
కాల్పులకు పాల్పడిన మాజీ ఆర్మీ జవాన్ మట్టా సాంబశివరావు(ఫైల్ ఫోటోస్)
సాక్షి, గుంటూరు: జిల్లాలో కాల్పులు కలకలం సృష్టించాయి. మాచర్ల మండలం రాయవరంలో మాజీ ఆర్మీ జవాన్ మట్టా సాంబశివరావు తుపాకీతో కాల్పులు జరిపారు. గత కొంతకాలంగా మట్టా శివ, మట్టా బాలకృష్ణ, మట్టా సాంబశివరావు మధ్య పొలం వివాదం నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఆదివారం వీరి మధ్య మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీసింది. దీంతో విచక్షణ కోల్పోయిన మాజీ జవాన్ సాంబశివరావు తుపాకీతో కాల్పులకు తెగబడ్డారు. బుల్లెట్లు శరీరంలో దూసుకుపోవడంతో తీవ్ర గాయాలపాలైన శివ, బాలకృష్ణ మృతి చెందారు. ఆంజనేయులు అనే మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిసింది.
ఇవీ చదవండి:
ఎక్కువగా బిర్యానీ, ఫాస్ట్‌ఫుడ్ తింటున్నారా.. ఈ సమస్య రావొచ్చు
అదృష్టం వీరికి పిల్లి రూపంలో వచ్చింది !
Comments
Please login to add a commentAdd a comment