సౌరవ్ గంగూలీ
కోల్‌కతా: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ క్రికెట్ సలహా కమిటీ (సీఏసీ)ని భర్తీ చేసే పనిలో నిమగ్నమయ్యాడు. భారత జట్టును ఎంపిక చేసే సెలక్షన్ కమిటీని ఎంపిక చేయడమే ప్రస్తుతం సీఏసీ పని. ‘త్వరలోనే సీఏసీ సభ్యుల్ని నియమిస్తాం. ఇప్పటికే టీమిండియా హెడ్ కోచ్ ఎంపిక పూర్తి కావడంతో కొత్త కమిటీ సెలక్టర్‌లను మాత్రమే ఎంపిక చేస్తుంది’ అని అన్నాడు. ఇప్పటి వరకు పనిచేసిన సీఏసీ సభ్యులందరూ పరస్పర విరుద్ధ ప్రయోజనాల అంశంతో ముడిపడి పదవుల్ని వదులుకున్నారు. దిగ్గజ బ్యాటింగ్ త్రయం సచిన్, వీవీఎస్ లక్ష్మణ్, గంగూలీలతో కూడిన తొలి కమిటీ, ఆల్‌రౌండ్ దిగ్గజం కపిల్‌దేవ్ నేతృత్వంలోని రెండో కమిటీ విరుద్ధ ప్రయోజనాలతోనే తమ పదవులకు రాజీనామా చేశారు. ఐపీఎల్ వేలంపాటపై స్పందిస్తూ ‘ఆ్రస్టేలియా పేసర్ కమిన్స్ (రూ.15.5 కోట్లు)కు చాలా ఎక్కువ మొత్తం లభించిందనడం సరికాదు. ఎక్కడైనా డిమాండ్ బట్టే ధర ఉంటుంది. బెన్ స్టోక్స్ ఇది వరకే రూ.14.50 కోట్లు పలికాదు. కమిన్స్ ఇప్పుడు అతన్ని మించాడు అంతే’ అని గంగూలీ పేర్కొన్నాడు.
శాంత రంగస్వామి వంతు!
న్యూఢిల్లీ: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఎథిక్స్ ఆఫీసర్ డి.కె.జైన్ నుంచి నోటీసులు అందుకునే వంతు తాజాగా శాంత రంగస్వామికి వచి్చంది. భారత మహిళల జట్టు మాజీ సారథి అయిన ఆమె కపిల్‌దేవ్ నేతృత్వంలోని క్రికెట్ సలహా కమిటీ (సీఏసీ) సభ్యురాలిగా వ్యవహరించారు. ఈ కమిటీ భారత హెడ్ కోచ్‌గా రవిశాస్త్రిని కొనసాగించింది. అనంతరం పరస్పర విరుద్ధ ప్రయోజనాల సెగతో కపిల్, అన్షుమన్ గైక్వాడ్, శాంత రంగస్వామిలు తమ పదవులకు రాజీనామా చేశారు. ఇదివరకే కపిల్, గైక్వాడ్‌లు ఈ నెల 27, 28 తేదీల్లో ముంబైలో జరిగే విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేసిన డి.కె.జైన్ ఇపుడు ఆమెకు కూడా 28న జరిగే విచారణకు స్వయంగా హాజరు కావాలని నోటీసులు పంపారు.
Comments
Please login to add a commentAdd a comment