మెల్‌బోర్న్: కరోనా నేపథ్యంలో ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతోన్న ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు (సీఏ) ఇటీవలే పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగించింది. అయితే ఇలాంటి ఇబ్బందికర పరిస్థితుల్లో వారికి బయట మరోచోట ఉద్యోగం ఇప్పించే ప్రయత్నంలో సహకరించేందుకు సిద్ధమైంది. జూన్ 30 వరకు తమవారికి తాత్కాలిక ఉద్యోగాల్లో చేర్చుకోవాలని అతి పెద్ద సూపర్ మార్కెట్ గ్రూప్‌లలో ఒకటి, తమ క్రికెట్ టీమ్ స్పాన్సర్ అయిన ‘వూల్‌వర్త్’ను కోరింది. ‘బోర్డులో ఉద్యోగాలు కోల్పోయిన వారికి తాత్కాలికంగా బయట ఏదో ఒక ఏర్పాట్లు చేసేందుకు మేం ప్రయత్నిస్తున్నాం. అందులో భాగంగానే వూల్‌వర్త్ సీఈఓ బ్రాడ్ బాండుసీకి నేను స్వయంగా లేఖ రాశాను. వారి సూపర్ మార్కెట్లలో ప్రస్తుతం సిబ్బంది అవసరం ఉందన్నట్లు మాకు తెలిసింది. అందుకే మా వాళ్లను తీసుకోమన్నాం’ అని సీఏ చీఫ్ ఎగ్జిక్యూటివ్ రాబర్ట్‌సన్ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment