Australia cricket board
-
షేన్‌వార్న్‌కు ఆసీస్ బోర్డు సముచిత గౌరవం
దివంగత క్రికెటర్ షేన్‌వార్న్‌ను ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు (సీఏ) సముచిత రీతిలో గౌరవించనుంది. ఇకపై ఆస్ట్రేలియా అత్యుత్తమ టెస్టు క్రికెటర్ అవార్డును షేన్‌వార్న్ పేరిట ఇవ్వనుంది. ఇకపై ఈ అవార్డు ‘షేన్ వార్న్ బెస్ట్ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ఆస్ట్రేలియా’గా వ్యవహరిస్తారు. గత మార్చిలో షేన్ వార్న్ మృతి చెందిన తర్వాత అతని సొంత మైదానం మెల్బోర్న్ గ్రౌండ్లో మొదటి టెస్టు జరుగుతున్న సందర్భంగా సోమవారం ఈ విషయాన్ని ఆసీస్ బోర్డు ప్రకటించింది. లెగ్‌స్పిన్ దిగ్గజం వార్న్ 145 టెస్టుల్లో ఆసీస్‌కు ప్రాతినిధ్యం వహించి 708 వికెట్లు పడగొట్టాడు. -
T20 World Cup: ప్రపంచకప్ ‘ప్రతీకార’ పోరు
క్రికెట్ ప్రపంచంలో భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ అంటే ఎప్పుడు, ఎన్నిసార్లు మ్యాచ్ జరిగినా అది కొత్తగానే ఉంటుంది. సుదీర్ఘ విరామం తర్వాతేమీ ఆడటం లేదు, ఇరు జట్ల మధ్య పోరు జరిగి సరిగ్గా 50 రోజులే అయింది. అయినా సరే ఇప్పుడు వరల్డ్‌కప్ వచ్చేసరికి మళ్లీ అభిమానుల్లో అదే ఉత్సాహం, అదే ఉద్వేగం... ఆటగాళ్లపై అదే తరహాలో తప్పని ఒత్తిడి కూడా! ఆసియా కప్‌ను పక్కన పెడితే గత ఏడాది టి20 ప్రపంచకప్‌లో పాక్ చేతిలో ఎదురైన పరాజయం కోణంలోనే భారత్‌కు ఈ మ్యాచ్ మరింత కీలకం. ‘ప్రతీకారం’ అనే మాటను వాడదల్చుకోలేదని ఎవరు చెప్పినా ఆ పదం విలువ, అర్థమేమిటో భారత అభిమానులకు బాగా తెలుసు! మెల్బోర్న్: ఎప్పుడో 37 ఏళ్ల క్రితం... భారత్, పాకిస్తాన్ జట్లు ప్రతిష్టాత్మక మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ)లో తలపడ్డాయి. ఇరు జట్ల మధ్య పోరును ఎవరూ పట్టించుకోని ఆ రోజుల్లో 30 వేల మంది కూడా మ్యాచ్‌కు రాలేదు. కానీ ఇప్పుడు... ఈ మ్యాచ్ రాబట్టే ఆదాయం ఏమిటో బాగా తెలిసిన ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ఎంసీజీని వేదికగా మార్చింది. 90 వేల సామర్థ్యం గల మైదానంలో చాలా కాలం క్రితమే అన్ని టికెట్లు నిమిషాల వ్యవధిలో అమ్ముడుపోయాయి. ఈ నేపథ్యంలో ఇరు జట్ల అభిమానుల హోరు మధ్య నేడు భారత్, పాకిస్తాన్ తమ తొలి లీగ్ మ్యాచ్‌లో తలపడనున్నాయి. దీంతో అభిమానులందరికీ ఆదివారం మధ్యాహ్నం నుంచి వినోదానికి ఫుల్ గ్యారంటీ. రెండో స్పిన్నర్ ఎవరు? భారత జట్టుకు బ్యాటింగ్‌కు సంబంధించి కొత్తగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇటీవల ఆసియా కప్‌తో పాటు ఆ తర్వాత స్వదేశంలో జరిగిన సిరీస్‌లను బట్టి చూస్తే చాలా వరకు తుది జట్టు ఏమిటో స్పష్టమవుతుంది. టాపార్డర్‌లో రోహిత్, రాహుల్, కోహ్లిలు సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నారు. గత వరల్డ్ కప్‌లో ఈ ముగ్గురి వికెట్లు తీసి షాహిన్ అఫ్రిది ఒక్కసారిగా హీరోగా మారిపోయాడు. ఈసారి అతని బౌలింగ్‌పై చెలరేగితే ప్రత్యర్థి ఆత్మరక్షణలో పడిపోతుంది. ప్రస్తుతం టి20 క్రికెట్లో అత్యుత్తమ బ్యాటర్‌గా ఉన్న సూర్యకుమార్ మిడిలార్డర్లో దూకుడుగా ఆడగల సమర్థుడు. ఆ తర్వాత హార్దిక్ పాండ్యా, దినేశ్ కార్తీక్ ఫినిషింగ్ బాధ్యతలు చేపడతారు. ఎడంచేతి వాటం ప్రయోజనం ఉన్నా, ప్రస్తుత ఫామ్ ప్రకారం కార్తీక్కే తుది జట్టులో స్థానం దక్కే అవకాశం ఎక్కువ. పేస్ బౌలింగ్‌లో షమీ, భువనేశ్వర్, అర్‡్షదీప్లు ఖాయం కాగా... రెండో స్పిన్నర్ విషయంలో అశ్విన్, చహల్‌లలో ఒకరే ఆడే అవకాశముంది. రవూఫ్ కీలకం! పాకిస్తాన్ బ్యాటింగ్‌లో కూడా తడబాటు ఉంది. అంకెలపరంగా చూస్తే మొహమ్మద్ రిజ్వాన్, కెప్టెన్ బాబర్ ఆజమ్ పెద్ద సంఖ్యలో పరుగులు చేస్తున్నట్లు కనిపిస్తున్నా, వారి స్ట్రయిక్‌రేట్ పేలవం. షాన్ మసూద్ పేలవ ఫామ్‌లో ఉండగా, గాయంతో ఫఖర్ జమాన్ దూరమయ్యాడు. మిడిలార్డర్లో హైదర్ అలీ, ఆసిఫ్ అలీ, ఇఫ్తికార్‌లు అంతంత మాత్రం బ్యాటర్లే! ఆసియా కప్‌లోనే వీరి వైఫల్యం స్పష్టంగా కనిపించింది. ఆసీస్ గడ్డపై వీరు ఏమాత్రం ఆడతారనేది చెప్పలేం. దాంతో పాకిస్తాన్ తమ బౌలింగ్‌నే ప్రధానంగా నమ్ముకుంటోంది. గాయం నుంచి కోలుకొని తిరిగొచ్చిన షాహిన్ తమ రాత మార్చగలడని పాక్ భావిస్తోంది. షాహిన్ బౌలింగ్‌లో శుభారంభం అందిస్తే ఆ జట్టుపై ఒత్తిడి తగ్గుతుంది. మరో పేసర్‌గా నసీమ్ షా ఉంటాడు. అయితే వాస్తవానికి అఫ్రిదికంటే కూడా హారిస్ రవూఫ్ కీలకం కానున్నాడు. బిగ్‌బాష్ లీగ్‌లో మెల్బోర్న్ స్టార్స్ తరఫున చెలరేగిన అతనికి ఒక రకంగా ఇది సొంత మైదానంలాంటిది. తుది జట్లు (అంచనా) భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), రాహుల్, కోహ్లి, సూర్యకుమార్, హార్దిక్, దినేశ్ కార్తీక్, అక్షర్ పటేల్, షమీ, చహల్/అశ్విన్, భువనేశ్వర్, అర్‡్షదీప్ సింగ్. పాకిస్తాన్: బాబర్ ఆజమ్ (కెప్టెన్), రిజ్వాన్, షాన్ మసూద్, హైదర్ అలీ, ఇఫ్తికార్, ఆసిఫ్ అలీ, నవాజ్, షాదాబ్, నసీమ్ షా, షాహిన్ అఫ్రిది, హారిస్ రవూఫ్. -
ఎట్టకేలకు సొంతగడ్డపై...
సిడ్నీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) అనూహ్యంగా వాయిదా పడిన రోజునుంచి ఎప్పుడెప్పుడు ఇళ్లకు చేరుదామా అని ఎదురు చూసిన ఆస్ట్రేలియా క్రికెటర్లకు ఊరట లభించింది. భారత్‌నుంచి వచ్చే విమానాలపై తమ దేశం విధించిన ఆంక్షల నేపథ్యంలో మాల్దీవులలో కొన్ని రోజులు గడిపిన అనంతరం వీరంతా సొంతగడ్డపై అడుగు పెట్టారు. లీగ్‌లో పాల్గొన్న ఆటగాళ్లు, సహాయక సిబ్బందితో పాటు ఇతర సాంకేతిక నిపుణులు అందరూ సోమవారం ఉదయం స్వదేశంలోకి ప్రవేశించారు. ‘ఎయిర్ సీషెల్స్’ ఫ్లయిట్ ద్వారా వీరంతా సిడ్నీ నగరానికి చేరుకున్నట్లు ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు (సీఏ) వెల్లడించింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం క్రికెటర్లు ఇప్పుడే తమ ఇంటికి వెళ్లేందుకు వీలు లేదు. రెండు వారాల పాటు వీరంతా స్థానిక మారియట్ హోటల్లో క్వారంటైన్లో ఉండనున్నారు. ఆ తర్వాత తమ స్వస్థలాలకు వెళ్లిపోతారు. కోవిడ్ బారిన పడి కోలుకున్న చెన్నై కోచ్ మైక్ హస్సీ కూడా విడిగా ఖతర్ మీదుగా ఆస్ట్రేలియాకు వెళ్లాడు. ఐపీఎల్‌ను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు మే 4న బీసీసీఐ ప్రకటించగా... అందరికంటే చివరగా ఆసీస్ క్రికెటర్లు సొంత దేశానికి వెళ్లగలిగారు. తమ ఆటగాళ్లు క్షేమంగా తిరిగి రావడం పట్ల సంతోషం వ్యక్తం చేసిన సీఏ చీఫ్ ఎగ్జిక్యూటివ్ నిక్ హాక్లీ...అందుకు తగిన ఏర్పాట్లు చేసిన బీసీసీఐకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపాడు. -
అమ్మో అడిలైడ్!
సిడ్నీ: భారత్‌తో ప్రతిష్టాత్మక సిరీస్‌ను విజయవంతంగా నిర్వహించాలని పట్టుదలగా ఉన్న ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు (సీఏ)కు కొత్త సమస్య వచ్చి పడింది. తొలి టెస్టు మ్యాచ్‌కు వేదికైన అడిలైడ్‌లో సోమవారం ఒక్కసారిగా కరోనా కేసుల సంఖ్య పెరిగిపోయింది. దాంతో టెస్టు కెప్టెన్ టిమ్ పైన్‌తో పాటు పలువురు ఆటగాళ్లు సెల్ఫ్ ఐసోలేషన్‌కు వెళ్లిపోయారు. ఆదివారం వరకు 4 కేసులు ఉన్న అడిలైడ్‌లో సోమవారం 17 కేసులు నమోదయ్యాయి. దాంతో ఈ నగరం ఉండే సౌత్ ఆస్ట్రేలియాతో మంగళవారం అర్ధరాత్రి నుంచి తమ సరిహద్దులు మూసివేస్తున్నట్లు పక్క రాష్ట్రాలు వెస్ట్రన్ ఆస్ట్రేలియా, నార్తర్న్ టెరిటరీ, టాస్మేనియా, క్వీన్స్లాండ్ ప్రకటించాయి. అక్కడి నుంచి ఎవరైనా వచ్చినా కచ్చితంగా 14 రోజుల హోటల్ క్వారంటైన్‌కు వెళ్లేలా ఆదేశాలు జారీ చేశాయి. అయితే డిసెంబర్ 17 నుంచి భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగే తొలి టెస్టు (డే–నైట్)కు ఎలాంటి ఆటంకం ఉండబోదని ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు (సీఏ) ప్రకటించింది. అప్పటిలోగా పరిస్థితులు చక్కబడతాయని ఆశాభావం వ్యక్తం చేసింది. తొలి టెస్టుకు స్టేడియంలో సగం మంది ప్రేక్షకులను అనుమతించాలని ఇప్పటికే నిర్ణయించారు. అయితే పరిస్థితి మారకపోతే మాత్రం ప్రేక్షకులు లేకుండానే మ్యాచ్ జరగవచ్చు. మరోవైపు తాజా పరిణామాల నేపథ్యంలో ప్రత్యేక విమానాల ద్వారా ఆస్ట్రేలియా జాతీయ జట్టు, దేశవాళీ టోర్నీ షెఫీల్డ్ షీల్డ్ ఆటగాళ్లందరినీ ఒక్క చోటకు చేర్చాలని సీఏ భావిస్తోంది. కరోనా సమస్య లేని సిడ్నీకి (న్యూసౌత్‌వేల్స్ రాష్ట్రం) అందరినీ తీసుకెళితే అన్ని మ్యాచ్‌లు షెడ్యూల్ ప్రకారమే నిర్వహించేందుకు అవకాశం ఉంటుందనేది సీఏ ఆలోచన. ప్రస్తుతం భారత జట్టు సిడ్నీలోనే ఉంది. -
ఒకే వేదికపై భారత్‌తో టెస్టు సిరీస్!
మెల్బోర్న్: పరిస్థితులు అనుకూలించకపోతే భారత్‌తో నాలుగు టెస్టుల సిరీస్‌ను ఒకే వేదికపై నిర్వహించేందుకు ప్రయత్నిస్తామని క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ కెవిన్ రాబర్ట్స్ శుక్రవారం ప్రకటించారు. అవసరమైతే గురువారం ప్రకటించిన టెస్టు సిరీస్ షెడ్యూల్లో మార్పులు చేస్తామని తెలిపారు. ‘ఇక్కడ అంతర్రాష్ట్ర సర్వీసులు నడిస్తే షెడ్యూల్ ప్రకారం సిరీస్ జరుపుతాం. అలా కాకుండా ప్రయాణ ఆంక్షలు అమల్లో ఉంటే ఒకే వేదికపై మ్యాచ్‌లు ఏర్పాటు చేస్తాం’ అని ఆయన అన్నారు. షెడ్యూల్ ప్రకారం నాలుగు టెస్టులకు వరుసగా బ్రిస్బేన్ (డిసెంబర్ 3–7), అడిలైడ్ (11–15), మెల్బోర్న్ (26–30), సిడ్నీ (జనవరి 3–7) ఆతిథ్యమివ్వనున్నాయి. మరోవైపు ఈ ఏడాది జరగాల్సిన టి20 ప్రపంచకప్ వాయిదా పడితే భారీ స్థాయిలో ఆదాయానికి గండిపడనుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ ప్రయాణ ఆంక్షల నేపథ్యంలో వరల్డ్ కప్ నిర్వహణపై అనిశ్చితి ఇంకా కొనసాగుతోందని పేర్కొన్నారు. టోర్నీ జరుగకపోతే రూ. 402 కోట్ల (80 మిలియన్ డాలర్లు) నష్టం వాటిల్లుతుందని చెప్పారు. -
ప్రపంచకప్ ప్రస్తావన లేకుండానే...
మెల్బోర్న్: షెడ్యూల్ ప్రకారం అక్టోబరు 18నుంచి నవంబరు 15 వరకు ఆస్ట్రేలియాలో టి20 వరల్డ్ కప్ జరగాల్సి ఉంది. అంతకు ముందు అక్టోబరు 11, 14, 17 తేదీల్లో భారత్‌తో 3 టి20ల్లో తలపడనున్నట్లు ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు (సీఏ) గురువారం ప్రకటించింది. వీటికి వేదికలు కూడా ఖరారు చేసింది. మరి తర్వాతి రోజునుంచే జరగాల్సిన ప్రపంచకప్ నిర్వహణపై మాత్రం ఇంకా సందేహాలు కనిపిస్తున్నాయి! ఆగస్టు నుంచి ఫిబ్రవరి దాకా జరిగే 2020–21 హోమ్ సీజన్ షెడ్యూల్లో భారత్‌తో 4 టెస్టులు, 3 వన్డేలు కూడా ఉన్నాయి. ఏడు పురుషుల టోర్నీలు, మూడు మహిళల ఈవెంట్లకు సంబంధించిన ద్వైపాక్షిక సిరీస్ షెడ్యూల్‌ను సీఏ ప్రకటించింది. ఆగస్టు 9నుంచి జింబాబ్వేతో జరిగే వన్డే సిరీస్‌తో మళ్లీ అక్కడ అంతర్జాతీయ క్రికెట్ ప్రారంభం అవుతుంది. భారత్‌తో టెస్టులకంటే ముందుగా మూడు టి20లు జరుగుతాయి. అక్టోబర్‌లో విండీస్‌తో మూడు టి20లు, నవంబర్‌లో అఫ్గానిస్తాన్‌తో ఏకైక టెస్టు, జనవరి, ఫిబ్రవరిల్లో న్యూజిలాండ్‌తో మూడు వన్డేలు, ఒక టి20 మ్యాచ్ ఆడుతుంది. భారత్, ఆసీస్ మహిళా జట్ల మధ్య జనవరిలో మూడు వన్డేలు జరుగుతాయి. -
బ్రిస్బేన్ టెస్టుతో మొదలు!
మెల్బోర్న్: ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియాలో పర్యటించే భారత క్రికెట్ జట్టు టెస్టు సిరీస్ షెడ్యూల్ ఖరారైంది. డిసెంబర్ 3 నుంచి బ్రిస్బేన్ మైదానంలో జరిగే తొలి టెస్టుతో నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ప్రారంభమవుతుందని ఆసీస్ మీడియా తెలిపింది. ఈ మేరకు ఆసీస్‌లో భారత్ పర్యటన వివరాలను శుక్రవారం క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ కెవిన్ రాబర్ట్స్ అధికారికంగా ప్రకటించే అవకాశముంది. బ్రిస్బేన్ టెస్టు తర్వాత అడిలైడ్‌లో డిసెంబర్ 11 నుంచి రెండో టెస్టు... మెల్బోర్న్లో డిసెంబర్ 26 నుంచి మూడో టెస్టు... సిడ్నీలో జనవరి 3 నుంచి నాలుగో టెస్టు జరుగుతుంది. అడిలైడ్‌లో జరిగే రెండో టెస్టును డే–నైట్‌గా నిర్వహించే అవకాశముంది. కరోనా నేపథ్యంలో ఆసీస్‌లో పర్యటించే భారత జట్టును క్వారంటైన్లో పెట్టాలా వద్దా అనే విషయంపై ఇంకా స్పష్టత లేదు. -
లబ్‌షేన్‌కు సీఏ కాంట్రాక్టు
మెల్బోర్న్: ఆసీస్ జట్టులో ఇటీవల నిలకడగా రాణిస్తున్న లబ్‌షేన్‌కు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) సెంట్రల్ కాంట్రాక్టు కట్టబెట్టింది. అయితే స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్ గైర్హాజరీలో కంగారూ జట్టును ఆదుకున్న ఉస్మాన్ ఖాజాకు సీఏ షాకిచ్చింది. 2020–21 సీజన్‌కుగానూ గురువారం ప్రకటించిన కాంట్రాక్టు జాబితా నుంచి అతన్ని తప్పించింది. గతేడాది యాషెస్ సిరీస్ నుంచి జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించని ఖాజాతో పాటు మార్కస్ హారిస్, నాథన్ కూల్టర్‌నీల్, పీటర్ హ్యాండ్స్కోంబ్, షాన్ మార్‡్ష, మార్కస్ స్టొయినిస్ తమ కాంట్రాక్టులు కోల్పోయారు. వీరి స్థానంలో బర్న్స్, లబ్‌షేన్, మాథ్యూ వేడ్, ఆల్‌రౌండర్ మిచెల్ మార్‡్ష, పేసర్ కేన్ రిచర్డ్సన్, స్పిన్నర్ ఆస్టన్ అగర్ సెంట్రల్ కాంట్రాక్టులు పొందారు. సీఏ ప్రకటించిన జాబితాలో మొత్తం 20 మంది ఆటగాళ్లు చోటు దక్కించుకున్నారు. గతేడాది అక్టోబర్‌లో చివరి టి20 ఆడిన మ్యాక్స్‌వెల్‌ను జాబితాలో కొనసాగించారు. -
మావాళ్లకు కాస్త ఉద్యోగాలు ఇవ్వండి
మెల్బోర్న్: కరోనా నేపథ్యంలో ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతోన్న ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు (సీఏ) ఇటీవలే పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగించింది. అయితే ఇలాంటి ఇబ్బందికర పరిస్థితుల్లో వారికి బయట మరోచోట ఉద్యోగం ఇప్పించే ప్రయత్నంలో సహకరించేందుకు సిద్ధమైంది. జూన్ 30 వరకు తమవారికి తాత్కాలిక ఉద్యోగాల్లో చేర్చుకోవాలని అతి పెద్ద సూపర్ మార్కెట్ గ్రూప్‌లలో ఒకటి, తమ క్రికెట్ టీమ్ స్పాన్సర్ అయిన ‘వూల్వర్త్’ను కోరింది. ‘బోర్డులో ఉద్యోగాలు కోల్పోయిన వారికి తాత్కాలికంగా బయట ఏదో ఒక ఏర్పాట్లు చేసేందుకు మేం ప్రయత్నిస్తున్నాం. అందులో భాగంగానే వూల్వర్త్ సీఈఓ బ్రాడ్ బాండుసీకి నేను స్వయంగా లేఖ రాశాను. వారి సూపర్ మార్కెట్లలో ప్రస్తుతం సిబ్బంది అవసరం ఉందన్నట్లు మాకు తెలిసింది. అందుకే మా వాళ్లను తీసుకోమన్నాం’ అని సీఏ చీఫ్ ఎగ్జిక్యూటివ్ రాబర్ట్సన్ వెల్లడించారు. -
ప్రేక్షకులు లేకుండా... ఒకే మైదానంలో...
