Ishant
-
IPL 2022: ఒత్తిడిలో గుజరాత్ చిత్తు!
ముంబై: గుజరాత్ 178 పరుగుల లక్ష్యఛేదనలో ఓపెనర్లే 12 ఓవర్లలో 106 పరుగులు చేశారు. ఇక మిగిలిన 8 ఓవర్లలో 72 పరుగులు 10 వికెట్లున్న జట్టుకు కష్టమే కాదు. కానీ ముంబై బౌలర్ల కష్టం, చక్కని ఫీల్డింగ్, ఆఖరి బంతి దాకా చూపిన పోరాటం టైటాన్స్‌కు ఊహించని షాకిచ్చాయి. 6 బంతుల్లో 9 పరుగులు చేయాల్సిన దశలో ఆఖరి ఓవర్ వేసిన సామ్స్ వికెట్ తీయడమే కాకుండా కేవలం 3 పరుగులే ఇచ్చి ముంబైని గెలిపించాడు. శుక్రవారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో ముంబై 5 పరుగులతో గెలిచింది. మొదట ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ (29 బంతుల్లో 45; 5 ఫోర్లు, 1 సిక్స్), కెప్టెన్ రోహిత్ శర్మ (28 బంతుల్లో 43; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించగా, చివర్లో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ టిమ్ డేవిడ్ (21 బంతుల్లో 44 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్స్‌లు) విరుచుకుపడ్డాడు. గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 172 పరుగులకే పరిమితమైంది. ఓపెనర్లు వృద్ధిమాన్ సాహా (40 బంతుల్లో 55; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు), శుబ్‌మన్ గిల్ (36 బంతుల్లో 52; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు సాధించారు. రాణించిన రోహిత్, కిషన్ రోహిత్ రెండో ఓవర్లో 2 ఫోర్లు, భారీ సిక్సర్‌తో వేగం పెంచాడు. రషీద్ ఖాన్ తొలి ఓవర్లో ఇషాన్ కిషన్ రెండు ఫోర్లు బాది టచ్‌లోకి వచ్చాడు. పవర్ ప్లేలో ముంబై 63/0 స్కోరు చేసింది. రోహిత్‌ను రషీద్ ఎల్బీగా పంపగా స్వల్ప వ్యవధిలో సూర్యకుమార్ (13), ఇషాన్ కిషన్, పొలార్డ్ (4) వికెట్లను కోల్పోయింది. టిమ్ డేవిడ్ క్రీజులోకి రాగానే బ్యాట్‌కు పనిచెప్పాడు. షమీ వేసిన 16వ ఓవర్లో 2 ఫోర్లు కొట్టిన డేవిడ్, జోసెఫ్ 18వ ఓవర్లో బౌలర్ తలపైనుంచి సిక్సర్ బాదాడు. ఓపెనర్లే వంద వరకు... ఓపెనర్లు సాహా, గిల్ ఆరంభం నుంచే వేగంగా పరుగులు సాధిస్తుండటంతో ముంబై బౌలర్లకు కష్టాలు తప్పలేదు. ప్రధాన సీమర్ బుమ్రా బౌలింగ్‌ను సాహా చితగ్గొట్టాడు. గిల్ కూడా పోటాపోటీగా బౌండరీలు బాదడంతో పవర్‌ప్లేలో ఓపెనింగ్ జోడీ 54 పరుగులు చేసింది. సామ్స్ వేసిన 8వ ఓవర్లో ‘హ్యాట్రిక్’ ఫోర్లు కొట్టిన గిల్, కార్తికేయ ఓవర్లో 6, 4 బాదాడు. సాహా (34 బంతుల్లో; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు), గిల్ (33 బంతుల్లో; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఒకరి వెంట ఒకరు ఫిఫ్టీలు పూర్తి చేసుకొన్నారు. జట్టు స్కోరు వంద దాటాకా మురుగన్ అశ్విన్ ఒకే ఓవర్లో గిల్, సాహాలను పెవిలియన్ పంపాడు. దీంతో 106 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. స్కోరు వివరాలు ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: ఇషాన్ కిషన్ (సి) రషీద్ (బి) జోసెఫ్ 45; రోహిత్ (ఎల్బీ) (బి) రషీద్‌ఖాన్ 43; సూర్యకుమార్ (సి) రషీద్ (బి) సంగ్వాన్ 13; తిలక్ రనౌట్ 21; పొలార్డ్ (బి) రషీద్ 4; డేవిడ్ నాటౌట్ 44; సామ్స్ (సి) రషీద్ (బి) ఫెర్గూసన్ 0; అశ్విన్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 177. వికెట్ల పతనం: 1–74, 2–99, 3–111, 4–119, 5–157, 6–164. బౌలింగ్: షమీ 4–0–42–0, జోసెఫ్ 4–0–41–1, రషీద్ 4–0–24–2, ఫెర్గూసన్ 4–0–34–1, సంగ్వాన్ 3–0–23–1, తెవాటియా 1–0–11–0. గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్: సాహా (సి) సామ్స్ (బి) మురుగన్ 55; గిల్ (సి) పొలార్డ్ (బి) మురుగన్ 52; హార్దిక్ రనౌట్ 24; సుదర్శన్ హిట్‌వికెట్ (బి) పొలార్డ్ 14; మిల్లర్ నాటౌట్ 19; తెవాటియా రనౌట్ 3; రషీద్ నాటౌట్ 1; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 172. వికెట్ల పతనం: 1–106, 2–111, 3–138, 4–156, 5–171 బౌలింగ్: సామ్స్ 3–0–18–0, బుమ్రా 4–0–48–0, మురుగన్ అశ్విన్ 4–0–29–2, మెరిడిత్ 4–0–32–0, కార్తికేయ 3–0–29–0, పొలార్డ్ 2–0–13–1. ఐపీఎల్లో నేడు పంజాబ్ X రాజస్తాన్ వేదిక: ముంబై, మధ్యాహ్నం గం. 3:30 నుంచి లక్నో X కోల్‌కతా వేదిక: పుణే, రాత్రి గం. 7:30 నుంచి స్టార్ స్పోర్ట్స్–1లో ప్రత్యక్ష ప్రసారం. -
వేలం పాటలో కోట్లు కుమ్మరించారు
-
కోట్లు కుమ్మరించారు
అంచనా నిజమైంది. ఆట ఉంటే చాలు అంతర్జాతీయ అనుభవం పెద్దగా లేకపోయినా.. కోట్లు కుమ్మరించడానికి తాము సిద్ధమేనని ఫ్రాంచైజీలు మరోసారి నిరూపించాయి. సోమవారం బెంగళూరులో జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) పదో సీజన్ ఆటగాళ్ల వేలం పాటలో ఇంగ్లండ్ క్రికెటర్లతోపాటు ఇతర ఆటగాళ్లకు కాసుల పంట పడింది. ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్‌ను రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్ జట్టు ఏకంగా రూ. 14 కోట్ల 50 లక్షలకు కొనుగోలు చేసి ఆశ్చర్యపరిచింది. ఇంగ్లండ్‌కే చెందిన బౌలర్ టైమల్ మిల్స్‌ను రూ. 12 కోట్లకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు సొంతం చేసుకుంది. హైదరాబాద్ రంజీ క్రికెటర్లు మొహమ్మద్ సిరాజ్ (రూ. 2 కోట్ల 60 లక్షలు), తన్మయ్ అగర్వాల్ (రూ. 10 లక్షలు)లను డిఫెండింగ్ చాంపియన్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు దక్కించుకుంది. వేలంలో మొత్తం 357 మంది క్రికెటర్లు పాల్గొనగా... 66 మంది అమ్ముడుపోయారు. కనీసం రూ. కోటి అందుకోనున్న వారిలో 22 మంది క్రికెటర్లు ఉన్నారు. భారత క్రికెటర్లు ఇషాంత్ శర్మ, చతేశ్వర్ పుజారా, ఇర్ఫాన్ పఠాన్లతోపాటు ఐసీసీ బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో ఉన్న ఇమ్రాన్ తాహిర్ (దక్షిణాఫ్రికా)ను కూడా ఫ్రాంచైజీలు పట్టించుకోలేదు. ఐపీఎల్ అంటే ఒకప్పుడు ఇంగ్లండ్ జట్టుకు అందనంత దూరం. మాకు జాతీయ జట్టే ముఖ్యం లీగ్ కాదంటూ వారంతా ప్రకటించుకోగా... అలా అయితే మాకూ మీ అవసరం లేదంటూ లీగ్ కూడా ఆ ఆటగాళ్లను పట్టించుకోలేదు. కానీ ఎట్టకేలకు పదో సీజన్‌కు వచ్చేసరికి ఇంగ్లండ్ ఆటగాళ్ల రాత మారిపోయింది. కేవలం ఆరుగురు ఆటగాళ్ల కోసం ఫ్రాంచైజీలు ఏకంగా రూ. 34.3 కోట్లు ఖర్చు చేశాయి. మొత్తంగా ఐపీఎల్–2017 కోసం 357 మంది జాబితా నుంచి కేవలం 66 మంది మాత్రం లీగ్‌లో ఎంపికయ్యే అదృష్టం దక్కించుకున్నారు. కొన్ని అనూహ్య, మరికొన్ని అసాధారణ ఎంపికలతో ఈసారి కూడా ఐపీఎల్ వేలం అంచనాలకు అందకుండా సాగింది. ఇద్దరు అఫ్ఘానిస్థాన్ ఆటగాళ్లు కూడా లీగ్‌లో అడుగుపెడుతుండటం మరో విశేషం. బెంగళూరు: ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ పంట పండింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) పదో సీజన్ కోసం అతను రికార్డు మొత్తానికి అమ్ముడుపోయాడు. స్టోక్స్‌ను రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్ రూ. 14 కోట్ల 50 లక్షలకు సొంతం చేసుకుంది. ఐపీఎల్ చరిత్రలో వేలంలో ఇది రెండో అత్యధిక మొత్తం కావడం విశేషం. గతంలో యువరాజ్ సింగ్‌కు ఢిల్లీ చెల్లించిన రూ. 16 కోట్లతో పోలిస్తే ఇది కోటిన్నర మాత్రమే తక్కువ. ప్రస్తుతం ఐపీఎల్లో ఉన్న ఆటగాళ్లలో విరాట్ కోహ్లి (అధికారికంగా రూ. 15 కోట్లు) తర్వాత ఎక్కువ మొత్తం అందుకోబోయేది కూడా స్టోక్స్ కావడం విశేషం. ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ టైమల్ మిల్స్ కోసం కూడా బెంగళూరు జట్టు ఏకంగా రూ. 12 కోట్లు ఖర్చు చేసింది. మిషెల్ స్టార్క్ అనూహ్యంగా తప్పుకోవడంతో అతని స్థానంలో లెఫ్టార్మ్ పేసర్ కావాలని కోరుకున్న ఫ్రాంచైజీకి మిల్స్ రూపంలో ప్రత్యామ్నాయం కనిపిం చింది. టి20 స్పెషలిస్ట్‌గా గుర్తింపు ఉన్న ఇత ను, ఇంగ్లండ్ తరఫున 4 మ్యాచ్‌లే ఆడినా... ఇటీవల భారత్‌తో జరిగిన సిరీస్‌లో అతని బౌలింగ్ కోహ్లిని ఆకట్టుకోవడం మిల్స్‌కు కలిసొచ్చింది. ఐపీఎల్లో ఒక బౌలర్‌కు చెల్లిస్తున్న అత్యధిక మొత్తం కూడా ఇదే. జాగ్రత్తగా... గత ఏడాదిలాగే ఈసారి కూడా ఫ్రాంచైజీలు ఆటగాళ్ల కోసం అత్యుత్సాహం ప్రదర్శించలేదు. పేరు ప్రఖ్యాతులకంటే కూడా తమ జట్టు అవసరం, ఆటగాడు నిర్వహించాల్సిన పాత్రను దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా వేలంలోకి వెళ్లాయి. కోల్‌కతా జట్టు అయితే తొలి 22 మంది ఆటగాళ్ల వరకు కనీసం స్పందించనే లేదు. బెంగళూరు మరింత అవకాశం ఉన్నా సరే... అందరికంటే తక్కువగా ఐదుగురు ఆటగాళ్లతోనే సరి పెట్టింది. అంతర్జాతీయ క్రికెట్లో చురుగ్గా కొనసాగుతున్న పలువురు విదేశీ ఆటగాళ్లను, సీనియర్లను పట్టించుకోని ఫ్రాంచైజీలు... జట్టుకు బలం కాగలడనిపించిన భారత యువ ఆటగాళ్లపైనే ఎక్కు వ నమ్మకముంచడం విశేషం. రబడ (రూ. 5 కోట్లు), బౌల్ట్ (రూ. 5 కోట్లు), ప్యాట్ కమిన్స్ (రూ. 4.5 కోట్లు), క్రిస్ వోక్స్ (రూ. 