captain Kohli
-
‘నైకీ’ నచ్చడం లేదు!
∙ టీమ్ కిట్‌పై భారత ఆటగాళ్ల ఫిర్యాదు ∙ కొత్త దుస్తులు పంపించిన నైకీ ముంబై: మైదానంలో అద్భుతమైన ఆటతో చెలరేగిపోతున్న భారత క్రికెట్ జట్టు ఇప్పుడు తమకు సంబంధించిన ఒక కొత్త ఫిర్యాదును ముందుకు తెచ్చింది. అధికారిక అపెరల్ పార్ట్నర్ ‘నైకీ’ తమకు అందజేస్తున్న కిట్లపై ఆటగాళ్లు అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. ప్రపంచంలోనే అత్యుత్తమ స్పోర్టింగ్ బ్రాండ్‌గా అగ్రస్థానంలో ఉన్న ‘నైకీ’ 2006 నుంచి భారత క్రికెట్ టీమ్‌కు భాగస్వామిగా వ్యవహరిస్తోంది. గత కొన్ని నెలలుగా వివిధ మ్యాచ్‌లలో తాము ధరిస్తున్న జెర్సీలు ‘నాసిరకంగా’ ఉన్నాయని కెప్టెన్ కోహ్లి సహా ఇతర ఆటగాళ్లు బీసీసీఐకి తెలియజేశారు. భారత క్రికెట్ జట్టుతో 2020 సెప్టెంబర్ వరకు కాంట్రాక్ట్ ఉన్న ‘నైకీ’... అందుకోసం గత ఏడాది బోర్డుకు రూ. 370 కోట్లు చెల్లించింది. మొత్తంగా తమ బ్రాండ్‌ను ధరిస్తున్నందుకు కాంట్రాక్ట్ అమల్లో ఉన్న సమయంలో జరిగే ఒక్కో అంతర్జాతీయ మ్యాచ్‌కు నైకీ దాదాపుగా రూ. 87 లక్షల 34 వేలు బీసీసీఐకి చెల్లిస్తోంది. భారత ఆటగాళ్ల ఫిర్యాదు గురించి తెలుసుకున్న ‘నైకీ’ వెంటనే స్పందించింది. తమ బ్రాండ్‌కు చెందిన కొత్త జెర్సీలు, ఇతర దుస్తులను బెంగళూరు నుంచి హడావిడిగా పంపించింది. పల్లెకెలె మైదానంలో మంగళవారం క్రికెటర్ల ఆప్షనల్ ప్రాక్టీస్ సమయానికి కిట్లు మైదానం చేరుకున్నాయి. నలుగురు సభ్యుల ‘నైకీ’ బృందం టీమిండియా ఆటగాళ్లు, అధికారులతో కూడా అక్కడే చర్చించింది. ధోని, రోహిత్ శర్మలు కొత్త జెర్సీలను పరిశీలించిన తమ అభిప్రాయాలు, సూచనలు వారికి తెలియజేశారు. కోహ్లి కోసమేనా... భారత కెప్టెన్‌గా, నంబర్‌వన్ ఆటగాడిగా శిఖరాన ఉన్న విరాట్ కోహ్లి ఇప్పుడు ఏం చేసినా, చెప్పినా అది చెల్లుబాటయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఇటీవల కోచ్‌గా కుంబ్లేను తొలగించడం అలాంటి పరిణామమే. తాజాగా ‘నైకీ’ గురించి ఆటగాళ్లు గళమెత్తడం వెనక కూడా కోహ్లినే కారణమని వినిపిస్తోంది. బయటికి నాణ్యతాలోపం గురించి చెప్పినా అసలు విషయం కోహ్లి బ్రాండ్ ‘పూమా’కు ప్రయోజనం చేకూర్చే ప్రయత్నం చేస్తున్నట్లుగా అంతర్గత సమాచారం. ‘పూమా’తో గత ఫిబ్రవరిలో కోహ్లి రూ. 110 కోట్ల భారీ మొత్తానికి ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఇటీవలే అది అమల్లోకి వచ్చింది. అయితే ఉసేన్ బోల్ట్ సహా పలువురు స్టార్ ఫుట్‌బాలర్లు ‘పూమా’కు అంబాసిడర్లుగా ఉన్నా...నైకీ, అడిడాస్‌లతో పోలిస్తే ఆ బ్రాండ్ మార్కెట్ భారత్‌లో చాలా తక్కువ. దానిని పెంచుకునే ప్రయత్నంలోనే అది కోహ్లిని ఎంచుకుంది. భారత్‌లో ఎక్కువ మందికి చేరువ కావాలంటే క్రికెట్‌తో జత కట్టాల్సిన అవసరాన్ని ‘పూమా’ గుర్తించింది. నంబర్‌వన్ బ్రాండ్‌ను పదేళ్లకు పైగా వాడుతున్న తర్వాత జెర్సీల నాణ్యత గురించి ఆటగాళ్లు ప్రశ్నించడం నిజంగా ఆశ్చర్యకరం. ఈ సాకుతో ఒప్పందంలో ఉన్న ‘అవసరమైతే కాంట్రాక్ట్‌ను రద్దు చేయవచ్చు’లాంటి క్లాజ్‌ను ఉపయోగించించి ఇప్పుడు నైకీని కూడా పక్కన పెడతారా, ఆ తర్వాత కోహ్లి కోరితే పూమాను ముందుకు తెస్తారా అనేది చూడాల్సిందే. -
రవీంద్ర జడేజా టాప్ ర్యాంక్ పదిలం
దుబాయ్: భారత స్టార్ స్పిన్నర్ రవీంద్ర జడేజా అంతర్జాతీయ క్రికెట్ మండలి టెస్టు బౌలర్ల ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. మంగళవారం వెల్లడించిన ఈ జాబితాలో శ్రీలంక స్పిన్నర్ రంగన హెరాత్‌ను వెనక్కి నెట్టి అశ్విన్ తిరిగి రెండో స్థానానికి చేరాడు. హెరాత్ మూడో స్థానంలో ఉన్నాడు. ఆల్‌రౌండర్స్ జాబితాలో జడేజా, అశ్విన్ వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. షకీబ్ టాప్‌లో ఉన్నాడు. బ్యాటింగ్ విభాగంలో కెప్టెన్ కోహ్లి తన ఐదో స్థానాన్ని నిలబెట్టుకోగా, పుజారా నాలుగో స్థానం.. ధావన్ 39 నుంచి 21వ స్థానానికి ఎగబాకాడు. -
సొంతమా...సమమా?
-
సొంతమా...సమమా?
⇔ సిరీస్ విజయమే భారత్ లక్ష్యం ∙ ⇔ మరో గెలుపుపై విండీస్ గురి ⇔ నేడు చివరి వన్డే ∙రాత్రి గం. 7.30 నుంచి సోనీ సిక్స్‌లో ప్రత్యక్ష ప్రసారం వరుసగా మూడు వన్డేల్లో సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించి వెస్టిండీస్‌తో సిరీస్‌ను ఏకపక్షంగా మార్చేసిన భారత్‌కు గత మ్యాచ్ చిన్నపాటి షాక్‌ను ఇచ్చింది. 190 పరుగుల లక్ష్యం అనగానే అప్పుడే సిరీస్ ముగిసిపోయినట్లు భావించినా... చివరకు ప్రత్యర్థిదే పైచేయి అయింది. మరోసారి టీమిండియా తమ సత్తా మేరకు రాణించి సిరీస్‌ను తమ ఖాతాలో వేసుకుంటుందా? మరోసారి పోరాటపటిమ ప్రదర్శించి విండీస్ పోరును సమం చేస్తుందా నేడు తేలిపోనుంది. కింగ్స్టన్ (జమైకా): అటు ఆటగాళ్లలోనూ, ఇటు అభిమానుల్లోనూ పెద్దగా ఆసక్తి రేపని వన్డే సిరీస్ చివరకు ముగింపు దశకు చేరుకుంది. నేడు జరిగే చివరిదైన ఐదో వన్డేలో భారత్, వెస్టిండీస్ తలపడనున్నాయి. సిరీస్‌లో ప్రస్తుతం 2–1తో ఆధిక్యంలో ఉన్న భారత్, ఈ మ్యాచ్ గెలిస్తే సిరీస్‌ను సొంతం చేసుకుంటుంది. మరోవైపు నాలుగో వన్డేలో అనూహ్య విజయం సాధించిన హోల్డర్ బృందం తమకు కలిసొచ్చిన మైదానంలో మరో గెలుపు సాధించాలని పట్టుదలగా ఉంది.మార్పులు ఉంటాయా: గత మ్యాచ్ పరాజయంతో సిరీస్ విజయం కోసం భారత్ మరింతగా శ్రమించాల్సిన స్థితిలో నిలిచింది. ధోని నెమ్మదైన ఇన్నింగ్స్ ఓటమికి కారణంగా పైకి కనిపిస్తున్నా... ఇందులో అందరి పాత్ర ఉంది. కాబట్టి ఈ మ్యాచ్ కోసం తుది జట్టులో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. వరుసగా నాలుగు వన్డేల్లోనూ కనీసం 50కు పైగా పరుగులు సాధించిన రహానే తన ఫామ్‌ను కొనసాగిస్తూ నే వేగంగా కూడా ఆడాల్సిన అవసరం ఉంది. గత రెండు వన్డేల్లో విఫలమైన ధావన్‌తో పాటు కెప్టెన్ కోహ్లి నుంచి జట్టు భారీ ఇన్నింగ్స్ ఆశిస్తోంది. ధోని గత మ్యాచ్ ప్రదర్శనను మరచి అసలు సత్తా చాటితే భారత్ పని సులువవుతుంది. యువరాజ్ గాయం నుంచి కోలుకుంటే దినేశ్ కార్తీక్ స్థానంలో రావచ్చు. బౌలింగ్‌లో భువనేశ్వర్ తిరిగి రానుండగా, జడేజా స్థానంలో అశ్విన్ ఆడతాడు. నాలుగో వన్డే అనుభవాన్ని బట్టి చూస్తే భారత్ అలసత్వం ప్రదర్శిస్తే మొదటికే మోసం రావచ్చు. హోల్డర్ ఆశలు: 189 పరుగుల స్కోరును కూడా కాపాడుకోవడంతో వెస్టిండీస్ జట్టులో ఆత్మవిశ్వాసం పెరిగింది. తొలి మూడు మ్యాచ్‌లలో టాస్ గెలిచిన తర్వాత ఫీల్డింగ్ చేసిన భారీగా పరుగులు సమర్పించుకున్న ఆ జట్టు, గత మ్యాచ్‌లో బౌలింగ్‌తోనే విజయం సాధించగలిగింది. నాలుగో వన్డేలో తలా ఓ చేయి వేసిన టాపార్డర్ ఈసారి మరింత మెరుగైన ప్రదర్శన చేయాలని భావిస్తోంది. షై బ్రదర్స్, లూయీస్లపై ఆ జట్టు ఆధార పడుతోంది. ఛేజ్, జేసన్ మొహమ్మద్ కూడా కీలకం కానున్నారు. గత మ్యాచ్‌లో తన స్లో బంతులతో ధోనిని కట్టి పడేసిన పేసర్ కెస్రిక్ విలియమ్స్ ఆకట్టుకున్నాడు. అతనికి కెప్టెన్ హోల్డర్ అండగా నిలిస్తే మంచి ఫలితం రాబట్టవచ్చు. స్పిన్నర్లు బిషూ, నర్స్ కూడా ప్రభావం చూపిస్తున్నారు. భారత్‌తో జరిగిన గత ఆరు ద్వైపాక్షిక సిరీస్‌లలో కూడా విండీస్ ఓడిపోయింది. ఆఖరిసారిగా ఆ జట్టు 2006లో భారత్‌ను 4–1తో ఓడించింది. ఈ నేపథ్యంలో కనీసం సిరీస్ కోల్పోకూడదని భావిస్తున్న హోల్డర్ బృందం ఏమాత్రం పోటీనిస్తుందో చూడాలి. తుది జట్ల వివరాలు (అంచనా): భారత్: కోహ్లి (కెప్టెన్), ధావన్, రహానే, ధోని, కార్తీక్/ యువరాజ్, జాదవ్/ పంత్, పాండ్యా, కుల్దీప్, జడేజా/ అశ్విన్, ఉమేశ్, షమీ/ భువనేశ్వర్ వెస్టిండీస్: హోల్డర్ (కెప్టెన్), లూయీస్, కైల్ హోప్, షై హోప్, జేసన్ మొహమ్మద్, ఛేజ్, పావెల్, నర్స్, విలియమ్స్, బిషూ, జోసెఫ్ ఈ మైదానంలో ఆడిన 32 వన్డేల్లో వెస్టిండీస్ 24 గెలిచింది. వరుసగా గత 9 మ్యాచ్‌లలో ఇక్కడ ఆ జట్టు విజయం సాధించింది. మరో మ్యాచ్‌లో ధోని నాటౌట్‌గా నిలిస్తే మురళీధరన్‌ను దాటి అత్యధిక సార్లు (120) అజేయంగా ఉన్న బ్యాట్స్‌మన్‌గా రికార్డును అందుకుంటాడు. పిచ్, వాతావరణం మ్యాచ్ రోజున వర్షం కురిసే అవకాశం ఉంది. ఆటకు అంతరాయం కలగవచ్చు. ఈ సిరీస్‌లో అన్నింటికంటే మెరుగైన బ్యాటింగ్ పిచ్ ఇది. -
రవిశాస్త్రి అధికారికంగా...
భారత హెడ్ కోచ్ పదవికి దరఖాస్తు చేసుకున్న మాజీ టీమ్ డైరెక్టర్ న్యూఢిల్లీ: మాజీ టీమ్ డైరెక్టర్ రవిశాస్త్రి భారత హెడ్ కోచ్ పదవికి దరఖాస్తు చేశారు. క్రికెట్ సలహా కమిటీ (సీఏసీ) సభ్యుడు సచిన్, కెప్టెన్ కోహ్లి అండదండలతో రవిశాస్త్రి ఇప్పుడు రేసులో ముందు వరుసలో ఉన్నారు. కోచ్ పదవికి శాస్త్రితో పాటు తాజాగా వెస్టిండీస్ మాజీ ఆల్‌రౌండర్ ఫిల్ సిమన్స్ కూడా దరఖాస్తు చేశారని బీసీసీఐ వర్గాలు ధ్రువీకరించాయి. ఇదివరకే టామ్ మూడీ, వీరేంద్ర సెహ్వాగ్, వెంకటేశ్ ప్రసాద్, రిచర్డ్ పైబస్, దొడ్డ గణేశ్, లాల్‌చంద్ రాజ్‌పుత్‌లు దరఖాస్తు చేసిన సంగతి తెలిసిందే. వీరిని గంగూలీ, సచిన్, లక్ష్మణ్‌లతో కూడి న సీఏసీ ఇంటర్వ్యూ చేయనుంది. ఇటీవల గంగూలీ మాట్లాడుతూ ఈ నెల 10న ఇంట ర్వ్యూలకు ఆహ్వానిస్తామని చెప్పారు. కెప్టెన్ కోహ్లితో విబేధాలు రావడంతో కోచ్ కుంబ్లే విండీస్ పర్యటనకు వెళ్లకుండా తన పదవికి రాజీనామా చేశారు. -
అవన్నీ పుకార్లే!
బర్మింగ్‌హామ్: భారత క్రికెట్లో సంచలనంగా మారిన కెప్టెన్ కోహ్లి, కోచ్ కుంబ్లే మధ్య వివాదాన్ని బీసీసీఐ మాత్రం తేలిగ్గా తీసుకుంది. బోర్డు సంయుక్త కార్యదర్శి అమితాబ్ చౌదరి దీనిపై స్పందిస్తూ ‘అవన్నీ పెద్ద పుకార్లు’ అంటూ కొట్టిపారేశారు. తనకు అసలు ఈ విషయం గురించి ఎలాంటి సమాచారం లేదని ఆయన అన్నారు. ‘ఇద్దరికీ పడటం లేదంటూ వచ్చిన కథనాలన్నీ ఊహాజనితం. ఏదేదో ఊహించుకొని రాయడం తప్ప వాటికి ఎలాంటి విలువ లేదు. నిప్పు లేదని పొగ రాదని కొందరంటున్నారు. కానీ అసలు పొగే లేదని నేను నమ్ముతున్నాను’ అని చౌదరి వ్యాఖ్యానించారు. కోచ్ ఎంపిక కోసం దరఖాస్తులు ఆహ్వానించడంలో తప్పు లేదని ఆయన సమర్థించుకున్నారు. ‘దీనిపై ఇప్పటికే స్పష్టతనిచ్చాం. కోచ్ ఎంపిక అనేది ఒక ప్రక్రియ. అంతా పారదర్శకంగా, సరిగ్గా జరిగేందుకు ఈ విధానాన్ని అనుసరిస్తున్నాం. కాబట్టి అప్లికేషన్లు కోరడంలో సమస్య లేదు’ అని అమితాబ్ చెప్పారు. భారత్ వరుసగా సిరీస్‌లు ఆడుతుండటం వల్ల విరామం లభించడం లేదని, అందుకే ఒక వైపు చాంపియన్స్ ట్రోఫీ జరుగుతుండగానే కోచ్ కోసం ప్రకటన ఇవ్వాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు. మరోవైపు గురువారం ఎడ్జ్‌బాస్టన్ మైదానం లో సాధన చేసిన భారత్ తమకు కల్పించిన ప్రాక్టీస్ సౌకర్యాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. -
ఆట విషయంలో కుంబ్లే నిక్కచ్చిగా ఉంటాడు: భజ్జీ
భారత కోచ్ కుంబ్లే ముక్కుసూటి మనిషి అని, ఆట విషయంలో చాలా కఠినంగా వ్యవహరిస్తాడని వెటరన్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్, దిగ్గజ బౌలర్‌ను వెనకేసుకొచ్చాడు. ప్రతిభ కంటే కూడా కష్టపడే మనస్తత్వానికే విలువిస్తాడని చెప్పాడు. కోచ్‌గా ఆయన ఘనతను చూపించేందుకు గత ఏడాది భారత్ సాధించిన విజయాలే నిదర్శనమన్నాడు. కోచ్, కెప్టెన్ కోహ్లిల ఉదంతంపై స్పందిస్తూ... కుంబ్లే ఒకరితో తగవు పెట్టుకునే రకం కాదని, ఎవరికైనా సాయపడే గుణమున్నవాడని కితాబిచ్చాడు. -
కటక్‌లోనే కొట్టేయాలి!
సిరీస్ విజయమే భారత్ లక్ష్యం ఒత్తిడిలో ఇంగ్లండ్ నేడు రెండో వన్డే కొండలనైనా పిండి చేసే కోహ్లి తత్వానికి గత మ్యాచ్‌లో జాదవ్ జత కలవడంతో భారత జట్టు ఒక అద్భుతమైన విజయాన్ని అందుకుంది. 351 పరుగుల లక్ష్యాన్ని కూడా అలవోకగా అందుకొని వన్డే క్రికెట్లో తమ బలాన్ని ప్రదర్శించింది. ఇప్పుడు మళ్లీ అదే జోరును కొనసాగించి సిరీస్‌ను సొంతం చేసుకోవాలని టీమిండియా పట్టుదలగా ఉంది. మరోవైపు ఎంత భారీ స్కోరు చేసినా గత మ్యాచ్‌లో ప్రత్యర్థిని కట్టడి చేయలేకపోయిన ఇంగ్లండ్ శిబిరంలో కాస్త ఆందోళన పెరిగింది. ఈ నేపథ్యంలో ఇరు జట్లు రెండో వన్డేకు సిద్ధమయ్యాయి. బారాబతి స్టేడియంలో భారత్‌కు మంచి రికార్డు ఉండటం మరో సానుకూలాంశం. కటక్: టెస్టు సిరీస్‌లో ఇంగ్లండ్‌ను చిత్తుగా ఓడించిన కోహ్లి సేన ఇప్పుడు వన్డే సిరీస్ విజయానికి మరో మ్యాచ్ దూరంలో నిలిచింది. తొలి వన్డేలో చెలరేగి మ్యాచ్‌ను గెలుచుకున్న భారత్, నేడు (గురువారం) జరిగే రెండో వన్డేలో ఇంగ్లండ్‌తో పోరుకు ఆత్మవిశ్వాసంతో సిద్ధమైంది. మరోవైపు 350 పరుగులు చేసి కూడా మ్యాచ్‌ను కాపాడుకోలేకపోయిన ఇంగ్లండ్, సిరీస్‌లో కోలుకునే ప్రయత్నంలో ఉంది. ఇరు జట్లలోనూ దూకుడుగా ఆడే బ్యాట్స్‌మెన్‌కు లోటు లేకపోవడంతో మళ్లీ పరుగుల వరద పారడం ఖాయంగా కనిపిస్తోంది. భారత్, ఇంగ్లండ్ బుధవారమే కటక్ చేరుకొని ప్రాక్టీస్‌లో పాల్గొన్నాయి. అయితే భారత కెప్టెన్ కోహ్లి నెట్స్‌కు దూరంగా ఉన్నాడు. అశ్విన్ రాణించేనా... ఇంగ్లండ్‌తో తొలి వన్డేలో తనదైన శైలిలో కోహ్లి సాగించిన వేట, జాదవ్ మెరుపు బ్యాటింగ్ భారత్‌కు విజయాన్నందించాయి. అయితే కొన్ని ఇతర లోపాలు కూడా ఇందులో కనిపించకుండా పోయాయి. వీరిద్దరు మినహా ఇతర బ్యాట్స్‌మెన్ అంతా విఫలమయ్యారు. భారత్ ఆరంభంలోనే నలుగురు ప్రధాన ఆటగాళ్ల వికెట్లు కోల్పోయింది. కోహ్లి, జాదవ్ భారీ భాగస్వామ్యం లేకపోతే ఫలితంలో తేడా వచ్చేది. కానీ ఇలాంటి అదృష్టం ప్రతీ రోజు కలిసి రాకపోవచ్చు. ముఖ్యంగా ఓపెనర్ శిఖర్ ధావన్ తన సత్తా ప్రదర్శించాల్సిన సమయం ఆసన్నమైంది. చాలా రోజులుగా అతడి నుంచి చెప్పుకోదగ్గ ప్రదర్శన రాలేదు. మరో ఓపెనర్ లోకేశ్ రాహుల్ కూడా కీలక ఇన్నింగ్స్ ఆడాల్సి ఉంది. అన్నింటికి మించి ఇద్దరు ఆటగాళ్లు ఒత్తిడిలో ఉన్నారనేది వాస్తవం. పునరాగమనం చేసిన యువరాజ్‌తో పాటు ఇప్పుడు కేవలం బ్యాటింగ్ నైపుణ్యంతోనే జట్టులో కొనసాగాల్సిన ధోని కూడా మెరుగైన ప్రదర్శన చేయాల్సి ఉంది. లేదంటే కెప్టెన్ కోహ్లికి ఇది సమస్యగా మారవచ్చు. హార్దిక్ పాండ్యా రాణించడం సానుకూలాంశం కాగా, భారీ స్కోరు నమోదైన మ్యాచ్‌లోనూ జడేజా ఓవర్‌కు ఐదు పరుగులే ఇచ్చి ఆకట్టుకున్నాడు. అయితే ఇప్పుడు అశ్విన్ ఫామ్ ఆందోళన రేపుతోంది. టెస్టుల్లో తిరుగులేని బౌలింగ్ చేసిన ఈ నంబర్‌వన్ స్పిన్నర్ వన్డేల్లో మాత్రం తేలిపోతున్నాడు. గత 14 వన్డేలలో అతను ఎనిమిది సార్లు కనీసం తన ఓవర్ల కోటా కూడా పూర్తి చేయలేకపోయాడు. అతని స్థానంలో లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రాను తీసుకోవచ్చని వినిపిస్తున్నా... కోహ్లి తన ప్రధాన స్పిన్నర్‌పై ఇంత తొందరగా నమ్మకం కోల్పోకపోవచ్చు. ఉమేశ్, బుమ్రా పుణేలో విఫలమైనా ఈ మ్యాచ్‌లో వారి స్థానాలకు ఢోకా లేదు. ఏం చేయాలి? భారత పర్యటనలో ఇంగ్లండ్ తమ తొలి విజయాన్ని అందుకోవాలంటే అద్భుతం చేయాల్సిందేనేమో! అన్ని రంగాల్లో భారత్‌పై ఆ జట్టు ఆధిక్యం ప్రదర్శిస్తే గానీ గెలుపు రుచి చూడకపోవచ్చు. తొలి వన్డేలో రనౌటైన హేల్స్ మినహా ఆ జట్టు ప్రధాన బ్యాట్స్‌మెన్ అంతా రాణించడం వల్లే ఇంగ్లండ్ భారీ స్కోరు చేయగలిగింది. రాయ్, రూట్, స్టోక్స్ మంచి ఫామ్‌లో ఉండగా, మోర్గాన్, బట్లర్ ఒంటి చేత్తో మ్యాచ్ దిశను మార్చగల సమర్థులు. ఈసారి కూడా జట్టు తమ బ్యాటింగ్‌పైనే ప్రధానంగా ఆధార పడుతోంది. బౌలింగ్‌లో ఇద్దరు పేసర్లు వోక్స్, విల్లీ ప్రభావం చూపించగా, బాల్, స్టోక్స్ విఫలమయ్యారు. భారత్‌లాగే ఇంగ్లండ్‌ను కూడా తన స్పిన్ విభాగం కలవరపెడుతోంది. ఇద్దరు స్పిన్నర్లు రషీద్, మొయిన్ అలీ ఘోరంగా విఫలమయ్యారు. నిజానికి టెస్టులకంటే కూడా రషీద్‌కు పరిమిత ఓవర్లలోనే మంచి రికార్డు ఉంది. కానీ పుణే మ్యాచ్‌లో అతని బౌలింగ్‌ను భారత్ చితక్కొట్టింది. రషీద్ స్థానంలో మరో పేసర్ ప్లంకెట్‌ను ఆడించాలని కూడా ఇంగ్లండ్ భావిస్తోంది. ఓవరాల్‌గా తమ బౌలింగ్‌పై పెద్దగా నమ్మకం ఉంచే పరిస్థితి లేకపోవడంతో మరోసారి భారీ స్కోరుపైనే ఇంగ్లండ్ ఆశలు పెట్టుకుంది. తుది జట్ల వివరాలు (అంచనా) భారత్: కోహ్లి (కెప్టెన్), ధావన్, రాహుల్, యువరాజ్, ధోని, జాదవ్, పాండ్యా, జడేజా, అశ్విన్/మిశ్రా, బుమ్రా, ఉమేశ్. ఇంగ్లండ్: మోర్గాన్ (కెప్టెన్), రాయ్, హేల్స్, రూట్, బట్లర్, స్టోక్స్, అలీ, వోక్స్, విల్లీ, బాల్, రషీద్/ ప్లంకెట్. పిచ్, వాతావరణం బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్‌పై తొలి మ్యాచ్‌లాగే ఈసారి కూడా భారీ స్కోరుకు అవకాశం ఉంది. బారాబతి స్టేడియంలో బౌండరీలు చిన్నగా ఉండటం కూడా మరో కారణం. బుధవారం పిచ్‌పై కాస్త పచ్చిక ఉన్నా, మ్యాచ్ ముందు దానిని తొలగించవచ్చు. అయితే మంచు ప్రభావం చాలా ఎక్కువగా కనిపిస్తోంది కాబట్టి టాస్ కీలకం కానుంది. ఈ మైదానంలో ఆడిన 15 వన్డేల్లో భారత్ 11 గెలిచి, 4 ఓడింది. ఇందులో నాలుగు సార్లు భారత్, ఇంగ్లండ్ తలపడ్డాయి. వీటిలో ఇరు జట్లు చెరో 2 మ్యాచ్‌లు నెగ్గాయి. రెండేళ్ల క్రితం ఇక్కడ శ్రీలంకతో జరిగిన వన్డేలో 363 పరుగులు చేసిన భారత్ 169 పరుగులతో విజయం సాధించింది. ఇందులో ధావన్, రహానే సెంచరీలు చేశారు. మధ్యాహ్నం గం. 1.30 నుంచి స్టార్ స్పోర్ట్స్–1లో ప్రత్యక్షప్రసారం -
అంతా బాగుంది...
ముంబై: ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో భారత జట్టు ప్రదర్శన కోచ్ అనిల్ కుంబ్లేకు ఆనందాన్ని కలిగిస్తోంది. ముఖ్యంగా బౌలర్లు రాణిస్తున్న తీరు పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. చక్కటి ఫీల్డింగ్ ఏర్పాట్లతో బౌలింగ్ ప్రణాళికలకు కెప్టెన్ కోహ్లి అండగా నిలిచాడని ఆయన వ్యాఖ్యానించారు. నాలుగో టెస్టు ప్రారంభానికి రెండు రోజుల ముందు మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘అన్ని మ్యాచ్‌లలో మన బౌలర్లు కీలక పాత్ర పోషించారు. అది ఇన్నింగ్సలో ఐదు వికెట్లు తీయడం కావచ్చు లేదా అసలైన సమయంలో తీసిన ఒకే ఒక వికెట్ కావచ్చు. మూడు వేర్వేరు పిచ్‌లపై కూడా ఫలితం సాధించగలిగాం. దాని ప్రకారమే లెంగ్తను సరిదిద్దుకొని బౌలింగ్ చేయగలిగాం. కోహ్లి ఫీల్డింగ్ ఆలోచనలు, బౌలర్లు శ్రమకు తగిన గుర్తింపును తెచ్చేలా చేశాయి’ అని కుంబ్లే అన్నారు. సాధారణంగా ఆటగాళ్ల మధ్య పోలికలను తాను ఇష్టపడనని... షమీ, ఉమేశ్ ఇద్దరూ చాలా బాగా ఆడుతున్నారని ప్రత్యేకంగా ప్రశంసించారు. ‘ఆట ముగిసే సమయంలో చివరి స్పెల్‌లో కూడా వారిద్దరు ఎంతో గొప్పగా బౌలింగ్ చేశారు. బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టి వికెట్లు తీయగలిగారు. ముఖ్యంగా 18 నెలల విరామం తర్వాత క్రికెట్లోకి వచ్చిన షమీ ఆడుతున్న తీరు స్ఫూర్తిదాయకం’ అని కుంబ్లే అన్నారు. మూడో టెస్టులో ముగ్గురు స్పిన్నర్లు కూడా అర్ధ సెంచరీ సాధించడం అద్భుతమన్న దిగ్గజ స్పిన్నర్, ఈ ఇన్నింగ్స జడేజాలో ఆత్మవిశ్వాసం పెంచిందన్నారు. విజయ్ చెలరేగుతాడు... ఓపెనర్ మురళీ విజయ్ షార్ట్ పిచ్ బంతులను ఎదుర్కోలేకపోతున్నాడనే విమర్శను కుంబ్లే కొట్టిపారేశారు. ‘గత రెండేళ్లుగా మా జట్టులో అత్యంత నిలకడగా ఆడుతున్న బ్యాట్స్‌మన్ విజయ్. రాజ్‌కోట్‌లో అతను సెంచరీ కూడా చేశాడు. సిరీస్‌లో ఒకే తరహాలో అవుటైనా, షార్ట్ పిచ్ బంతి అతని బలహీనత కాదు. నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్న విజయ్, త్వరలోనే మరో భారీ ఇన్నింగ్స ఆడతాడు’ అని కోచ్ సమర్థించారు. మరోవైపు పదే పదే ఓపెనర్లు మారుతున్నా, భారత్ బాగా ఆడుతోందనే విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఆటలో గాయాలు సహజమని, కోలుకున్న లోకేశ్ రాహుల్ మెరుగ్గా రాణిస్తాడని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. తాను ఆడిన రోజులతో పోలిస్తే, తర్వాతి కాలంలో ఫిట్‌నెస్‌పై ఆటగాళ్లకు శ్రద్ధ పెరిగిందని, ఇప్పుడు భారత జట్టు అత్యంత ఫిట్‌గా కనిపిస్తోందని కుంబ్లే అన్నారు. మరోవైపు డీఆర్ఎస్ వినియోగంపై తమ ఆటగాళ్లంతా సంతృప్తిగా ఉన్నారని, ఈ విషయంలో సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడమే ముఖ్యమని ఆయన అభిప్రాయపడ్డారు. పార్థివ్ పటేల్ కొనసాగింపు... వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా గాయం కారణంగా మూడో టెస్టు బరిలోకి దిగిన పార్థివ్ పటేల్‌కు మరో అవకాశం లభించింది. ఇంగ్లండ్‌తో జరిగే నాలుగో టెస్టులోనూ అతను ఆడతాడని బీసీసీఐ ప్రకటించింది. సాహా కోలుకున్నా... ముందు జాగ్రత్తగా అతనికి మరింత విశ్రాంతి కల్పించినట్లు బోర్డు చెప్పింది. మొహాలీ టెస్టులో పార్థివ్ రెండు ఇన్నింగ్సలలో 42, 67 నాటౌట్ పరుగులు చేశాడు. ‘ఎనిమిదేళ్ల తర్వాత టెస్టు ఆడినా పార్థివ్ ఎలాంటి ఒత్తిడికి లోను కాలేదు. కీపర్‌గా, అప్పటికప్పుడు ఓపెనర్‌గా కూడా తనకు ఇచ్చిన బాధ్యతను సమర్థంగా నెరవేర్చాడు. కష్టానికి ఎప్పటికై నా గుర్తింపు లభిస్తుందని అతని పునరాగమనం చూపించింది. తన 16 ఏళ్ల వయసులోనే అతను ఒకసారి జట్టును ఓటమినుంచి రక్షించాడు. గడ్డం గీసుకుంటే ఇప్పటికీ అతను 16 ఏళ్లవాడిలాగానే కనిపిస్తాడు’ అని పార్థివ్ గురించి కుంబ్లే వ్యాఖ్యానించారు. -
అంత వీజీ కాదు!
అన్ని విభాగాల్లో పటిష్టంగా ఇంగ్లండ్ ఇకపై భారత్ వ్యూహం మార్చాల్సిందే ఐదే ఐదు రోజులు... భారత్ నేలకు దిగింది. బంగ్లాదేశ్ లాంటి జట్టు చేతిలోనే మూడు రోజుల్లో ఓడిపోరుున జట్టు మనకు కనీసం పోటీ ఇస్తుందా అనే భావన నుంచి... ఇకపై అప్రమత్తంగా లేకపోతే ఓడిపోవాలేమో అనే సందేహం వచ్చేసింది. తొలి టెస్టులో ఇంగ్లండ్ జట్టు అద్భుతంగా ఆడింది. ఒక రకంగా భారత జట్టు ఇన్నాళ్లూ సొంత గడ్డపై ప్రత్యర్థుల్ని ఎలా ఏడిపిస్తోందో.. ఈసారి ఇంగ్లండ్ మనల్ని అలా ఏడిపించేసింది. మొత్తానికి కష్టపడి తొలి టెస్టును ‘డ్రా’ చేసుకున్న భారత్ ఇకపై వ్యూహాన్ని పూర్తిగా మార్చాలి. అదే సమయంలో మరింత అప్రమత్తంగా ఆడాలి. ఎందుకంటే ఇంగ్లండ్‌పై గెలవడం అంత ఈజీ కాదని తొలి టెస్టుతో అర్థమైపోరుుంది. క్రీడావిభాగం కోహ్లి కెప్టెన్ అయ్యాక సొంతగడ్డపై టెస్టు మ్యాచ్‌ల్లో భారత్ ఒక్క టాస్ కూడా ఓడిపోలేదు. టాస్ గెలిచిన ప్రతిసారీ భారత్ బ్యాటింగ్ చేసింది. భారత్‌లో ఏ వేదికలో క్రికెట్ ఆడినా ఆఖరి రెండు రోజులు స్పిన్ ట్రాక్‌లు ఉంటారుు కాబట్టి... నాలుగో ఇన్నింగ్సలో ఆడాల్సిన ప్రమాదం తప్పేది. కానీ ఇంగ్లండ్‌తో తొలి టెస్టులో సీన్ రివర్స్ అరుుంది. ఒకవేళ ఈ మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి ఉంటే ఫలితం మరోలా ఉండేది. అరుుతే టాస్ అనేది ఎవరి చేతుల్లోనూ ఉండదు. కాబట్టి ప్రతికూల పరిస్థితుల్లో ఎలా అనే అంశంపై భారత్ దృష్టి పెట్టాలి. నిజానికి టాస్ కలిసి రావడం ఒక్కటే కాదు... ఇంగ్లండ్ అన్ని విభాగాల్లోనూ అద్భుతంగా ఆడింది. అందరూ ఫామ్‌లో... ఇంగ్లండ్ జట్టు ఈ సిరీస్ కోసం 19 ఏళ్ల కుర్రాడు హమీద్‌ను తీసుకొచ్చింది. తను స్పిన్ బాగా ఆడతాడనే కారణంతోనే చిన్న వయసులోనే అరంగేట్రం చేరుుంచారు. తనకు లభించిన అవకాశాన్ని ఆ కుర్రాడు అద్భుతంగా వినియోగించుకున్నాడు. రెండు ఇన్నింగ్సలోనూ ఆకట్టుకున్నాడు. ఇక కుక్ కూడా భారత్‌లో తనకు అలవాటైన ఆటతీరుతో అదరగొట్టాడు. ముఖ్యంగా రెండో ఇన్నింగ్సలో ఆఖరి రోజు పిచ్‌పై సెంచరీని పూర్తి చేసుకున్నాడు. జో రూట్ మరోసారి తన విలువను నిరూపించుకుంటే... మొరుున్ అలీ ఉపఖండంలో సరిగా ఆడలేడనే అపప్రదను తొలగించుకున్నాడు. ఆల్‌రౌండర్ స్టోక్స్ బ్యాటింగ్ కూడా కొంత ఆశ్చర్యపరిచింది. ఓవరాల్‌గా ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ అందరూ మంచి ఫామ్‌లో కనిపిస్తున్నారు. ఎలాంటి పిచ్‌పై అరుునా అశ్విన్ బౌలింగ్‌ను ఆడటం అంత సులభం కాదు. కానీ ఈ మ్యాచ్‌లో అశ్విన్ బౌలింగ్‌లో అలవోకగా పరుగులు చేశారు. ఇంగ్లండ్ స్పిన్నర్లు కూడా ఆశించిన రీతిలో బౌలింగ్ చేశారు. ముఖ్యంగా ఆదిల్ రషీద్ బాగా ఆకట్టుకున్నాడు. అనుభవం లేకపోరుునా జఫర్ అన్సారీ... ఎంతో కొంత అనుభవం ఉన్న మొరుున్ అలీ కూడా బాగా బౌలింగ్ చేశారు. స్పిన్ బాగా ఆడతారనే పేరున్న భారత బ్యాట్స్‌మెన్‌నే ఈ స్పిన్ త్రయం వణికించింది. మన కూర్పు సంగతేంటి? నిజానికి తొలి టెస్టుకు తుది జట్టు ఎంపికలో భారత్ సరైన వ్యూహం అవలంభించలేదనే భావించాలి. ముగ్గురు స్పిన్నర్లు పనికొచ్చే పిచ్ మీద ఆడుతున్నప్పుడు పేసర్లకు పెద్దగా పని ఉండదు. అలాంటప్పుడు హార్దిక్ పాండ్యాను తుది జట్టులోకి తీసుకుని ఉంటే బ్యాటింగ్ విభాగం కూడా మరింత బలంగా కనిపించేది. ఆట పరంగా తొలి టెస్టులో భారత్‌కు కూడా కొన్ని సానుకూల అంశాలు ఉన్నారుు. విజయ్, పుజారా తొలి ఇన్నింగ్సలో అద్భుతంగా ఆడారు. రెండో ఇన్నింగ్సలో కోహ్లి ప్రతికూల పరిస్థితుల్లో తన శైలికి భిన్నంగా నాణ్యమైన టెస్టు ఆటతీరు కనబరిచాడు. రహానే రెండు ఇన్నింగ్సలోనూ విఫలమైనా... తను నైపుణ్యం ఉన్న క్రికెటర్ కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇక అశ్విన్ బ్యాటింగ్ ఈ మ్యాచ్‌లో అత్యద్భుతం. ఆల్‌రౌండర్ అనే పదానికి తను అర్హుడని గతంలోనే నమ్మకం కుదిరినా... ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్ ద్వారా తన స్థారుుని మరింత పెంచుకున్నాడు. ఓవరాల్‌గా ఆటతీరు పరంగా భారత్‌ను పెద్దగా ఇబ్బంది పెట్టే అంశాలు లేవు. అరుుతే రెండో ఇన్నింగ్సలో ప్రతికూల పరిస్థితుల్లో మనవాళ్లు పడ్డ తడబాటు ఇంగ్లండ్ జట్టు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందనడంలో సందేహం లేదు. స్పిన్ పిచ్లే పరిష్కారమా? నిజానికి భారత్‌లో టెస్టు అంటే నాలుగో రోజు ఉదయం సెషన్ నుంచే బంతి గిర్రున తిరగాలి. కానీ ఈసారి రాజ్‌కోట్‌లో బంతి కాస్త ఆలస్యంగా తిరగడం మొదలైంది. ఐదో రోజు ఆఖరి సెషన్లో బాగా ప్రభావం కనిపించింది. రాజ్‌కోట్‌లో జరిగిన తొలి టెస్టు కావడం వల్ల ఆ రాష్ట్ర సంఘం పెద్దగా రిస్క్ తీసుకుని ఉండకపోవచ్చు. అందుకే తొలి మూడు రోజులు పూర్తిగా బ్యాటింగ్‌కు అనుకూలించేలా ట్రాక్‌ను రూపొందించారు. నిజానికి భారత బలం స్పిన్. కాబట్టి పూర్తిగా స్పిన్ ట్రాక్‌లు వేసి మూడో రోజు నుంచే బంతి తిరుగుతుంటే మనకు అనుకూలంగా ఫలితాలు రావచ్చు. కాబట్టి రాబోయే నాలుగు టెస్టులకు స్పిన్ ట్రాక్‌లు సిద్ధం చేయాలనే ఆదేశాలు ఇప్పటికే వెళ్లి ఉండొచ్చు. రెండో టెస్టు జరిగే వైజాగ్ ఇటీవల కాలంలో స్పిన్నర్లకు స్వర్గధామంలా మారింది. ముఖ్యంగా న్యూజిలాండ్‌తో జరిగిన ఆఖరి వన్డే చూస్తే ఈ పిచ్‌పై స్పిన్నర్లు తప్ప మాట్లాడటానికి మరో అంశం ఉండదు. ఒకవేళ అదే తరహా పిచ్ వైజాగ్‌లో ఈ టెస్టుకు ఎదురైతే భారత్ అసలు బలమేంటో బయటకు వస్తుంది. ఒకవేళ అలాంటి వికెట్ ఎదురైనా ఇంగ్లండ్ గెలవడమో, డ్రా చేసుకోవడమో చేసిందంటే... భారత్ తీవ్రమైన ఒత్తిడిలోకి వెళ్లడం ఖాయం. ఏమైనా రెండో టెస్టుకు ముందు భారత్ మరింత కష్టపడాలి. అటు వ్యూహాల్లో, ఇటు ఆటతీరులోనూ మార్పులు చేసుకోవాలి. లేకపోతే... నాలుగేళ్ల క్రితం నాటి పరాభవాన్ని మళ్లీ చూడాల్సి వస్తుంది. ఇంగ్లండ్‌కు సౌలభ్యం... జట్టు కూర్పు విషయంలో మనతో పోలిస్తే ఇంగ్లండ్‌కు మరింత సౌలభ్యత ఉంది. ముగ్గురు పేసర్లు, ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగే అవకాశం ఉండటం... ఈ ఆరుగురిలో ఇద్దరు నిఖార్సైన ఆల్‌రౌండర్లు కావడం వల్ల జట్టు కూర్పు విషయంలో ఆ జట్టు భారత్‌తో పోలిస్తే మెరుగ్గా ఉంది. ఇక రెండో టెస్టుకు అండర్సన్ అందుబాటులోకి వస్తే ఆ జట్టు బౌలింగ్ మరింత బలపడుతుంది. వోక్స్ స్థానంలో అండర్సన్‌ను ఆడిస్తారు. అరుుతే కుక్‌ను బాగా ఆనందపరిచిన విషయం స్పిన్నర్ల ప్రదర్శన. ముఖ్యంగా భారత స్పిన్నర్లు బంతిని సరిగా స్పిన్ చేయలేకపోరుున పిచ్‌పై ఇంగ్లండ్ త్రయం ఆకట్టుకున్నారు. ఇది ఆ జట్టులో కొత్త ఉత్సాహాన్ని నింపింది. -
నంబర్‌వన్ భారత్
గదను అందుకున్న కోహ్లి కివీస్‌తో టెస్టు సిరీస్‌తో విజయంతో పాటు ఐసీసీ ర్యాంకింగ్‌సలో నంబర్‌వన్‌గా నిలవడం భారత్ ఆనందాన్ని రెట్టింపు చేసింది. రెండో టెస్టు తర్వాతే అగ్రస్థానానికి చేరినా, సిరీస్ తర్వాత దానికి అధికారికంగా ఆమోదముద్ర పడింది. కెప్టెన్ కోహ్లి తొలిసారిగా నంబర్‌వన్ గదను అందుకోవడం విశేషం. దిగ్గజ క్రికెటర్ సునీల్ గావస్కర్ దీనిని అందజేశారు. ఇంగ్లండ్ చేతిలో ఓడితే తప్ప... ఇతర సిరీస్‌ల ఫలితాలు భారత్ టాప్ ర్యాంక్‌ను ప్రభావితం చేయలేవు. మరోవైపు బౌలింగ్ ర్యాంకింగ్‌సలో అశ్విన్ (900 రేటింగ్ పారుుంట్లు) మళ్లీ అగ్రస్థానానికి చేరాడు. భారత్ తరఫున తొలిసారి ఒక బౌలర్ 900 పారుుంట్లను అందుకోవడం ఇదే మొదటిసారి కావడం విశేషం. ‘ఏదో ఒక రోజు టెస్టుల్లో దేశానికి ప్రాతినిధ్యం వహించడ మే లక్ష్యంగా ఉండేది. కానీ ఇప్పుడు నంబర్‌వన్ జట్టులో భాగం కావడం చాలా గర్వంగా అనిపిస్తోంది. కొన్ని వ్యక్తిగత ప్రదర్శనలతో పాటు చివరకు సమష్టితత్వం మమ్మల్ని ఈ స్థారుుకి చేర్చింది. ఎంతో శ్రమ, పట్టుదల కనబర్చిన జట్టు సభ్యులందరి వల్లే ఇది సాధ్యమైంది. ప్రపంచంలోని అత్యుత్తమ టీమ్‌గా మారేందుకు సహకరించినవారందరికీ కృతజ్ఞతలు. మున్ముందు ఈ విజయాలను కొనసాగిస్తామని విశ్వాసంతో ఉన్నా’ అని కోహ్లి వ్యాఖ్యానించాడు. -
బౌలర్లు గాడిలో పడతారా!
నేటి నుంచి విండీస్ బోర్డు ఎలెవన్‌తో రెండో వార్మప్ మ్యాచ్ తుది జట్టు ఎంపికపైనే భారత్ దృష్టి బసెటర్రీ (సెయింట్ కిట్స్): వెస్టిండీస్‌తో నాలుగు టెస్టుల సిరీస్‌కు ముందు భారత్ తన అస్త్రాలను మరోసారి పరీక్షించుకునేందుకు సిద్ధం అవుతోంది. తొలి వార్మప్ మ్యాచ్‌లో బ్యాట్స్‌మెన్ అంచనాలను అందుకున్నా.. బౌలర్లు నిరాశపర్చారు. ఈ నేపథ్యంలో నేటి (గురువారం) నుంచి మూడు రోజుల పాటు జరిగే రెండో ప్రాక్టీస్ మ్యాచ్‌లో టీమిండియా... విండీస్ బోర్డు ప్రెసిడెంట్ ఎలెవన్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. ఈనెల 21 నుంచి జరిగే తొలి టెస్టుకు తుది జట్టును ఎంపిక చేసేందుకు ఈ మ్యాచ్‌ను వేదికగా చేసుకోవాలని కోచ్ కుంబ్లే, కెప్టెన్ కోహ్లి భావిస్తున్నారు. దీంతో ప్రతి బౌలర్‌ను క్షుణ్ణంగా పరిశీలించాలని యోచిస్తున్నారు. తొలి ప్రాక్టీస్ మ్యాచ్‌లో బౌలర్లు లైన్ అండ్ లెంగ్త్‌లో తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా సుదీర్ఘ విరామం తర్వాత జట్టులోకి వచ్చిన పేసర్ షమీ, భువనేశ్వర్ కుమార్ ఆరంభంలో ఫర్వాలేదనిపించినా తర్వాత పూర్తిగా విఫలమయ్యారు. కోహ్లి గేమ్ ప్లాన్‌లో కీలకమైన ఇషాంత్, ఉమేశ్‌లు కూడా అంచనాలకు అందుకోలేకపోవడంతో ముంబై పేసర్ శార్దూల్ ఠాకూర్‌కు అవకాశం ఇవ్వాలని కోచ్ భావిస్తున్నారు. అయితే పేసర్లు విఫలమైన చోట స్పిన్నర్ అమిత్ మిశ్రా మాత్రం బాగా ఆకట్టుకున్నాడు. ప్రధాన స్పిన్నర్ అశ్విన్, జడేజాలను కూడా ఈ మ్యాచ్‌లో బరిలోకి దించాలని ప్రణాళికలు వేస్తున్నారు. బ్యాటింగ్‌లో టాప్ ఆర్డర్ రాణించడం భారత్‌కు శుభసూచకం. ఓపెనర్లు రాహుల్, ధావన్‌లు అర్ధసెంచరీలు చేయడంతో మిడిలార్డర్‌పై ఒత్తిడి తగ్గింది. అయితే ఓపెనింగ్‌లో మురళీ విజయ్‌కు తోడుగా ఈ ఇద్దరిలో ఎవర్ని దించాలనేది ఈ మ్యాచ్‌తో తేలిపోతుంది. కోహ్లి, రహానే తమ ఫామ్‌ను మరోసారి సరిచూసుకోవాల్సిన అవసరం ఉంది. -
దులీప్ట్రోఫీలో పింక్ బంతులతో...
ఈ సీజన్ దులీప్ ట్రోఫీలో పింక్ బంతులతో డేనైట్ మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. భారత్‌లో అంతర్జాతీయ డేనైట్ టెస్టు నిర్వహణకు ముందు కెప్టెన్ కోహ్లితో పాటు టెస్టు జట్టులోని ఆటగాళ్లంతా ఈ టోర్నీలో ఆడి అభిప్రాయాలు చెప్పాలని బీసీసీఐ కోరింది. దీంతో వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌కు ముందు భారత ప్రధాన క్రికెటర్లంతా దులీప్ ట్రోఫీలో ఆడనున్నారు. -
మాట్లాడనంతే..!
ఇషాంత్‌శర్మ వివాదంపై కోహ్లి న్యూఢిల్లీ : శ్రీలంక సిరీస్‌లో ఇషాంత్ ప్రవర్తనతో పాటు అతనికి కెప్టెన్ కోహ్లి మద్దతుగా నిలవడం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. దాంతో దీనినుంచి దూరంగా ఉండాలని భావిస్తున్న కోహ్లి ఈ అంశంపై, దక్షిణాఫ్రికాతో తొలి టెస్టుకు ఇషాంత్ దూరం కావడంపై మాట్లాడేందుకు నిరాకరించాడు. ‘ఈ ప్రశ్నలకు నేను సమాధానం ఇవ్వదల్చుకోలేదు. గతంలో జరిగిన విషయం, ఇకపై జరగబోయే దాని గురించి కూడా చెప్పను. నా కెప్టెన్సీ గురించి కానీ, జట్టు కోచ్ గురించి కానీ స్పందిం చను’ అని కోహ్లి అన్నాడు. మహిళా అభిమానుల తాకిడి గురించి మాట్లాడుతూ...తాను అనుష్క శర్మకు కట్టుబడి ఉన్నట్లు చెప్పాడు. -
బ్యాడ్మింటన్ హుషారు...ఆటో షికారు!