సిడ్నీ: భారత్‌తో సిరీస్ అంటే ఏ జట్టుకైనా ఆర్థికపరంగా పండుగే. భారీ టీవీ హక్కులతో పాటు ప్రేక్షకాదరణ కూడా అద్భుతంగా ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత ఎక్కువ టీమిండియాతో తలపడేందుకు అన్ని జట్లూ ప్రయత్నిస్తాయి. అందుకు ఆస్ట్రేలియాలాంటి పెద్ద జట్టు కూడా అతీతం కాదు. కోవిడ్–19 నేపథ్యంలో ఆర్థికపరంగా భారీ నష్టాలకు గురవుతున్న ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు (సీఏ) ఈ ఏడాది చివర్లో భారత్‌తో జరిగే టెస్టు సిరీస్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోరాదని భావిస్తోంది. కరోనా వైరస్ వ్యాప్తి ఈ సిరీస్ జరగడంపై సందేహాలు రేకెత్తుతుండటంతో సిరీస్ నిర్వహించేందుకు ప్రత్యామ్నాయ ఆలోచనలు చేస్తోంది. అవసరమైతే మైదానంలోకి ప్రేక్షకులను అనుమతించకుండా కూడా టెస్టు సిరీస్ ఆడించాలని సీఏ భావిస్తోంది. అదే తరహాలో వేర్వేరు వేదికలపై కాకుండా ఒకే చోట కూడా సిరీస్ నిర్వహించే ప్రతిపాదన ఉంది. ఈ సిరీస్‌లో నాలుగు టెస్టులే జరగాల్సి ఉండగా... నష్టం పూడ్చుకునే క్రమంలో అదనంగా మరో మ్యాచ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌ను జరపాలని కూడా భావిస్తోంది. సీఏ చీఫ్ ఎగ్జిక్యూటివ్ కెవిన్ రాబర్ట్స్ ఈ విషయాలు వెల్లడించారు. కరోనా నేపథ్యంలో సీఏ సుమారు 20 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్ల నష్టం ఎదుర్కొనే ప్రమాదం కనిపిస్తోంది. ‘ప్రస్తుత పరిస్థితుల్లో కొత్త తరహాలోనైనా సరే భారత్‌తో సిరీస్ కోసం అందుబాటులో ఉన్న అన్ని ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తున్నాం. బీసీసీఐ, భారత క్రికెటర్లు, సహాయక సిబ్బంది మద్దతుతో ఒక అద్భుతమైన సిరీస్ నిర్వహించాలనేది మా ఆలోచన. మైదానంలో ప్రేక్షకులు ఉన్నా లేకున్నా సరే ఇది కొనసాగాలని కోరుకుంటున్నాం. వీటిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు కానీ బీసీసీఐతో పూర్తి స్థాయిలో చర్చిస్తాం. సిరీస్‌ను ఐదు టెస్టులకు పొడిగించడం కూడా అందులో ఒకటి. మన చేతుల్లో లేనిదాని గురించి ఏమీ చేయలేం కానీ ఇప్పుడు ఏం చేయాలో కొత్తగా ఆలోచించాలి కదా’ అని ఆయన అన్నారు. ఒకవేళ ఒకే చోట సిరీస్ జరిగితే అందుకు అడిలైడ్ వేదిక కావచ్చు. స్టేడియానికి అనుబంధంగా కొత్తగా నిర్మించిన హోటల్లోనే క్రికెటర్లందరినీ ఉంచాలనేది సీఏ ఆలోచన. మరోవైపు అక్టోబర్‌లోనే జరగాల్సిన టి20 ప్రపంచకప్ నిర్వహణ విషయంలో కూడా ఆస్ట్రేలియా బోర్డులో ఆందోళన పెరుగుతోంది. సమయానికి నిర్వహించడం సాధ్యమవుతుందా లేదంటే ఇతర ప్రత్యామ్నాయాలు చూడాలా అనే అంశంపై చర్చిస్తున్నామని, ఇంకా ఎలాంటి స్పష్టతా రాలేదని సీఏ పేర్కొంది. -
క్రీజ్‌లోకి మళ్లీ ‘మాస్టర్’
మెల్బోర్న్: క్రికెట్ ‘దేవుడు’ సచిన్ టెండూల్కర్ మళ్లీ క్రీజులోకి దిగాడు. తనను క్రికెట్లో రారాజుగా చేసిన బ్యాటింగ్‌తో మళ్లీ మెరిశాడు. ‘కార్చిచ్చు’తో మసి అయిన ఆస్ట్రేలియాలో తన పెద్ద మనసు చాటుకున్నాడు. విరాళాలు పోగు చేసే సత్కార్యంలో తన బ్యాటింగ్ ఆట చూపెట్టాడు. బ్యాటింగ్ ఎవరెస్ట్, క్రికెట్ గ్రేటెస్ట్‌కు బౌలింగ్ చేసే అదృష్టం ఆస్ట్రేలియన్ మహిళల జట్టు సూపర్‌స్టార్ ఆల్‌రౌండర్ ఎలీస్ పెర్రీ దక్కించుకుంది. ఈ ‘మెన్ ఇన్ బ్లూ’ ఆటగాడు కొంగొత్త డ్రెస్సింగ్‌తో బరిలోకి దిగాడు. పసుపు రంగు హెల్మెట్ ధరించి, అల్ట్రాలైట్ కూకాబుర్రా లోగో (సాధారణంగా ఎంఆర్ఎఫ్ లేదంటే అడిడాస్ లోగో) ఉన్న బ్యాట్‌తో ఐదు నిమిషాలు సచిన్ బ్యాటింగ్ చేశాడు. షార్ట్ ఫైన్ లెగ్, డీప్ స్క్వేర్‌లో తనదైన ట్రేడ్‌మార్క్ షాట్లతో అక్కడి ప్రేక్షకుల్ని టెండూల్కర్ అలరించాడు. నిజానికి కార్చిచ్చు విరాళాల సేకరణలో పాలుపంచుకునేందుకు అక్కడికి వెళ్లాడు. కానీ 10 ఓవర్ల ఆటలో మాత్రం ఆడలేదు. అయితే మహిళా స్టార్ పెర్రీ తన బౌలింగ్‌ను ఎదుర్కోవాలని సామాజిక సైట్లో వీడియో మెసేజ్ చేయగా... సచిన్ సరేనంటూ ఆమె ముచ్చట తీర్చాడు. తన క్రికెట్ అభిమానుల్ని అలరించాడు. అంతకుముందు జరిగిన 10 ఓవర్ల పొట్టి మ్యాచ్‌లో పాంటింగ్ ఎలెవన్ పరుగు తేడాతో గిల్‌క్రిస్ట్ ఎలెవన్‌పై నెగ్గింది. పాంటింగ్ జట్టు 104/5 స్కోరు చేయగా... మన యువరాజ్ సింగ్ (2) ఆడిన గిల్‌క్రిస్ట్ జట్టు 103/6 వద్ద ఆగిపోయింది. లారా, కోట్నీ వాల్‡్ష, వసీమ్ అక్రమ్, పాంటింగ్, హేడెన్, గిల్‌క్రిస్ట్, వాట్సన్, సైమండ్స్ తదితర క్రికెటర్లు చారిటీ మ్యాచ్‌లో ఉత్సాహంగా ఆడారు. ఈ మ్యాచ్ ద్వారా 77 లక్షల 23 వేల 129 ఆస్ట్రేలియన్ డాలర్లు (రూ. 36 కోట్ల 85 లక్షలు) విరాళంగా సేకరించామని క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. ఈ మొత్తాన్ని కార్చిచ్చు బాధితులకు అందజేస్తామని తెలిపింది. ఔరా... లారా... క్రికెట్ తెలిసిన వారికి లారా తెలియకుండా ఉండడు. వెస్టిండీస్ క్రికెట్లోనే కాదు... ప్రపంచ క్రికెట్లోనే అసాధారణ బ్యాటింగ్ మాంత్రికుడు బ్రియాన్ లారా. అతని ఆట, కెరీర్ ఎంతో అద్భుతంగా సాగింది. ఇంకా చెప్పాలంటే అతని రికార్డు (టెస్టుల్లో 400 నాటౌట్) ఇంకా చెక్కు చెదరలేదు. 50 ఓవర్లలోనే 350 లక్ష్యమైనా ఉఫ్‌మని ఊదేస్తున్న ఈ రోజుల్లో... వన్డేల్లోనే డబుల్ సెంచరీల మీద డబుల్ సెంచరీలు బాదుతున్న రోహిత్, పరుగులు పరుగుల్లా కాకుండా వరదలెత్తిస్తున్న విరాట్, విధ్వంసం సృష్టించే వార్నర్లాంటి వారంతా ఉన్న నేటితరం క్రికెట్లో... లారా సంప్రదాయ క్రికెట్లో సాధించిన ‘క్వాడ్రపుల్ సెంచరీ’ జోలికి ఎవరూ వెళ్లలేకపోయారు. కానీ లారా మాత్రం తనకు ఏమాత్రం తెలియని టి20 క్రికెట్‌ను అవలీలగా ఆడేస్తానని తన బ్యాట్‌తో అది కూడా 50 ఏళ్ల వయసులో చాటడం గొప్ప విశేషం. ఈ క్రికెట్ చరిత్రకారుడు బుష్ఫైర్ (కార్చిర్చు) చారిటీ మ్యాచ్‌లో పాంటింగ్ ఎలెవన్ తరఫున 10 ఓవర్ల క్రికెట్ ఆడాడు. 11 బంతుల్లోనే 30 పరుగులు చేశారు. అతని 3 ఫోర్లు, 2 సిక్సర్లు చూస్తే మాత్రం ఇప్పటికీ అతను తాజాగా ఆడుతున్న క్రికెటర్‌నే గుర్తుచేస్తాయి తప్ప రిటైర్డ్ క్రికెటర్ అని అనిపించదు! -
కెప్టెన్లుగా కోహ్లి, ధోని