4.2 కోట్లు), రషీద్ ఖాన్ (రూ. 4 కోట్లు) భారీ మొత్తం గెలుచుకున్న ఆటగాళ్ల జాబితాలో ఉన్నారు. ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల కెప్టెన్ ఇయాన్ మోర్గాన్‌కు రూ. 2 కోట్లు మాత్రమే దక్కాయి. 2016లో రూ. 8.5 కోట్లతో సంచలనం సృష్టించిన పవన్ నేగి ఈసారి రూ. 1 కోటి ధర పలికాడు. ఆ ఇద్దరి కోసం... స్టోక్స్ కనీస ధర రూ. 2 కోట్ల వద్ద అందరికంటే ముందుగా ముంబై బరిలో నిలిచింది. ఆ తర్వాత ముంబైతో పోటీ పడిన ఢిల్లీ దీనిని రూ. 10.5 కోట్ల వరకు తీసుకుపోయింది. ఈ సమయంలో అడుగు పెట్టిన సన్‌రైజర్స్ కూడా రూ. 13 కోట్ల వరకు ఆసక్తి చూపించింది. అయితే వెనక్కి తగ్గని పుణే చివరకు రూ. 14.5 కోట్లకు స్టోక్స్‌ను గెలుచుకుంది. రూ. 50 లక్షల కనీస ధరతో వచ్చిన మిల్స్ కోసం ముందుగా ముంబై బిడ్ వేసిం ది. ఆ తర్వాత పంజాబ్ కూడా పోటీ పడి ఒక దశలో ఆగిపోయింది. కోల్‌కతా కూడా రూ.10.5 కోట్లు ఇచ్చేందుకు సిద్ధపడినా... చివరకు చాలెంజర్స్దే పైచేయి అయింది. మరో వైపు 25 ఏళ్ల తమిళనాడు లెఫ్టార్మ్ పేసర్ తంగరసు నటరాజన్‌కు కూడా బిగ్ బొనాంజా లభించింది. కనీస ధర రూ. 10 లక్షలకు 30 రెట్లు ఎక్కువగా రూ. 3 కోట్లు చెల్లించి పంజాబ్ అతడిని సొంతం చేసుకుంది. రోజువారీ కూలీ కుమారుడు అయిన నటరాజన్ తమిళనాడు ప్రీమియర్ లీగ్‌తో వెలుగులోకి వచ్చాడు. అందులో ఒక మ్యాచ్ సూపర్ ఓవర్లో అతను ఆరు అద్భుతమైన యార్కర్లు వేయడం విశేషం. జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించకుండా భారీ మొత్తం సొంతం చేసుకున్న భారత ఆటగాళ్లలో బాసిల్ తంపి (రూ. 85 లక్షలు), కృష్ణప్ప గౌతమ్ (రూ. 2 కోట్లు), అనికేత్ చౌదరి (రూ. 2 కోట్లు) ఉన్నారు. నంబర్వన్నూ పట్టించుకోలేదు! ఇమ్రాన్ తాహిర్... ప్రస్తుతం ఐసీసీ వన్డే, టి20 ర్యాంకింగ్స్‌లో వరల్డ్ నంబర్‌వన్ బౌలర్. టి20 ఫార్మాట్లో 148 మ్యాచ్‌లు ఆడిన అతని కెరీర్ బౌలింగ్ రికార్డు చాలా మెరుగ్గా ఉంది. తన లెగ్‌స్పిన్‌తో మధ్య ఓవర్లలో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేయగల సామర్థ్యం ఉన్న తాహిర్ (దక్షిణాఫ్రికా) మూడు రోజుల క్రితమే కివీస్‌పై 5 వికెట్లు తీశాడు. అయితే ఇవేవీ తాహిర్పై ఫ్రాంచైజీలకు నమ్మకాన్ని పెంచలేకపోయాయి. రూ. 50 లక్షల కనీస ధరతో మళ్లీ మళ్లీ వేలంలోకి అతని పేరు వచ్చినా ఎవరూ స్పందించలేదు. విదేశీ ఆటగాళ్ల వేలానికి ఇది అందరికంటే ఎక్కువగా ఆశ్చర్యపరచిన అంశం. మార్టిన్ గప్టిల్, జేసన్ రాయ్‌లాంటి హిట్టర్లను కూడా తొలి దశలో ఎవరూ తీసుకోలేదు కానీ ఆ తర్వాత మరోసారి వేలంలో పేరు వచ్చినప్పుడు వారు కనీస ధరకు అమ్ముడుపోయారు. రెండు సార్లు ప్రపంచ కప్ విజేతగా నిలిచిన జట్టు కెప్టెన్ స్యామీని కేవలం రూ.30 లక్షలకే పంజాబ్ సొంతం చేసుకోగా... ఈ రెండు సార్లు ‘మ్యాన్ ఆఫ్ ద ఫైనల్’ శామ్యూల్స్‌ను ఎవరూ పట్టించుకోలేదు. అంతర్జాతీయ క్రికెటర్లుగా తమకంటూ ప్రత్యేక గుర్తింపు ఉన్నా ఐపీఎల్ లెక్కలోకి తీసుకోని విదేశీ క్రికెటర్లలో రాస్ టేలర్, అలెక్స్ హేల్స్, బెయిర్‌స్టో, జేసన్ హోల్డర్, తిసార పెరీరా, బెహర్దీన్, కుషాల్ పెరీరా, సాన్‌ట్నర్, గ్రాండ్‌హోమ్ ఉన్నారు. అఫ్ఘనాపాటీలు... అంతర్జాతీయ క్రికెట్లో తమ జట్టు ఇంకా ఓనమాల దశలోనే ఉన్నా ఇద్దరు అఫ్ఘనిస్తాన్ క్రికెటర్లు మాత్రం ఐపీఎల్లో అవకాశం దక్కించుకొని ఒక్కసారిగా తమ స్థాయిని పెంచుకున్నారు. 18 ఏళ్ల లెగ్‌స్పిన్నర్ రషీద్ ఖాన్ కోసం ఏకంగా రూ. 4 కోట్లు వెచ్చించిన సన్‌రైజర్స్ హైదరాబాద్, వెటరన్ ఆల్‌రౌండర్ మొహమ్మద్ నబీని రూ. 30 లక్షలకు సొంతం చేసుకుంది. రషీద్ కోసం రైజర్స్‌తో పాటు ముంబై జట్టు కూడా వేలంలో పోటీ పడింది. ఏడాదిన్నర క్రితమే అంతర్జాతీయ క్రికెట్లో అడుగు పెట్టి 18 వన్డేలు, 21 టి20లు ఆడిన రషీద్‌కు అప్పుడే ఐపీఎల్ కాంట్రాక్ట్ దక్కడం గొప్ప విశేషంగా చెప్పవచ్చు. ఎనిమిదేళ్ల కెరీర్లో నబీ కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు. ఐపీఎల్లో వీరిద్దరి రాక అప్ఘన్ జట్టు వేగంగా ఎదుగుతోందనడానికి సంకేతంగా చెప్పవచ్చు. వీరితో పాటు యూఏఈ ఆటగాడు చిరాగ్ సూరిని గుజరాత్ రూ. 10 లక్షలకు సొంతం చేసుకుంది. డస్కటే (నెదర్లాండ్స్) తర్వాత అసోసియేట్ జట్ల నుంచి ఐపీఎల్‌కు ఎంపికైన ఆటగాళ్లు వీరు ముగ్గురే. పాపం ఇషాంత్... ‘ఇషాంత్ కనీస విలువ రూ. 