CAC
-
సెలక్షన్ కమిటీ చైర్మన్‌గా చేతన్ శర్మ
అహ్మదాబాద్: భారత క్రికెట్ సీనియర్ సెలక్షన్ కమిటీ చైర్మన్‌గా మాజీ పేస్ బౌలర్ చేతన్ శర్మ (నార్త్ జోన్) ఎంపికయ్యాడు. గురువారం జరిగిన బీసీసీఐ ఎజీఎంలో ఈ ఎంపికను ఖరారు చేశారు. చేతన్‌తో పాటు సెలక్షన్ కమిటీలో మాజీ పేసర్లు అబయ్ కురువిల్లా, దేవాశీష్ మొహంతి లకు కూడా అవకాశం దక్కింది. మదన్ లాల్, ఆర్పీ సింగ్, సులక్షణా నాయక్‌లు సభ్యులుగా ఉన్న క్రికెట్ సలహా కమిటీ (సీఏసీ) ఇంటర్వ్యూలు నిర్వహించి కొత్త సెలక్టర్లను ఎంపిక చేసింది. ఐదుగురు సభ్యుల సెలక్షన్ కమిటీలో ఇప్పటికే సునీల్ జోషి, హర్వీందర్ సింగ్ ఉన్నారు. కొత్తగా ఎంపికైన ముగ్గురు వీరితో జత కలుస్తారు. ఇప్పటి వరకు జోషి చైర్మన్‌గా వ్యవహరించినా... నిబంధనల ప్రకారం ఐదుగురిలో ఎక్కువ టెస్టులు ఆడిన చేతన్ శర్మ ఇకపై చీఫ్ సెలక్టర్ హోదాలో పని చేస్తాడు. వెస్ట్ జోన్‌నుంచి చివరి నిమిషం వరకు అజిత్ అగార్కర్ పేరు వినిపించినా... అనూహ్యంగా కురువిల్లాకు అవకాశం లభించింది. వీరితో పాటు సెలక్టర్ పదవి కోసం మణీందర్ సింగ్, నయన్ మోంగియా, శివసుందర్ దాస్, రణదేబ్ బోస్ తదితరులు దరఖాస్తు చేసుకున్నారు. ప్రస్తుతం సెలక్షన్ కమిటీలో ఐదుగురూ బౌలర్లే (నలుగురు పేస్, ఒకరు స్పిన్నర్) కావడం విశేషం! తొలి హ్యాట్రిక్‌తో... పదేళ్ల అంతర్జాతీయ కెరీర్లో చేతన్ శర్మ భారత్ తరఫున 23 టెస్టులు (61 వికెట్లు), 65 వన్డేలు (67 వికెట్లు) ఆడాడు. 1987 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌పై ‘హ్యాట్రిక్’ తీసిన చేతన్...ఈ రికార్డు సాధించిన తొలి భారత ఆటగాడిగా నిలిచాడు. అయితే అంతకు ముందు ఏడాది ఆస్ట్రలేసియా కప్ ఫైనల్లో అతని బౌలింగ్‌లో చివరి బంతికి మియాందాద్ సిక్సర్ బాది పాక్‌ను గెలిపించిన క్షణం చేతన్‌ను సుదీర్ఘ కాలం వెంటాడటంతో అతని ఘనతలకు తగిన గుర్తింపు దక్కలేదు. దేవాశీష్ మొహంతి భారత్ తరఫున 2 టెస్టులు (4 వికెట్లు), 45 వన్డేలు (57 వికెట్లు) ఆడగా... అబయ్ కురువిల్లా 10 టెస్టులు (25 వికెట్లు), 25 వన్డేల్లో (25 వికెట్లు) టీమిండియాకు ప్రాతినిధ్యం వహించాడు. -
మార్చి తొలి వారంలో బీసీసీఐ సెలక్టర్ల ఎంపిక
న్యూఢిల్లీ: బీసీసీఐ సెలక్షన్ కమిటీలో ఏర్పడిన రెండు ఖాళీలను ప్రస్తుతం జరుగుతోన్న భారత్–న్యూజిలాండ్ సిరీస్ ముగిసేలోపు భర్తీ చేస్తామని క్రికెట్ సలహా కమిటీ (సీఏసీ) సభ్యుడు మదన్‌లాల్ తెలిపారు. సెలక్టర్ల పదవి కోసం మొత్తం 44 మంది దరఖాస్తు చేసుకున్నారు. సెలక్షన్ కమిటీ చైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్, ప్యానెల్ సభ్యుడు గగన్ ఖోడాల పదవీ కాలం ముగియడంతో ఏర్పడిన ఖాళీలను భర్తీ చేసే బాధ్యతను బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ సీఏసీకి అప్పగించారు. -
త్వరలోనే కొత్త సీఏసీ: గంగూలీ
