెట్ సిబ్బంది సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకున్నారు. ఈ గొడవకు సంబంధించి తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని స్థానిక పోలీసులు వెల్లడించారు. 2014లో ఇండియా తరఫున శ్రీలంకతో మ్యాచ్ ద్వారా రాజేశ్వరి గైక్వాడ్ అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసింది. 2017లో వన్డే వరల్డ్‌కప్ ఫైనల్ చేరిన ఇండియన్ టీమ్‌లో రాజేశ్వరి సభ్యురాలు. అదే వరల్డ్‌కప్‌లో తన అత్యుత్తమ ప్రదర్శన కూడా చేసింది. మహిళల క్రికెట్ వరల్డ్‌కప్ చరిత్రలో న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో ఇండియా తరఫున అత్యుత్తమ గణాంకాలు (5/15) నమోదు చేసింది. -
AP: మహిళా మార్ట్స్
మార్కెట్ ధరలకన్నా తక్కువకే నాణ్యమైన నిత్యావసర వస్తువులను గ్రామీణులకు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో కార్యాచరణను సిద్ధం చేసింది. తద్వారా పొదుపు మహిళల మెరుగైన జీవనోపాధికి బీజం వేస్తోంది. పొదుపు సంఘాల మహిళల ఆధ్వర్యంలో మండలాల వారీగా ‘చేయూత’ మహిళా సూపర్ మార్కెట్లను ఏర్పాటు చేయనుంది. పొదుపు సంఘాల ఆధ్వర్యంలో ఇప్పటికే పట్టణ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన జగనన్న మహిళా మార్ట్లు విజయవంతం కావడంతో ఈ ఫార్ములాను గ్రామీణ ప్రాంతాల్లోనూ అమలు చేయాలని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) సంకల్పించింది. సాక్షి, నెల్లూరు: స్వయం సహాయక సంఘాల్లోని మహిళలకు సుస్థిర జీవనోపాధి కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. పొదుపు సంఘాల్లోని సభ్యులతో గ్రూపులు ఏర్పాటు చేసి ‘చేయూత’ మహిళా సూపర్ మార్కెట్లను ఏర్పాటు చేయాలని సంకల్పించింది. సెర్ప్ (గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ) ఆధ్వర్యంలో వీటిని ఏర్పాటు చేసేందుకు సన్నద్ధమవుతోంది. ప్రతి జిల్లాకు ప్రయోగాత్మకంగా రెండు మహిళా మార్ట్లు ఏర్పాటు చేసేందుకు విధి విధానాలను రూపొందించింది. వీటికి ఆదరణ లభిస్తే భవిష్యత్‌లో ప్రతి మండలానికి ఒకటి చొప్పున విస్తరించాలనే యోచనలో ఉన్నారు. జిల్లాలో మార్ట్లు ఏర్పాటుకు స్థానిక వెలుగు ఆధ్వర్యంలో పనులు చురుగ్గా సాగుతున్నాయి. స్వయం సహాయక సంఘాల బలోపేతం, మహిళలకు సుస్థిర ఆదాయం కల్పనే లక్ష్యంగా వైఎస్సార్ చేయూత రిటైల్ స్టోర్లను ప్రభుత్వం ఇప్పటికే ఏర్పాటు చేసింది. ఈ దుకాణాలకు తక్కువ ధరలకు నాణ్యమైన సరుకులు పంపిణీ చేసేలా రిలయన్స్, ఐటీసీ, హెచ్‌యూఎల్, పీఅండ్‌జీ వంటి కార్పొరేట్ సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నారు. పరిమితంగా ఉన్న ఈ వ్యాపారాన్ని విస్తరించి నిర్వాహకులకు సుస్థిర జీవనోపాధిని కల్పించడంతో భాగంగానే గ్రామీణ ప్రాంతాల్లోనూ మహిళా మార్ట్లను ఏర్పాటు చేయనున్నారు. వీటి ద్వారా గ్రామీణ వినియోగదారులకు నాణ్యమైన నిత్యావసర సరుకులు సరసÆమైన ధరలకు అందించేలా చర్యలు తీసుకోనున్నారు. నగరాల్లోని మాల్స్‌కు దీటుగా వీటిని తీర్చిదిద్దేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. జిల్లాలో రెండు చోట్ల జిల్లాలో ప్రయోగాత్మకంగా రెండు చోట్ల మహిళా మార్ట్లు ఏర్పాటుకు స్థానిక వెలుగు ఆధ్వర్యంలో చర్యలు వేగవంతమయ్యాయి. జిల్లాలో తొలుత ఐదు మండలాలను ఎంపిక చేశారు. కావలి, వెంకటాచలం, కోవూరు, వింజమూరు, కందుకూరు వంటి ప్రాంతాలను ఎంపిక చేసి అందులో రెండు చోట్ల ప్రయోగాత్మకంగా ప్రారంభానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి మహిళా సంఘాల ఎంపిక, స్థల సేకరణ, పెట్టుబడి నిధి సమీకరణ, వంటి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. స్త్రీనిధి, బ్యాంక్ రుణంతో.. సుమారు 1000 చదరపు అడుగుల విస్తీర్ణంలో విశాలమైన వాహన పార్కింగ్ ఉండేలా బ్యాంకులు, బస్సు స్టేషన్ సమీపంలో ఏర్పాటుకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ముఖ్యంగా ఈ మార్ట్‌ల్లో స్థానిక ఉత్పత్తులకు పెద్ద పీట వేయనున్నారు. సుమారు రూ.60 లక్షల వరకు మూలధనంగా సమీకరించనున్నారు. స్వయం సహయక సంఘాల మహిళలను ఈ మార్ట్‌ల్లో వాటాదారులుగా చేర్చనున్నారు. ఎలాంటి ఒత్తిడి లేకుండా మహిళలు ఇష్టపడితే ప్రతి ఒక్కరి నుంచి రూ.100 నుంచి రూ.200 వరకు వాటా ధనం సేకరిస్తారు. బ్యాంకుల నుంచి, స్త్రీ నిధి అప్పుల రూపంలో సేకరిస్తారు మార్ట్ సేవలు ఇలా.. మహిళా మార్ట్ల ఏర్పాటుతో గ్రామీణ వినియోగదారులకు ఎక్కువ ప్రయోజనాలు ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. అనవసర వ్యయం, రవాణా ఖర్చు తగ్గించేలా దృష్టి పెడతారు. హోల్ సేల్ విక్రయాల ద్వారా తక్కువ ధరలకు సరుకుల లభ్యత ఉండేలా చూస్తారు. స్థానిక రైతులు పండించిన ఉత్పత్తుల విక్రయానికి మార్ట్ మధ్యవర్తిగా వ్యవహరించి వారికి మద్దతు ధర లభించేలా చేస్తాయి. గ్రామీణ ప్రాంతాల్లో చిన్న పరిశ్రమలకు ప్రోత్సాహం కల్పించడం వంటివి మార్ట్లు చేపట్టనున్నాయి. మహిళా సంఘాలు బలోపేతం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న మహిళా సంఘాలు మరింత బలోపేతం అయ్యేందుకు మహిళా మార్ట్లు ఎంతో ఉపయోగపడతాయి. కలెక్టర్ ఆదేశాలతో జిల్లాలో ప్రయోగాత్మకంగా రెండు చోట్ల ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. స్థల సేకరణ, నిధుల సమీకరణ, ఇతర కీలక అంశాలపై సమీక్ష నిర్వహించాం. వైఎస్సార్ చేయూత రిటైల్ స్టోర్ల మాదిరిగానే మార్ట్లు విజయవంతం అవుతాయని ఆశిస్తున్నాం. త్వరలో మార్ట్లు కార్యరూపం దాల్చనున్నాయి. – సాంబశివారెడ్డి, ప్రాజెక్ట్ డైరెక్టర్ డీఆర్డీఏ -
వంట నూనెల అక్రమ నిల్వలపై విస్తృత దాడులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వంట నూనెల అక్రమ నిల్వలు, అధిక ధరలకు విక్రయాలపై విజిలెన్స్ శాఖ దాడులు కొనసాగిస్తోంది. గురువారం రాష్ట్రవ్యాప్తంగా 214 దుకాణాలు, సూపర్ మార్కెట్లలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించింది. పలుచోట్ల లీటర్ ప్యాకెట్లలో వంట నూనె 910 గ్రాములే ఉన్నట్టు తేలింది. మరికొన్నిచోట్ల ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు విక్రయిస్తున్నట్టు గుర్తించారు. అక్రమాలకు పాల్పడుతున్న 53 దుకాణాలు, సూపర్ మార్కెట్లపై అధికారులు కేసులు నమోదు చేశారు. మార్చిలో మొత్తం 5,328 దుకాణాలు, సూపర్ మార్కెట్లలో అధికారులు తనిఖీలు నిర్వహించి 1,690 కేసులు నమోదు చేశారు. -
870 కిలోమీటర్లు ప్రయాణం చేసిన పాము..! తీరా చూస్తే
కాన్బెర్రా: కిచెన్‌లోకి పాము ప్రత్యక్షమైన సంఘటన ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరానికి చెందిన ఓ వ్యక్తికి ఎదురైంది. సిడ్నీకి చెందిన అలెక్స్ వైట్ ఒకరోజు సూపర్‌మార్కెట్‌కు వెళ్లి సరుకులను తీసుకొని వచ్చాడు. ఇంటికి వచ్చాక సరుకులను తీస్తుండగా ఒక్కసారిగా ఖంగు తిన్నాడు. అతడు తెచ్చిన పాలకూర ప్యాకెట్లో పాము ప్రత్యక్షమైంది. పాము బుసలు కొట్టడంతో ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. దీంతో అలెక్స్ భయపడిపోయి ప్యాకెట్‌ను దూరంగా విసిరేశాడు. అటవీ శాఖ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి ఆ పామును తీసుకొని వెళ్లారు. ఒకవేళ ఆ పాము కాటువేసి ఉంటే తీవ్రమైన పరిణామాలు ఉండేవని వైర్స్ రెస్యూ సిబ్బంది తెలిపారు. కాగా, అలెక్స్ వైట్ ఈ విషయాన్ని సూపర్ మార్కెట్ యాజమన్యానికి తెలిపాడు. పాము సూపర్ మార్కెట్లోకి ఎలా ప్రవేశించిందో అనే విషయాన్ని పరిశీలించగా, ఆస్ట్రేలియాలోని తూవూంబా నగరంలో ఒక ప్యాకింగ్ ప్లాంట్ నుంచి సిడ్నీకి 870 కిలోమీటర్లు పాము ప్రయాణం చేసినట్లు అధికారులు చెప్పారు. ప్యాక్ చేసిన ఉత్పత్తులలో మొదటిసారి పామును చూశామని స్థానిక సిబ్బంది తెలిపారు. అంతేకాకుండా ప్యాకింగ్ చేసిన కూరగాయల్లో తరచూ కప్పలు రావడం అక్కడ సర్వసాధారణమే. చదవండి: వైరల్: ఏనుగు డాన్స్ చూస్తే నవ్వకుండా ఉండలేం! -