2 కోట్లు చాలా ఎక్కువ’... ఐపీఎల్ వేలం సందర్భంగా అతని మాజీ సహచరుడు గంభీర్ చేసిన వ్యాఖ్య ఇది. భారత టెస్టు జట్టులో రెగ్యులర్ ఆటగాడైన ఇషాంత్... వన్డేలు, టి20ల్లో మాత్రం భాగం కాదు. అయితే టి20ల్లో అద్భుతమైన బౌలర్ కాకపోయినా... అతని అనుభవాన్ని బట్టి చూస్తే ప్రస్తుత భారత ఆటగాడిని ఫ్రాంచైజీలు ఏమాత్రం పట్టించుకోకపోవడం ఆశ్చర్యం కలిగించింది. గంభీర్ మాటలను బట్టి చూస్తే అతనికి రూ. 2 కోట్లు ఇవ్వడం కూడా ఎక్కువ అని జట్లు భావించి ఉంటాయి. చాలా రోజులుగా భారత జట్టుకు దూరంగా ఉన్నా... తన కనీస ధరను రూ. 30 లక్షలుగా మాత్రమే నిర్ణయించుకున్న వరుణ్ ఆరోన్‌కు రూ. 2.8 కోట్ల భారీ మొత్తం దక్కడం విశేషం. ఆరోన్తో పోల్చుకుంటే తక్కువ ధర వద్ద మొదలైతే ఇషాంత్‌కు కూడా అవకాశం ఉండేదేమో! ఊహించినట్లుగానే మరో టెస్టు ఆటగాడు పుజారాను ఈసారి కూడా ఫ్రాంచైజీలు పట్టించుకోలేదు. ఇక దాదాపు నాలుగున్నరేళ్ల క్రితం ఆఖరిసారిగా భారత్‌కు ఆడిన ఇర్ఫాన్ పఠాన్‌పై కూడా ఎవరూ ఆసక్తి చూపించలేదు. దేశవాళీలో అప్పుడప్పుడు కొన్ని మెరుపులు ప్రదర్శిస్తూ... తనను తాను టి20 స్పెషలిస్ట్‌గా ఇర్ఫాన్ చూపించే ప్రయత్నం చేసినా ఫలితం దక్కలేదు. వేలంలో అమ్ముడుపోకుండా నిరాశకు గురైన ఇతర భారత ఆటగాళ్లలో ప్రజ్ఞాన్ ఓజా, ముకుంద్, పర్వేజ్ రసూల్, ఆర్పీ సింగ్ ఉన్నారు. జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించకపోయినా... ఇటీవల కొన్ని ప్రత్యేక ప్రదర్శనలతో వార్తల్లో నిలిచి లీగ్‌కు ఎంపికవుతామని ఆశించిన అనేక మంది కుర్రాళ్లపై కూడా ఫ్రాంచైజీలు ఆసక్తి చూపించలేదు. టి20ల్లో ట్రిపుల్ సెంచరీ చేసిన మోహిత్ ఆహ్లావత్, 17 ఏళ్ల పృథ్వీ షా, రంజీ టాప్ స్కోరర్ ప్రియాంక్ ఈ జాబితాలో ఉన్నారు. ఎవరికెంత వచ్చిందంటే... -
చెలరేగిన భువనేశ్వర్
తొలి ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్ 225 ఆలౌట్ భారత్‌కు 128 పరుగుల ఆధిక్యం గ్రాస్ ఐలెట్: భారత పేసర్ భువనేశ్వర్ కుమార్ (5/33) ధాటికి వెస్టిండీస్ జట్టు కుప్ప కూలింది. ఓ దశలో టాపార్డర్ రాణింపుతో పటిష్టంగా కనిపించినా... 23 పరుగుల వ్యవధిలో చివరి ఏడు వికెట్లు కోల్పోయింది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో 103.4 ఓవర్లలో 225 పరుగులకు ఆలౌటయింది. బ్రాత్‌వైట్ (163 బంతుల్లో 64; 6 ఫోర్లు), మార్లన్ శామ్యూల్స్ (109 బంతుల్లో 48; 7 ఫోర్లు, 1 సిక్స్) మినహా మిగతావారు విఫలమయ్యారు. అశ్విన్‌కు రెండు, ఇషాంత్, జడేజాలకు ఒక్కో వికెట్ దక్కింది. భారత్‌కు 128 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. 107/1 ఓవర్‌నైట్ స్కోరుతో నాలుగో రోజు శుక్రవారం ఆట ప్రారంభించిన విండీస్ ప్రారంభంలోనే రెండు వికెట్లు కోల్పోయింది. బ్రావోను ఇషాంత్ అవుట్ చేయగా మరో మూడు ఓవర్ల అనంతరం అశ్విన్ బౌలింగ్‌లో బ్రాత్‌వైట్ కీపర్ సాహాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఈ దశలో మార్లన్ శామ్యూల్స్, బ్లాక్‌వుడ్ (86 బంతుల్లో 20; 1 ఫోర్) సమయోచితంగా ఆడారు. ముఖ్యంగా జడేజా, అశ్విన్ బౌలింగ్‌లో శామ్యూల్స్ ఎదురుదాడికి దిగి పరుగులు సాధించాడు. వీరిద్దరి ఆటతీరుతో నాలుగో వికెట్‌కు 67 పరుగులు జతచే రాయి. అయితే లంచ్ విరామానంతరం పేసర్ భువనేశ్వర్ విండీస్ బ్యాటింగ్ ఆర్డర్‌ను వణికించాడు. చివరి ఏడు వికెట్లలో ఐదు భువనేశ్వరే తీశాడు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్... కడపటి వార్తలు అందే సమయానికి... 2 ఓవర్లలో 8 పరుగులు చేసింది. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: 353 వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్: బ్రాత్‌వైట్ (సి) సాహా (బి) అశ్విన్ 64; జాన్సన్ (రనౌట్) 23; డారెన్ బ్రావో (సి) జడేజా (బి) ఇషాంత్ 29; శామ్యూల్స్ (బి) భువనేశ్వర్ 48; బ్లాక్‌వుడ్ (సి) కోహ్లి (బి) భువనేశ్వర్ 20; చేజ్ (సి) రహానే (బి) జడేజా 2; డౌరిచ్ (సి) ధావన్ (బి) భువనేశ్వర్ 18; హోల్డర్ ఎల్బీడబ్ల్యు (బి) భువనేశ్వర్ 2; జోసెఫ్ (సి) రాహుల్ (బి) భువనేశ్వర్ 0; కమ్మిన్స్ (సి) సాహా (బి) అశ్విన్ 0; గాబ్రియల్ నాటౌట్ 0; ఎక్స్టాలు 19; మొత్తం (103.4 ఓవర్లలో ఆలౌట్) 225. వికెట్ల పతనం: 1-59, 2-129, 3-135, 4-202, 5-203, 6-205, 7-212, 8-212, 9-221, 10-225. బౌలింగ్: భువనేశ్వర్ 23.4-10-33-5; షమీ 17-3-58-0; అశ్విన్ 26-7-52-2; ఇషాంత్ 13-2-40-1; జడేజా 24-9-27-1. -
దూకు దూకు దూకుతాడనే టెన్షనూ...!
ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో కూడా తెలిసినోడే గొప్ప కెప్టెన్ అవుతాడు. సినిమా డైలాగ్‌లా అనిపించినా క్రికెట్లో ఇది కఠోర వాస్తవం. ఓ మ్యాచ్‌లో నెగ్గడానికి ఎన్ని వ్యూహాలైనా అమలు చేయొచ్చు. బ్యాట్‌తో, బంతితో ఎలాంటి దూకుడునైనా చూపించొచ్చు. కానీ ప్రవర్తన విషయంలో మాత్రం సంయమనం ఉండాలి. ఆటగాడిగా కోహ్లి గతంలో అనేకసార్లు నియంత్రణ కోల్పోయాడు. కెప్టెన్ అయ్యాక కూడా తన శైలి పెద్దగా మారలేదు. అయితే తాజాగా శ్రీలంక సిరీస్‌లో మిగిలిన జట్టుకు కూడా ఇదే అలవాటు చేశాడు. ఈ దూకుడు ఇలాగే కొనసాగితే భవిష్యత్‌లో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందనేదే ఇప్పుడు టెన్షన్. తాను చూపించిన మార్గమే... విరాట్ కోహ్లికి వివాదాలతో అవినాభావ సంబంధం ఉంది. అవసరం ఉన్నా లేకపోయినా అతని నోటినుంచి వచ్చే బూతు పురాణం చాలా ప్రసిద్ధికెక్కింది! మూడేళ్ల క్రితం సిడ్నీ టెస్టు సందర్భంగా ప్రేక్షకులకు వేలు చూపించడం, ఐపీఎల్లో గంభీర్‌తో గొడవ, హరారేలో అంపైర్లతో వాదన అతనికి చెడ్డ పేరు తెచ్చి పెట్టాయి. గత ఏడాది చివర్లో ఆస్ట్రేలియాతో సిరీస్‌లో మిషెల్ జాన్సన్‌ను ఎదుర్కోవడంలో చూపించిన తెగువకు ఆరంభంలో అభినందనలు అందించినా...అది అతి కావడంతో సమస్యగా మారింది. అసలు 2008లో అండర్-19 ప్రపంచకప్‌ను గెలిపించిన కెప్టెన్ కోహ్లి, ఆ టోర్నీలోనే రూబెల్ హుస్సేన్‌తో దూషణకు దిగిన ఘటన అతని వివాదాలకు బీజం వేసింది. ఇక ఇటీవల వన్డే ప్రపంచకప్ సమయంలో జర్నలిస్ట్‌ను కూడా అకారణంగా తిట్టడం, చివరకు ఎలాగోలా దానికి ముగింపు పలకడం ఎవరి మదినుంచీ చెరిగిపోలేదు. ఇదంతా ఆటగాడిగా అతని ట్రాక్ రికార్డు. అయితే అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన, కోహ్లి అందించిన విజయాలు ఈ ఘటనలను మరచిపోయేలా చేసినా... ఏదో ఒక సమయంలో అవి మళ్లీ బయటకు వస్తున్నాయి. నాయకుడే ఇలా ఉంటే... మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో నిలకడగా ఆడుతున్న కుషాల్ పెరీరా క్యాచ్‌ను మిడాఫ్‌లో అందుకున్న కోహ్లి ఆగ్రహంతో బంతిని ఫుట్బాల్లా తన్నాడు. నోటినుంచి నాలుగు ‘బూతులు’ కూడా జాలువారాయి. కెప్టెన్‌ను చూశాకేనేమో బౌలర్ ఇషాంత్ కూడా పెరీరాను ఏదో అన్నాడు. ఆ సమయానికి భారత్ టెస్టులో సంపూర్ణ ఆధిక్యంలో ఉంది. మ్యాచ్ హోరాహోరీగా ఏమీ సాగడం లేదు. కానీ విరాట్ ఇంతగా స్పందించాల్సిన అవసరం ఏమిటో అర్థం కాలేదు. ‘మాకు గౌరవం ఇవ్వని వారిని మేం గౌరవించాల్సిన పని లేదు’ అంటూ ఆస్ట్రేలియా సిరీస్‌నుంచి కోహ్లి తనను తాను సమర్థించుకుంటూ రావచ్చు గాక... కానీ అన్నింటికి అదే సమాధానం కాబోదు. సరిగ్గా చెప్పాలంటే కోహ్లి తనలాగే తన జట్టు సభ్యులు కూడా ఉండాలని కోరుకుంటున్నాడు. అందుకే దూకుడు... దూకుడు అంటూ ఒకటే పాఠం వల్లె వేస్తున్నాడు. కోహ్లి దూకుడే సిరీస్ విజయం అందించిందని కొంత మంది చెబుతున్నా, గత కొన్నేళ్లలో అత్యంత బలహీనంగా కనిపించిన ఈ శ్రీలంక జట్టుపై గెలిచేందుకు అది అవసరమా అనిపిస్తుంది. గంగూలీతో పోలిక 2002లో లార్డ్స్‌లో విజయానంతరం గంగూలీ చొక్కా విప్పి చేసుకున్న సంబరాలు ఎవరూ మరచిపోలేరు. అంతకు ముందునుంచి కూ డా గంగూలీ ప్రత్యర్థి ఆటగాళ్లతో ఢీ అంటే ఢీ అని తలపడేందుకు సిద్ధంగా ఉండేవాడు. ఆస్ట్రేలియాలాంటి జట్టుతో కూడా మాటల యుద్ధానికి సై అనేవాడు. ఇప్పుడు కోహ్లి ప్రవర్తన కొంత వరకు సౌరవ్‌ను గుర్తుకు తెస్తోంది. ‘గాంధీయవాది’లాగే ఉంటే కుదరదు కాబట్టి ‘దూకుడు’ అనే స్టాంప్ అందరికీ ఉండాలి, అప్పుడే వారు ఆటలో దూసుకుపోగలరని కోహ్లి గట్టిగా నమ్ముతున్నాడు. అయితే నాడు ఒక వైపు అగ్నిలా సౌరవ్ ఉన్నా పరిస్థితిని శాంతపరిచేందుకు జట్టులో సచిన్, ద్రవిడ్, లక్ష్మణ్‌లాంటి దిగ్గజాలు ఉండేవారు. ఆటతోనే కాకుండా వ్యక్తిత్వంలోనూ అత్యుత్తమ ఆటగాళ్లైన వీరి అండ గంగూలీకి కెప్టెన్‌గా ఉన్నన్ని రోజులు సహకరించింది. కుంబ్లే కెప్టెన్‌గా ఉన్నా... సైమండ్స్, హర్భజన్ వివాదాన్ని సాధ్యమైనంత తగ్గించడంలో సచిన్ కూడా కీలక పాత్ర పోషించిన విషయం మరచిపోలేం. కానీ కోహ్లి పరిస్థితి అలా కాదు. ఇది ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న కొత్త జట్టు. తనకు ఉన్న అనుభవంతోనే జట్టును తీర్చిదిద్దుకోవాల్సిన పనిలో కోహ్లి ఉన్నాడు. సహజంగానే కెప్టెన్ మాట, అతని ప్రవర్తన ఆటగాళ్లపై ప్రభావం చూపిస్తుంది. ‘ఓహో... ఇలా ఉండటమే కెప్టెన్‌కు ఇష్టం’ అనే సందేశం ఇప్పుడు ఆటగాళ్లకు వెళుతోంది. అనవసరపు దూకుడుతో ఒక ప్రధాన ఆటగాడిని కీలక మ్యాచ్‌కు జట్టు కోల్పోవడం అర్థం లేనిది. ఇలాంటిదే పునరావృతం అయితే రేపు కోహ్లిపై కూడా నిషేధం పడవచ్చు. మారాల్సిన సమయం కోహ్లి కెప్టెన్సీలో భారత్ ఇప్పటి వరకు ఆరు టెస్టులు ఆడింది. 