కోల్‌కతా: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ క్రికెట్ సలహా కమిటీ (సీఏసీ)ని భర్తీ చేసే పనిలో నిమగ్నమయ్యాడు. భారత జట్టును ఎంపిక చేసే సెలక్షన్ కమిటీని ఎంపిక చేయడమే ప్రస్తుతం సీఏసీ పని. ‘త్వరలోనే సీఏసీ సభ్యుల్ని నియమిస్తాం. ఇప్పటికే టీమిండియా హెడ్ కోచ్ ఎంపిక పూర్తి కావడంతో కొత్త కమిటీ సెలక్టర్లను మాత్రమే ఎంపిక చేస్తుంది’ అని అన్నాడు. ఇప్పటి వరకు పనిచేసిన సీఏసీ సభ్యులందరూ పరస్పర విరుద్ధ ప్రయోజనాల అంశంతో ముడిపడి పదవుల్ని వదులుకున్నారు. దిగ్గజ బ్యాటింగ్ త్రయం సచిన్, వీవీఎస్ లక్ష్మణ్, గంగూలీలతో కూడిన తొలి కమిటీ, ఆల్‌రౌండ్ దిగ్గజం కపిల్‌దేవ్ నేతృత్వంలోని రెండో కమిటీ విరుద్ధ ప్రయోజనాలతోనే తమ పదవులకు రాజీనామా చేశారు. ఐపీఎల్ వేలంపాటపై స్పందిస్తూ ‘ఆ్రస్టేలియా పేసర్ కమిన్స్ (రూ.15.5 కోట్లు)కు చాలా ఎక్కువ మొత్తం లభించిందనడం సరికాదు. ఎక్కడైనా డిమాండ్ బట్టే ధర ఉంటుంది. బెన్ స్టోక్స్ ఇది వరకే రూ.14.50 కోట్లు పలికాదు. కమిన్స్ ఇప్పుడు అతన్ని మించాడు అంతే’ అని గంగూలీ పేర్కొన్నాడు. శాంత రంగస్వామి వంతు! న్యూఢిల్లీ: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఎథిక్స్ ఆఫీసర్ డి.కె.జైన్ నుంచి నోటీసులు అందుకునే వంతు తాజాగా శాంత రంగస్వామికి వచి్చంది. భారత మహిళల జట్టు మాజీ సారథి అయిన ఆమె కపిల్‌దేవ్ నేతృత్వంలోని క్రికెట్ సలహా కమిటీ (సీఏసీ) సభ్యురాలిగా వ్యవహరించారు. ఈ కమిటీ భారత హెడ్ కోచ్‌గా రవిశాస్త్రిని కొనసాగించింది. అనంతరం పరస్పర విరుద్ధ ప్రయోజనాల సెగతో కపిల్, అన్షుమన్ గైక్వాడ్, శాంత రంగస్వామిలు తమ పదవులకు రాజీనామా చేశారు. ఇదివరకే కపిల్, గైక్వాడ్‌లు ఈ నెల 27, 28 తేదీల్లో ముంబైలో జరిగే విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేసిన డి.కె.జైన్ ఇపుడు ఆమెకు కూడా 28న జరిగే విచారణకు స్వయంగా హాజరు కావాలని నోటీసులు పంపారు. -
సీఏసీలోకి మళ్లీ సచిన్, లక్ష్మణ్!
కోల్‌కతా: గతంలో రద్దయిన క్రికెట్ సలహాదారుల కమిటీ (సీఏఏ)ని శనివారం మళ్లీ ఏర్పాటు చేయాలని బీసీసీఐ నిర్ణయించింది. భారత క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూ ల్కర్, వీవీఎస్ లక్ష్మణ్ మరోసారి ఇందులో సభ్యులుగా పునరాగమనం చేసే అవకాశం ఉందని సమాచారం. కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రస్ట్ కారణంగా ఈ కమిటీ నుంచి సచిన్, వీవీఎస్ ఇంతకు ముందు తప్పుకున్నారు. అయితే గంగూలీ బోర్డు అధ్యక్షుడైన నేపథ్యంలో సీఏసీ మళ్లీ సిద్ధమవుతోంది. ఆదివారం జరిగే బీసీసీఐ ఏజీఎంలో కొత్త సెలక్షన్ కమిటీని కూడా ప్రకటించనున్నారు. -
సీఏసీకి కపిల్ రాజీనామా
న్యూఢిల్లీ: భారత దిగ్గజ ఆల్‌రౌండర్ కపిల్ దేవ్ క్రికెట్ సలహా కమిటీ (సీఏసీ) చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. పరస్పర విరుద్ధ ప్రయోజనాల అంశంలోనే ఆయన కూడా వైదొలిగారు. ఈ ప్రయోజనాల బాటలో పదవిని వదులుకున్న నాలుగో క్రికెట్ దిగ్గజం కపిల్. ఇదివరకే గంగూలీ, సచిన్, లక్ష్మణ్‌లు తప్పుకున్నారు. ఆయన రాజీనామా నిజమేనని బోర్డు వర్గాలు ధ్రువీకరించాయి. క్రికెట్ పాలక కమిటీ (సీఓఏ) నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉందని బోర్డు వర్గాలు తెలిపాయి. కపిల్, అన్షుమన్ గైక్వాడ్‌లతో పాటు కమిటీలో ఉన్న శాంతా రంగస్వామి కూడా ఈ విరుద్ధ ప్రయోజనాలతోనే ఇటీవల రాజీనామా చేశారు. -
కపిల్‌దేవ్ సంచలన నిర్ణయం
