
సాక్షి, తాడేపల్లి: ఆర్మీ జవాన్ కార్తీక్ మృతిపై వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) సంతాపం తెలిపారు. కార్తీక్ చూపిన ధైర్యసాహసాలు, త్యాగానికి సెల్యూట్ అని ప్రశంసించారు. ఈ కష్ట సమయంలో కార్తీక్(Jawan Karthik) కుటుంబానికి అండగా నిలుద్దామని చెప్పారు.
ఉత్తర జమ్మూలో సైన్యం, ఉగ్రవాదుల మధ్య జరిగిన కాల్పుల్లో కార్తీక్ మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కార్తీక్ మృతిపై వైఎస్ జగన్ సంతాపం వ్యక్తం చేశారు. కార్తీక్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు వైఎస్ జగన్. అలాగే, కార్తీక్ చూపిన ధైర్యసాహసాలు, త్యాగానికి సెల్యూట్ అంటూ ప్రశంసలు కురిపించారు. ఈ కష్ట సమయంలో కార్తీక్ కుటుంబానికి అందరం అండగా నిలుద్దాం అని వ్యాఖ్యానించారు.

జమ్మూకాశ్మీర్లోని సొపోర్ జిల్లాలో ఉగ్రవాదులతో జరిగిన ఎదురు కాల్పుల్లో చిత్తూరు జిల్లా, ఎగువరాగిమాను పెంట గ్రామానికి చెందిన కార్తిక్ వీర మరణం పొందడం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, కార్తిక్ కుటుంబ సభ్యులకు దేవుడు ధైర్యం ప్రసాదించాలని… pic.twitter.com/9P1axvHTi9
— YS Jagan Mohan Reddy (@ysjagan) January 21, 2025