అమెరికాలో మళ్లీ పేలిన తూటా.. 10 మంది మృతి
కొలొరాడో: అమెరికాలో వారం రోజుల వ్యవధిలో మళ్లీ కాల్పులు జరగడం భయభ్రాంతులకు గురి చేసింది. కొలొరాడోలోని ఒక సూపర్ మార్కెట్లో సోమవారం ఒక దుండగుడు విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో ఒక పోలీసు అధికారి సహా 10 మంది మరణించారు. కాల్పులు జరిపిన వ్యక్తి కూడా గాయపడడంతో పోలీసులు అదుపులోకి తీసుకొని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బౌల్డర్ కౌంటీలోని కొలొరాడోలోని కింగ్ సూపర్స్ గ్రోసరీ మార్కెట్లో కాల్పులు జరుగుతున్నాయని సోమవారం మధ్యాహ్నం పోలీసులకు సమాచారం అందింది. ఆ సమయంలో డ్యూటీలో ఉన్న అధికారి ఎరిక్ టాలీ (51) ఆధ్వర్యంలోని పోలీసు బృందం సూపర్ మార్కెట్‌కి తరలివెళ్లింది. సూపర్ మార్కెట్లోకి మొదట అడుగు పెట్టిన ఎరిక్ టాలీ ఆ కాల్పుల్లో మరణించారని బౌల్డర్ కౌంటీ చీఫ్ మారిస్ హెరాల్డ్ కన్నీళ్ల మధ్య చెప్పారు. గత 11 ఏళ్లుగా సేవలు అందిస్తున్న గొప్ప సాహసికుడైన అధికారిని కోల్పోయామని ఆమె అన్నారు. అట్లాంటాలోని ఆసియా మసాజ్‌లపై జరిగిన కాల్పుల్లో ఎనిమిది మంది మృతి చెందిన ఘటన జరిగి వారం రోజులైందో లేదో సూపర్ మార్కెట్లో కాల్పులు వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. బౌల్డర్ కౌంటీ చరిత్రలోనే ఇదో చీకటి రోజు అని ప్రత్యక్ష సాక్షులు కొందరు వ్యాఖ్యానించారు. సారా మూన్షాడో అనే మహిళ స్థానిక మీడియాతో మాట్లాడుతూ తాను, తన కుమారుడు స్ట్రా బెర్రీలు తీసుకుంటూ ఉండగా కాల్పుల శబ్ధం వినిపించిందని, వెంటనే తామిద్దరం ప్రాణాలు కాపాడుకోవడానికి బయటకు పరుగులు తీశామని చెప్పారు. బయటకి వచ్చేసరికి పార్కింగ్ స్థలంలో ఒక మృతదేహాన్ని చూశామని, తాము ప్రాణాలతో బయటకు వస్తామని అనుకోలేదని అన్నారు. నిందితుడు కాల్పులు జరపడానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. -
మావాళ్లకు కాస్త ఉద్యోగాలు ఇవ్వండి
మెల్బోర్న్: కరోనా నేపథ్యంలో ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతోన్న ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు (సీఏ) ఇటీవలే పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగించింది. అయితే ఇలాంటి ఇబ్బందికర పరిస్థితుల్లో వారికి బయట మరోచోట ఉద్యోగం ఇప్పించే ప్రయత్నంలో సహకరించేందుకు సిద్ధమైంది. జూన్ 30 వరకు తమవారికి తాత్కాలిక ఉద్యోగాల్లో చేర్చుకోవాలని అతి పెద్ద సూపర్ మార్కెట్ గ్రూప్‌లలో ఒకటి, తమ క్రికెట్ టీమ్ స్పాన్సర్ అయిన ‘వూల్వర్త్’ను కోరింది. ‘బోర్డులో ఉద్యోగాలు కోల్పోయిన వారికి తాత్కాలికంగా బయట ఏదో ఒక ఏర్పాట్లు చేసేందుకు మేం ప్రయత్నిస్తున్నాం. అందులో భాగంగానే వూల్వర్త్ సీఈఓ బ్రాడ్ బాండుసీకి నేను స్వయంగా లేఖ రాశాను. వారి సూపర్ మార్కెట్లలో ప్రస్తుతం సిబ్బంది అవసరం ఉందన్నట్లు మాకు తెలిసింది. అందుకే మా వాళ్లను తీసుకోమన్నాం’ అని సీఏ చీఫ్ ఎగ్జిక్యూటివ్ రాబర్ట్సన్ వెల్లడించారు. -
ఐస్‌క్రీమ్‌కి కక్కుర్తి పడ్డాడు.. జైలుకి వెళ్లాడు
-
ఐస్‌క్రీమ్‌కి కక్కుర్తి పడ్డాడు.. జైలుకి వెళ్లాడు
