రవిశాస్త్రి అధికారికంగా...
భారత హెడ్ కోచ్ పదవికి దరఖాస్తు చేసుకున్న మాజీ టీమ్ డైరెక్టర్
న్యూఢిల్లీ: మాజీ టీమ్ డైరెక్టర్ రవిశాస్త్రి భారత హెడ్ కోచ్ పదవికి దరఖాస్తు చేశారు. క్రికెట్ సలహా కమిటీ (సీఏసీ) సభ్యుడు సచిన్, కెప్టెన్ కోహ్లి అండదండలతో రవిశాస్త్రి ఇప్పుడు రేసులో ముందు వరుసలో ఉన్నారు. కోచ్ పదవికి శాస్త్రితో పాటు తాజాగా వెస్టిండీస్ మాజీ ఆల్‌రౌండర్ ఫిల్ సిమన్స్ కూడా దరఖాస్తు చేశారని బీసీసీఐ వర్గాలు ధ్రువీకరించాయి.
ఇదివరకే టామ్ మూడీ, వీరేంద్ర సెహ్వాగ్, వెంకటేశ్ ప్రసాద్, రిచర్డ్ పైబస్, దొడ్డ గణేశ్, లాల్‌చంద్ రాజ్‌పుత్‌లు దరఖాస్తు చేసిన సంగతి తెలిసిందే. వీరిని గంగూలీ, సచిన్, లక్ష్మణ్‌లతో కూడి న సీఏసీ ఇంటర్వ్యూ చేయనుంది. ఇటీవల గంగూలీ మాట్లాడుతూ ఈ నెల 10న ఇంట ర్వ్యూలకు ఆహ్వానిస్తామని చెప్పారు. కెప్టెన్ కోహ్లితో విబేధాలు రావడంతో కోచ్ కుంబ్లే విండీస్ పర్యటనకు వెళ్లకుండా తన పదవికి రాజీనామా చేశారు.