చిత్తూరు: దేశరక్షణ కోసం సియాచిన్ ప్రాంతంలో విధులు నిర్వర్తించి, అక్కడి నుంచి తిరిగి వచ్చిన ఓ సైనికుడిని చిత్తూరు పోలీసులు సెల్‌లో వేసి చితక్కొట్టారు. దాంతో అతడి పరిస్థితి విషమంగా మారింది. ఈ ఘటన చిత్తూరు జిల్లా కుప్పంలో జరిగింది. పోలీసుల చేతిలో దెబ్బలు తిన్న సియాచిన్ సైనికుడు వేమనారాయణ పరిస్థితి విషమంగా ఉంది. బెంగళూరు ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అతడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. బైక్పై వెళ్తున్న అతడిని పోలీసులు ఆపేందుకు యత్నించారు.
అయితే అతడు బైక్ ఆపకుండా వెళ్లడంతో పోలీసులు వేమనారాయణను వెంబడించి... పట్టుకున్నారు. అనంతరం స్టేషన్కి తీసుకువెళ్లి విచక్షణారహితంగా కొట్టారు. ఆ క్రమంలో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. తన భర్తపై పోలీసులు దౌర్జన్యం చేశారని జవాను భార్య ఆందోళనకు దిగారు.