వాషింగ్టన్ : తప్పుచేసిన వారిపై కఠిన చట్టాలను అమలు చేయడంలో అగ్రరాజ్యం అమెరికా ఎప్పుడూ ముందు వరుసలో ఉంటుంది. తప్పుచిన్నదైనా, పెద్దదైనా సరే ఏమాత్రం కనికరం లేకుండా కటకటాల వెనక్కి పంపే చట్టాలు ఆదేశంలో ఉన్నాయి. ఈ క్రమంలోనే సూపర్ మార్కెట్లో ఓ యువకుడి సరదా అతని దూల తీర్చింది. ఐస్‌క్రీమ్‌ను సగం తిని తిరిగి ఫ్రిజ్‌లో పెట్టినందుకు న్యాయస్థానం అతడికి 30 రోజుల జైలు శిక్ష విధించింది. అంతేకాకుండా రూ.75వేల రూపాయల జరిమానా కూడా విధించింది. స్థానిక మీడియా వెలువరించిన కథనాల ప్రకారం.. అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో ఆడ్రీన్ ఆండర్సన్ అనే 24 ఏళ్ల యువకుడు వాల్‌మార్ట్ సూపర్ మార్కెట్‌కు స్నేహితులతో కలిసి వెళ్లాడు. ఈ నేపథ్యంలో అక్కడున్న ఫ్రిజ్‌లో నోరూరించే ఐస్‌క్రీమ్ అతని కంటపడింది. కొనుక్కోవడానికి మనోడి దగ్గర డబ్బులులేవో ఏమో.. అనుకున్నదే తడువుగా ఐస్‌క్రీమ్‌ను లాగించేశాడు. సగం తినేసి మిగిలింది ఏమీతెలియనట్లు తిరిగి ఫ్రిజ్‌లో పెట్టాడు. ఈ తతంగమంతా అతడి స్నేహితులు ఫోన్లో వీడియో రికార్డు చేశారు. అంతటితో ఆగకుండా దానిని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇదంతా గత ఏడాది ఆగస్ట్‌లో జరిగింది. అదికాస్తా నెట్టింట్లో వైరల్‌గా మారడంలో పలువురు వైద్య అధికారులు దానిపై స్పందించి.. సంబంధిత సూపర్ మార్కెట్లో ఫిర్యాదు చేశారు. యాజమాన్యం ఫిర్యాదు మేరకు కేసు విచారించిన స్థానిక కోర్టు అతనికి 30 రోజుల జైలు శిక్ష విధిస్తూ గురువారం తీర్పును వెలువరిచింది. -
‘బిగ్ బాస్కెట్’కు భారీ నష్టాలు
న్యూఢిల్లీ: బిగ్ బాస్కెట్ సంస్థను నిర్వహించే ఇన్నోవేటివ్ రిటైల్ కాన్సెప్ట్స్ కంపెనీ నష్టాలు గత ఆర్థిక సంవత్సరంలో మరింతగా పెరిగాయి. 2017–18లో రూ.179 కోట్లుగా ఉన్న ఈ కంపెనీ నష్టాలు గత ఆర్థిక సంవత్సరంలో రూ.348 కోట్లకు పెరిగాయి. కార్యకలాపాల ఆదాయం మాత్రం రూ.1,410 కోట్ల నుంచి 69 శాతం వృద్ధితో రూ.2,381 కోట్లకు పెరిగింది. ఇన్నోవేటివ్ రిటైల్ కాన్సెప్ట్స్ సంస్థ బిగ్ బాస్కెట్నే కాకుండా ‘సూపర్‌మార్కెట్ గ్రోసరీ సప్లైస్’ పేరుతో హోల్‌సేల్ విభాగాన్ని కూడా నిర్వహిస్తోంది. ఆర్థిక ఫలితాల వివరాలను ఇన్నోవేటివ్ రిటైల్ కాన్సెప్ట్స్ సంస్థ కేంద్ర కంపెనీల వ్యవహారాల మంత్రిత్వ శాఖకు సమర్పించింది. -
వారికి షాకే : ఇక షాపింగ్ మాల్స్‌లో పెట్రోల్
సాక్షి, న్యూఢిల్లీ : పెట్రోల్ బంకుల యాజమాన్యాలకు షాకిచ్చేలా కేంద్ర ప్రభుత్వం త్వరలోనే ఒక సంచలన నిర్ణయం తీసుకోనుంది. షాపింగ్ మాల్స్ లేదా సూపర్ మార్కెట్లలో రీటైల్‌గా పెట్రోల్, డీజిల్‌లను అందుబాటులో ఉంచాలని కేంద్రం ఆలోచిస్తున్నట్టుగా సమాచారం. సంబంధిత అనుమతులను త్వరలోనే మంజూరు చేయనుంది. ఈ మేరకు పెట్రోలియం మంత్రిత్వ శాఖ తొందరలోనే క్యాబినెట్ నోట్‌ను తీసుకురానుంది. ప్రస్తుత నిబంధనలను సడలించేందుకు కసరత్తు చేస్తోందని బిజినెస్ స్టాండర్డ్ నివేదించింది. ఆర్థికవేత్త కిరిట్ పరిఖ్ నేతృత్వంలోని అయిదుగురు సభ్యుల కమిటీ ఇంధన రీటైలింగ్ విధానానికి సంబంధించి భారతదేశంలో సడలింపు నిబంధనలను ప్రతిపాదించింది. అతి సులభంగా, తగ్గింపు ధరల్లో ఇంధనాన్ని వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించింది. మాజీ పెట్రోలియం కార్యదర్శి జిసి చతుర్వేది, మాజీ ఇండియన్ ఆయిల్ (ఐఓసి) చైర్మన్ ఎంఏ పఠాన్, పెట్రోలియం మంత్రిత్వ శాఖ మార్కెటింగ్ ఇన్‌ఛార్జి జాయింట్ సెక్రటరీ అశుతోష్ జిందాల్ ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. మే 30న రెండవ సారి అధికార పగ్గాలు చేపట్టిన మోదీ సర్కార్ 100 రోజుల్లేనే ఈ విధానాన్ని అమల్లోకి తేవాలని భావించిందట. దీని ప్రకారం సెప్టెంబర్‌మొదటి వారంలో దీనికి