న్యూఢిల్లీ: పరస్పర విరుద్ద ప్రయోజనాల అంశం మరోసారి ప్రకంపనలు సృష్టిస్తోంది. గతంలో సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్ వంటి దిగ్గజాలకు ఈ అంశంపై నోటీసులు రావడంతో అందరూ విమర్శల వర్షం కురిపించారు. తాజాగా బీసీసీఐ క్రికెట్ సలహా మండలి (సీఏసీ) సభ్యులకు కూడా ఆ వేడి తగిలింది. పరస్పర విరుద్ధ ప్రయోజనాల అంశమై అక్టోబర్ 10లోగా వివరణ ఇవ్వాలని దిగ్గజ ఆల్‌రౌండర్ కపిల్‌దేవ్ నేతృత్వంలోని క్రికెట్ సలహా మండలి (సీఏసీ)కి బీసీసీఐ నైతిక విలువల అధికారి జస్టిస్ డీకే జైన్ నోటీసులు పంపారు. ఇప్పటికే తనకు నోటీసులు రావడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన శాంత రంగస్వామి సీఏసీ నుంచి తప్పుకున్నారు. తాజాగా సీఏసీ నుంచి కపిల్‌దేవ్ కూడా తప్పుకుంటూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సీఏసీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు కపిల్ దేవ్ బుధవారం ప్రకటించారు. అయితే ఇందుకు గల కారణాలను వెల్లడించలేదు. కపిల్‌దేవ్ అత్యంత సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం పరస్పర విరుద్ద ప్రయోజనాల అంశంపై నోటీసుల రావడంతో కొంచెం ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా దీనిపై ఎవరికి సమాధానం చెప్పే ఇష్టం లేకనే తప్పుకుంటున్నట్లు సమాచారం. ఇక గత జులై నెలలో బీసీసీఐ ముగ్గురు సభ్యులతో కూడిన క్రికెట్ సలహా మండలిని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ బృందమే టీమిండియా హెడ్ కోచ్, సహాయ సిబ్బందిని ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఇక 'భారత క్రికెట్లో ఇదో కొత్త ఫ్యాషన్. విరుద్ద ప్రయోజనాల కింద నోటీసులు ఇవ్వడం.. వార్తల్లో నిలవడం. భగవంతుడే భారత క్రికెట్‌ను కాపాడాలి’ అంటూ మాజీ సారథి సౌరవ్ గంగూలీ బహిరంగంగా విమర్శించాడు. అంతేకాకుండా ప్రస్తుత పరిస్థితుల్లో ఇతర పదవులు, పనులు చేయకుండా కేవలం క్రికెట్ పాలనకు తగిన మాజీ ఆటగాళ్లను ఎంపిక చేయడం బీసీసీఐకి పెద్ద తలపోటుగా మారే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ అంశంపై మాజీ క్రికెటర్లు పెదవి విరుస్తున్న విషయం తెలిసిందే. కపిల్ వ్యాఖ్యాతగా, ఫ్లడ్‌లైట్ల సంస్థ అధిపతిగా, భారత క్రికెటర్ల సంఘం సభ్యుడి (ఐసీఏ)గా ఉన్నాడు. గైక్వాడ్ సొంత అకాడమీతో పాటు బీసీసీఐ అఫిలియేషన్ కమిటీలో సభ్యుడు. శాంత కూడా ఐసీఏ సభ్యురాలు. వీటిని పేర్కొంటూ మధ్యప్రదేశ్ క్రికెట్ సంఘం సభ్యుడు సంజీవ్ గుప్తా ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. -
సీఏసీ నుంచి తప్పుకున్న శాంత రంగస్వామి
న్యూఢిల్లీ: పరస్పర విరుద్ధ ప్రయోజనాల అంశమై అక్టోబర్ 10లోగా సమాధానం ఇవ్వాలంటూ నోటీసు రావడంతో భారత మహిళల క్రికెట్ జట్టు మాజీ కెపె్టన్ శాంత రంగస్వామి... క్రికెట్ సలహా మండలి (సీఏసీ), భారత క్రికెటర్ల సంఘం (ఐసీఏ) నుంచి ఆదివారం తప్పుకొన్నారు. దిగ్గజ ఆల్‌రౌండర్ కపిల్ దేవ్ నేతృత్వంలోని సీఏసీలో సభ్యురాలిగా ఉన్న శాంత... ఇటీవల టీమిండియా హెడ్ కోచ్‌గా రవిశాస్త్రి ఎంపికలో పాల్గొన్నారు. దీంతో ఆమె విరుద్ధ ప్రయోజనాల పరిధిలోకి వస్తారంటూ మధ్యప్రదేశ్ క్రికెట్ సంఘం సభ్యుడు సంజీవ్ గుప్తా బీసీసీఐ ఎథిక్స్ అధికారికి ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో పదవుల నుంచి శాంత వైదొలగారు. ‘నాకు వేరే ప్రణాళికలున్నాయి. వాటిపై దృష్టిపెట్టాలి. అయినా, సీఏసీ ఏడాదికో రెండేళ్లకో ఒకసారి సమావేశం అవుతుంది. ఇందులో విరుద్ధ ప్రయోజనాలు ఏమున్నాయో? సీఏసీలో సభ్యురాలిని కావడం గౌరవంగా భావిస్తున్నా. కానీ, ఇప్పుడున్న పరిస్థితుల్లో క్రికెట్ పాలనకు తగిన మాజీ ఆటగాళ్లను ఎంపిక చేయడం కష్టమేమో? ఐసీఏకు దాని ఎన్నికల కంటే ముందే రాజీనామా చేశా’ అని శాంత కాస్త తీవ్రంగా స్పందించారు. -
