army jawan
-
30మందిని కాపాడి ఆర్మీ జవాన్ వీరమరణం
కంభం/నార్పల: తోటి జవాన్లు 30 మందిని ల్యాండ్‌మైన్ ఉచ్చు నుంచి కాపాడి.. తాను మాత్రం దాని బారిన బడి ప్రాణాలు కోల్పోయాడు. జమ్మూలో నియంత్రణ రేఖ వద్ద సోమవారం విధి నిర్వహణలో ఉన్న ఆర్మీ జవాన్ ల్యాండ్‌మైన్ పేలి దుర్మరణం పాలయ్యాడు. ప్రకాశం జిల్లా రావిపాడుకు చెందిన వరికుంట్ల సుబ్బయ్య(45) జమ్మూలోని పూంచ్ జిల్లాలో 30 మంది జవానులతో కలిసి సరిహద్దు వద్ద కాపలా కాస్తున్నాడు. అంతలో అక్కడ ల్యాండ్‌మైన్ ఉన్నట్టు గుర్తించాడు. వెంటనే తోటి జవాన్లను దూరంగా పంపించేసి తాను పొరపాటున దాని ఉచ్చులో చిక్కుకున్నాడు. అది ఒక్కసారిగా పేలడంతో సుబ్బయ్య అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు కుటుంబ సభ్యులకు ఆర్మీ అధికారులు సమాచారం ఇచ్చారు. అధికార లాంఛనాలు ముగించుకుని మృతదేహాన్ని బెంగళూరు వరకు విమానంలో.. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో తరలించనున్నట్లు సమాచారం. మృతుడి తండ్రి వెంకట సుబ్బయ్య కొన్నేళ్ల కిందట చనిపోగా, తల్లి గాలెమ్మ గ్రామంలోనే ఉంటోంది. కుమారుడు మృతి చెందాడన్న వార్త తెలుసుకున్న ఆ తల్లి కుమారుడి ఫొటో పట్టుకుని గుండెలవిసేలా రోదిస్తోంది. మృతుడి భార్య లీల స్వగ్రామం అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం నార్పాల. ఇద్దరు పిల్లలతో ఆమె అక్కడే ఉంటోంది. మృతదేహాన్ని నార్పాల గ్రామానికి తీసుకెళ్తున్నట్లు సమాచారం రావడంతో బంధువులు అక్కడికి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. జవాన్ భౌతిక కాయానికి గురువారం అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్టు కుటుంబ సభ్యులు చెప్పారు. -
కూతురు పెళ్లికి ముందు జవాను మృతి..దేవుడిలా వచ్చిన స్నేహితులు
లక్నో:తాము అందరికీ ఆదర్శమని ఆర్మీ జవాన్లు మరోసారి నిరూపించుకున్నారు. దేశాన్ని కంటికిరెప్పలా కాపాడడమే కాదు..అవసరమైతే పక్కవాడి కష్టాన్ని తమ కష్టంగా భావించి ఆదుకుంటామని చాటారు. ఉత్తరప్రదేశ్‌లోని మథురలో 48 ఏళ్ల దేవేంద్రసింగ్ నెలరోజుల క్రితమే ఆర్మీ నుంచి రిటైర్ అయ్యారు. మరో రెండు రోజుల్లో జరగాల్సిన కూతురు పెళ్లికి అన్ని ఏర్పాట్లు ఒక్కడే చకచకా చేసుకుంటున్నారు. ఇంతలో విధి వెక్కిరించింది. గురువారం(డిసెంబర్5) జరిగిన రోడ్డు ప్రమాదంలో సింగ్ దుర్మరణం పాలయ్యారు. ఈ దుర్ఘటనతో సింగ్ ఇంట్లో అంతులేని విషాదం అలుముకుంది. పెళ్లి ఆగిపోయిందని అంతా భావించారు. కానీ ఇక్కడే సీన్ పూర్తిగా మారిపోయింది. సింగ్‌తో పాటు ఆర్మీలో పనిచేసిన జవాన్లు, అధికారులు అతడి మరణం విషయం తెలుసుకున్నారు. వెంటనే మథురకు వచ్చారు. సింగ్ కుటుంబ సభ్యులను ఓదార్చారు. అన్నీ దగ్గరుండి చూసుకుని సింగ్ కూతురి పెళ్లిని అంగరంగ వైభవంగా జరిపించారు. చివరకు దగ్గరుండి కన్యాదానం కూడా చేశారు. సింగ్ స్నేహితుల మానవతా సాయంపై అతడి వియ్యంకుడు నరేంద్రసింగ్ స్పందించారు. అంతా అయిపోయిందనుకున్న తరుణంలో సింగ్ స్నేహితులంతా వచ్చి మాకు ధైర్యం చెప్పి పెళ్లి జరిపించారు’అని వారిపై ప్రశంసలు కురిపించారు. -
నాన్న.. అనిపించుకోకుండానే..