సంబంధించిన విధి విధానాలు తుది రూపు దాల్చనున్నాయి. తద్వారా సంస్థల ఇంధన వినియోగాన్ని తగ్గించాలని ఇది సూచించే అవకాశం ఉంది. అలాగే ప్రభుత్వం దేశీయ మార్కెట్లో ప్రాథమిక మౌలిక సదుపాయాల పెట్టుబడి పరిమితిని రూ.2 వేల కోట్లనుంచి తగ్గించనుంది. లేదా 3 మిలియన్ టన్నుల (30 లక్షల టన్నులు) లేదా దీనికి సమానమైన మొత్తానికి బ్యాంక్ గ్యారెంటీలను అందించనుందని రిపోర్టులో తెలిపింది. అదే జరిగితే పెట్రో బంకులకు గట్టి దెబ్బ తప్పదనే చెప్పాలి. బంకుల్లో జరిగే మోసాలకూ అడ్డుకట్టపడే అవకాశం ఉంది. సూపర్ మార్కెట్ల ద్వారా రిటైల్ ఇంధన విక్రయాలను అనుమతించే విధానం యునైటెడ్ కింగ్డమ్ (యుకె)లో విజయవంతంగా అమల్లో ఉంది. ఇదిలా ఉండగా, గత ఏడాది మార్చి 16న పూణేలో పెట్రోల్ హోండెలివరీ సదుపాయాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. ప్రస్తుతం ఇండియన్ ఆయిల్ కార్ప్ (ఐఓసి), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీవో) హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ (హెచ్‌పిసిఎల్) లాంటి ప్రభుత్వ ఇంధన రిటైలర్లు పూణే, ఢిల్లీ, జౌన్పూర్, చెన్నై, బెంగళూరు, అలీగఢ్, దుదైపూర్, రేవారి, నవీ ముంబైలో పెట్రోలు హోం డెలివరీ ఇస్తున్న సంగతి తెలిసిందే. -
హైదరాబాద్‌లో రిలయన్స్ స్మార్ట్ న్యూ స్టోర్స్
సాక్షి, హైదరాబాద్ : రిలయన్స్ రిటైల్‌కు చెందిన భారీ సూపర్ మార్కెట్ చైన్ రిలయన్స్ స్మార్ట్ విస్తరణ ప్రణాళికల్లో భాగంగా హైదరాబాద్‌లోని పీర్జాదిగూడ, చాంద్రాయణగుట్టలో నూతన స్టోర్లను లాంఛ్ చేసింది. కిరాణా, పండ్లు, కూరగాయలు, కిచెన్ వేర్ సహా గృహావసరాలకు అవసరమైన వస్తువులు ఈ స్టోర్స్‌లో అందుబాటులో ఉంటాయి. ఇక పీర్జాదిగూడ స్టోర్ 7900 చదరపు అడుగుల్లో, చాంద్రాయణగుట్ట స్టోర్ 17,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో కస్టమర్లకు సౌకర్యవంతమైన షాపింగ్ అనుభూతిని కలిగిస్తాయని సంస్థ ఓ ప్రకటనలో పేర్కొంది. కిరాణా సహా వివిధ వస్తువులపై భారీ ఆఫర్లు, డిస్కౌంట్లను కస్టమర్లకు అందించనున్నట్టు తెలిపింది. దేశవ్యాప్తంగా వందకు పైగా నగరాల్లో 150 రిలయన్స్ స్మార్ట్ స్టోర్లు వినియోగదారులకు మెరుగైన సేవలు అందిస్తున్నాయని వెల్లడించింది. -
తప్పిపోకండి అవసరం లేనివి తెచ్చుకోకండి
షాపింగ్ మాల్నంతా కొని తెచ్చుకున్నా, మళ్లీ పచారీ కొట్టుకు పరుగులు తీస్తున్నారంటే.. మీ బడ్జెట్ తప్పిందనే. హెడేక్‌ను మీరు కొని తెచ్చుకున్నారనే! ‘‘పది మ్యాగీ నూడుల్స్ ప్యాకెట్స్, అయిదు పాస్తా పాకెట్లు, పన్నెండు బాంబినో ఇన్స్టంట్ సూప్ ప్యాకెట్స్, మల్టీగ్రెయిన్ పిండి, ఇన్స్టంట్ ఉప్మా, పులిహోర పాకెట్లు, ఇడ్లీ, దోశపిండి, బటర్, చీజ్...’’ కప్బోర్డ్లోంచి కొన్ని, ఫ్రిజ్‌లోంచి కొన్ని తీసి కింద పడేసిన వస్తువుల జాబితా చదువుతూ చదువుతూ ఆగిపోయింది బబిత ఉస్సూరుమంటూ. ‘‘మేడమ్.. ఇంకా ఉన్నాయ్’’ పనమ్మాయి నందా అంటోంది. ‘‘హూ..’’ నిట్టూరుస్తూ ‘‘ఇంతకీ ఇప్పుడు కావల్సిన పసుపు, ఎండు మిరపకాయల పాకెట్లు ఉన్నాయా? లేవా?’’ అడిగింది బబిత.‘‘ప్చ్..’’ లేవన్నట్టు చేతులు తిప్పుతూ నిలుచుంది నందా. ‘‘పచారీ కొట్టుకు పరిగెత్తాల్సిందే కదా..’’ – హాల్లోంచి వంటగదిలోకి వస్తూ బబిత అత్తగారు. సమాధానం ఇవ్వకుండానే ఫ్రిజ్‌పైన కవర్లోంచి రెండు వందల రూపాయల నోటు తీసి నందాకు ఇచ్చింది బబిత... వెంటనే వెళ్లి వాటిని తెమ్మన్నట్లు. ‘‘మా కాలంలో ఒక్కసారి లిస్ట్రాసి పంపిస్తే నెలకు సరిపడా సరకులు ఇంటికొచ్చి పడేవి. మళ్లా నెల దాకా పచారీ కొట్టు మొహం చూసే వాళ్లం కాదు. అవసరమైనవి తప్ప అనవసరమైనవి వచ్చేవీ కావు’’ అంటూ నేల మీద చిన్న రాశిగా పోగేసి ఉన్న పాకెట్లలోంచి ఓ పాకెట్ తీసింది పెద్దావిడ.. ముక్కు మీదకు జారిన కళ్లద్దాలను సవరించుకుంటూ ఆ పాకెట్ మీదున్న ఎక్స్పైరీ డేట్ చూసే ప్రయత్నం చేస్తూ.