కోచ్ పదవిపై రవిశాస్త్రికి సరికొత్త తలనొప్పి
న్యూఢిల్లీ: టీమిండియా ప్రధాన కోచ్‌గా ఇటీవల నియమంచబడ్డ రవిశాస్త్రికి సరికొత్త తలనొప్పి వచ్చి పడింది. కపిల్‌దేవ్ నేతృత్వంలోని క్రికెట్ సలహా కమిటీ(సీఏసీ) రవిశాస్త్రిని కోచ్‌గా ఎంపిక చేయడమే ఇందుకు కారణం. వరుసగా రెండోసారి టీమిండియా హెడ్ కోచ్‌గా ఎంపికైన రవిశాస్త్రి పెద్దగా పోటీ లేకుండానే ఆ బాధ్యతను అందుకున్నాడు. ఇప్పటికే ‘పరస్పర విరుద్ధ ప్రయోజనాల’ నోటీసును సీఏసీ అందుకోవడంతో రవిశాస్త్రి మరోసారి వార్తల్లోకి వచ్చాడు. ఒకవేళ సీఏసీ సభ్యులు పరస్పర విరుద్ధ ప్రయోజనాల కిందకు వస్తే రవిశాస్త్రి నియామకం అనేది చెల్లదు. ఈ నేపథ్యంలో రవిశాస్త్రి నియామకం మరోసారి చర్చనీయాంశమైంది. కపిల్, అన్షుమన్ గ్వైక్వాడ్, శాంత రంగస్వామిలు పరస్పర విరుద్ధ ప్రయోజనాల అంశం కిందకు వస్తే మాత్రం రవిశాస్త్రి తన పదవిని కోల్పోవాల్సి వస్తుంది. రవిశాస్త్రిని కోచ్‌గా నియమించడానికి వారం రోజుల ముందుగానే అన్షుమన్ గ్వైక్వాడ్ తన అభిప్రాయాన్ని బాహబాటంగానే వెల్లడించాడు. రవిశాస్త్రిని తిరిగి కోచ్‌గా నియమిస్తే తప్పేముందనే విషయాన్ని స్పష్టం చేశాడు. భారత క్రికెట్ విజయాల్లో రవిశాస్త్రి పాత్ర ఎంతో ఉందంటూ మీడియా ముఖంగా కొనియాడాడు. ఇది అప్పట్లో దుమారమే రేపినా అసలు ఏం జరగబోతుందో అనే దానిపై మాజీలు నిరీక్షించారు. అయితే రవిశాస్త్రినే ప్రధాన కోచ్‌గా నియమించడంతో అది మరొకసారి హాట్ టాపిక్ అయ్యింది. శనివారం ఎథిక్స్ ఆఫీసర్ డీకే జైన్.. సీఏసీకి నోటీసులు ఇవ్వడంతో రవిశాస్త్రి నియామకంపై విపరీతమైన చర్చ నడుస్తోంది. అప్పట్లోనే భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌ను సీఏసీ ఎంపిక చేయడంపై పరిపాలన కమిటీ(సీఓఏ)లో భిన్న వాదనలు వినిపించాయి. సీఓఏ చీఫ్ వినోద్ రాయ్.. ప్రధాన కోచ్‌ను ఎంపిక చేసే అర్హత కపిల్ బృందానికి ఉందని చెప్పగా, ఆ కమిటిలోని సభ్యురాలు డానియా ఎడ్జుల్లీ మాత్రం దాంతో విభేదించారు. ఇది బీసీసీఐ రాజ్యాంగం ప్రకారం చెల్లదని తేల్చిచెప్పారు. చివరకు అనేక ట్విస్టుల మధ్య సీఏసీనే ప్రధాన కోచ్ ఎంపికను చేపట్టింది. కాగా, డీకే జైన్ ఎథిక్స్ ఆఫీసర్‌గా నియామకం జరిగిన తర్వాత కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్‌లకు నోటీసులు అందుకున్నారు. ఇప్పుడు సీఏసీని టార్గెట్ చేయడంతో అది కాస్తా రవిశాస్త్రి నియామకంపై పడింది. పరస్పర విరుద్ధ ప్రయోజనాలు నోటీసుతో అలిగిన సీఏసీ సభ్యురాలు శాంత రంగస్వామి ఇప్పటికే తన పదవికీ రాజీనామా చేయడం కూడా ఆసక్తిని రేపుతోంది. మరి భారత క్రికెట్లో కొత్త పరిణామాలు ఏమైనా చోటు చేసుకుంటాయా.. లేదా అనేది తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే. సీఏసీ సభ్యులు అక్టోబర్ 10లోగా తమ నివేదికను సమర్పించిన తర్వాత కానీ రవిశాస్త్రి నియామకం ఎంత పారదర్శకంగా జరిగిందనేది తెలియదు. -
ఈ సీఏసీ పదవి నాకొద్దు..!