2 గెలిచి, 2 ఓడి, 2 డ్రా చేసుకుంది. అప్పుడే అతని పరిణతిపై మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ పదే పదే చెప్పే దూకుడు మాత్రమే జట్టుకు విజయాన్ని అందించలేదని ఇప్పటికే అతనికి అర్థమై ఉండాలి. నిజానికి తన స్వభావాన్ని సరైన దిశలో చూపిస్తే అద్భుతాలు చేయగలనని అతను తన బ్యాటింగ్‌తో చాలా సార్లు నిరూపించాడు. ఆటగాడిగా కోహ్లి అందించిన విజయాలు వెలకట్టలేనివి. మరో వైపు సంగక్కరకు ఫేర్వెల్ ఇవ్వడంలో, మూడో టెస్టులో సెంచరీ సాధించిన మ్యాథ్యూస్‌ను భుజంపై తట్టి అభినందించడం చూస్తే ప్రత్యర్థిని గౌరవించగల స్ఫూర్తి కూడా అతనిలో ఉంది. అయితే అనవసరంగా తెచ్చి పెట్టుకునే ఆవేశాన్ని అతను ఇప్పుడు అదుపులో ఉంచుకోవాలి. మరీ మెషీన్ తరహాలో బిగదీసుకోవాల్సిన అవసరం లేదు కానీ.... దూషణలకు దిగే, గొడవలు పెట్టుకునే కెప్టెన్‌ను మనం చూడాలనుకోవడం లేదు. టీవీలో కనిపించే ఈ ఘటనలు అతడి పేరును మరింత చెడగొడతాయి. తన సీనియర్ ధోని నుంచి ఏది నేర్చుకున్నా, నేర్చుకోకపోయినా... సంయమనంగా ఉండటంలో మాత్రం ‘కెప్టెన్ కూల్’ను అనుసరించాల్సిందే. -
లంకను జయించారు
సాధించారు... మూడో టెస్టులో భారత్ ఘన విజయం ♦ 2-1తో సిరీస్ కైవసం ♦ చెలరేగిన ఇషాంత్, అశ్విన్ ♦ మ్యాథ్యూస్ శతకం వృథా వెళ్లిన ప్రతిసారి ఏదో ఓ వైఫల్యంతో వెనక్కి వచ్చేస్తున్న పరిస్థితి... జట్టులో సీనియర్లు లేరు... అనుభవమూ అంతంత మాత్రమే... కొత్త ఆశలు.. కొంగొత్త సవాళ్లతో జట్టులోకి వచ్చిన కుర్రాళ్లు... ప్రత్యర్థిదేమో.. సొంతగడ్డపై బెబ్బులిలా పోరాడే తత్వం... తొలి టెస్టు ఓటమి ప్రభావం ఓ మూలన మిణుకుమంటున్నా.... మైదానంలో పరిస్థితులు సవాళ్లుగా మారుతున్నా.. మొక్కవోని ఆత్మవిశ్వాసంతో... నైపుణ్యాన్ని ఆయుధంగా మల్చుకుని లంక గడ్డపై యువ భారత్ రెచ్చిపోయింది. ప్రత్యర్థికి చుక్కలు చూపెడుతూ... తిరుగులేని ఆటతీరుతో 22 ఏళ్ల తర్వాత లంకలో సిరీస్‌ను సొంతం చేసుకుంది. ఒక విదేశీ సిరీస్‌లో తొలి టెస్టు ఓడి కూడా సిరీస్ గెలుచుకోవడం భారత్‌కు ఇదే తొలిసారి. అసలు ‘దూకుడు’ అనే మాట తమతోనే పుట్టిందా అన్నట్లు... దానికి కొత్త అర్థాన్ని చూపించాలన్నట్లు కెప్టెన్ పదే పదే తన సహచరులలో స్ఫూర్తి నింపే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో కొన్ని విమర్శలు ఎదురైనా, డెరైక్టర్ రవిశాస్త్రి అండతో కోహ్లి తాను అనుకున్న వ్యూహాలకు కట్టుబడ్డాడు. ‘మూడు టెస్టుల సిరీస్ నా సత్తాకు సవాల్. ఎందుకంటే పూర్తి స్థాయి సిరీస్ ఉంటే నా వ్యూహాల్లో తప్పులు జరిగినా దిద్దుకోగలను’ అని సిరీస్‌కు ముందు కోహ్లి చెప్పా డు. తొలి టెస్టులో ఆద్యంతం ఆధిక్యం ప్రదర్శించినా, ఒకే సెషన్లో వెనుకబడి మ్యాచ్ కోల్పోవడం షాక్‌కు గురిచేసింది. దాంతో ఒక్కసారిగా అతనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అయితే కోహ్లి నేర్చుకున్నాడు. తర్వాతి రెండు టెస్టుల్లో మ్యాచ్‌లు చేజారకుండా తాను అనుకున్న వ్యూహాలకు కట్టుబడి సిరీస్ సాధించాడు. బౌలింగ్ అద్భుతం : సొంతగడ్డపై అమోఘమైన రికార్డు ఉన్న అశ్విన్ ఇప్పుడు దానిని లంకలో కూడా కొనసాగించాడు. స్పిన్‌లో వైవిధ్యంతో పాటు బౌన్స్‌ను కూడా చక్కగా ఉపయోగించుకొని అతను 21 వికెట్లతో సత్తా చాటాడు. నాలుగేళ్ల తర్వాత జట్టులోకి వచ్చినా తన లెగ్‌స్పిన్‌లో పదును తగ్గలేదని నిరూపిస్తూ అమిత్ మిశ్రా సిరీస్‌లో సగటు, ఎకానమీ, స్ట్రైక్‌రేట్...ఇలా అన్నింటిలో అత్యుత్తమంగా నిలిచాడు. ఇక ఇషాంత్ బౌలింగ్ ప్రత్యర్థిని ‘తల బాదుకునేలా’ చేసింది. గత ఏడాది లార్డ్స్ టెస్టులో అద్భుత విజయాన్ని అందించిన ఇషాంత్ మరో సారి తన పేస్ పదునుతో జట్టును టెస్టు గెలిపించాడు. ఉమేశ్ ఎక్కువ వికెట్లు తీయకపోయినా (5) లంక టాపార్డర్‌ను పూర్తిగా కట్టి పడేశాడు. మొత్తానికి కోహ్లి అనుకున్న ఐదుగురు బౌలర్ల సిద్ధాంతానికి వీరంతా న్యాయం చేశారు. 1988 తర్వాత భారత బౌలర్లు 3 టెస్టుల సిరీస్‌లో తొలిసారి అన్ని 60 వికెట్లు పడగొట్టడం విశేషం. ఐదు శతకాలు: సిరీస్‌లో గొప్పగా కనిపించకపోయినా భారత బ్యాటింగ్ ప్రదర్శన కూడా నిలకడగా సాగింది. ప్రతీ టెస్టుకు వేర్వేరు ఓపెనింగ్ జోడీలు బరిలోకి దిగినా ఇద్దరిలో ఒకరు రాణించడం జట్టుకు కలిసొచ్చింది. ధావన్, రాహుల్, పుజారా సెంచరీలు చేయగా, రెండో టెస్టులో రహానే కూడా కీలక శతకం బాదాడు. ముఖ్యంగా టెస్టు జట్టుకు పుజారా అవసరం ఎంత ఉందో అతను మూడో టెస్టులో స్వింగ్ బౌలింగ్‌ను ఎదుర్కొని చేసిన పరుగులు చూస్తే తెలుస్తుంది. కోహ్లి కూడా సెంచరీ చేసినా అతని స్థాయికి తగిన ప్రదర్శన మాత్రం రాలేదు. రోహిత్ ఎలాగోలా రెండు అర్ధ సెంచరీలు చేసినా...