![New Selection Panel To Be Revealed In The First Week Of March - Sakshi](/styles/webp/s3/article_images/2020/02/18/bcci_4.jpg.webp?itok=67VQ171T)
న్యూఢిల్లీ: బీసీసీఐ సెలక్షన్ కమిటీలో ఏర్పడిన రెండు ఖాళీలను ప్రస్తుతం జరుగుతోన్న భారత్–న్యూజిలాండ్ సిరీస్ ముగిసేలోపు భర్తీ చేస్తామని క్రికెట్ సలహా కమిటీ (సీఏసీ) సభ్యుడు మదన్‌లాల్ తెలిపారు. సెలక్టర్ల పదవి కోసం మొత్తం 44 మంది దరఖాస్తు చేసుకున్నారు. సెలక్షన్ కమిటీ చైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్, ప్యానెల్ సభ్యుడు గగన్ ఖోడాల పదవీ కాలం ముగియడంతో ఏర్పడిన ఖాళీలను భర్తీ చేసే బాధ్యతను బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ సీఏసీకి అప్పగించారు.
Comments
Please login to add a commentAdd a comment