మెల్బోర్న్: గత పదేళ్ల అంతర్జాతీయ ప్రదర్శనను పరిగణనలోకి తీసుకుంటూ ఆ్రస్టేలియా క్రికెట్ బోర్డు (సీఏ) అధికారిక వెబ్సైట్ ఈ దశాబ్దపు టెస్టు, వన్డే జట్లను ప్రకటించింది. ఇందులో పలువురు ఆ్రస్టేలియన్లను వెనక్కి నెట్టి వన్డే జట్టు కెప్టెన్ గా మహేంద్ర సింగ్ ధోని, టెస్టు జట్టు కెప్టెన్ గా విరాట్ కోహ్లి ఎంపిక కావడం విశేషం. గత పదేళ్ల కాలంలో 70 అంతర్జాతీయ సెంచరీలు చేసిన కోహ్లి 50కు పైగా సగటుతో అన్ని ఫార్మాట్లలో కలిపి 21,444 పరుగులు సాధించాడు. ఆసీస్ గడ్డపైనే కోహ్లి 6 టెస్టు సెంచరీలు, 3 వన్డే సెంచరీలు చేయడం విశేషం. 2011లో వన్డే వరల్డ్ కప్, 2013లో ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో భారత్‌ను విజేతగా నిలిపిన ధోనికి వన్డే కెప్టెన్ గా గుర్తింపు దక్కింది. cricket.com.au ప్రకటించిన ఈ దశాబ్దపు అత్యుత్తమ జట్ల జాబితా: టెస్టులు: కోహ్లి (కెప్టెన్), అలిస్టర్ కుక్, డేవిడ్ వార్నర్, కేన్ విలియమ్సన్, స్టీవ్ స్మిత్, ఏబీ డివిలియర్స్, బెన్ స్టోక్స్, డేల్ స్టెయిన్, స్టువర్ట్ బ్రాడ్, నాథన్ లయన్, జేమ్స్ అండర్సన్ వన్డేలు: ధోని (కెప్టెన్), రోహిత్, ఆమ్లా, కోహ్లి, డివిలియర్స్, షకీబ్, బట్లర్, రషీద్ ఖాన్, మిషెల్ స్టార్క్, ట్రెంట్ బౌల్ట్, లసిత్ మలింగ టెస్టుల్లోనూ నంబర్‌వన్‌గా... ఏడాదిని ముగించిన కోహ్లి దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) వన్డే ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్‌గా నిలిచిన భారత కెప్టెన్ విరాట్ కోహ్లి టెస్టుల్లోనూ అగ్రస్థానంతో 2019ని ముగించాడు. ఐసీసీ ప్రకటించిన తాజా బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌ల్లో కోహ్లి (928 పాయింట్లు) తన టాప్ ర్యాంక్‌ను నిలబెట్టుకున్నాడు. ఆ్రస్టేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్ (911)కంటే కోహ్లి 17 పాయింట్లు ముందంజలో నిలిచాడు. కేన్ విలియమ్సన్ (864)కు మూడో స్థానం దక్కింది. ఇతర భారత బ్యాట్స్‌మెన్‌లో చతేశ్వర్ పుజారా (4వ స్థానం), అజింక్య రహానే (7వ స్థానం)లకు టాప్–10లో చోటు లభించగా, మయాంక్ 12వ, రోహిత్ 15వ స్థానంలో నిలిచారు. ప్యాట్ కమిన్స్ (ఆ్రస్టేలియా) నంబర్‌వన్‌గా ఉన్న బౌలర్ల జాబితాలో జస్ప్రీత్ బుమ్రాకు ఆరో స్థానం దక్కింది. ఆల్రౌండర్లలో జేసన్ హోల్డర్ (వెస్టిండీస్) అగ్రస్థానం సాధించగా, రవీంద్ర జడేజా (భారత్) రెండో ర్యాంక్‌తో 2019ని ముగించాడు. -
ఫలితం తేలేవరకు ‘సూపర్ ఓవర్లు’
మెల్బోర్న్: ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో సూపర్ ఓవర్ కూడా ‘టై’గా ముగిసిన తర్వాత బౌండరీల లెక్కన విజేతను నిర్ణయించడం ఎంత వివాదాస్పదమైందో అందరికీ తెలిసిందే. అలాంటి వివాదానికి అవకాశం ఇవ్వకుండా ఆ్రస్టేలియా క్రికెట్ బోర్డు బిగ్‌బాష్ లీగ్‌లో కొత్త నిబంధనతో ముందుకు వచి్చంది. మ్యాచ్‌లో స్కోర్లు సమమై, ఆ తర్వాత సూపర్ ఓవర్ కూడా ‘టై’గా ముగిస్తే ఆ వెంటనే రెండో సూపర్ ఓవర్ కూడా ఆడిస్తారు. అందులో కూడా ఇరు జట్లు సమంగా నిలిస్తే మరో సూపర్ ఓవర్ కూడా ఆడాల్సి ఉంటుంది. తుది ఫలితం తేలే వరకు దీనిని కొనసాగిస్తారు. ఫుట్‌బాల్, హాకీ పెనాల్టీ షూటౌట్లలో స్కోరు సమమైతే ఫలితం తేలే వరకు షూటౌట్ కొనసాగే తరహాలోనే బిగ్ బాష్ నిర్వాహకులు కొత్త రూల్‌ను రూపొందించారు. ముందుగా ఈ నిబంధనను పురుషుల, మహిళల బిగ్‌బాష్ లీగ్‌ల ఫైనల్ మ్యాచ్‌లకు మాత్రమే వర్తింపజేస్తున్నారు. లీగ్ దశలో సూపర్ ఓవర్ కూడా సమమైతే మాత్రం మ్యాచ్‌ను ‘టై’గా ప్రకటించి ఇరు జట్లకు సమంగా పాయింట్లు కేటాయిస్తారు. -
బీసీసీఐతో చర్చించాకే!