కొలంబో : టెస్టు సిరీస్‌ను సమం చేసిన జోరులో ఉన్న భారత ఆటగాళ్లు తర్వాతి రోజును ఉత్సాహంగా గడిపారు. క్రికెటర్లు షట్లర్లుగా మారి సరదా తీర్చుకున్నారు. మంగళవారం కెప్టెన్ కోహ్లితో పాటు ఇషాంత్, భువనేశ్వర్, పుజారా సుదీర్ఘ సమయం బ్యాడ్మింటన్ ఆడారు. ఆ తర్వాత హర్భజన్, బిన్నీలతో కలిసి కోహ్లి ఆటోలో (అక్కడి భాషలో టుక్ టుక్) నగరం చుట్టొచ్చాడు. ఈ ఫోటోలను వీరు సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు. -
‘గాలి’ పోయింది
♦ తొలి టెస్టులో భారత్ ఓటమి ♦ 112 పరుగులకే కుప్పకూలిన కోహ్లి సేన ♦ హెరాత్ సంచలన బౌలింగ్ ♦ సిరీస్‌లో శ్రీలంకకు 1-0 ఆధిక్యం గతంలో ఎన్నడూ లేని విధంగా భారత ఆటగాళ్లు విదేశంలోని ఓ మైదానంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు చేసుకున్నారు. జెండా ఎగరేశారు. జాతీయ గీతం పాడారు. కానీ ఆ స్ఫూర్తితో మైదానంలో పోరాడలేకపోయారు. కేవలం 176 పరుగుల చిన్న లక్ష్యాన్ని ఛేదించలేకపోయారు. 112 పరుగులకే కుప్పకూలిన కోహ్లి సేన జాతీయ పండగరోజు భారత పరువు తీసింది. గాలె : భారత స్వాతంత్య్ర దినోత్సవం రోజున మన క్రికెట్ జట్టు మరచిపోలేని పరాభవాన్ని మూటగట్టుకుంది. శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో 63 పరుగులతో ఓడిపోయింది. ఆటన్నాక గెలుపోటములు సహజం. కానీ మూడు రోజులు ఆధిపత్యం చూపించిన టెస్టులో కేవలం 176 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక ఓడిపోవడాన్ని జీర్ణించుకోవడం కష్టంగా ఉంది. గాలె అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో నాలుగో రోజు శనివారం భారత జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 49.5 ఓవర్లలో 112 పరుగులకు ఆలౌటయింది. అజింక్య రహానే (76 బంతుల్లో 36; 4 ఫోర్లు), శిఖర్ ధావన్ (83 బంతుల్లో 28; 3 ఫోర్లు) మినహా ఒక్క బ్యాట్స్‌మన్ కూడా కొద్దిసేపైనా నిలబడలేదు. శ్రీలంక లెఫ్టార్మ్ స్పిన్నర్ హెరాత్ (7/48) ధాటికి భారత బ్యాట్స్‌మెన్ పోటీ పడుతూ పెవిలియన్‌కు క్యూ కట్టారు. మరో స్పిన్నర్ కౌశల్ మూడు వికెట్లు తీసుకున్నాడు. చండీమల్కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. మూడు టెస్టుల సిరీస్‌లో శ్రీలంక 1-0 ఆధిక్యం సాధించింది. రెండో టెస్టు 20 నుంచి కొలంబోని సారా ఓవల్ మైదానంలో జరుగుతుంది. ఒకరి వెనుక ఒకరు... ఓవర్‌నైట్ స్కోరు 23/1తో నాలుగో రోజు ఆటను కొనసాగించిన భారత్ మరో 153 పరుగులు చేస్తే గెలిచేది. అయితే ధావన్ పరుగు తీయడానికే ఓ ఎండ్‌లో ఇబ్బంది పడితే మరో ఎండ్‌లో హెరాత్ ధాటికి నైట్ వాచ్‌మన్ ఇషాంత్‌తో పాటు రోహిత్ పెవిలియన్‌కు చేరాడు. కోహ్లి, ధావన్‌లను కౌశల్ అవుట్ చేశాడు. దీంతో భారత్ 60 పరుగులకు ఐదు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో రహానే ఒక ఎండ్‌లో నిలబడి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేసినా... రెండో ఎండ్‌లో హెరాత్ నాలుగు ఓవర్ల వ్యవధిలో మూడు వికెట్లు తీశాడు. దీంతో భారత్ 81 పరుగులకు 8 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో అమిత్ మిశ్రా (15) కాసేపు రహానేకు అండగా నిలబడ్డాడు. అయితే హెరాత్ స్పిన్ ధాటికి రహానే కూడా పెవిలియన్‌కు చేరాడు. కౌశల్ బౌలింగ్‌లో మిశ్రా అవుట్ కావడంతో భారత్ ఓటమి లాంఛనం ముగిసింది. స్కోరు వివరాలు శ్రీలంక తొలి ఇన్నింగ్స్ : 183 ; భారత్ తొలి ఇన్నింగ్స్: 375 శ్రీలంక రెండో ఇన్నింగ్స్ : 367 భారత్ రెండో ఇన్నింగ్స్ : లోకేశ్ రాహుల్ ఎల్బీడబ్ల్యు (బి) హెరాత్ 5; ధావన్ (సి) అండ్ (బి) కౌశల్ 28; ఇషాంత్ ఎల్బీడబ్ల్యు (బి) హెరాత్ 10; రోహిత్ (బి) హెరాత్ 4; కోహ్లి (సి) సిల్వ (బి) కౌశల్ 3; రహానే (సి) మ్యాథ్యూస్ (బి) హెరాత్ 36; సాహా (స్టం) చండీమల్ (బి) హెరాత్ 2; హర్భజన్ (సి) సిల్వ (బి) హెరాత్ 1; అశ్విన్ (సి) ప్రసాద్ (బి) హెరాత్ 3; అమిత్ మిశ్రా (సి) కరుణరత్నె (బి) కౌశల్ 15; ఆరోన్ నాటౌట్ 1; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (49.5 ఓవర్లలో ఆలౌట్) 112. వికెట్ల పతనం : 1-12; 2-30; 3-34; 4-45; 5-60; 6-65; 7-67; 8-81; 9-102; 10-112. బౌలింగ్ : ప్రసాద్ 4-2-4-0; హెరాత్ 21-6-48-7; కౌశల్ 17.5-1-47-3; ప్రదీప్ 6-3-8-0; మ్యాథ్యూస్ 1-0-3-0. ‘ఈ ఓటమికి మమ్మల్ని మేమే నిందించుకోవాలి. ఒత్తిడిని జయించడమే సాధారణ జట్టుకు, పెద్ద జట్టుకు తేడా. ఈ మ్యాచ్ ద్వారా తెలుసుకోవాల్సింది అదే. చండీమల్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఇక ప్రపంచస్థాయి బౌలర్ హెరాత్ గురించి కొత్తగా చెప్పాల్సిందేమీ లేదు. మేం బ్యాటింగ్ సరిగా చేయక ఈ మ్యాచ్‌లో ఓడిపోయాం. కాబట్టి డీఆర్ఎస్ లేకపోవడాన్ని ఇప్పుడు ప్రస్తావించడం అనవసరం. డీఆర్ఎస్ గురించి సిరీస్ అయిపోయాక ఆలోచిస్తాం.’ -భారత కెప్టెన్ కోహ్లి 18 200 లోపు లక్ష్యాన్ని ఛేదించలేక భారత్ విఫలం కావడం 18 ఏళ్ల తర్వాత ఇప్పుడే. చివరిసారిగా 1997లో వెస్టిండీస్‌పై 120 పరుగులు ఛేదించలేక ఓడింది. 112 టెస్టుల్లో భారత్‌కు శ్రీలంకపై ఇదే అత్యల్ప స్కోరు 22 టెస్టుల్లో హెరాత్ ఇన్నింగ్స్‌లో ఐదు లేదా అంతకంటే వికెట్లు తీయడం ఇది 22వ సారి. -
భారత్ ప్రాక్టీస్ మొదలు...
నెట్స్‌లో చెమటోడ్చిన ఆటగాళ్లు కొలంబో : మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ కోసం శ్రీలంకకు వచ్చిన భారత జట్టు మంగళవారం ప్రాక్టీస్ మొదలుపెట్టింది. 15 మంది ఆటగాళ్లు సహాయక సిబ్బంది సమక్షంలో నెట్స్‌లో చెమటోడ్చారు. ముందుగా ధావన్ నెట్స్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. ఆ తర్వాత కోహ్లి, విజయ్ ఆడారు. అధిక ఒత్తిడి లేదు: విజయ్ లంకతో సిరీస్‌లో కెప్టెన్ కోహ్లి ఐదుగురు బౌలర్ల వ్యూహాన్ని అనుసరిస్తున్న నేపథ్యంలో... బ్యాట్స్‌మెన్‌పై ఎలాంటి అధిక ఒత్తిడి లేదని ఓపెనర్ మురళీ విజయ్ అన్నాడు. ‘ఆరుగురు స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్ ఆడాలన్న డిమాండేమీ లేదు. ఆడినా పెద్దగా భారం పడదు. వీళ్లలో ఒక్కరు కుదురుకున్నా జట్టుకు భారీ స్కోరు అందించడం ఖాయం. చాలాసార్లు ఇలా జరి గింది కూడా. అయితే బ్యాట్స్‌మెన్‌కు ఇది సవాలే. మ్యాచ్ మన భుజాలపై ఉండటం మంచి బాధ్యతే. అయితే మ్యాచ్‌లో ఆధిపత్యం చెలాయించాలంటే మాత్రం సమష్టిగా రాణించాలి. అందుకు తగ్గట్టుగా ప్రణాళికలకు కట్టుబడి ఆడాలి’ అని విజయ్ పేర్కొన్నాడు. ఓపెనింగ్ కోసం పోటీ ఉండటం మంచిదేనన్నాడు. లంక జట్టులో యువ ఆటగాళ్లకు కొదవలేదన్నాడు. ‘మ్యాథ్యూస్, తిరిమన్నేలాంటి యువ ఆటగాళ్లు బాగా ఆడుతున్నారు. అయితే మా జట్టులో కూడా యువ ఆటగాళ్లు ఉన్నారు. కాబట్టి ఈ సిరీస్‌లో గట్టిపోటీ తప్పుదు. రెండో టెస్టు తర్వాత సీనియర్ ఆటగాడు సంగక్కర రిటైర్ అవుతున్నాడు. అప్పుడు లంక జట్టులో సీనియర్లు తక్కువగా ఉం టారు. కాబట్టి తర్వాతి మ్యాచ్‌లో భారత్‌దే పైచేయి అవుతుంది. హోరాహోరీగా సాగిన పాక్, లంక సిరీస్ మాదిరిగానే ఇది కూడా జరుగుతుందని భావిస్తున్నాం’ అని ఈ చెన్నై బ్యాట్స్‌మన్ వెల్లడించాడు. ప్రస్తుతం భారత టెస్టు క్రికెట్ సంధి దశలో ఉందని చెప్పిన విజయ్... కోహ్లి నేతృత్వంలోని యువ జట్టు బాగా రాణిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. -
భజ్జీ ‘వేడి’ తగ్గింది!
