Ravi Sasthi
-
బీసీసీఐతో చర్చించాకే!
మెల్బోర్న్: ఈ ఏడాది చివర్లో తమ దేశ పర్యటనకు రానున్న టీమిండియాకు అదనపు సన్నాహక మ్యాచ్ ఏర్పాటుకు ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ముందుకొచ్చింది. అయితే, దీనిపై బీసీసీఐ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉందని క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) అధికారి తెలిపారు. ‘అదనపు ప్రాక్టీస్ మ్యాచ్‌లకు సంబంధించి బీసీసీఐతో చర్చించడానికి మేము సిద్ధమే. అయితే ఈ విషయంపై బీసీసీఐ నుంచి ఎలాంటి అధికారిక సమాచారం రాలేదు’ అని సీఏ అధికారి తెలిపారు. విదేశాల్లో టెస్టు సిరీస్‌ల ఓటములకు తగినంతగా ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడకపోవడమే కారణమని విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో రెండు రోజుల క్రితం భారత కోచ్ రవిశాస్త్రి స్పందించాడు. ఆసీస్ పర్యటనలో ఎక్కువ సన్నాహక మ్యాచ్‌లు ఉండేలా చూడాలని బీసీసీఐకి విన్నవించాడు. నవంబరు 21న ప్రారంభం కానున్న ఈ సిరీస్‌లో కోహ్లి సేన మూడు టి20లు, నాలుగు టెస్టులు, మూడు వన్డేలు ఆడనుంది. -
జహీర్, ద్రవిడ్ అనుమానమేనా!
రవిశాస్త్రి ఎంపికకే సీఓఏ ఆమోదం న్యూఢిల్లీ: టీమిండియా కోచ్‌ల నియామక ప్రక్రియ అనేక మలుపులు తిరుగుతోంది. శనివారం సమావేశమైన పరిపాలక కమిటీ (సీఓఏ) హెడ్ కోచ్‌గా రవిశాస్త్రి ఎంపికపైనే ఆమోద ముద్ర వేసింది. అయితే బౌలింగ్ కోచ్ జహీర్ ఖాన్, బ్యాటింగ్ కోచ్ రాహుల్ ద్రవిడ్‌ల నియామకంపై కమిటీ ఏ నిర్ణయమూ తీసుకోలేదు. జట్టు సహాయక సిబ్బందిని ఈనెల 22న రవిశాస్త్రిని సంప్రదించాకే నియమించే అవకాశం ఉంది. సమావేశంలో వినోద్ రాయ్, డయానా ఎడుల్జీలతో పాటు బీసీసీఐ సీఈవో రాహుల్ జోహ్రి పాల్గొన్నారు. అయితే బోర్డు చెబుతున్నట్టుగా విదేశీ పర్యటనలోనైనా జహీర్, ద్రవిడ్ జట్టుతో పాటు ఉంటారా? అనే విషయంలో కమిటీ స్పష్టతనివ్వడం లేదు. శాస్త్రి వేతనంపై కమిటీ కోచ్ రవిశాస్త్రికి, సహాయక సిబ్బందికి ఎంత మొత్తం ఇవ్వాలనే విషయంపై నలుగురు సభ్యులతో కూడిన కమిటీ ఏర్పాటయ్యింది. ఇందులో డయానా ఎడుల్జీ, బోర్డు తాత్కాలిక అధ్యక్షుడు సీకే ఖన్నా, సీసీవో జోహ్రి, కార్యదర్శి అమితాబ్ చౌదరీ సభ్యులుగా ఉంటారు. ఈనెల 19న వీరు తొలిసారిగా సమావేశం కానున్నారు. తమ ప్రతిపాదనలతో ఈ కమిటీ 22న సీఓఏకు నివేదిక ఇస్తుంది. టీమ్ మేనేజర్ కోసం దరఖాస్తుల ఆహ్వానం ముంబై: సహాయక సిబ్బంది ఎంపిక ఇంకా నలుగుతుండగానే బీసీసీఐ.. టీమ్ మేనేజర్ పదవి కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈనెల 21లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎంపిౖకైన వారు ఏడాది కాలం పాటు పదవిలో ఉంటారని, అభ్యర్థులు ఫస్ట్ క్లాస్/అంతర్జాతీయ స్థాయి మ్యాచ్‌ల్లో ఆడిన అనుభవం ఉండాలని కోరింది. -
ఆరుగురిలో ఒకరు!
భారత క్రికెట్ జట్టు కోచ్ ఎంపిక కోసం నేడు ఇంటర్వ్యూలు రవిశాస్త్రికి మెరుగైన అవకాశాలు ముంబై: భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్‌ను ఎంపిక చేసేందుకు రంగం సిద్ధమైంది. అనిల్ కుంబ్లే అనూహ్య రాజీనామాతో ఏర్పడ్డ ఈ కీలక పదవిని భర్తీ చేయడం కోసం అభ్యర్థులకు నేడు ఇంటర్వ్యూలు జరుగనున్నాయి. సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్ సభ్యులుగా ఉన్న క్రికెట్ సలహా కమిటీ (సీఏసీ) ఈ ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది. కోచ్ పదవి కోసం దరఖాస్తు చేసుకోమంటూ బీసీసీఐ ఇచ్చిన ప్రకటనకు అనుగుణంగా మొత్తం పది మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే ప్రాథమిక వడబోత అనంతరం ఆరుగురు బరిలో నిలిచారు. ఈ ఆరుగురికి మాత్రమే ఇంటర్వ్యూలు జరుగుతాయి. దక్షిణాఫ్రికా మాజీ ఆల్‌రౌండర్ లాన్స్ క్లూస్నర్, భారత జట్టు మాజీ పేసర్ దొడ్డ గణేశ్, ఒమన్ జట్టుకు కోచ్‌గా ఉన్న రంజీ ట్రోఫీ మాజీ ఆటగాడు రాకేశ్ శర్మలతో పాటు ఎలాంటి క్రికెట్ నేపథ్యం లేని ఇంజినీర్ ఉపేంద్రనాథ్ బ్రహ్మచారి దరఖాస్తులను మాత్రం సీఏసీ ముందుగానే తిరస్కరించినట్లు సమాచారం. నేడు జరిగే ఇంటర్వ్యూలలో ఈ నలుగురిని పిలిచే అవకాశాలు దాదాపుగా లేవని బోర్డు ప్రతినిధి ఒకరు వెల్లడించారు. సెహ్వాగ్‌పై నమ్మకముందా! జగమెరిగిన భారత మాజీ ఆటగాడు రవి శాస్త్రి కుంబ్లేకు ముందు టీమ్ డైరెక్టర్‌గా మంచి ఫలితాలు రాబట్టారు. అన్నింటికి మించి ఇప్పుడు పెద్ద అర్హతగా కనిపిస్తున్న ‘కెప్టెన్‌తో సత్సంబంధాలు’ విషయంలో ఆయన అందరికంటే ముందున్నారు. కోహ్లితో సాన్నిహిత్యమే శాస్త్రికి కలిసొచ్చే అంశం. కోచ్ పదవి కోసం ముందుగా దరఖాస్తు చేయని ఆయన, తేదీ పొడిగించిన తర్వాత బరిలోకి వచ్చారు. గత ఏడాది కోచ్ ఇంటర్వ్యూల సమయంలో సీఏసీ సభ్యుడు గంగూలీతో బహిరంగంగా గొడవకు దిగినా... ఈసారి సచిన్ సూచనతోనే ముందుకు వచ్చానని చెబుతున్నారు కాబట్టి అది ఇప్పుడు సమస్య కాకపోవచ్చు. విధ్వంసకర బ్యాట్స్‌మన్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉన్న వీరేంద్ర సెహ్వాగ్ కూడా ప్రధానంగా పోటీలో ఉన్నారు. సీఏసీ సభ్యులతో ఉన్న స్నేహం వీరూకు అదనపు అర్హతలా కనిపిస్తోంది. అయితే ఐపీఎల్లో మెంటార్‌గా పని చేయడం మినహా ప్రధాన కోచింగ్‌లో వీరూకు ఎలాంటి అనుభవం లేదు. అంతర్జాతీయ, దేశవాళీల్లో కోచ్‌గా చాలా మంచి రికార్డు ఉన్న టామ్ మూడీ (ఆస్ట్రేలియా), గతంలో అఫ్ఘానిస్తాన్, ఐర్లాండ్‌లకు కోచ్‌గా వ్యవహరించిన ఫిల్ సిమన్స్ (విండీస్), గతంలో పాక్, బంగ్లాదేశ్‌లకు కోచ్‌గా వ్యవహరించిన రిచర్డ్ పైబస్ (దక్షిణాఫ్రికా) కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. 2007 టి20 ప్రపంచ కప్ గెలిచిన సమయంలో జట్టు మేనేజర్‌గా వ్యవహరించి, ఆ తర్వాత అఫ్ఘాన్ టీమ్‌తో మంచి ఫలితాలు రాబట్టిన లాల్‌చంద్ రాజ్‌పుత్ కూడా బరిలో నిలిచారు. నేరుగా కోచ్ పేరు ప్రకటన? మరోవైపు సరిగ్గా ఇంటర్వ్యూకు ముందు మరో కొత్త అంశం బోర్డులో చర్చకు వచ్చింది. అభ్యర్థులు అంతా తమ బయోడేటాలతో పాటు తమ ప్రణాళికలు కూడా స్పష్టంగా దరఖాస్తులోనే పంపించారు కాబట్టి మళ్లీ ప్రత్యేకంగా ఇంటర్వ్యూలు చేయాల్సిన అవసరం లేదని, సీఏసీ సభ్యులు, బీసీసీఐతో చర్చించి నేరుగా కోచ్ పేరు ప్రకటించాలనే చర్చ తెరపైకి వచ్చింది. గత ఏడాది గంగూలీ, శాస్త్రి మధ్య జరిగిన రచ్చను దీనికి కారణంగా కొందరు చూపిస్తున్నారు. అయితే చివరి నిమిషంలో ఇలాంటి నిర్ణయం తీసుకోవడం కష్టం కాబట్టి షెడ్యూ ల్ ప్రకారం ఇంటర్వ్యూలు కొనసాగుతాయని బోర్డు ప్రతినిధి ఒకరు వెల్లడించారు. -
రవిశాస్త్రి అధికారికంగా...
భారత హెడ్ కోచ్ పదవికి దరఖాస్తు చేసుకున్న మాజీ టీమ్ డైరెక్టర్ న్యూఢిల్లీ: మాజీ టీమ్ డైరెక్టర్ రవిశాస్త్రి భారత హెడ్ కోచ్ పదవికి దరఖాస్తు చేశారు. క్రికెట్ సలహా కమిటీ (సీఏసీ) సభ్యుడు సచిన్, కెప్టెన్ కోహ్లి అండదండలతో రవిశాస్త్రి ఇప్పుడు రేసులో ముందు వరుసలో ఉన్నారు. కోచ్ పదవికి శాస్త్రితో పాటు తాజాగా వెస్టిండీస్ మాజీ ఆల్‌రౌండర్ ఫిల్ సిమన్స్ కూడా దరఖాస్తు చేశారని బీసీసీఐ వర్గాలు ధ్రువీకరించాయి. ఇదివరకే టామ్ మూడీ, వీరేంద్ర సెహ్వాగ్, వెంకటేశ్ ప్రసాద్, రిచర్డ్ పైబస్, దొడ్డ గణేశ్, లాల్‌చంద్ రాజ్‌పుత్‌లు దరఖాస్తు చేసిన సంగతి తెలిసిందే. వీరిని గంగూలీ, సచిన్, లక్ష్మణ్‌లతో కూడి న సీఏసీ ఇంటర్వ్యూ చేయనుంది. ఇటీవల గంగూలీ మాట్లాడుతూ ఈ నెల 10న ఇంట ర్వ్యూలకు ఆహ్వానిస్తామని చెప్పారు. కెప్టెన్ కోహ్లితో విబేధాలు రావడంతో కోచ్ కుంబ్లే విండీస్ పర్యటనకు వెళ్లకుండా తన పదవికి రాజీనామా చేశారు.