తనకు టెస్టుల్లో స్థానంపై వచ్చిన సందేహాలకు మాత్రం సమాధానమివ్వలేకపోయాడు. జోరు కొనసాగాలి : గత రెండేళ్లలో జొహన్నెస్‌బర్గ్, వెల్లింగ్టన్, గాలేలలో విజయానికి చేరువగా వచ్చినా... దానికి దూరమైన భారత్ ఇప్పుడు కొలంబోలో చివరకు లక్ష్యాన్ని చేరింది. సచిన్ రిటైర్మెంట్ తర్వాత తొలి సిరీస్ నెగ్గిన యువ ఆటగాళ్లలో గెలుపు కళ కనిపిస్తోంది. అయితే ఏ రకంగా చూసిన ప్రస్తుత శ్రీలంక జట్టు చాలా బలహీనం. మనకంటే అనుభవం తక్కువ ఉన్న ఆటగాళ్లు అక్కడ చాలా మంది ఉన్నారు. ఇది మన గెలుపు రికార్డును మార్చకపోవచ్చు గానీ...రానున్న దక్షిణాఫ్రికా సిరీస్‌లో సత్తా చాటితే కోహ్లి సేనకు తిరుగుండదు. మన గడ్డపై కూడా సఫారీలు ఎప్పుడైనా ప్రమాదకర ప్రత్యర్థే. వారిని నిలువరించి విజయం అందుకుంటే టెస్టుల్లో మన ముద్ర స్పష్టంగా కనిపిస్తుంది. -సాక్షి క్రీడా విభాగం కొలంబో : రాబోయేది మొత్తం టెస్టుల సీజన్. ఇందులో తొలి పరీక్షలో కోహ్లిసేన శ్రీలంకలో దిగ్విజయంగా పాసయింది. మూడు టెస్టుల సిరీస్‌ను 2-1తో సొంతం చేసుకుంది. అశ్విన్ (4/69), ఇషాంత్ (3/32) పరాక్రమం చూపెట్టడంతో మంగళవారం ముగి సిన చివరి టెస్టులో భారత్ 117 పరుగుల తేడాతో శ్రీలంకపై ఘన విజయం సాధించింది. 22 ఏళ్ల తర్వా త లంక గడ్డపై సిరీస్‌ను చేజిక్కించుకున్న టీమిండియా.. 2011 తర్వాత విదేశీ గడ్డపై తొలిసారి సిరీస్ విజయాన్ని సొంతం చేసుకుంది. 386 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన లంక రెండో ఇన్నిం గ్స్‌లో 85 ఓవర్లలో 268 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్ మ్యాథ్యూస్ (240 బంతుల్లో 110; 13 ఫోర్లు) పోరాటానికి తోడు కుశాల్ పెరీరా (106 బంతుల్లో 70; 11 ఫోర్లు) సమయోచితంగా రాణించాడు. కానీ సహచరుల వైఫల్యం లంక జట్టుకు ఓటమిని మిగిల్చింది. పుజారాకు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’; అశ్విన్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ లభించాయి. డ్రా వైపు మొగ్గినా: 67/3 ఓవర్‌నైట్ స్కోరుతో ఆఖరి రోజు ఆట కొనసాగించిన లంకేయులపై భారత బౌలర్లు ఒత్తిడి పెంచడంలో సఫలమయ్యారు. మ్యాథ్యూస్ నిలకడగా ఆడినా... రెండో ఎండ్‌లో కౌశల్ సిల్వ (27), తిరిమన్నే (12)లను అవుట్ చేయడంతో లంక 107 పరుగులకు 5 వికెట్లు కోల్పోయింది. అయితే రెండో సెషన్లో మ్యాథ్యూస్, కుశాల్ పెరీరాలు ఓ రేంజ్లో పోరాటం చేశారు. ఈ ఇద్దరి జోరుతో ఓ దశలో మ్యాచ్ డ్రా తప్పదేమో అనుకుంటున్న దశలో పెరీరా చేసిన తప్పు భారత్‌కు వరంగా మారింది. 77వ ఓవర్లో అశ్విన్ బంతిని అనవసరంగా రివర్స్ స్వీప్ ఆడి రోహిత్ చేతికి చిక్కాడు. ఫలితంగా ఈ ఇద్దరి మధ్య ఆరో వికెట్‌కు నెలకొన్న 135 పరుగుల భారీ భాగస్వామ్యానికి తెరపడింది. 81వ ఓవర్లో కొత్త బంతితో ఇషాంత్ నిప్పులు చెరిగాడు. మ్యాథ్యూస్‌ను అవుట్ చేసి మ్యాచ్‌ను మలుపుతిప్పాడు. తర్వాత అశ్విన్, మిశ్రాలు మిగతా మూడు వికెట్లు తీసి చిరస్మరణీయ విజయాన్ని అందించారు. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: 312 ఆలౌట్ శ్రీలంక తొలి ఇన్నింగ్స్: 201 ఆలౌట్ భారత్ రెండో ఇన్నింగ్స్: 274 ఆలౌట్ శ్రీలంక రెండో ఇన్నింగ్స్: తరంగ (సి) ఓజా (బి) ఇషాంత్ 0; సిల్వ (సి) పుజారా (బి) ఉమేశ్ 27; కరుణరత్నే (సి) ఓజా (బి) ఉమేశ్ 0; చండిమల్ (సి) కోహ్లి (బి) ఇషాంత్ 18; మ్యాథ్యూస్ ఎల్బీడబ్ల్యు (బి) ఇషాంత్ 110; తిరిమన్నే (సి) రాహుల్ (బి) అశ్విన్ 12; కుశాల్ పెరీరా (సి) రోహిత్ (బి) అశ్విన్ 70; హెరాత్ ఎల్బీడబ్ల్యు (బి) అశ్విన్ 11; కౌశల్ నాటౌట్ 1; ప్రసాద్ (సి) బిన్నీ (బి) అశ్విన్ 6; ప్రదీప్ ఎల్బీడబ్ల్యు (బి) మిశ్రా 0; ఎక్స్‌ట్రాలు: 13; మొత్తం: (85 ఓవర్లలో ఆలౌట్) 268. వికెట్ల పతనం: 1-1; 2-2; 3-21; 4-74; 5-107; 6-242; 7-249; 8-257; 9-263; 10-268. బౌలింగ్: ఇషాంత్ 19- 5-32-3; ఉమేశ్ 15-3-65-2; బిన్నీ 13-3-49 -0; మిశ్రా 18-1-47-1; అశ్విన్ 20-2-69-4. 200 ఇషాంత్ శర్మ టెస్టుల్లో తీసిన వికెట్ల సంఖ్య. కపిల్ దేవ్ (434), జహీర్ (311), శ్రీనాథ్ (236) ఈ ఘనత సాధించిన ఇతర భారత పేసర్లు. 1 1993 తర్వాత లంక గడ్డపై సిరీస్ గెలవడం ఇదే తొలిసారి. గతంలో అజహర్ నేతృత్వం లోని టీమ్ 1-0తో సిరీస్‌ను గెలిచింది. ఇషాంత్‌పై టెస్టు నిషేధం కొలంబో: శ్రీలంకతో జరిగిన మూడో టెస్టులో దురుసుగా ప్రవర్తించినందుకు భారత పేసర్ ఇషాంత్ శర్మపై ఐసీసీ ఓ టెస్టు నిషేధాన్ని విధించింది. దీంతో నవంబర్‌లో దక్షిణాఫ్రికాతో జరిగే తొలి టెస్టుకు తను అందుబాటులో ఉండడు. అలాగే శ్రీలంక బ్యాట్స్‌మన్ దినేశ్ చండిమాల్ కూడా ఇదే కారణంతో ఓ వన్డే మ్యాచ్ నిషేధానికి గురయ్యాడు. తనతో పాటు లాహిరు తిరిమన్నే, దమ్మిక ప్రసాద్‌ల మ్యాచ్ ఫీజులో ఐసీసీ 50 శాతం కోత విధించింది. టెస్టును డ్రా చేసుకోవడం అనేది మాకు చివరి ప్రత్యామ్నాయం. ప్రతి మ్యాచ్‌లోనూ విజయం కోసం అవసరమైతే ఓడిపోవడమనే రిస్క్‌ను చేయడానికి వెనుకాడం. ఈ విజయం మా ఉత్సాహాన్ని పెంచింది. -కోహ్లి -
బ్యాడ్మింటన్ హుషారు...ఆటో షికారు!
