
భువనేశ్వర్: ఆగిపోయిన ఒక సైనికుడి గుండెను.. తిరిగి కొట్టుకునేలా చేసి ఆ వ్యక్తికి పునర్జన్మ ప్రసాదించారు. శుభాకాంత్ సాహు అనే ఈ జవాను వయసు 24 ఏళ్లు. అక్టోబర్ 1వ తేదీన తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరాడు. అప్పటి నుంచి అతనికి చికిత్స కొనసాగుతోంది. అయితే..
ఉన్నట్లుండి ఈ మధ్య అతని గుండె ఆగిపోయింది. దీంతో డాక్టర్లు సీపీఆర్ చేసి బతికించే ప్రయత్నం చేశారు. అయినా చలనం లేకపోవడంతో ఎక్స్‌ట్రాకార్పోరియల్ కార్డియోపల్మనరీ రిససిటేషన్ (ఈసీపీఆర్) చేశారు. దీంతో 90 నిమిషాల తర్వాత గుండె కొట్టుకోవడం మొదలైంది. ఆపై 30 గంటల గుండె లయబద్ధంగా కొట్టుకోవడం ప్రారంభించింది. మరో 96 గంటల తర్వాత అతనికి ఎక్మోను తొలగించారు. ఇలా..
ఒడిషా భువనేశ్వర్‌లోని ఎయిమ్స్ బృందం అతని ప్రాణాలు నిలబెట్టింది. సాంకేతికంగా ఈసీపీఆర్ విధానం అనేది సవాళ్లతో కూడుకున్నదని, అయినప్పటికీ గుండె ఆగిన సందర్భాల్లో చికిత్సకు అనువైందని డాక్టర్ శ్రీకాంత్ బెహరా చెబుతున్నారు. ప్రస్తుతం శుభాకాంత్ ఆరోగ్యంగానే ఉన్నారని తెలిపారాయన.
Comments
Please login to add a commentAdd a comment