తండ్రిని కాబోతున్నాననే ఆనందంతో ఆర్మీ జవాన్ సెలవుపై వచ్చాడు. సోమవారం భార్య ప్రసవానికి వైద్యులు సమయం ఇచ్చారు. కానీ ఒక్క రోజు ముందే ఆదివారం రాత్రి మృత్యువు వెంటాడింది. నాన్న అనిపించుకోకుండానే ఆ ఆర్మీ జవాన్‌ను రోడ్డు ప్రమాదం కబళించింది. ఎదురెదురుగా రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ఘటనలో అతడితోపాటు మరొకరు చనిపోయారు. నస్పూర్: తెల్లవారితే తనకు పుట్టబోయే బిడ్డను ఎత్తుకుని మురిసిపోదామనుకున్న ఒకరు నాన్న అనే పిలుపునకు నోచుకోకుండానే, తన సోదరుని అత్త మరణ వార్త తెలుసుకుని అతన్ని ఓదార్చుదామనుకున్న మరోవ్యక్తిని రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబళించింది. ఒకే గ్రామానికి చెందిన ఇద్దరు మృతి చెందడంతో విషాదఛాయలు అలుముకున్న సంఘటన మంచిర్యాల జిల్లాలోని దొరగారిపల్లెలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు మంచిర్యాల పోలీస్ స్టేషన్ పరిధిలోని దొరగారి పల్లెకు చెందిన ముల్క ఉదయ్ ఆదివారం రాత్రి పని నిమిత్తం బైక్‌పై మంచిర్యాలకు వెళ్లి వస్తుండగా అదే గ్రామానికి చెందిన పత్తి నర్సింహ తన భార్య రమాదేవితో కలిసి ద్విచక్ర వాహనంపై గద్దెరాగడికి బయలుదేరాడు. దొరగారిపల్లె గ్రామ సమీపంలో 200 పీట్ల సర్వీస్ రోడ్డు వద్దకు రాగానే ఇరువురి వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఘటనలో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. గమనించిన స్థానికులు 108కు సమాచారం అందించడంతో మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ఉదయ్, నర్సింహ అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై ప్రవీణ్‌కుమార్ తెలిపారు.భార్య డెలివరీకి వచ్చి...ముల్క ఉదయ్ భోపాల్ రాష్ట్రంలో ఆర్మీ జవానుగా ఉద్యోగం చేస్తున్నాడు. మంచిర్యాలకు చెందిన పావనితో 2022లో వివాహమైంది. ప్రస్తుతం ఆమె నిండు గర్భిణి. ఆమె డెలివరీ కోసం పదిరోజుల క్రితం ఇంటికి వచ్చాడు. వైద్యులు ఆమెకు సోమవారం డెలివరీ సమయం ఇచ్చినట్లు సమాచారం. తెల్లవారితే తనకు ముద్దులొలికే చిన్నారి జన్మిస్తుందని అతను కన్న కలలు నెరవేరకుండానే ఇలా మృత్యువు కబలించడం కుటుంబ సభ్యులను తీవ్ర మనోవేదనకు గురిచేసింది. సోదరుని పరామర్శించేందుకు వెళ్తూ...నస్పూర్‌కాలనీలో చికెన్ సెంటర్ నిర్వహిస్తున్న పత్తి నర్సింహకు 2014లో రమాదేవితో వివాహమైంది. గద్దెరాగడిలో నివాసం ఉండే తన సోదరుని అత్త మృతి చెందిన విషయం తెలుసుకున్న నర్సింహా ఆదివారం రాత్రి రమాదేవిని బైక్‌పై ఎక్కించుకుని గద్దెరాగడికి బయలుదేరాడు. నర్సింహను రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబళించడం, అతని భార్య గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతుండడంతో కుటుంబ సభ్యులు ఆవేదన చెందుతున్నారు.గ్రామంలో విషాదం..ఒకే గ్రామానికి చెందిన ఇద్దరు ఒకే ప్రమాదంలో మృతి చెందడంతో దొరగారి పల్లెలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
ఆగిన గుండె.. 90 నిమిషాలకు తిరిగి కొట్టుకుంది!
భువనేశ్వర్: ఆగిపోయిన ఒక సైనికుడి గుండెను.. తిరిగి కొట్టుకునేలా చేసి ఆ వ్యక్తికి పునర్జన్మ ప్రసాదించారు. శుభాకాంత్ సాహు అనే ఈ జవాను వయసు 24 ఏళ్లు. అక్టోబర్ 1వ తేదీన తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరాడు. అప్పటి నుంచి అతనికి చికిత్స కొనసాగుతోంది. అయితే..ఉన్నట్లుండి ఈ మధ్య అతని గుండె ఆగిపోయింది. దీంతో డాక్టర్లు సీపీఆర్ చేసి బతికించే ప్రయత్నం చేశారు. అయినా చలనం లేకపోవడంతో ఎక్స్ట్రాకార్పోరియల్ కార్డియోపల్మనరీ రిససిటేషన్ (ఈసీపీఆర్) చేశారు. దీంతో 90 నిమిషాల తర్వాత గుండె కొట్టుకోవడం మొదలైంది. ఆపై 30 గంటల గుండె లయబద్ధంగా కొట్టుకోవడం ప్రారంభించింది. మరో 96 గంటల తర్వాత అతనికి ఎక్మోను తొలగించారు. ఇలా..ఒడిషా భువనేశ్వర్‌లోని ఎయిమ్స్ బృందం అతని ప్రాణాలు నిలబెట్టింది. సాంకేతికంగా ఈసీపీఆర్ విధానం అనేది సవాళ్లతో కూడుకున్నదని, అయినప్పటికీ గుండె ఆగిన సందర్భాల్లో చికిత్సకు అనువైందని డాక్టర్ శ్రీకాంత్ బెహరా చెబుతున్నారు. ప్రస్తుతం శుభాకాంత్ ఆరోగ్యంగానే ఉన్నారని తెలిపారాయన. -
రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. ఇద్దరు జవాన్ల కిడ్నాప్, ఒకరు మృతి
జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. ఏకంగా ఇద్దరు ఆర్మీ జవాన్లను కిడ్నాప్ చేయడం తీవ్ర కలకలం రేపుతోంది. అనంత్‌నాగ్ జిల్లాలో ఇద్దరు ఆర్మీ జవాన్లు కిడ్నాప్‌కు గురయ్యారు. కాకర్‌నాగ్ ప్రాంతం టెరిటోరియల్‌లో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు జవాన్లను ఉగ్రవాదులు ఎత్తుకెళ్లారు. ఈ క్రమంలోనే ఉగ్రవాదుల చెర నుంచి ఒక జవాన్ తప్పించుకుని బయటపడగా.. ఇంకో జవాన్ వారి చేతులో చిక్కుకుపోయాడు.ఈ విషయం తెలుసుకున్న భారత సైన్యం.. ఆ ప్రాంతంలో భారీ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించింది. గాయపడిన జవాన్‌ను వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. మిస్ అయిన మరో జవాన్.. కొన్ని గంటలకే కోకెర్నాగ్లోని అటవీ ప్రాంతంలో మృతదేహం లభ్యమైంది. చనిపోయిన సైనికుడి శరీరంలోకి బుల్లెట్ దూసుకెళ్లినట్లు భద్రతా బలగాలు గుర్తించాయి.మృతుడిని అనంత్‌నాగ్‌లోని ముక్ధంపోరా నౌగామ్‌కు చెందిన హిలాల్ అహ్మద్ భట్‌గా అధికారులు గుర్తించారు. గాయపడిన జవాన్ పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని అధికారులు తెలిపారు.ఉగ్రవాదులను పట్టుకునేందుకు ఆ ప్రాంతం మొత్తాన్ని జల్లెడ పడుతున్నారు. ఇటీవలె జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించగా.. ఆ ఫలితాలు వెల్లడైన ఒక రోజు ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం -
పొగరుబోతుకు ఆర్మీ జవాన్ జవాబు!
ఆర్మీ అంటేనే క్రమశిక్షణకు, కట్టుబాట్లకు పేరు.. బెటాలియన్లోనైనా.. బయటనైనా జవాన్లు పద్ధతి ప్రకారం ఉంటారు. మరి.. తమ చుట్టూ ఉన్నవారు పద్ధతి మీరి కనిపిస్తే... పొగరుగా ప్రవర్తిస్తూంటే...? సహించలేరు కదా? ఈ వీడియోలో కూడా అదే జరిగింది. ఇందులో స్కూటర్ నడుపుతున్న ఓ వ్యక్తి డివైడర్‌కు ఆవల.. ఎదురుగా వచ్చే వాహనాలకు అడ్డంగా నిలబడటమే కాకుండా.. ఆంబులెన్స్కూ దారివ్వకుండా... పక్క నుంచి వెళ్లాల్సిందిగా పొగరుగా వ్యవహరించాడు. ఈ విషయం కాస్తా.. వెనుక ఉన్న ఆర్మీ వాహనం డ్రైవర్ కంట పడింది. కాసేపు ఊరకున్న.. ఆ వ్యక్తి పొగరుగా చేస్తున్న చేష్టలను ఆ జవాను తట్టుకోలేకపోయాడు. వాహనం నుంచి కిందకు దిగి.. ఆ వ్యక్తి హెల్మెట్‌పైనే ఒక్కటిచ్చుకున్నాడు... ‘‘బుద్ధుందా.. ఎదురుగా ఆంబులెన్స్ వచ్చినా దారి ఇవ్వవా’’ అని గడ్డిపెట్టినట్లు ఉన్నాడు. అయినా ఆ వ్యక్తి పక్కకు జరగలేదు సరికదా.. ఇంకాస్తా దురుసుగా మాట్లాడినట్లు కనిపిస్తోంది. ఇక లాభం లేదనుకున్నాడో ఏమో ఆ జవాలు.. వాహనంలో ఉంచిన లాఠీని బయటకు తీసి పని చెప్పబోయాడు. ఈ లోపు అక్కడికి చేరుకున్న ట్రాఫిక్ పోలీసు... ‘‘మీరు ఉండండి సర్. ఇక నేను చూసుకుంటాను కదా’’ అని సర్ది చెప్పింది.ఎక్కడ జరిగిందో స్పష్టంగా తెలియదు కానీ.. @shilpa_cn హ్యాండిల్ కలిగిన ‘ఎక్స్’ ఖాతాదారు ఒకరు ఈ వీడియోను పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆర్మీ జవాన్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు.Satisfying video 🤌🏻Indian Army 😍 pic.twitter.com/H6nnlehIaD— Shilpa (@shilpa_cn) August 25, 2024 -
కూటమి అరాచకాలు.. దన్నానపేటలో ఆర్మీ జవాన్ ఇంటి కూల్చివేత
-
విషాదం: అసోంలో తెలంగాణ జవాన్ మృతి
సాక్షి, నల్లగొండ: తెలంగాణకు చెందిన ఆర్మీ జవాన్ ఈరేటి మహేష్ అసోంలో మృతిచెందాడు. నేడు అతడి భౌతికకాయం స్వగ్రామానికి రానున్నట్టు తెలుస్తోంది. రేపు అతడి అంత్యక్రియలు జరుగనున్నాయి.వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లాలోని అనుముల మండలం మాదరిగూడెం గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ ఈరేటి మహేష్(24) అసోంలో అనారోగ్యంతో మృతిచెందాడు. కాగా, మహేష్‌కు ఇటీవల ఆరోగ్యం బాగాలేకపోవడంతో ఆసుపత్రిలో చేర్పించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ మహేష్ మృతిచెందాడు. దీంతో, నేడు అతడి భౌతికకాయాన్ని స్వగ్రామానికి తరలించనున్నారు. రేపు స్వగ్రామంలో అతడి అంత్యక్రియలు జరుగనున్నాయి. -
కథువా ఉగ్రదాడిని ఖండించిన భారత్.. ప్రతీకారం తీర్చుకుంటాం!
జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు సోమవారం భారీ దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. కథువా జిల్లాలోని మాచేడి ప్రాంతంలో భారత సైన్యానికి చెందిన వాహనంపై టెర్రిరిస్టులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఐదుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. మాచేడి-కిండ్లీ-మల్హార్ రోడ్డు మార్గంలో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.తాజాగా కథువా ఉగ్రదాడి ఘటను భారత్ తీవ్రంగా ఖండించింది. ఈ దాడికి ప్రతీకారం తప్పక తీర్చుకుంటామని రక్షణ శాఖ కార్యదర్శి గిరిధర్ అరమనే స్పష్టం చేశారు. దాడి వెనుక ఉన్న దుష్ట శక్తులను విడిచిపెట్టేది లేదని హెచ్చరించారు. ఉగ్రదాడిలో అమరులైన సైనిక కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు.‘కథావాలోని బద్నోటాలో జరిగిన ఉగ్రవాద దాడిలో ఐదుగురు ధైర్యవంతులైన జవాన్లను కోల్పోయినందుకు.. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. వారి నిస్వార్థ సేవను దేశం ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటుంది, వారి త్యాగం ప్రతీకారం తీర్చుకుంటాం. అలాగే దాడి వెనుక ఉన్న దుష్ట శక్తులను భారత్ విడిచిపెట్టదు.’ అని ఎక్స్‌లో ట్వీట్ చేశారు.ఉగ్రవాదులు పక్కా ప్లాన్ ప్రకారం దాడికి పాల్పడ్డారు. తొలుత కాన్వాయ్‌పై గ్రనేడ్ విసిరారు. వాహనం ఆగిపోవడంతో కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో జూనియర్ కమీషన్డ్ ఆఫీసర్‌తో సహా ఐదుగురు ఆర్మీ సిబ్బంది మరణించారు. మరికొందరు గాయపడ్డారు. ప్రమాద సమయంలో ఆర్మీ కాన్వాయ్‌లో పదిమంది సైనికులు ఉన్నారు. బలగాలు ఎదురుకాల్పులు ప్రారంభించేసరికి అక్కడి నుంచి దగ్గర్లోని అటవీ ప్రాంతంలోకి పరారైనట్లు ఆర్మీ అధికారులు వెల్లడించారు. వారి కోసం సెర్చ్ ఆపరేషన్ సాగుతోంది. -
రిటైర్డ్ ఆర్మీ జవానుకు 20 ఏళ్ల జైలు
రాంగోపాల్‌పేట్: ఓ మైనర్ బాలికను బెదిరించి లైంగికదాడికి పాల్పడిన ఓ రిటైర్డ్ ఆర్మీ జవానుకు పోక్సో స్పెషల్ సెషన్స్ కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష, రూ.20 వేల జరిమానా విధించింది. మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన 2017 సంవత్సరంలో జరిగింది. మార్కెట్ ఇన్స్పెక్టర్ రాఘవేందర్ తెలిపిన వివరాల ప్రకారం ఓ మైనర్ బాలిక రెజిమెంటల్‌బజార్‌లోని హోంలో ఉంటూ 31బస్టాప్ ప్రాంతంలోని పాలికాబజార్‌లో ఉండే ఓ టైలరింగ్ సెంటర్లో టైలరింగ్ నేర్చుకుంటోంది. 2017 జూలై 24వ తేదీన ఉదయం 11గంటలకు టైలరింగ్ సెంటర్‌కు వెళ్తుండగా ఆర్మీలో పదవి విరమణ పొందిన యాప్రాల్‌లో నివాసం ఉండే పెరియాటి శ్రీధరన్(59) బాలికను ఆపి భోజనం చేశావా అంటూ ప్రశ్నించాడు. భోజనం పెట్టిస్తానని ముత్యాలమ్మ దేవాలయం ప్రాంతంలోని ఓ హోటల్‌కు తీసుకుని వెళ్లి భోజనం పెట్టించాడు. అక్కడి నుంచి ఆ బాలికను హోటల్‌కు తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు. అటు తర్వాత మనోహర్ థియేటర్ ప్రాంతంలోని ఓ లైన్లో ఆ బాలికను విడిచి వెళ్లిపోయాడు. ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని బెదిరించాడు. బాలిక హోంకు వెళ్లి రెండు రోజుల పాటు ఏడుస్తూ విచారంగా ఉంది. హోంలోని ఓ ఆరోగ్య కార్యకర్త గమనించి ఆరా తీయగా జరిగిన విషయం చెప్పింది. వెంటనే 27వ తేదీన హోం నిర్వాహకులు మంజుల, పద్మ బాలికను తీసుకుని వెళ్లి మార్కెట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయించారు. ఆ తర్వాత పోలీసులు దర్యాప్తు చేసి నిందితుడిని రిమాండ్‌కు తరలించి చార్జిïÙట్ను కోర్టుకు సమరి్పంచారు. పోక్సో ప్రత్యేక సెషన్స్ జడ్జి పుష్పలత కేసును విచారించి పోలీసులు సమరి్పంచిన సాక్ష్యాధారాలతో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష ఖరారు చేశారు. మరో రూ.20వేల జరిమానా కూడా విధించారు. ఈ అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రతాప్‌రెడ్డి బాలిక తరఫున వాదనలు వినిపించి శిక్ష పడేలా చూశారు. -
18 వేల అడుగుల ఎత్తులో.. మైనస్ 38 డిగ్రీల టెంపరేచర్లో..
