భారత కోచ్ కోసం రేపు ఇంటర్య్వూలు!
కోల్కతా:భారత క్రికెట్ జట్టు చీఫ్ కోచ్‌ను ఎంపిక చేయడానికి సచిన్, గంగూలీ, లక్ష్మణ్ లతో కూడిన క్రికెట్ అడ్వైజరీ కమిటీ (సీఏసీ) బృందం సన్నద్ధమయ్యింది. కోచ్ అభ్యర్ధిత్వానికి పోటీ పడుతున్నవారిని సీఏసీ త్రయం మంగళవారం ఇంటర్య్వూ చేయనుంది. టీమిండియా ప్రధాన కోచ్ రేసులో భాగంగా షార్ట్ లిస్ట్ చేసిన 21 మంది సభ్యులు మాత్రమే ఇంటర్య్వూకు హాజరుకానున్నట్లు బీసీసీఐ తెలిపింది.
ఒకవేళ కోచ్ రేసులో ఉన్న అభ్యర్థులు నేరుగా ఇంటర్య్వూకు హాజరు కాని పక్షంలో వారికి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆ ప్రక్రియను నిర్వహిస్తారు. దీన్ని బీసీసీఐ మాజీ సెక్రటరీ సంజయ్ జగ్దాలే చీఫ్ కో ఆర్డినేటర్‌గా వ్యవహరిస్తున్న కమిటీ పర్యవేక్షిస్తుంది. ఈ ప్రక్రియను ఒక రోజులోనే ముగించి మరుసటి రోజు తుది నివేదికను అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ అందజేసే అవకాశం ఉంది. టీమిండియా కోచ్ పదవికి 51 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ జాబితాను షార్ట్ లిస్ట్ చేసి 21కు తగ్గించారు.