న్యూఢిల్లీ: పరస్పర విరుద్ధ ప్రయోజనాల అంశమై అక్టోబర్ 10లోగా వివరణ ఇవ్వాలని దిగ్గజ ఆల్‌రౌండర్ కపిల్ దేవ్ నేతృత్వంలోని క్రికెట్ సలహా మండలి (సీఏసీ)కి బీసీసీఐ నైతిక విలువల అధికారి జస్టిస్ డీకే జైన్ శనివారం నోటీసు పంపిన సంగతి తెలిసిందే. కపిల్ ఆధ్వర్యంలో అన్షుమన్ గైక్వాడ్, శాంత రంగస్వామి సభ్యులుగా ఉన్న సీఏసీకి డీకే జైన్ నోటీసులు పంపారు. దీనిపై అలిగిన శాంతా రంగస్వామి.. సీఏసీ పదవికి రాజీనామా చేశారు. దాంతోపాటు భారత క్రికెటర్స్ అసోసియేషన్‌కు డైరెక్టర్ పదవి కూడా ఆమె రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం శాంతా రంగస్వామి మాట్లాడుతూ.. ‘ సీఏసీ సమావేశం అనేది ఏడాదికి ఒకసారో, రెండేళ్లకు ఒకసారో జరుగుతుంది. మరి దీనికి పరస్పర విరుద్ధ ప్రయోజనాల అంశాన్ని ముడిపెట్టడం ఏమిటి. నాకైతే ఏమీ అర్థం కాలేదు. అందుచేత ఈ నిర్ణయం తీసుకున్నా’ అని తెలిపారు. కాగా, సీఏసీలో తనను చేర్చుకోవడాన్ని గొప్ప గౌరవం భావిస్తున్నానని, తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించినట్లే అనుకుంటున్నానని పేర్కొన్నారు. ఇదొక చాలా కఠినతరమైన పదవి అని ఆమె తెలిపారు. ఇటీవల కపిల్ నేతృత్వంలోని సీఏసీ కమిటీ.. భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌గా రవిశాస్త్రిని నియమించింది. ఆ క్రమంలోనే ఇందులో సభ్యులుగా ఉన్నవారు పరస్పర విరుద్ధ ప్రయోజనాల కిందకు వస్తారనే వాదన వినిపించింది. దాంతో తాజాగా డీకే జైన్.. సీఏసీకి నోటీసులు పంపడంతో శాంతా రంగస్వామి కలత చెందారు. ఈ నేపథ్యంలోనే తన సభ్యత్వానికి రాజీనామా చేశారు.(ఇక్కడ చదవండి: కపిల్ ‘సీఏసీ’కి నోటీసు) -
కపిల్ ‘సీఏసీ’కి నోటీసు
న్యూఢిల్లీ: పరస్పర విరుద్ధ ప్రయోజనాల అంశమై అక్టోబర్ 10లోగా వివరణ ఇవ్వాలని దిగ్గజ ఆల్‌రౌండర్ కపిల్ దేవ్ నేతృత్వంలోని క్రికెట్ సలహా మండలి (సీఏసీ)కి బీసీసీఐ నైతిక విలువల అధికారి జస్టిస్ డీకే జైన్ శనివారం నోటీసు పంపారు. కపిల్ ఆధ్వర్యంలో అన్షుమన్ గైక్వాడ్, శాంత రంగస్వామి సభ్యులుగా ఉన్న సీఏసీ... ఇటీవల టీమిండియా ప్రధాన కోచ్‌గా రవిశాస్త్రిని ఎంపిక చేíసింది. కపిల్ వ్యాఖ్యాతగా, ఫ్లడ్‌లైట్ల సంస్థ అధిపతిగా, భారత క్రికెటర్ల సంఘం సభ్యుడి (ఐసీఏ)గా ఉన్నాడు. గైక్వాడ్ సొంత అకాడమీతో పాటు బీసీసీఐ అఫిలియేషన్ కమిటీలో సభ్యుడు. శాంత కూడా ఐసీఏ సభ్యురాలు. వీటిని పేర్కొంటూ మధ్యప్రదేశ్ క్రికెట్ సంఘం సభ్యుడు సంజీవ్ గుప్తా ఫిర్యాదు చేశాడు. -
కోచ్ ఎంపికలో థర్డ్ అంపైర్?
న్యూఢిల్లీ: ఇప్పటివరకూ థర్డ్ అంపైర్‌ను ఆన్ ఫీల్డ్‌లోనే చూశాం. అయితే టీమిండియా ప్రధాన కోచ్ ఎంపికలో థర్డ్ అంపైర్ పాత్ర ఉంటుందనే వార్తలు వస్తున్నాయి. అసలు కోచ్ ఎంపికలో థర్డ్ అంపైర్ ఏమిటా అనుకుంటాన్నారా?.. ప్రధాన కోచ్‌ను ఎంపిక చేసే బాధ్యతను కపిల్‌దేవ్ నేతృత్వంలోని క్రికెట్ సలహా కమిటీ(సీఏసీ)కి అప్పగించిన విషయం తెలిసిందే. అదే సమయంలో ముగ్గురు రు సభ్యులతో కూడి సీఏసీ బృందం ఒక నివేదకను కూడా సమర్పించింది. తాము ఎటువంటి వేరే క్రికెట్ వ్యవహారాల్లో జోక్యం లేదని విషయాన్ని అందులో స్పష్టం చేసింది. దీనికి సుప్రీంకోర్టు నేతృత్వంలో ఏర్పాటైన క్రికెట్ పరిపాలన కమిటీ(సీఓఏ) కూడా సంతృప్తి వ్యక్తం చేసింది. వారు ముగ్గురు సమర్పించిన నివేదకతో సీఓఏ చీఫ్ వినోద్ రాయ్ ఏకీభవించారు. అయితే వీరు పరస్పర విరుద్ధ ప్రయోజనాల అంశం కిందకు