ఇంకా అక్కడే ఉంటే అత్తగారు తన హయాంలోని రామాయణాన్ని వినిపిస్తారని గబగబా హాల్లోకి వచ్చేసింది కానీ ఆవిడ మాటల్లోని నిజాన్ని మాత్రం మెదడులోంచి తీసేయలేకపోయింది బబిత. నిజమే.. సూపర్మార్కెట్ల మాయలో అవసరమైనవే కాకుండా అనవసరమైనవి ఎన్ని వస్తున్నాయి ఇంటికి! ఆలోచనలో పడింది బబిత. సూపర్‌మార్కెట్.. శ్రావ్యమైన సంగీతం.. అద్దాల అల్మారాలు.. అందమైన ర్యాక్‌లు.. ఆకర్షణీయమైన ప్యాక్‌లు.. ట్రాలీ పట్టుకొని ఏ వస్తువు నచ్చితే ఆ వస్తువు దగ్గరకు వెళ్లే సౌకర్యం.. దేన్నయినా మనమే తీసుకొని ట్రాలీలో వేసుకునే వెసులుబాటు. అందుకే పర్స్‌లో తెచ్చుకున్న డబ్బు అయిపోవడంతోపాటు పాటు క్రెడిట్ కార్డ్‌లు, డెబిట్ కార్డ్‌లు, కార్పొరేట్ ఆఫీస్‌లు ఇచ్చే ఫుడ్ కార్డ్‌లూ స్వైప్ మిషన్‌లో సర్రుమంటాయి! పర్యవసానం ‘‘తెచ్చుకున్న లిస్ట్ అలాగే ఉంటుంది. లిస్ట్లోలేని సరుకులు ట్రాలీ నిండుతాయి. వేసుకున్న బడ్జెట్ ఓవర్ అయిపోయి.. డెట్‌లో పడిపోతాం’’ అంటున్నారు హైదరాబాద్‌కు చెందిన ఎన్. శైలజ. ఆమె నిమ్స్ ఉద్యోగి. ‘‘వర్కింగ్ ఉమన్‌ని కాబట్టి ఈ సూపర్మార్కెట్ల ఎంట్రీ హ్యాపీగానే అనిపించింది మొదట్లో. కిరాణా షాప్‌లో లిస్ట్ ఇస్తే కావల్సిన సరకులు ఇంటికొచ్చేవి. కాని పప్పులు, బియ్యాలు శుభ్రం చేసుకోవాల్సి వచ్చేది. సూపర్మార్కెట్లోనైతే అలాంటి బాదర బందీ ఉండదు. చక్కగా నీట్‌గా ప్యాక్ చేసి ఉంటాయి. దాదాపు పదేళ్ల నుంచి సూపర్ మార్కెట్లోనే కొంటున్నాను. అయితే ఈ పదేళ్లలో ఏ నెల కూడా నేను వేసుకున్న బడ్జెట్లో సరుకులు రాలేదు. ఓన్లీ పప్పులు, ఉప్పు, చింతపండు, ఎండు మిర్చి, నూనె, సబ్బులు, షాంపూలకు వెళితే నాలుగు రకాల షాంపూలు, నాలుగు రకాల సబ్బులు, రెండు రకాల వంట నూనెలు, డిష్ వాష్ లిక్విడ్ సోప్, రెండు రకాల హ్యాండ్ వాష్‌లు ఎట్సెట్రా తీసుకెళ్తా. బడ్జెట్ ఎక్కువై పోతుందని ఒకసారి పచారీ కొట్టు నుంచి సరుకులు తెప్పించా. మా ఇంట్లో నలుగురం ఉంటాం.. రెండున్నర వేలల్లో బియ్యంతోపాటు సరుకులన్నీ వచ్చాయి. అదే సూపర్‌మార్కెట్‌కి వెళితే ఏడు వేలు దాటుతుంది. అవసరమైనవి మైనస్ అవుతాయి’’ అని చెప్పారు శైలజ. క్రెడిట్ కార్డ్స్‌తో డెబిటే నిజామాబాద్‌కు చెందిన లక్ష్మీతివారి అనుభవం కూడా ఇంచుమించు ఇలానే ఉంది. ‘‘పచారీ కొట్టు అంటేనే పరిమితమైన బడ్జెట్ అని. చచ్చు, పుచ్చులు వచ్చినా వెళ్లి తిరిగి ఇచ్చే సౌకర్యం ఉండేది.సూపర్‌మార్కెట్‌లోనూ ఉన్నా.. అదో పెద్ద ప్రహసనం. ఎవరికి ఎవరు పూచీకత్తు అన్నట్టే ఉంటుంది. డబ్బులుంటేనే వస్తువులు. ఇప్పుడు ఈ క్రెడిట్ కార్డ్స్, డెబిట్ కార్డ్స్ వచ్చి డబ్బులు లేకపోయినా వస్తువులు వస్తున్నాయి. పద్దు హద్దు దాటుతోంది. అంతేకాదు ఉన్నవి డబుల్ డబుల్ ఉంటున్నాయి. లేనివి అసలే ఉండట్లేదు. వాటి కోసం మళ్లీ వీధిలో ఉన్న కిరాణా షాప్‌కి పరిగెత్తడమే. ఏం సుఖం? శ్రమ, డబ్బులు అన్నీ వేస్ట్. క్రెడిట్ కార్డ్స్‌తో అప్పులు’’ అని అంటున్నారు లక్ష్మి. పరిష్కారం ఏమిటి? ఇంటికి అవసరమైనవి. మాత్రమే లిస్ట్ చేసుకొని.. వాటి కోసమే సూపర్‌మార్కెట్‌కి వెళితే మంచిది. వీలైనంత వరకు ఇన్స్టంట్ ఫుడ్ జోలికి వెళ్లకుండా.. క్రెడిట్ అండ్ డెబిట్ కార్డ్స్‌ను ఇంట్లోనే వదిలేసి.. క్యాష్‌నే క్యారీ చేస్తే.. సూపర్మార్కెట్లనూ మన బడ్జెట్లోనే బంధించొచ్చు అని అనుభవంతో సలహా ఇస్తున్నారు శైలజ, లక్ష్మిలాంటి వినియోగదారులు. వాడేది తక్కువ.. పడేసేది ఎక్కువ ఇన్స్టంట్ ఫుడ్ మార్కెట్లోకి వచ్చినప్పటి నుంచయితే చెప్పక్కర్లేదు. అంతకు ముందు ఆఫీస్ నుంచి రాగానే చక్కగా ఇడ్లీ, దోశకు పిండి మిక్సీలో పట్టి పెట్టుకునేదాన్ని. ఇప్పుడు ఇన్స్టంట్ కనిపించేసరికి బద్దకం ఎక్కువై పాకెట్లు కొనేసుకోవడమే. ఉప్మా, పులిహోర అన్నీ. టేస్ట్ నచ్చక.. వాడేది తక్కువ, పారేసేది ఎక్కువ. డబ్బు దండగా.. ఆరోగ్యమూ పాడు. – శైలజ పచారీ కొట్టు తీరే వేరు పచారీ కొట్టు ఓ షాప్లా కాకుండా.. ఓ ఫ్రెండ్షిప్లాంటిదిగా ఉండేది. ఇంట్లో పిల్లలను పంపించి ఫలానా ఇంటి వాళ్లం.. ఫలానా వస్తువు కావాలి.. రాసి పెట్టమన్నారు అని చెబితే చాలు ఆ వస్తువు ఇంటికి వచ్చేసేది. అంటే అంత నమ్మకం ఉండేది. సూపర్మార్కెట్లలో ఆ క్రెడిట్ ఉండదు కదా! – లక్ష్మీ తివారీ – సరస్వతి రమ -
హెరిటేజ్, మోర్, రత్నదీప్‌లపై కేసులు
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ పరిధిలో నిబంధనలు ఉల్లంఘిస్తూ జీఎస్టీ పేరుతో అధిక ధరలకు విక్రయిస్తున్న షాపింగ్ మాల్స్, సూపర్ మార్కెట్లపై తూనికలు, కొలతలశాఖ కొరడా ఝులిపించింది. కేంద్రం పలు వస్తువులపై జీఎస్టీ తగ్గించినా ఇప్పటికీ పాత ధరలకే విక్రయిస్తున్న షాపింగ్ మాల్స్, సూపర్ మార్కెట్లపై తూనికలశాఖ అధికారులు గురువారం దాడులు నిర్వహించారు. జీఎస్టీ పేరుతో పలు సరుకు లను అధిక ధరలకు విక్రయిస్తున్నందుకు గానూ రత్నదీప్ సూపర్ మార్కెట్‌పై 18, హెరిటేజ్ సూపర్ మార్కెట్‌పై 13, మోర్ సూపర్ మార్కెట్‌పై 5, స్పెన్సర్స్‌పై 7, బిగ్‌బజార్‌పై 15, విజేత సూపర్ మార్కెట్, మహావీర్ ఎలక్ట్రికల్ అండ్ హార్డ్‌వేర్, భగవతి పెయింట్స్ అండ్ హార్డ్‌వేర్, బిగ్‌సీ, హైపర్ మార్కెట్లపై కేసులు నమోదు చేశారు. తూనికలశాఖలో పదోన్నతులు.. తూనికలు, కొలతలశాఖలో 12 మంది ఇన్స్పెక్టర్లకు పదోన్నతులు కల్పిస్తూ ఆ శాఖ కంట్రోలర్ అకున్‌సబర్వాల్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇన్స్పెక్టర్లుగా ఉన్న వారిని జిల్లా తూనికలు, కొలతల అధికారి (డీఎల్ఎంవో)గా పదోన్నతి కల్పించారు. పదోన్నతులు పొందిన వారిలో బి.ప్రవీణ్ కుమార్, శ్రీవల్లి, డి.సరోజ, మొహమ్మద్ సుజాత్ అలీ, కె.రామ్మోహన్, ఎన్. సంజయ్‌కృష్ణ, బి.భూలక్ష్మి, పి.శ్రీనివాస్ రెడ్డి, జి.అశోక్‌బాబు, పి.రవీందర్, ఎండీ రియాజ్ అహ్మద్‌ఖాన్, ఎంఏ జలీల్ ఉన్నారు. -
చోరీ చేస్తూ దొరికిన మహిళా పోలీస్..అంతలోనే ట్విస్ట్!
-
చోరీ చేస్తూ దొరికిన మహిళా పోలీస్..
చెన్నై : దొంగలను పట్టుకోవాల్సిన ఓ మహిళా పోలీసే దొంగలా మారింది. అంతే కాకుండా చోరీ చేస్తుంటే ప్రశ్నించినందుకు.. తననే నిలదీస్తావా అంటూ భర్తతో కొట్టించింది. ఈ సంఘటన చెన్నైలోని చెట్పేట్లో బుధవారం చోటు చేసుకుంది. వివరాలు.. సూపర్ మార్కెట్లో మహిళా పోలీస్ కానిస్టేబుల్ ఫోన్లో మాట్లాడుతూ వస్తువులను జేబులో పెట్టడాన్ని అక్కడే పనిచేస్తున్న ప్రణవ్ గమనించాడు. వెంటనే ఆమె దగ్గరికి వెళ్లి చోరీ చేసిన వస్తువులను తిరిగి ఇవ్వాలని కోరాడు. అంతేకాకుండా తప్పు చేసినట్టు క్షమాపణ పత్రం రాసి ఇవ్వాలన్నాడు. మహిళా పోలీసు తన భర్తకు విషయం చెప్పడంతో అతను మరికొందరిని తన వెంట వేసుకొని సూపర్ మార్కెట్‌పై దాడి చేశాడు. ప్రణవ్ను ఇష్టానుసారంగా కొట్టడంతో తీవ్రగాయాలయ్యాయి. ప్రస్తుతం అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ వ్యవహారంతో చెన్నై పోలీసులు తలలు పట్టుకున్నారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. -
ఇంటి ముందుకే సూపర్ మార్కెట్
కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు పుడతాడని సామెత. ఈ సామెతను.. కలిసొచ్చే టెక్నాలజీతో.. నడిచొచ్చే సూపర్‌మార్కెట్ అని మార్చుకోవలసిన రోజులు వచ్చేశాయి. చైనాలోని షాంఘై పట్టణ వీధుల్లో సందడి చేస్తోంది ఈ నడిచొచ్చే సూపర్‌మార్కెట్. పేరు మొబీ. ఇంట్లోకి సామాన్లు కావాలంటే వీధి చివరి పచారీ కొట్టుకెళ్లడం, సిటీల్లోనైతే కారేసుకుని సూపర్‌మార్కెట్‌కు వెళ్లడం మనం మామూలుగా చేసే పని. మోబీతో ఇవన్నీ గత కాలపు పనులైపోతాయి. ఎందుకంటే డ్రైవర్ అవసరం లేని ఈ వాహనం ఎంచక్కా మీ ఇంటివద్దకే వచ్చేస్తుంది మరి. చేయాల్సిందల్లా.. సరుకులతో నిండిన మోబీలోకి ఎంటరైపోయి కావల్సింది కొనుక్కోవడమే. స్మార్ట్‌ఫోన్ అప్లికేషన్ సాయంతో మొబీ ఎప్పుడు ఎక్కడ ఉండేదీ ఇట్టే తెలిసిపోతుంది. అయినా.. కష్టపడి స్టోర్ దాకా వెళ్లాలా అనుకుంటే అదే స్మార్ట్‌ఫోన్ ద్వారా ఆర్డరిస్తే చాలు.. మోబీ నుంచి రివ్వున ఎగిరే డ్రోన్.. సరుకులను మీ ఇంటి ముందుకు తీసుకొచ్చేస్తుంది. ఇందుకోసం ఒక్కో మోబీ స్టోర్‌లో ప్రత్యేకంగా నాలుగు డ్రోన్లు ఉంటాయి. ఈ మొబైల్ సూపర్ మార్కెట్ ఒకవైపు సూర్యుడి శక్తితోనే పనిచేస్తూనే.. గాల్లోని విషతుల్యమైన సూక్ష్మ ధూళి కణాలను కూడా శుభ్రం చేస్తుందట. కృత్రిమ మేధ సాయంతో ఎవరు ఏం కొన్నారు, దానికి బిల్లు ఎంతైందన్న వివరాలను నమోదు చేస్తుంది కూడా. ఈ మోబీ స్టోర్‌లోకి ఎంటరవగానే... ఓ హాలోగ్రామ్ మీకు హలో చెబుతుంది. స్టోర్‌లో ఏవైనా వస్తువులు లేకపోతే.. లేదా మీకు ప్రత్యేకంగా ఏవైనా అవసరముంటే ఈ హాలోగ్రామ్కు చెబితే.. తెప్పించి ఇచ్చే ఏర్పాట్లు ఉన్నాయి. హీఫీ విశ్వవిద్యాలయం, హిమాలయఫై సంయుక్తంగా అభివృద్ధి చేసిన మొబీ.. సూపర్మార్కెట్లకు మాత్రమే కాకుండా.. మందుల షాపులుగానూ, ఏటీఎం సెంటర్లగానూ వాడుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. షాంఘైలో ప్రస్తుతం తొలి మొబీ స్టోర్‌ను ప్రయోగాత్మకంగా నడిపి చూస్తున్నారు. అంతా సవ్యంగా సాగితే త్వరలోనే వీటిని వాణిజ్య స్థాయిలో తయారు చేసేందుకు ప్రయత్నిస్తామని దీని అభివృద్ధిలో కీలకపాత్ర పోషించిన థామస్ మొజెట్టీ అంటున్నారు. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
కొనబోతే కొరివి అమ్మబోతే అడవి
-
ఫ్రిడ్జ్‌లో 12 అడుగుల కొండచిలువ
కేప్‌టౌన్: నిత్యవసర వస్తువులను కొనుగోలు చేసుకునేందుకు ఓ మహిళ తన నివాసానికి దగ్గరలోని సూపర్ మార్కెట్లోకి వెళ్లింది. పెరుగు ప్యాకెట్ తీసుకుందామని ఫ్రిడ్జ్‌లో చేయిపెట్టిన ఆమె చేతికి 12 అడుగుల కొండచిలువ తగిలింది. అది గమనించిన ఆమె ఒక్కసారిగా భయంతో కేకలు వేసింది. అప్రమత్తమైన మార్కెట్ సిబ్బంది ఫ్రిడ్జ్ వద్దకు చేరుకుని అందులో ఉన్న కొండచిలువను చూసి హతశులయ్యారు. వెంటనే పాములు పట్టుకునే వారికి సమాచారం అందించారు. మహిళ కొండచిలువను పట్టుకున్న సమయంలో అది గాఢనిద్రలో ఉండటంతో పెను ప్రమాదం తప్పింది. వెంటనే మార్కెట్‌కు చేరుకున్న పాములు పట్టే బృందం కొండచిలువను ఫ్రిడ్జ్ లోపలి నుంచి బయటకు లాగింది. ఆ తర్వాత దాన్ని జాతీయ పార్కులో వదిలేశారు. తమ సూపర్‌మార్కెట్ వెనుక చాలా పొదలు ఉన్నాయని, పై కప్పు నుంచో లేదా మార్కెట్ కింది భాగంలో ఉన్న మురుగు కాలువ నుంచో కొండ చిలువ వచ్చి ఫ్రిడ్జ్‌లో చేరుంటుందని యాజమాన్యం పేర్కొంది. -
సూపర్ మార్కెట్ ముందు సూట్‌కేస్ కలకలం
రాజేంద్రనగర్ మండలం నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలోని సూపర్ మార్కెట్ ముందు సూట్‌కేస్ కలకలం సృష్టించింది. గుర్తుతెలియని వ్యక్తులు సూట్‌కేస్‌ను సూపర్ మార్కెట్ ముందు వదిలి వెళ్లారు. ఇది గమనించిన స్తానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు బాంబ్‌స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో సంఘటనాస్థలానికి చేరుకున్నారు. ముమ్మర తనిఖీలు నిర్వహించారు. కలకలానికి కారణం అయిన సూట్ కేస్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.