నిజామాబాద్: ఆర్మీలో జవాన్‌గా పనిచేస్తున్న కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం అన్నాసాగర్ గ్రామానికి చెందిన మహ్మద్ షాదుల్ ఎత్తైన మంచు పర్వతంపై తన స్వగ్రామం పేరును ప్రదర్శించి మమకారం చాటుకున్నారు. షాదుల్ రెండ్రోజులుగా జమ్మూకశ్మీర్‌లోని లదాఖ్‌లో గల 18 వేల అడుగుల ఎత్తులో ఉన్న పర్వతంపై మైనస్ 38 డిగ్రీల టెంపరేచర్లో ఉద్యోగాన్ని నిర్వర్తిస్తున్నారు. ఈ సందర్భంగా స్వగ్రామం అన్నాసాగర్ పేరుతో ఉన్న ప్లకార్డును ప్రదర్శించాడు. గ్రామస్తులు షాదుల్‌ను అభినందించారు. ఇవి చదవండి: ఎట్టకేలకు ‘రూట్’ క్లియర్! -
ఆర్మీ ఉద్యోగి అదృశ్యం
ప్రకాశం: ఓ ఆర్మీ జవాన్ విధులకు హాజరయ్యేందుకు పశ్చిమ బెంగాల్‌కు వెళ్లి అక్కడ అదృశ్యమయ్యాడు. 10 రోజులు దాటినా ఆచూకీ లేకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. కొమరోలు మండలలోని ఎర్రపల్లె గ్రామానికి చెందిన మారంరెడ్డి వీరబ్రహ్మానందరెడ్డి పదేళ్లుగా ఆర్మీలో విధులు నిర్వహిస్తున్నాడు. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని న్యూజల్పాయ్గురి క్యాంప్‌లో ఉంటున్నాడు. కాగా, డిసెంబరు 8వ తేదీన వీరబ్రహ్మానందరెడ్డి సెలవుపై స్వగ్రామానికి వచ్చి నెల రోజుల తర్వాత తిరిగి జనవరి 8వ తేదీన విధుల్లో చేరేందుకు స్వగ్రామం నుంచి బయలుదేరి వెళ్లాడు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని ఎల్‌జీపీటీ రైల్వేస్టేషన్లో దిగిన వీరబ్రహ్మానందరెడ్డి అక్కడే అదృశ్యమయ్యాడు. జనవరి 10వ తేదీన కుటుంబ సభ్యులతో మాట్లాడిన వీరబ్రహ్మానందరెడ్డి ఎల్‌జీపీటీ రైల్వేస్టేషన్లో అదృశ్యం కావడంతో తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అక్కడి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బంధుమిత్రులు కూడా ఆ ప్రాంతానికి వెళ్లి వీరబ్రహ్మానందరెడ్డి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా కలగజేసుకుని విచారణ చేపట్టాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. వీరబ్రహ్మానందరెడ్డికి సంబంధించిన మొబైల్ ఫోన్, లగేజీ ఎల్‌జీపీటీ రైల్వేస్టేషన్లో రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వీరబ్రహ్మానందరెడ్డికి ఏడాది క్రితమే ఒంగోలుకు చెందిన భాగ్యలక్ష్మితో వివాహమైంది. -
మాంజా దారానికి బలైన ఆర్మీ జవాన్
-
గుండెపోటుతో ఆర్మీ జవాన్ మృతి
అనకాపల్లి: గుండెపోటుతో ఆర్మీ జవాన్ మృతి చెందారు. మండలంలోని గిడుతూరుకు చెందిన మట్ల సహదేవుడు(45) ఆర్మీలో హవాల్దార్‌గా పనిచేస్తున్నారు. ప్రస్తుతం హర్యానాలో పనిచేస్తున్న ఈయన గురువారం విధుల్లో ఉండగా గుండెపోటుతో మరణించారు. ఈ నేపథ్యంలో అక్కడే ఆర్మీ అధికారులు సైనిక లాంఛనాలు ముగించి భౌతిక కాయాన్ని స్వగ్రామం తరలించారు. ఈ మేరకు శుక్రవారం గిడుతూరులో సైనిక లాంఛనాల మధ్య అంత్యక్రియలు నిర్వహించారు. మృతుడికి భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. -
