మెల్‌బోర్న్: ఈ ఏడాది చివర్లో తమ దేశ పర్యటనకు రానున్న టీమిండియాకు అదనపు సన్నాహక మ్యాచ్ ఏర్పాటుకు ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ముందుకొచ్చింది. అయితే, దీనిపై బీసీసీఐ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉందని క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) అధికారి తెలిపారు. ‘అదనపు ప్రాక్టీస్ మ్యాచ్‌లకు సంబంధించి బీసీసీఐతో చర్చించడానికి మేము సిద్ధమే.
అయితే ఈ విషయంపై బీసీసీఐ నుంచి ఎలాంటి అధికారిక సమాచారం రాలేదు’ అని సీఏ అధికారి తెలిపారు. విదేశాల్లో టెస్టు సిరీస్‌ల ఓటములకు తగినంతగా ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడకపోవడమే కారణమని విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో రెండు రోజుల క్రితం భారత కోచ్ రవిశాస్త్రి స్పందించాడు. ఆసీస్ పర్యటనలో ఎక్కువ సన్నాహక మ్యాచ్‌లు ఉండేలా చూడాలని బీసీసీఐకి విన్నవించాడు. నవంబరు 21న ప్రారంభం కానున్న ఈ సిరీస్‌లో కోహ్లి సేన మూడు టి20లు, నాలుగు టెస్టులు, మూడు వన్డేలు ఆడనుంది.
Comments
Please login to add a commentAdd a comment