
నల్లగొండవాసి అనుమానాస్పద మృతి
మృతుడు ఆర్మీ జవాన్, 22న వివాహం, అంతలోనే చావు కబురు
మిర్యాలగూడ టౌన్: పశ్చిమ బెంగాల్ లోని కోల్‌కతాలో ఆది వారం నల్లగొండ జిల్లావాసి అనుమానాస్పదంగా మృతి చెం దాడు. వివరాలు.. మిర్యాలగూడ మండలం తడకమళ్లకు చెందిన అనంతుల వెంకయ్య కుమారుడు లింగస్వామి(25) కోల్‌కతాకు 150 కిలోమీటర్ల దూరంలోని పనార్జర్ ఆర్మీ సెం టర్‌లో జవాన్‌గా పనిచేస్తున్నాడు. ఈ నెల 22న అతని వివాహానికి నిశ్చయమైంది. శనివారం రాత్రి 12 గంటల సమయంలో తమతో ఫోన్లో మాట్లాడినట్లు తల్లిదండ్రులు వెంకయ్య, లక్ష్మమ్మ తెలిపారు.
ఈ విషయమై లింగస్వా మి రూమ్‌మేట్ అయిన నల్లగొండ జిల్లా భువనగిరికి చెందిన బాలకృష్ణారెడ్డితో ‘సాక్షి’ మాట్లాడగా తాము నిద్రలేచి స్నానం చేసేందుకు లింగస్వామిని కదిలించగా శరీరం మొత్తం చల్లబడిపోయి ఉందని, వెంటనే అధికారులకు సమాచారం ఇచ్చామన్నారు. ఆర్మీ ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు ధ్రువీకరించినట్లు చెప్పారు. ప్రస్తుతం లింగస్వామి మృతదేహం దుర్గాపూర్ సివిల్ ఆస్పత్రిలో ఉంది.