వస్తారంటూ సీఓఏ సభ్యురాలైన డయానా ఎడ్జుల్లీ విన్నవిస్తు వస్తున్నారు. ఈ క్రమంలోనే సోమవారం జరిగిన సమావేశంలో కూడా ఎడ్జుల్లీ ఇదే పునరావృతం చేశాడు కూడా. దాంతో థర్డ్ అంపైర్ పాత్రను తెరపైకి తీసుకొచ్చారు. కపిల్ కమిటేనే ఇంటర్యూలు చేసి కోచ్‌ను ఎంపిక చేసినప్పటికీ ఎథిక్ ఆఫీసర్ వారి సూచించిన దానిని మరోసారి పర్యవేక్షిస్తారన్నమాట. అంటే కపిల్, అన్షుమన్ గైక్వాడ్, శాంతా రామస్వామిలకు ఏకగ్రీవంగా తమ నిర్ణయాన్ని చెప్పే అధికారం ఉండదు. ఒకవేళ అదే జరిగితే కపిల్ కమిటీ కోచ్‌ను ఎంపిక చేసిన తర్వాత ఎథిక్ ఆఫీసర్ థర్డ్ అంపైర్ పాత్ర పోషించే అవకాశం ఉంది. వచ్చే వారంలో టీమిండియా ప్రధాన కోచ్‌తో పాటు సపోర్టింగ్ స్టాప్ ఎంపిక ప్రక్రియ ఆరంభం కానున్నట్లు వినోద్ రాయ్ పేర్కొన్నారు. ఆగస్టు, 13, 14 తేదీల్లో ఇంటర్యూలో ఉంటాయని ఆయన పేర్కొన్నారు. కోచ్‌ల ఎంపికను కపిల్ కమిటీనే నిర్ణయిస్తుందన్నారు. పరస్పర విరుద్ధ ప్రయోజనాల అంశానికి సంబంధించి సీఏసీ సభ్యులు ఇచ్చిన నివేదకతో తాము సంతృప్తి చెందామన్నారు. టీమిండియా కోచ్ కోసం వచ్చిన దరఖాస్తులను బీసీసీఐ షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత ఎంపిక ప్రక్రియ ఉంటుందన్నారు. ఇందుకు మరికొన్ని రోజుల సమయం పట్టనుందన్నారు. మరి కపిల్ కమిటీ ప్రధాన కోచ్‌ను ఎంపిక చేసిన తర్వాత దాన్ని ఎథిక్స్ కమిటీకి అప్పగిస్తారా.. లేదా అనేది చూడాల్సి ఉంది. -
'సరైన వ్యక్తినే కోచ్‌గా ఎంపిక చేశారు'
న్యూఢిల్లీ:భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌గా రవిశాస్త్రిని ఎంపిక చేయడంపై బీసీసీఐ పాలకుల కమిటీ(సీవోఏ) హర్షం వ్యక్తం చేసింది. సరైన వ్యక్తిని కోచ్ గా ఎంపిక చేశారంటూ పేర్కొన్న సీవోఏ.. దానికి కారణమైన సౌరవ్ గంగూలీ, సచిన్ టెండూల్కర్, వీవీఎస్ లక్ష్మణ్‌లతో కూడిన బీసీసీఐ అడ్వైజరీ కమిటీ(సీఏసీ)ని అభినందించింది. 'కోచ్ ను ఎంపిక చేసే క్రమంలో సీఏసీ సభ్యులు నిబద్ధతతో పని చేశారు. ఏది ఆశించామో అదే చేసి చూపించారు. రవిశాస్త్రి కోచ్ గా సరైన వ్యక్తి అనడంలో ఎటువంటి సందేహం లేదు' అని ఓ ప్రకటనలో సీవోఏ అభిప్రాయపడింది. ప్రస్తుతం వచ్చిన కోచ్ తో భారత జట్టు ఆశించిన ఫలితాల్ని సాధిస్తుందని పేర్కొంది. ఈ కొత్త కాంబినేషన్ తో భారత జట్టు నంబర్ వన్ జట్టుగా నిలవడం ఖాయమని సీవోఏ జోస్యం చెప్పింది. -
సశేషం!
♦ భారత కోచ్ పేరును ప్రకటించని బీసీసీఐ ♦ ఇంటర్వ్యూలు నిర్వహించిన సీఏసీ ♦ కోచ్ లేకుండానే లంక టూర్‌కు! భారత క్రికెట్‌కు సంబంధించిన ఒక కీలక అంకం ముగిసింది. కొత్త కోచ్ ఎంపిక కోసం జరిగిన ఇంటర్వ్యూలకు ఐదుగురు హాజరు కాగా, వారిలో ఎవరికి పదవీ యోగం దక్కుతుందో తేలేందుకు మరికొంత సమయం పట్టనుంది. క్రికెట్ సలహా కమిటీ (సీఏసీ) ఈ విషయంలో ఎలాంటి తొందరపాటును ప్రదర్శించడం లేదు. అనిల్ కుంబ్లేతో సాగిన వివాదం నేపథ్యంలో కోహ్లితో కూడా ‘ఒక మాట’ మాట్లాడిన తర్వాతే కోచ్ పేరును ప్రకటించవచ్చు. ఈ నేపథ్యంలో శ్రీలంక పర్యటనకు కూడా కోచ్ లేకుండా భారత జట్టు వెళ్లే అవకాశం ఉంది. ముంబై: భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ ఎంపికపై సస్పెన్స్ ఇంకా కొనసాగుతోంది. ఐదుగురు అభ్యర్థులను ఇంటర్వ్యూ చేసిన తర్వాత కూడా క్రికెట్ సలహా కమిటీ (సీఏసీ) తుది నిర్ణయం తీసుకోలేకపోయింది. ప్రస్తుతానికి తాము కోచ్ పేరును ప్రకటించడం లేదని, దీనిపై మరింత చర్చ జరగాల్సి