హైదరాబాద్‌లో జవాన్ ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్: లంగర్‌హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆర్మీ సెంటర్లో ఆర్మీ జవాన్ గన్‌తో కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పంజాబ్‌కు చెందిన రాజిందర్ బుధవారం తెల్లవారుజామున తన వద్ద ఉన్న తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. చదవండి: రమేష్ కుమార్ జైస్వాల్ ఎక్కడ? -
సిక్కిం వరదల్లో నిజామాబాద్ ఆర్మీ జవాన్ మృతి
సాక్షి, నిజాబాద్: సిక్కింలో మంగళవారం అర్ధరాత్రి సంభవించిన వరదల్లో చిక్కుకొని చనిపోయిన ఆర్మీ జవాన్లలో నిజామాబాద్ జిల్లా సాలూర మండలం కుమ్మన్‌పల్లికి చెందిన నీరడి గంగాప్రసాద్ ఉన్నట్టు కుటుంబసభ్యులకు సమాచారం వచ్చింది. గురువారం మృతదేహం లభ్యం కాగా, పోస్టుమార్టం కోసం పశ్చిమ బెంగాల్‌లోని జల్పాయ్గిరి జిల్లా ఆస్పత్రికి ఆర్మీ అధికారులు తరలించారు. శుక్రవారం స్వగ్రామానికి మృతదేహం చేరుకునే అవకాశాలున్నా యి. ఎమ్మెల్యే షకీల్ సమకూర్చిన విమానంలో మృతుడి తమ్ముడు సుధాకర్, మరో బంధువు దిలీప్ బయలుదేరి వెళ్లి ఘటనాస్థలానికి చేరుకున్నారు. పశ్చి మబెంగాల్లోని బినాగుడి ఆర్మీ హెడ్ క్వార్టర్లో విధులు నిర్వహిస్తున్న గంగాప్రసాద్ శిక్షణలో భాగంగా 20 రోజుల క్రితం సిక్కింలోని జులుక్ ప్రాంతానికి వెళ్లి తీస్తా నది వరదల్లో గల్లంతయ్యారు. గంగాప్రసాద్‌ది నిరు పేద దళిత కుటుంబం. గంగాప్రసాద్‌కు భార్య శిరీష, ఇద్దరు కుమారులు హర్ష(6), ఆదిత్య(3) ఉన్నారు. -
వరదలో కొట్టుకుపోయిన 23 మంది ఆర్మీ సిబ్బంది..
-
ఆర్మీ జవాన్ కిడ్నాప్.. హత్య
ఇంఫాల్: మణిపూర్ రాష్ట్రంలో సాయుధ ముఠా ఒకటి ఆర్మీ జవాన్‌ను పొట్టనబెట్టుకుంది. రాష్ట్రంలోని ఇంఫాల్ పశి్చమ జిల్లా తరుంగ్ గ్రామానికి చెందిన సిపాయి సెర్తో థంగ్‌థంగ్ కొమ్.. కంగ్పొక్పి జిల్లా లీమఖోంగ్లోని ఆర్మీ డిఫెన్స్ సెక్యూరిటీ ఫోర్స్‌కు చెందిన ప్లటూన్‌లో విధులు నిర్వర్తిస్తన్నారు. కొద్దిరోజుల క్రితం ఆయన సెలవుపై స్వగ్రామానికి చేరుకున్నారు. శనివారం ఉదయం ఇంట్లో ఉన్న ఆయనను గుర్తు తెలియని సాయుధులు తుపాకీతో బెదిరించి తమ వాహనంలో తీసుకెళ్లారు. ఆదివారం ఉదయం ఖునింగ్‌థెక్ గ్రామ సమీపంలో నుదుటిపై బుల్లెట్ గాయంతో ఆయన విగతజీవిగా పడి ఉండగా స్థానికులు గుర్తించారు. -
నా భార్యపై దారుణంగా దాడి చేశారు.. ఆర్మీజవాన్ వీడియో కలకలం
కొంతమంది వ్యక్తులు నా భార్యపై దారుణంగా దాడి చేశారంటూ ఓ ఆర్మీ జవాన్ ట్విట్టర్లో పోస్ట్ చేసిన వీడియో తీవ్ర కలకలం రేపింది. ఈ మేరకు తమిళనాడులోని నాగపట్నం జిల్లాలో కడవాసల్ గ్రామంలో కొందరు వ్యక్తులు నా భార్యను అర్థనగ్నంగా చేసి దాడి చేశారంటూ ఆమె భర్త ఆర్మీ జవాన్ వీడియోలో పేర్కొన్నాడు. ఈ వీడియోని రిటైర్డ్ ఆర్మీ అధికారి లెఫ్టినెంట్ కల్నల్ ఎన్ త్యాగరాజన్ పోస్ట్ చేశారు. ఆ వీడియోలో.. ఆరోపణలు చేస్తున్న ఆర్మీ జవాన్ హవల్దార్ ప్రభాకరన్ తమిళనాడులోని