అశ్విన్ ముందు తేలిపోయిన సీనియర్ భవిష్యత్తులో చోటు కష్టమే(నా)! బంగ్లాదేశ్‌తో ఏకైక టెస్టుకు భారత జట్టును ప్రకటించినప్పుడు అందరినీ ఆశ్చర్యపరిచిన విషయం హర్భజన్ సింగ్‌కు చోటు. దేశవాళీలో అద్భుతాలు ఏమీ చేయకపోయినా... కేవలం కెప్టెన్ కోహ్లి గట్టి మద్దతు కారణంగానే ఈ వెటరన్ ఆఫ్ స్పిన్నర్‌కు స్థానం లభించింది. దాదాపు రెండేళ్ల విరామం తర్వాత పునరాగమనం చేసిన భజ్జీ... తనపై ఉన్న అంచనాలను అందుకోలేకపోయాడు. ఫతుల్లాలో ప్రదర్శన పెద్ద వైఫల్యంగా కనబడకపోయినా... జట్టులో ఉన్న మరో ఆఫ్ స్పిన్నర్ అశ్విన్ బౌలింగ్‌తో పోలిస్తే మాత్రం తీసికట్టుగానే ఉంది. భజ్జీ బంతుల్లో గతంలో ఉన్న వాడి లేదు. సాక్షి క్రీడా విభాగం ‘ఒకే మ్యాచ్‌లో హర్భజన్, అశ్విన్ కలిసికట్టుగా బౌలింగ్ చేయడాన్ని కెప్టెన్‌గా నేను ఆస్వాదించాను. ఇద్దరిలో మ్యాచ్‌ను గెలిపించే సత్తా ఉంది. భవిష్యత్తులోనూ వీరు ఇలాగే జట్టుకు ఉపయోగపడాలి’... ఫతుల్లాలో టెస్టు ముగిసిన అనంతరం తన ఇద్దరు ఆఫ్ స్పిన్నర్ల గురించి కెప్టెన్ విరాట్ కోహ్లి వ్యాఖ్య ఇది. అయితే మున్ముందు రాబోయే సిరీస్‌లలో జట్టులో ఒకే ఆఫ్ స్పిన్నర్‌ను ఆడించాల్సిన పరిస్థితి వస్తే కోహ్లి ఇదే తరహాలో ఆలోచించగలడా అనేది సందేహం. ఎందుకంటే బంగ్లాదేశ్ బలహీన జట్టు. అందులోనూ ఎక్కువ మంది లెఫ్ట్ హ్యాండర్లు ఉన్నారు కాబట్టి ఇద్దరు ఆఫ్ స్పిన్నర్లను ఆడించగలిగాడు. డివిలియర్స్, ఆమ్లా, సంగక్కర లాంటి క్రికెటర్లపై ఇదే వ్యూహం అక్కరకు రాదు. ఆ జట్లతో టెస్టు ఆడేటప్పుడు ఇద్దరు ఆఫ్ స్పిన్నర్లు తుది జట్టులో ఉండటం దాదాపు అసాధ్యం. వైవిధ్యం కోసం ఒక లెగ్ స్పిన్నర్ లేదా లెఫ్టార్మ్ స్పిన్నర్‌కు చోటివ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఇద్దరిలో బెస్ట్ అయిన అశ్విన్‌కే ఓటు పడుతుంది. పట్టు దొరకలేదు బంగ్లాదేశ్‌తో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 17.5 ఓవర్లు వేసి 3 వికెట్లు తీసిన భజ్జీ, రెండో ఇన్నింగ్స్‌లో 5 ఓవర్లు బౌల్ చేశాడు. మ్యాచ్ మొత్తం జరిగి ఉంటే గణాంకాలు ఎలా ఉండేవో కానీ... నిజానికి ఒక టెస్టులో ప్రదర్శనను అంచనా వేసేందుకు ఇది సరిపోదు. ‘ఇది పునరాగమనం అనుకోవద్దు, గాయం వల్ల జట్టుకు దూరం అయ్యానంతే అనే భావనతో ఆడు’ అంటూ కోహ్లి స్ఫూర్తి నింపే ప్రయత్నం చేసినా... భజ్జీలో ఒకరకమైన ఒత్తిడి కనిపించింది. తనకు దొరికిన ఏకైక అవకాశం కోల్పోవద్దనే ఆలోచనతో ఉన్న హర్భజన్.... ఆరంభ ఓవర్లలో సరైన లెంగ్త్‌లో బంతులు వేయడంలో విఫలమయ్యాడు. లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మన్ క్రీజ్‌లో ఉన్నప్పుడు స్లిప్, సిల్లీ పాయింట్, షార్ట్ కవర్, గల్లీ స్థానాలలో ఫీల్డర్లతో భజ్జీకి అనుకూలంగా గాలివాటం ఉన్న ఎండ్ నుంచి పదే పదే కోహ్లి బౌలింగ్ చేయించినా వెటరన్ ఆఫ్ స్పిన్నర్ పెద్దగా ఫలితం రాబట్టలేకపోయాడు. కాస్త కుదురుకున్నాక వికెట్లు దక్కడంతో భజ్జీ ఊపిరి పీల్చుకోగలిగాడు. కైస్ను మంచి బంతితో అవుట్ చేయగా...మిగతా రెండు వికెట్లు బ్యాట్స్‌మెన్ నిర్లక్ష్యపు ఆటతో లభించాయి. కానీ మొత్తంగా చూస్తే 35 ఏళ్ల హర్భజన్ బౌలింగ్‌లో నాటి పదును లేదని, పెద్ద జట్లపై ఇది సరిపోదని మాత్రం అర్థమైంది. అసలైన ఆఫ్ బ్రేక్ మరోవైపు అశ్విన్ మాత్రం తన సీనియర్ కంటే ఒక మెట్టుపైనే నిలిచాడు. భారత్ బయట తొలిసారి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు తీసిన అశ్విన్ మ్యాచ్ ఆసాంతం ఆకట్టుకున్నాడు. పిచ్‌ను అతను తొందరగా అంచనా వేయగలిగాడు. ఫలితంగా భజ్జీతో పోలిస్తే ఎక్కువ టర్న్, బౌన్స్ రాబట్టగలిగాడు. పైగా వేరియేషన్ల పేరుతో ఎక్కువగా వైవిధ్యానికి పోకుండా సాంప్రదాయ ఆఫ్ స్పిన్‌ను సమర్థంగా ఉపయోగించాడు. నిలకడగా ఒకే లైన్లో బౌలింగ్ వేసి బ్యాట్స్‌మెన్‌ను సందిగ్ధంలో పడేశాడు. తమీమ్, ముష్ఫికర్, షువగత ఇదే కన్ఫ్యూజన్లో వికెట్లు సమర్పించుకున్నారు. అశ్విన్ చేతి నుంచి అంత బాగా బంతి రావడం గతంలో ఎప్పుడూ చూడలేదంటూ మాజీ ఆటగాడు మంజ్రేకర్ ప్రశంసిస్తే... ఐదు వికెట్లూ తెలివైన బంతులకే దక్కాయి అంటూ మరో వ్యాఖ్యాత విశ్లేషించడం ఈ మ్యాచ్‌లో అశ్విన్ ప్రభావమేమిటో చూపించింది. ఇక ఉపఖండంలో అశ్విన్ బ్యాటింగ్ కూడా జట్టుకు అవసరం. కేవలం 23.87 సగటుతో ఇక్కడ 100 వికెట్లు తీసిన అతని బ్యాటింగ్ సగటు కూడా 43.50 ఉండటం విశేషం. ఇదే విషయాన్ని చెబుతూ కోహ్లి... అశ్విన్ ఆటను చక్కగా అర్థం చేసుకోగలడని, అతని విలువ అమూల్యమని స్పష్టం చేశాడు. ఇకపై జరిగే టెస్టుల్లో ఆఫ్ స్పిన్నర్‌గా తొలి ప్రాధాన్యత 28 ఏళ్ల అశ్విన్‌కే అనేది ఖాయం. ముగ్గురు స్పిన్నర్లు ఆడితేనే... టెస్టు కెప్టెన్‌గా కోహ్లి ఐదుగురు బౌలర్ల ఫార్ములా కొనసాగిస్తానని స్పష్టం చేశాడు. సాధారణంగా ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లతో బౌలింగ్ లైనప్‌ను నింపాలి. విదేశాల్లో అయితే ఏకంగా నలుగురు పేసర్లు, ఒక స్పిన్నర్ ఆడాలి. ఈ కాంబినేషన్‌తో జట్టు ఎంపిక చేసినప్పుడు... ఇద్దరు స్పిన్నర్లే తుది జట్టులో ఉంటే భజ్జీ, అశ్విన్ ఒకే మ్యాచ్‌లో ఆడటం కష్టం. అశ్విన్‌ను కాదని హర్భజన్‌ను ఆడిస్తే విమర్శల పాలు కావాల్సి వస్తుంది. కచ్చితంగా ఒక ఆఫ్ స్పిన్నర్‌తో పాటు ఒక లెగ్ స్పిన్నర్నో లేదా ఎడంచేతి వాటం స్పిన్నర్నో తీసుకోవాలి. అలా కాకుండా అశ్విన్, హర్భజన్ ఇద్దరూ జట్టులో ఉండాలంటే తుది జట్టులో ముగ్గురు స్పిన్నర్లు ఉండాలి. బహుశా స్వదేశంలో దక్షిణాఫ్రికాతో సిరీస్‌లో భయంకరమైన స్పిన్ ట్రాక్ తయారు చేసి ఇలాంటి ప్రయోగం చేయొచ్చు. ప్రస్తుత పరిస్థితుల్లో బోర్డు అలాంటి ట్రాక్‌లు తయారు చేయకపోవచ్చు. సాధారణ పరిస్థితుల్లో ఆడాలంటే మాత్రం అశ్విన్‌ను దాటి భజ్జీ తుది జట్టులోకి రావడం కష్టమే అనుకోవాలి. ఇక ఉపఖండం బయట మ్యాచ్‌లు ఆడితే హర్భజన్‌కు తుది జట్టులో చోటు అసాధ్యం. అక్కడ ముగ్గురు లేదా నలుగురు పేసర్లతో ఆడాల్సి వస్తుంది. -
'ఇక రెండో ఛాన్స్ లేదు'
ఢాకా: ఒక టెస్టు మ్యాచ్ , మూడు వన్డేలు ఆడేందుకు బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లిన టీమిండియా తమ ప్రణాళిలను పక్కాగా అమలు చేయాలని ఆస్ట్రేలియా బౌలింగ్ లెజెండ్ మెక్ గ్రాత్ స్పష్టం చేశాడు. ప్రధానంగా ఒక టెస్ట్ మ్యాచ్ మాత్రమే బంగ్లాదేశ్ తో ఆడుతున్నందున టీమిండియా ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా కోలుకోవడానికి మరో అవకాశం లేదన్నాడు. 'టీమిండియా ప్రణాళికల్లో కచ్చితత్వం ఉండాలి. వారితో ఆడేది ఒక టెస్ట్ మాత్రమే అనే సంగతి గుర్తించుకోవాలి. టెస్ట్ సిరీస్ అయితే తరువాత మ్యాచ్ గురించి ఆలోచిస్తాం. అక్కడ టీమిండియాకు రెండో ఛాన్స్ లేదు' బంగ్లాతో జాగ్రత్తగా ఆడితే టీమిండియాదే విజయం అని మెక్ గ్రాత్ తెలిపాడు. ఫేవరెట్ జట్టుగా బరిలోకి దిగుతున్న టీమిండియా.. బంగ్లాదేశ్ ను తేలిగ్గా తీసుకోకుడూదని హెచ్చరించాడు ప్రస్తుతం ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో భారత్ మూడో స్థానంలో ఉంది. బంగ్లాతో జరిగే ఏకైక టెస్టులో గెలిస్తేనే ఈ ర్యాంక్‌ను నిలబెట్టుకోవచ్చు. ఒకవేళ ఓడిపోతే ఏకంగా ఏడో ర్యాంక్‌కు పడిపోతుంది. ఒకవేళ డ్రా అయినా నాలుగో ర్యాంక్‌కు కోహ్లిసేన పడిపోయే అవకాశం ఉంది. -
కొత్త ఇన్నింగ్స్ మొదలు
ఐపీఎల్ సందడి ముగిసింది. కొద్దిపాటి విశ్రాంతి కూడా పూర్తయింది. ఇక కొత్త సీజన్ కోసం భారత జట్టు సిద్ధమైంది. ఒక టెస్టు, మూడు వన్డేలు ఆడేందుకు ఢాకా వెళ్లింది. మామూలుగా అయితే ఈ పర్యటన గురించి పెద్దగా ఆలోచించాల్సిన పనిలేదు. కానీ ఈ సీజన్లో భారత్‌కు చాలా ప్రశ్నలకు సమాధానాలు దొరకాల్సి ఉంది. ముఖ్యంగా టెస్టుల్లో భారత్ ఆటతీరు మెరుగవుతుందా? కెప్టెన్‌గా కోహ్లి వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయి? సాక్షి క్రీడావిభాగం ఇక నుంచి నేర్చుకోవడానికి కాదు... గెలవడానికి ఆడాలి... బంగ్లాదేశ్ పర్యటనకు బయల్దేరే ముందు టెస్టు కెప్టెన్ కోహ్లి వ్యాఖ్య ఇది. సారథిగా తన దృక్పథం ఎలా ఉండబోతోందో ఈ ప్రకటనతోనే చెప్పేశాడు. గత ఏడాది ఆస్ట్రేలియాలో జరిగిన సిరీస్ సమయంలోనే కోహ్లి తన దూకుడును చూపించాడు. చాలామంది కెప్టెన్లు డ్రా కోసం ఆడే పరిస్థితులున్న మ్యాచ్‌లో విజయం కోసం ప్రయత్నించి ఓడిపోయాడు. ‘ఓ మ్యాచ్‌లో గెలవడానికి ప్రయత్నించి ఓడిపోయినా నేను బాధపడను’ అనే కోహ్లి మాట భవిష్యత్‌లోనూ ఇదే తరహాలో వ్యవహరిస్తాడనడానికి సూచన. వన్డేలు, టి20ల సంగతి ఎలా ఉన్నా టెస్టుల్లో భారత్ క్రమంగా తన ప్రాభవాన్ని కోల్పోతోంది. దీనిని మార్చాలనే పట్టుదలతో కొత్త సీజన్‌కు కోహ్లిసేన సిద్ధమవుతోంది. బంగ్లాదేశ్‌తో ఏకైక టెస్టు సీజన్‌కు వార్మప్ లాంటిది మాత్రమే. ఈ ఏడాది దక్షిణాఫ్రికాతో సిరీస్ ఉంది. అందులో మన జట్టు సత్తా ఏంటో బయటకు వస్తుంది. అయితే ప్రస్తుతం జట్టు ఆత్మవిశ్వాసంతోనే ఉంది. అనుభవం పెద్దగా లేకపోయినా నైపుణ్యానికి కొదవలేని క్రికెటర్లతో కొత్త సీజన్‌ను ప్రారంభిస్తున్నారు. అయితే కొత్త కెప్టెన్ దూకుడు దృక్పథాన్ని ఏమేరకు ఆటగాళ్లు అందిపుచ్చుకుంటారో చూడాలి. యువ జట్టు హర్భజన్, మురళీ విజయ్ మినహా ప్రస్తుత టెస్టు జట్టులో అందరూ 30 ఏళ్ల లోపు వాళ్లే. గాయంతో ఈ టెస్టుకు దూరమైన ఓపెనర్ లోకేశ్ రాహుల్ వయసు 23 ఏళ్లే. కాబట్టి ఓపెనర్ స్థానానికి భవిష్యత్‌లో సమ స్య లేదు. పుజారా, రహానే, రోహిత్ 28 ఏళ్ల లోపు వారే. స్పిన్నర్ అశ్విన్‌కు 28 ఏళ్లే. విదేశాల్లో సిరీస్‌లు గెలవాలంటే పేస్ బౌలర్లు కీలకం. భా రత పేస్ బృందం ఉమేశ్, ఇషాం త్, భువనేశ్వర్, ఆరోన్ అందరూ 28 ఏళ్ల లోపు వారే. వీరిలో ఇషాంత్‌కు ఇప్పటికే చాలా అనుభవం ఉంది. తక్కువ వయసు క్రికెటర్లు జట్టులో ఉండటం భవిష్యత్‌లో మేలు చేసే అంశం. ప్రణాళికల్లో మార్పు కెప్టెన్‌గా ధోని రికార్డు అద్భుతం. గతంలో ఎవరికీ సాధ్యంకాని విజయాలు చాలా సాధించాడు. కానీ టెస్టుల్లో ధోని కెప్టెన్సీ వ్యూహాలపై చాలా విమర్శలు ఉన్నాయి. రక్షణాత్మక ధోరణితో ఆడిస్తాడనే ముద్ర ఉంది. దీనిని మార్చడం కోహ్లి ప్రథమ లక్ష్యం. ప్రస్తుతం కోహ్లి వయసు 26 సంవత్సరాలు. నిస్సందేహంగా తనే జట్టులో ఉత్తమ బ్యాట్స్‌మన్. కాబట్టి తనకు కెప్టెన్‌గానూ భవిష్యత్ చాలా ఉంటుంది. కావలసినంత సమయం ఉంది కాబట్టి... తొలుత తనకు ఏం కావాలనేది స్పష్టంగా తెలుసుకోవాలి. ఏదో ఒక్క సిరీస్‌కో పరిమితం కాకుండా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. ఓడితే ఏడో ర్యాంక్‌కు ప్రస్తుతం ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో భారత్ మూడో స్థానంలో ఉంది. బంగ్లాతో జరిగే ఏకైక టెస్టులో గెలిస్తేనే ఈ ర్యాంక్‌ను నిలబెట్టుకోవచ్చు. ఒకవేళ ఓడిపోతే ఏకంగా ఏడో ర్యాంక్‌కు పడిపోతుంది. ఒకవేళ డ్రా అయినా నాలుగో ర్యాంక్‌కు కోహ్లిసేన పడిపోతుంది. రాగానే ప్రాక్టీస్... మిర్పూర్: బంగ్లా గడ్డపై అడుగు పెట్టగానే భారత జట్టు సాధనపై దృష్టి పెట్టింది. సోమవారం ఉదయం ఢాకా చేరుకున్న టీమిండియా ఆటగాళ్లు మధ్యాహ్నం దాదాపు రెండు గంటలకు పైగా ప్రాక్టీస్ చేశారు. ఏకైక టెస్టు జరగనున్న ఫతుల్లాలో బంగ్లాదేశ్ టీమ్ ప్రాక్టీస్ కొనసాగుతున్నందున ఢాకాలోని షేర్ ఎ బంగ్లా స్టేడియంలో కోహ్లి బృందం సాధన చేసింది. ‘జట్టులోని 14 మంది సభ్యులు పూర్తి ఫిట్‌గా ఉన్నారు. కోల్‌కతాలో ప్రాక్టీస్ సందర్భంగా గాయపడిన సాహా కూడా పూర్తిగా కోలుకున్నాడు. అతను కూడా జట్టుతో పాటు సాధన చేశాడు. మంగళవారం ఫతుల్లాలో శిక్షణ కొనసాగుతుంది’ అని టీమ్ మేనేజర్ బిశ్వరూప్ డే తెలిపారు. ► భారత్, బంగ్లాదేశ్‌ల మధ్య ఇప్పటివరకూ నాలుగు టెస్టు సిరీస్‌లు జరిగాయి. అన్నీ భారత్ గెలిచింది. సిరీస్‌లన్నీ బంగ్లాదేశ్‌లోనే జరిగాయి. ► మొత్తం రెండు జట్ల మధ్య ఇప్పటివరకూ జరిగిన ఏడు టెస్టుల్లో ఆరు భారత్ గెలిచింది. ఒక మ్యాచ్ డ్రాగా ముగిసింది. -
ఈసారి మేం స్వేచ్ఛగా ఆడతాం
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ కోహ్లి ముంబై : క్రిస్ గేల్, డివిలియర్స్‌తో పాటు తాను కూడా ఈసారి ఐపీఎల్లో స్వేచ్ఛగా ఆడతామని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి అన్నాడు. ఈసారి తమ జట్టు స్థాయికి తగ్గ ప్రదర్శన చేస్తుందని ధీమా వ్యక్తం చేశాడు. ఇటీవలి వేలంలో వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్, స్యామీ, బద్రీనాథ్ జట్టులోకి వచ్చారు. ‘ఈసారి సీజన్ మాకు చాలా విభిన్నమైంది. ఎందుకంటే గత నాలుగేళ్ల నుంచి నాతోపాటు గేల్, డివిలియర్స్‌లపైనే బ్యాటింగ్ భారం ఉండడంతో ఒత్తిడిలో ఆడాల్సి వచ్చేది. ఇతర జట్లను గమనిస్తే బ్యాటింగ్ ఆర్డర్లో వారికి వెసులుబాటు ఉంది. అందుకే ఆటగాళ్లు స్వేచ్ఛగా ఆడుతున్నారు. ఈసారి మేం కూడా అలాంటి ఆటతీరునే చూపుతాం. ఎందుకంటే దినేశ్ కార్తీక్, స్యామీ, బద్రీనాథ్, మన్దీప్ సింగ్ మా బ్యాటింగ్ లైనప్‌లో ఉన్నారు. వీరి అండతో మేం ముగ్గురం ఇక మా సహజశైలిలో ఆడతాం. ఇప్పటికే డివిలియర్స్ ప్రపంచకప్‌లో టి20 మజా చూపించాడు. రెండుసార్లు సెమీస్, ఓ సారి ఫైనల్‌కు వచ్చాం. ఇక ఈసారి మాత్రం టైటిల్ లోటును తీర్చుకోవాలనే కసితో ఉన్నాం’ అని టీమ్ జెర్సీ ఆవిష్కరణ సందర్భంగా కోహ్లి అన్నాడు. పేసర్ మిషెల్ స్టార్క్ మోకాలి గాయం కారణంగా నాలుగు మ్యాచ్‌ల అనంతరం జట్టులో చేరతాడని చెప్పాడు. సుదీర్ఘ పర్యటన అనంతరం వెంటనే ఐపీఎల్ ఆడాల్సి రావడంలో ఇబ్బందేమీ లేదని కోహ్లి చెప్పాడు. ప్రొఫెషనల్ క్రికెటర్‌గా ఇలాంటి సమస్యను సమర్థవంతంగా అధిగమించాల్సి ఉంటుందని, ప్రపంచకప్ తర్వాత లభించిన 9 రోజుల విరామంలో మేం బాగానే కోలుకున్నామని అన్నాడు.