మెల్బోర్న్: ఈ ఏడాది చివర్లో తమ దేశ పర్యటనకు రానున్న టీమిండియాకు అదనపు సన్నాహక మ్యాచ్ ఏర్పాటుకు ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ముందుకొచ్చింది. అయితే, దీనిపై బీసీసీఐ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉందని క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) అధికారి తెలిపారు. ‘అదనపు ప్రాక్టీస్ మ్యాచ్‌లకు సంబంధించి బీసీసీఐతో చర్చించడానికి మేము సిద్ధమే. అయితే ఈ విషయంపై బీసీసీఐ నుంచి ఎలాంటి అధికారిక సమాచారం రాలేదు’ అని సీఏ అధికారి తెలిపారు. విదేశాల్లో టెస్టు సిరీస్‌ల ఓటములకు తగినంతగా ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడకపోవడమే కారణమని విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో రెండు రోజుల క్రితం భారత కోచ్ రవిశాస్త్రి స్పందించాడు. ఆసీస్ పర్యటనలో ఎక్కువ సన్నాహక మ్యాచ్‌లు ఉండేలా చూడాలని బీసీసీఐకి విన్నవించాడు. నవంబరు 21న ప్రారంభం కానున్న ఈ సిరీస్‌లో కోహ్లి సేన మూడు టి20లు, నాలుగు టెస్టులు, మూడు వన్డేలు ఆడనుంది. -
బెట్టింగ్ పాల్పడిన మహిళా క్రికెటర్లపై వేటు
మెల్బోర్న్: బెట్టింగ్‌కు పాల్పడిన ఇద్దరు ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్లపై ఆ దేశ క్రికెట్ బోర్డు వేటు వేసింది. హేలీ జెన్సెన్, కొరిన్నె హల్లపై రెండేళ్ల చొప్పున క్రికెట్ ఆస్ట్రేలియా నిషేధం విధించింది. కాగా నిషేధాన్ని 18 నెలలు పాటు సస్పెండ్ చేసింది. అంటే వీరిద్దరిపై 6 నెలల చొప్పున నిషేధం అమల్లో ఉంటుంది. హేలీ జెన్సెన్, కొరిన్నె హల్.. ఆస్ట్రేలియా జాతీయ మహిళల లీగ్, మహిళల దేశవాళీ టి-20 టోర్నమెంట్లో ప్రాతినిధ్యం వహించారు. పురుషుల క్రికెట్ మ్యాచ్‌లపై పందేలు కాసినట్టు వీరిద్దరూ అంగీకరించారు. గతేడాది ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ల మధ్య జరిగిన టెస్టు మ్యాచ్‌పై బెట్టింగ్ కట్టినట్టు జెన్సెన్ ఒప్పుకుంది. పురుషుల దేశవాళీ వన్డే క్రికెట్ మ్యాచ్‌లు రెండింటిపై పందెంకాసినట్టు హల్ చెప్పింది. దక్షిణ ఆస్ట్రేలియా పురుషుల దేశవాళీ క్రికెటర్ జోయెల్ లొగన్పై కూడా బెట్టింగ్ ఆరోపణలు వచ్చాయి. లొగన్పై రెండేళ్ల నిషేధం విధించినా.. అతని మ్యాచ్ కాంట్రాక్టులను పరిగణనలోకి తీసుకుని నిషేధాన్ని పూర్తిగా సస్పెండ్ చేసింది. -
కొత్త ప్రతిపాదనలపై ఐసీసీ భేటీ నేడు
సింగపూర్: ఐసీసీ పునర్ నిర్మాణ ప్రతిపాదనల ఆమోదం కోసం నేడు (శనివారం) సభ్యదేశాలు మరోమారు సమావేశం కానున్నాయి. ఈ కొత్త ప్రతిపాదనలు అమల్లోకి వస్తే భారత క్రికెట్ బోర్డు ఆదాయపరంగానే కాకుండా కీలక నిర్ణయాలు తీసుకునే విషయంలోనూ తిరుగులేని స్థాయిలో ఉంటుంది. బీసీసీఐతో పాటు ఇంగ్లండ్, ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డులకు కూడా తగిన అధికారాలు లభించనున్నాయి. అయితే ఈ పరిణామాలను ఆది నుంచీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న దక్షిణాఫ్రికా, పాకిస్థాన్, శ్రీలంక క్రికెట్ బోర్డులు ఈ సమావేశంలో ఎలా స్పందిస్తాయనేది ఆసక్తికరంగా మారింది. ఐసీసీ పునర్నిర్మాణ ప్రతిపాదనలు చట్టబద్ధంగానే ఉన్నాయని ఐసీసీ న్యాయ విభాగం చీఫ్ ఇయాన్ హిగ్గిన్స్ శ్రీలంక క్రికెట్ బోర్డు (ఎస్ఎల్సీ)కు స్పష్టం చేశారు. ప్రతిపాదనల చట్టబద్దతను ప్రశ్నిస్తూ లంక బోర్డు ఐసీసీ న్యాయవిభాగానికి గతంలో లేఖ రాసింది.