'సరైన వ్యక్తినే కోచ్గా ఎంపిక చేశారు'
న్యూఢిల్లీ:భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్గా రవిశాస్త్రిని ఎంపిక చేయడంపై బీసీసీఐ పాలకుల కమిటీ(సీవోఏ) హర్షం వ్యక్తం చేసింది. సరైన వ్యక్తిని కోచ్ గా ఎంపిక చేశారంటూ పేర్కొన్న సీవోఏ.. దానికి కారణమైన సౌరవ్ గంగూలీ, సచిన్ టెండూల్కర్, వీవీఎస్ లక్ష్మణ్లతో కూడిన బీసీసీఐ అడ్వైజరీ కమిటీ(సీఏసీ)ని అభినందించింది.
'కోచ్ ను ఎంపిక చేసే క్రమంలో సీఏసీ సభ్యులు నిబద్ధతతో పని చేశారు. ఏది ఆశించామో అదే చేసి చూపించారు. రవిశాస్త్రి కోచ్ గా సరైన వ్యక్తి అనడంలో ఎటువంటి సందేహం లేదు' అని ఓ ప్రకటనలో సీవోఏ అభిప్రాయపడింది. ప్రస్తుతం వచ్చిన కోచ్ తో భారత జట్టు ఆశించిన ఫలితాల్ని సాధిస్తుందని పేర్కొంది. ఈ కొత్త కాంబినేషన్ తో భారత జట్టు నంబర్ వన్ జట్టుగా నిలవడం ఖాయమని సీవోఏ జోస్యం చెప్పింది.