ఉందని సీఏసీ సభ్యుడు సౌరవ్ గంగూలీ స్పష్టం చేశారు. సోమవారం గంగూలీతో పాటు వీవీఎస్ లక్ష్మణ్, సచిన్ టెండూల్కర్ (లండన్ నుంచి స్కైప్ ద్వారా) ఇంటర్వ్యూలు నిర్వహించారు. ‘కోచ్ పేరును ఇప్పుడే ప్రకటించడం లేదు. కొన్ని రోజుల సమయం ఇంకా అవసరం ఉంది కాబట్టి ప్రస్తుతానికి వాయిదా వేస్తున్నాం. ఎంపికకు తొందరేమీ లేదని మా అభిప్రాయం. ఈసారి ఎవరి పేరును ప్రకటించినా వారు 2019 వరల్డ్ కప్ వరకు కొనసాగుతారు’ అని గంగూలీ స్పష్టం చేశారు. అంతా అప్పటిలాగే... సీఏసీ నిర్వహించిన ఇంటర్వ్యూలకు ఐదుగురు అభ్యర్థులు హాజరయ్యారు. రవిశాస్త్రి, వీరేంద్ర సెహ్వాగ్, లాల్‌చంద్ రాజ్‌పుత్ (భారత్), టామ్ మూడీ (ఆస్ట్రేలియా), రిచర్డ్ పైబస్ (దక్షిణాఫ్రికా)లు తమ శిక్షణ, ప్రణాళికల గురించి వివరించారు. మరో అభ్యర్థి ఫిల్ సిమన్స్ (విండీస్) మాత్రం ఇంటర్వ్యూకు రాలేదు. సెహ్వాగ్ ఇంటర్వ్యూ రెండు గంటలకు పైగా సాగింది. అభ్యర్థుల ప్రజెంటేషన్ విషయంలో అంతా గత ఏడాది తరహాలోనే సాగిందని గంగూలీ చెప్పారు. ‘భారత క్రికెట్ భవిష్యత్తు గురించి అభ్యర్థులు చెప్పిన విషయాలు, ఆలోచనలు గతంలో చూసినవే. నేను గానీ బోర్డు కార్యదర్శి లేదా సీఈఓ గానీ మ్యాచ్ బరిలోకి దిగేవాళ్లం కాదు. అందరికంటే ఆటగాళ్లు ముఖ్యం. వారికి సహాయక సిబ్బంది అండగా ఉంటారు. అయితే అందరి ఆలోచనలు, అభిప్రాయాలు ఒకేలా ఉంటే బాగుంటుంది. భారత క్రికెట్ మేలు గురించి ఆలోచించే ఏ నిర్ణయమైనా తీసుకుంటాం’ అని ఈ మాజీ కెప్టెన్ అన్నారు. కోహ్లితో చర్చించిన తర్వాతే... కోచ్ పేరును ప్రకటించే ముందు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లితో కచ్చితంగా చర్చిస్తామని గంగూలీ వెల్లడించారు. అయితే ఇప్పటి వరకు మాత్రం కోహ్లి తమ పనిలో కలగజేసుకోలేదని, కోచ్‌గా ఎవరు ఉండాలనే పేరును కూడా సూచించలేదని ఆయన అన్నారు. ‘కోచ్ ఎవరితో కలిసి పని చేయాల్సి ఉంటుందో అలాంటి వారితో మాట్లాడటం కూడా చాలా అవసరం. అతను 2019 ప్రపంచ కప్ వరకు ఉండాల్సి ఉంటుంది. ఆరు నెలల తర్వాత అభిప్రాయ భేదాలు రాకూడదు కదా. ఎంపికతో మా పాత్ర ముగిసిపోతుంది కానీ జట్టును ముందుకు నడిపించాల్సింది కెప్టెన్, కోచ్, ఆటగాళ్లు మాత్రమే’ అని ‘దాదా’ చెప్పారు. అలాగే ‘కోచ్‌లు ఎలా పని చేస్తారో కూడా కోహ్లి అర్థం చేసుకోవాల్సి ఉంటుంది’ అంటూ పరోక్షంగా చురక కూడా అంటించారు. కోహ్లి ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నాడు. అతను ఈ నెల 17న భారత్‌కు తిరిగి వచ్చే అవకాశం ఉంది. శాస్త్రికి కష్టమేనా? ఇంటర్వ్యూకు ముందు వరకు కూడా రవిశాస్త్రి కోచ్‌గా ఎంపికవుతారని అందరూ భావిస్తూ వచ్చారు. అయితే అంతర్గత సమాచారం ప్రకారం ఇంటర్వ్యూలు ముగిశాక రవిశాస్త్రికి మరీ అనుకూల వాతావరణం ఏమీ లేదు. అసలు కోచ్ పేరును నేరుగా ప్రకటించకుండా కోహ్లిని భాగస్వామిగా చేయడంలోనే సీఏసీ చాలా తెలివిగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. ఇది పూర్తిగా తమ నిర్ణయం కాదని, రేపు కుంబ్లే తరహాలో ఏదైనా జరిగితే కోహ్లిదే బాధ్యత అని కమిటీ చెప్పకనే చెప్పింది. బీసీసీఐలోని ఒక వర్గం చెబుతున్న ప్రకారం... కోహ్లి ముందు సీఏసీ రెండు ప్రత్యామ్నాయాలు ఉంచి అందులో ఒకరిని ఎంపిక చేసుకోమని కోరుతున్నట్లు సమాచారం. అయితే అందులో శాస్త్రి పేరు కాకుండా సెహ్వాగ్, టామ్ మూడీ పేర్లు ఉన్నాయని వారు అంటున్నారు! -
రవిశాస్త్రి అధికారికంగా...
భారత హెడ్ కోచ్ పదవికి దరఖాస్తు చేసుకున్న మాజీ టీమ్ డైరెక్టర్ న్యూఢిల్లీ: మాజీ టీమ్ డైరెక్టర్ రవిశాస్త్రి భారత హెడ్ కోచ్ పదవికి దరఖాస్తు చేశారు. క్రికెట్ సలహా కమిటీ (సీఏసీ) సభ్యుడు సచిన్, కెప్టెన్ కోహ్లి అండదండలతో రవిశాస్త్రి ఇప్పుడు రేసులో ముందు వరుసలో ఉన్నారు. కోచ్ పదవికి శాస్త్రితో పాటు తాజాగా వెస్టిండీస్ మాజీ ఆల్‌రౌండర్ ఫిల్ సిమన్స్ కూడా దరఖాస్తు చేశారని బీసీసీఐ వర్గాలు ధ్రువీకరించాయి. ఇదివరకే టామ్ మూడీ, వీరేంద్ర సెహ్వాగ్, వెంకటేశ్ ప్రసాద్, రిచర్డ్ పైబస్, దొడ్డ గణేశ్, లాల్‌చంద్ రాజ్‌పుత్‌లు దరఖాస్తు చేసిన సంగతి తెలిసిందే. వీరిని గంగూలీ, సచిన్, లక్ష్మణ్‌లతో కూడి న సీఏసీ ఇంటర్వ్యూ చేయనుంది. ఇటీవల గంగూలీ మాట్లాడుతూ ఈ నెల 10న ఇంట ర్వ్యూలకు ఆహ్వానిస్తామని చెప్పారు. కెప్టెన్ కోహ్లితో విబేధాలు రావడంతో కోచ్ కుంబ్లే విండీస్ పర్యటనకు వెళ్లకుండా తన పదవికి రాజీనామా చేశారు. -
కోహ్లి.. సర్దుకుపోతేనే మంచిది!
న్యూఢిల్లీ:భారత క్రికెట్ జట్టు కోచ్ పదవికి దరఖాస్తులు ఆహ్వానిస్తూ ఇటీవల బీసీసీఐ ప్రకటన విడుదల చేసినప్పటికీ, ప్రస్తుతానికి కోచ్ ను మార్చే యోచనలో లేనట్లే కనబడుతోంది. చాంపియన్స్ ట్రోఫీ తరువాత భారత క్రికెట్ జట్టుకు కొత్త కోచ్ వస్తాడని ఆశించినా, కొంతకాలం పాటు అనిల్ కుంబ్లేనే ఆ పదవిలో కొనసాగించాలని బోర్డు చూస్తోంది. దీనిలో భాగంగానే ఈ నెల చివర్లో వెస్టిండీస్ పర్యటనకు వెళ్లే భారత జట్టుకు కుంబ్లేనే కోచ్ గా ఉండనున్నాడు. భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లితో విభేదాల కారణంగానే కుంబ్లే పదవి పొడిగింపుపై పెద్దగా ఆసక్తికనబరచని బీసీసీఐ.. ఆ మేరకు కోచ్ పదవికి ఆప్లికేషన్స్ ను కూడా ఆహ్వానించింది. అయితే మరికొంత కాలం కుంబ్లే కొనసాగింపుకు బీసీసీఐ మొగ్గుచూపుతోంది. దీనిలో భాగంగా కోహ్లిని సముదాయించినట్లు తెలుస్తోంది. 'చాంపియన్స్ ట్రోఫీ ముగిసిన వెంటనే కొత్త కోచ్ ను నియమించాలని బీసీసీఐ క్రికెట్ సలహాదారుల కమిటీ (సీఏసీ) భావించడం లేదు. వెస్టిండీస్ పర్యటనకు కుంబ్లే వెళ్లనున్నాడు. అది చిన్న పర్యటన కావడంతో ఎటువంటి ఇబ్బంది ఉండదు. కుంబ్లే కొనసాగింపుపై బీసీసీఐ సీఈవోకు సీఏసీ ఇప్పటికే స్పష్టం చేసింది. మరొకవైపు కుంబ్లే-కోహ్లిలతో కూడా సమావేశమైంది. ఆ సమయంలోనే కుంబ్లేతో సర్దుకోవాలని కోహ్లికి ముగ్గురు సభ్యులతో కూడిన సీఏసీ తెలిపింది' అని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. -
భారత కోచ్ కోసం రేపు ఇంటర్య్వూలు!
కోల్‌కతా:భారత క్రికెట్ జట్టు చీఫ్ కోచ్‌ను ఎంపిక చేయడానికి సచిన్, గంగూలీ, లక్ష్మణ్ లతో కూడిన క్రికెట్ అడ్వైజరీ కమిటీ (సీఏసీ) బృందం సన్నద్ధమయ్యింది. కోచ్ అభ్యర్ధిత్వానికి పోటీ పడుతున్నవారిని సీఏసీ త్రయం మంగళవారం ఇంటర్య్వూ చేయనుంది. టీమిండియా ప్రధాన కోచ్ రేసులో భాగంగా షార్ట్ లిస్ట్ చేసిన 21 మంది సభ్యులు మాత్రమే ఇంటర్య్వూకు హాజరుకానున్నట్లు బీసీసీఐ తెలిపింది. ఒకవేళ కోచ్ రేసులో ఉన్న అభ్యర్థులు నేరుగా ఇంటర్య్వూకు హాజరు కాని పక్షంలో వారికి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆ ప్రక్రియను నిర్వహిస్తారు. దీన్ని బీసీసీఐ మాజీ సెక్రటరీ సంజయ్ జగ్దాలే చీఫ్ కో ఆర్డినేటర్‌గా వ్యవహరిస్తున్న కమిటీ పర్యవేక్షిస్తుంది. ఈ ప్రక్రియను ఒక రోజులోనే ముగించి మరుసటి రోజు తుది నివేదికను అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ అందజేసే అవకాశం ఉంది. టీమిండియా కోచ్ పదవికి 51 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ జాబితాను షార్ట్ లిస్ట్ చేసి 21కు తగ్గించారు.