పడవేడు గ్రామానికి చెందిన వ్యక్తి. అతను ప్రస్తుతం కాశ్మీర్లో ఉద్యోగం చేస్తున్నాడు. ట్విట్టర్లో పోస్ట్ చేసిన వీడియోలో అతను తన భార్యకు జరిగిన అవమానం గురించి వివరించాడు. తన భార్య ఒక స్థలంలో లీజుకు ఓ దుకాణం నుడుపుతోందని వీడియోలో తెలిపాడు. ఆమెను 120 మంది వ్యక్తలు కొట్టి షాపులోని వస్తువులను బయటకు విసిరేశారు. ఎస్పీకి ఫిర్యాదు చేయగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కత్తులతో నా కుటుంబంపై దాడి చేసి బెదిరించారని, తన భార్యను అర్ధ నగ్నం చేసి దారుణంగా కొట్టారని ఆరోపణలు చేశాడు. అయితే పోలీసులు అతని ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు కంధవాసల్ పోలీసులు ప్రాథమిక దర్యాప్తు చేసి ఓ ప్రకటన విడుదల చేశారు. ఆ ప్రకటనలో..రేణుగాంబాల్ ఆలయానికి చెందిన స్థలంలో నిర్మించిన దుకాణాన్ని ప్రభాకరన్ మామగారైన సెల్వమూర్తి కుమార్ నుంచి ఐదేళ్ల కాలానికి రూ. 9.5 లక్షలకు లీజుకు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కుమార్ మరణించిన తర్వాత అతని కుమారుడు రాము దుకాణాన్ని తిరిగి ఇవ్వాలని కోరాడు. అందుకు డబ్బు తిరిగి ఇవ్వడాన్ని కూడా అంగీకరించడమే గాక ఒప్పందంపై సంతకం కూడా చేశాడు. ఐతే సెల్వమూర్తి డబ్బు తీసుకునేందుకు తిరస్కరించడమే గాక దుకాణం నుంచి వెళ్లేందుకు నిరాకరించాడని రాము పేర్కొన్నాడు. ఈ క్రమంలో జూన్ 10వ తేదిన సెల్వమూర్తి కుమారులు జీవా, ఉదయలకు డబ్బు ఇచ్చేందుకు రాము దుకాణానికి వెళ్లగా అతనిపై కత్తితో దాడి చేసినట్లు సమాచారం. ఈ గొడవను గమనించి స్థానికులు రాముకు పెద్ద ఎత్తున మద్దతుగా రావడంతో అది కాస్త పెద్దదై, అక్కడ దుకాణంలో వస్తువులు బయటకు విసిరేసేంత వరకు దారితీసిందని పోలీసులు పేర్కొన్నారు. ఆ సమయంలో దుకాణంలో ప్రభాకరన్ భార్య కీర్తి, ఆమె తల్లి దుకాణంలో ఉన్నారని, కానీ వారిపై ఆ గుంపు దాడి చేయలేదని ప్రకటనలో వెల్లడించారు పోలీసులు. ఇదిలా ఉండగా, తమిళనాడు బీజేపీ చీఫ్ కే అన్నామలై ఆర్మీ జవాన్‌తో మాట్లాడి తమ పార్టీ అతని భార్యకు న్యాయం చేయడమే గాక కుటుంబానికి అండగా ఉంటామని ట్వీట్లో పేర్కొన్నారు. ఈ మేరకు బీజేపీ చీఫ్ ఆ ట్వీట్లో..కాశ్మీర్లో మన దేశానికి ధైర్యంగా సేవ చేస్తున్న హవల్దార్, అతని భార్యతో ఫోన్లో మాట్లాడటం జరిగింది. ఆమె కథ విని నిజంగా బాధనిపించింది. తమిళ గడ్డపై ఆమెకు ఇలా జరిగినందుకు సిగ్గుపడ్డాను. వెల్లూరులో ఓ ఆస్పత్రిలో చేరినా ఆమెను తమ పార్టీ పరామర్శించినట్లు ట్వీట్ చేశారు. @ThanthiTV @News18TamilNadu @PTTVOnlineNews @ChanakyaaTv @Def_PRO_Chennai @narendramodi @annamalai_k @rajnathsingh — Lt Col N Thiagarajan Veteran (@NTR_NationFirst) June 10, 2023 (చదవండి: కేకు డబ్బులు అడిగాడని కాల్పులు.. దుకాణదారుని మృతి!) -
రాజన్న సిరిసిల్లలో ముగిసిన జవాన్ అనిల్ అంత్యక్రియలు
-
రాజన్న సిరిసిల్లలో ఆర్మీ జవాన్ పీ.అనిల్ అంత్యక్రియలు
-
ఆ ఊరే ఓ సైన్యం!
సాక్షి, కామారెడ్డి: ఆ ఊళ్లో ఒకరిని చూసి ఒకరు అన్నట్టుగా ఇప్పటికే 25 మంది సైన్యంలో అడుగుపెట్టారు. మరికొందరు అదే బాటలో సిద్ధమవుతున్నారు. ఆటల్లో ముందుండే తాడ్వాయి యువత దేశ సేవలోనూ ముందు వరుసలో నిలుస్తున్నారు. తాడ్వాయి మండల కేంద్రంలో యువతకు దేశభక్తి ఎక్కువ. దేశ సేవ కోసం వారు త్రివిధ దళాల్లో చేరుతున్నారు. ముఖ్యంగా ఆర్మీలో చాలా మంది చేరారు. సెలవుల్లో వచ్చినపుడల్లా గ్రామానికి చెందిన యువతకు సైన్యం గురించి అవగాహన కల్పిస్తున్నారు. దీంతో యువత సైన్యంలో చేరడానికి మరింత ఆసక్తి కనబరుస్తున్నారు. కాగా గ్రామానికి చెందిన రవీందర్‌రెడ్డి అనే సైనికుడు రెండేళ్ల నాడు చనిపోయాడు. ఆర్మీలో చేరేందుకు ఆసక్తి చూపే యువతను గ్రామానికి చెందిన సైనికులు ప్రోత్సహిస్తున్నారు. త్రివిధ దళాల్లో.. తాడ్వాయి గ్రామానికి చెందిన యువకులు త్రివిధ దళాల్లో వివిధ స్థాయిల్లో పలు రాష్ట్రాల్లో విధులు నిర్వహిస్తున్నారు. జమ్మూకాశ్మీర్, పంజాబ్, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం తదితర రాష్ట్రాల్లో వారు బాధ్యతలు నిర్వహిస్తూ దేశ రక్షణలో తమవంతు పాత్ర పోశిస్తున్నారు. వివిధ స్థాయిల్లో వారు పనిచేస్తున్నారు. అంతేగాక గ్రామానికి చెందిన పలువురు పోలీసు శాఖలోనూ ఉద్యోగాల్లో ఉన్నారు. గ్రామం నడిబొడ్డున సుభాష్ చంద్రబోస్ విగ్రహం తాడ్వాయికి చెందిన సైనికులంతా కలిసి గ్రామంలో సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. మండల కేంద్రంలోని ప్రధాన కూడలి వద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేసి అందరికీ స్ఫూర్తిని నింపారు. అలాగే అనేక సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తుంటారు. యువతను ప్రోత్సహించేందుకు వారు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. తాడ్వాయికి చెందిన విద్యార్థులు, యువకులు ఆటల్లో ఎంతో పేరు గడించారు. వారిలో చాలా మంది ఆర్మీలో, పోలీసు శాఖలో చేరడానికి ఆసక్తి చూపుతున్నారు. గర్వంగా ఉంది.. నా కొడుకు సైన్యంలో చేరి దేశానికి సేవ చేస్తుండడం గర్వంగా అనిపిస్తుంది. మా గ్రామంలో యువకులు ఒకరిని నుంచి ఒకరు దేశ సేవకు అంకితమవుతున్నారు. నా కొడుకు సైన్యంలో చేరాలనుకున్నపుడు ప్రోత్సహించి పంపించాను. –తానయ్యోల బాపురావు, సైనికుడి తండ్రి, తాడ్వాయి నేను పోలీసు కావాలనుకున్నా.. నాకు పోలీసు అవ్వాలని ఉండే. నేను కాలేకపోయా ను. నా కొడుకు సైన్యంలో చేరాడు. నా కోరిక నా కొడుకు రూపంలో తీరింది. దేశ సేవ కోసం సై న్యంలో చేరడాన్ని గొప్పగా ఫీలవుతాను. చాలా మంది యువకులు సైన్యంలో చేరుతున్నారు. – ఆకిటి రాజిరెడ్డి, సైనికుడి తండ్రి, తాడ్వాయి మా గ్రామానికే గర్వకారణం మా గ్రామం నుంచి 25 మంది సైన్యంలో పనిచేస్తుండడం మాకెంతో గర్వంగా ఉంది. సై న్యంలో పనిచేస్తూనే గ్రామంలో సేవా కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు. వారిని చూసి గ్రామం గర్వంగా ఫీలవుతుంది. వాళ్ల దారిలో చాలా మంది నడవడానికి ముందుకు వస్తున్నారు. –సంజీవులు, సర్పంచ్, తాడ్వాయి -
ఎదురుకాల్పుల్లో నేలకొరిగిన ముగ్గురు జవాన్లు
దుమ్ముగూడెం: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా జేగురుగొండ అటవీప్రాంతంలో మావోయిస్టులతో జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు డీఆర్జీ జవాన్లు మృతి చెందారు. ఛత్తీస్‌గఢ్ పోలీసులు, డీఆర్జీ బలగాలు జేగురుగొండ నుంచి దండకారణ్య అటవీ ప్రాంతంలో రోజువారీ గాలింపుల్లో ఉండగా కందేడ్ అటవీ ప్రాంతంలో శనివారం ఉదయం మావోయిస్టులు కాల్పులు జరిపారు. ముగ్గురు జవాన్లు మృతి చెందగా గాయపడిన వారిని వెంటనే క్యాంప్‌కు తరలించి వైద్యమందించారు. రెండు ఏకే 47 తుపాకులు, 51 ఎంఎం మోరా్టర్‌ను మావోయిస్టులు అపహరించారు. కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు చనిపోయి ఉంటారని పోలీసులంటున్నారు. వారి కోసం భారీగా కూంబింగ్ చేపట్టినట్టు బస్తర్ రేంజ్ ఐజీపీ సుందర్రాజ్ చెప్పారు. ఆర్మీ జవాన్‌ను హతమార్చిన మావోయిస్టులు చర్ల: ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ జిల్లాలో శనివారం ఓ ఆర్మీ జవాన్‌ను మావోయిస్టులు హతమార్చారు. జిల్లాలోని బడెతెవాడకు చెందిన జవాన్ మోతీరామ్ సెలవుపై స్వగ్రామానికి వచ్చాడు. సమీపంలోని ఉసేలీ వారపు సంతలో కోడి పందేలు చూస్తుండగా ముగ్గురు మావోయిస్టులు మూడు రౌండ్లు కాల్పులు జరపడంతో మోతీరాం అక్కడికక్కడే మృతిచెందారు. -
జవాన్ల శౌర్యాన్ని తక్కువ చేసి మాట్లాడొద్దు : కేంద్రమంత్రి జై శంకర్
-
అమర జవాన్ జశ్వంత్ రెడ్డి ఫ్యామిలీకి " సాక్షి ఎక్సలెన్స్ అవార్డు "