కొలంబో : టెస్టు సిరీస్‌ను సమం చేసిన జోరులో ఉన్న భారత ఆటగాళ్లు తర్వాతి రోజును ఉత్సాహంగా గడిపారు. క్రికెటర్లు షట్లర్లుగా మారి సరదా తీర్చుకున్నారు. మంగళవారం కెప్టెన్ కోహ్లితో పాటు ఇషాంత్, భువనేశ్వర్, పుజారా సుదీర్ఘ సమయం బ్యాడ్మింటన్ ఆడారు. ఆ తర్వాత హర్భజన్, బిన్నీలతో కలిసి కోహ్లి ఆటోలో (అక్కడి భాషలో టుక్ టుక్) నగరం చుట్టొచ్చాడు. ఈ ఫోటోలను వీరు సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు. -
కోహ్లి నాయకత్వానికి పరీక్ష
♦ నేటినుంచి భారత్, శ్రీలంక తొలి టెస్టు ♦ రెండూ యువ జట్లే భారత జట్టు ఉపఖండంలో అద్భుతంగా ఆడుతుంది కానీ బయట రికార్డు గొప్పగా లేదు అనేది తరచుగా వినిపించే మాట. కానీ ఉపఖండంలో కూడా శ్రీలంకలో టీమిండియా ప్రదర్శన పేలవమే. 22 ఏళ్లుగా అక్కడ భారత్ సిరీస్ గెలవలేకపోయింది. ఇప్పుడు ఆ రికార్డును తిరగరాసేందుకు కోహ్లి సేన సన్నద్ధమైంది. ఇరు జట్లలో ఎక్కువ భాగం యువ ఆటగాళ్లే ఉండగా... ఇటీవలి ప్రదర్శనతో మొగ్గు మన వైపే కనిపిస్తోంది. టెస్టు కెప్టెన్‌గా కోహ్లి తన ముద్ర వేయగలడా అనేది కూడా ఆసక్తికరం. గాలే : కొంత విశ్రాంతి తర్వాత సుదీర్ఘ సీజన్‌కు భారత క్రికెట్ జట్టు సిద్ధమైంది. శ్రీలంక రూపంలో జట్టుకు తొలి సవాల్ ఎదురు కానుంది. మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా భారత్, లంక మధ్య నేటినుంచి (బుధవారం) మొదటి టెస్టు జరుగుతుంది. కెప్టెన్‌గా కోహ్లి తొలిసారి ఒక పూర్తి స్థాయి సిరీస్‌కు నాయకత్వం వహిస్తున్నాడు. మరో వైపు ఇటీవల అనూహ్యంగా పాకిస్తాన్ చేతిలో ఓడిన లంక కోలుకునే ప్రయత్నంలో ఉంది. ఆటగాళ్ల ఫామ్, ఓవరాల్‌గా జట్టు ప్రదర్శన చూస్తే భారత్ పరిస్థితి మెరుగ్గా ఉంది. అయితే సొంతగడ్డపై బలమైన జట్టయిన లంక తమ దిగ్గజం సంగక్కర వీడ్కోలు సిరీస్‌ను ఘనంగా ముగించాలని పట్టుదలగా ఉంది. ఐదుగురు బౌలర్లతోనే కెప్టెన్ అయిననాటినుంచి ఐదుగురు బౌలర్ల వ్యూహానికే కట్టుబడ్డానని పదే పదే చెబుతున్న విరాట్ కోహ్లి మరోసారి దానినే అమలు చేసే అవకాశం ఉంది. పేసర్లుగా ఇషాంత్, ఉమేశ్... ముగ్గురు స్పిన్నర్లుగా హర్భజన్, అశ్విన్, మిశ్రా తుది జట్టులో ఉండొచ్చు. గాయంతో విజయ్ దూరం కావడంతో జట్టుకు ఓపెనింగ్ సమస్య తొలగిపోయింది. ధావన్, రాహుల్‌లు ఓపెనర్లుగా బరిలోకి దిగుతారు. రాహుల్‌కు జట్టులో అందరికంటే తక్కువ అనుభవం ఉన్నా... అతనూ ఇప్పటికే ఆస్ట్రేలియాలో సెంచరీ చేసేశాడు. కోహ్లి, రహానేలు మిడిలార్డర్లో కీలకం కానున్నారు. పుజారాను కాదని తనపై నమ్మకం ఉంచిన మేనేజ్మెంట్ను సంతృప్తి పరచాల్సిన బాధ్యత రోహిత్ శర్మపై ఉంది. మూడో స్థానంలో అతను ఇప్పటికైనా రాణిస్తేనే టెస్టుల్లో భవిష్యత్తు ఉంటుంది. ఒక బ్యాట్స్‌మన్ తగ్గడంతో కీపర్ సాహా కూడా బాగా ఆడితే భారీస్కోరు సాధ్యమవుతుంది. పేరుకు యువ జట్టుగా కనిపిస్తున్నా ఇందులో ఇంగ్లండ్, ఆస్ట్రేలియాలలో ఆడి చాలా మంది ఆటగాళ్లు రాటుదేలారు. ఆసీస్‌తో టెస్టు సిరీస్‌లో తాత్కాలికంగా రెండు మ్యాచ్‌లు, బంగ్లాదేశ్‌తో ఏకైక టెస్టుకు కెప్టెన్సీ చేసిన కోహ్లి తన సామర్థ్యం నిరూపించుకునేందుకు ఇది తగిన అవకాశంగా భావిస్తున్నాడు. భారత టాప్-6 ఆటగాళ్లెవరూ ఇప్పటి వరకు శ్రీలంకలో ఆడలేదు. మ్యాథ్యూస్‌పై ఒత్తిడి టెస్టుల్లో నిలకడ లేని జట్టు పాకిస్తాన్ చేతిలో కూడా సిరీస్ పరాజయం, భవిష్యత్తులో ఎక్కువ మంది కుర్రాళ్లతో నిండిన జట్టును నడిపించాల్సిన బాధ్యత వల్ల లంక కెప్టెన్ మ్యాథ్యూస్ ఒత్తిడిలో ఉన్నాడు. వెటరన్ సంగక్కర మార్గనిర్దేశనంలో తొలి రెండు టెస్టుల్లోనే సిరీస్ ఫలితాన్ని తేల్చాలని అతను భావిస్తున్నాడు. అయితే ముగ్గురు ఆటగాళ్లు మినహా మిగతా వారంతా అనుభవశూన్యుల కిందే లెక్క! కౌశల్ సిల్వ, కరుణరత్నే ఇటీవల మంచి ఓపెనింగ్ భాగస్వామ్యాలు అందించారు. వారిపైనే జట్టు మరోసారి ఆధారపడుతోంది. దమ్మిక ప్రసాద్, ప్రదీప్‌లు పేస్ భారం మోస్తున్నారు. స్పిన్‌లో ఆ జట్టు విజయావకాశాలు రంగన హెరాత్‌పైనే ఆధారపడి ఉన్నాయి. మరో స్పిన్నర్‌గా కౌశల్ ఉంటాడు. జట్లు (అంచనా): భారత్: కోహ్లి (కెప్టెన్), ధావన్, రాహుల్, రోహిత్, రహానే, సాహా, అశ్విన్, హర్భజన్, ఇషాంత్, ఉమేశ్, మిశ్రా. శ్రీలంక: మ్యాథ్యూస్ (కెప్టెన్), కౌశల్, కరుణరత్నే, సంగక్కర, తరంగ, చండీమల్, ముబారక్, దమ్మిక ప్రసాద్, తరిందు, హెరాత్, ప్రదీప్.