![బ్యాడ్మింటన్ హుషారు...ఆటో షికారు!](/styles/webp/s3/article_images/2017/09/3/71440532977_625x300.jpg.webp?itok=uw6MXfgA)
బ్యాడ్మింటన్ హుషారు...ఆటో షికారు!
కొలంబో : టెస్టు సిరీస్‌ను సమం చేసిన జోరులో ఉన్న భారత ఆటగాళ్లు తర్వాతి రోజును ఉత్సాహంగా గడిపారు. క్రికెటర్లు షట్లర్లుగా మారి సరదా తీర్చుకున్నారు. మంగళవారం కెప్టెన్ కోహ్లితో పాటు ఇషాంత్, భువనేశ్వర్, పుజారా సుదీర్ఘ సమయం బ్యాడ్మింటన్ ఆడారు. ఆ తర్వాత హర్భజన్, బిన్నీలతో కలిసి కోహ్లి ఆటోలో (అక్కడి భాషలో టుక్ టుక్) నగరం చుట్టొచ్చాడు. ఈ ఫోటోలను వీరు సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు.