Siachen
-
ప్రపంచ శ్రేయస్సుకు యోగా శక్తివంతమైన సాధనం: మోదీ
శ్రీనగర్: యోగాను ప్రపంచ శ్రేయస్సుకు పనిచేసే శక్తివంతమైన ఉపకరణంగా నేడు అందరూ భావిస్తున్నా రని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. మరింత మంది పర్యాటకులను ఆకర్షించడం ద్వారా జమ్మూకశ్మీర్ ఆర్థిక వ్యవస్థను మార్చే సామర్థ్యం యోగాకు ఉందన్నారు. ఈ కేంద్ర పాలిత ప్రాంతంలో యోగాను 50 వేల నుంచి 60 వేల మంది వరకు సాధన చేస్తుండటం సాధారణ విషయం కాదని తెలిపారు. 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీనగర్‌లోని షేర్–ఇ–కశ్మీర్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్(ఎస్కేఐసీసీ)లో జరిగిన కార్యక్రమంలో మోదీ పాల్గొని ప్రసంగించారు. ‘దేవుడు, ఈశ్వరుడు లేదా అల్లాను చేరుకునే ఆధ్యాత్మిక ప్రయాణంగా యోగా గురించి సాధారణంగా చెబుతుంటారు. ఆధ్యాత్మిక కోణాన్ని వదిలేసి ప్రస్తుతానికి, మనం వ్యక్తిగత అభివృద్ధి కోసం యోగాపై దృష్టి పెట్టి, దానిని జీవితంలో ఒక భాగంగా ఆచరించవచ్చు. అలా చేస్తే ఎన్నో లాభాలు ఉన్నాయి. వ్యక్తిగత అభివృద్ధి సమాజ శ్రేయస్సుకు..అంతిమంగా అది మానవాళి శ్రేయస్సుకు దారితీస్తుంది’’ అని చెప్పారు.సియాచిన్‌లోనూ యోగా డేరాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, అధికారులు యోగా చేశారు. పాల్గొన్నారు. కేంద్ర మంత్రులు అమిత్ షా, ఎస్.జైశంకర్, రాజ్‌నాథ్ సింగ్ తదితరులు దేశవ్యాప్తంగా పలుచోట్ల కార్యక్రమంలో పాల్గొన్నారు. సియాచిన్‌లో, రాజస్తాన్‌లోని థార్ ఏడారిలో, సముద్రంలో విమానవాహక యుద్ధ నౌక ఐఎన్ఎస్ విక్రమాదిత్యపై సైనికులు యోగా చేశారు. తమిళనాడులోని రామేశ్వరంలో సాయుధ సిబ్బంది జల యోగ చేశారు. ఈ ఏడాది యోగా డే ఇతివృత్తం ‘యోగా ఫర్ సెల్ప్ అండ్ సొసైటీ’. -
సియాచిన్‌లో ‘నారీ పర్వం’
లేహ్/జమ్మూ: ప్రపంచంలోనే ఎత్తయిన యుద్ధ క్షేత్రం సియాచిన్‌లో ప్రప్రథమ మహిళా వైద్యాధికారిగా కెప్టెన్ ఫాతిమా వసీమ్ రికార్డు సృష్టించనున్నారు. మొదటిసారిగా ఆపరేషనల్ పోస్టులో భారత ఆర్మీ ఈమెను నియమించింది. కేంద్రపాలిత ప్రాంతమైన లద్దాఖ్‌లోని సియాచిన్‌లో బాధ్యతలు చేపట్టనున్న రెండో వైద్యాధికారి ఫాతిమా అని భారత ఆర్మీకి చెందిన ఫైర్ అండ్ ఫ్యురీ కార్ప్స్ మంగళవారం తెలిపింది. సైన్యంలో లింగసమానత్వం పెంచేందుకు తీసుకుంటున్న చర్యల్లో కెప్టెన్ ఫాతిమా నియామకం ఒకటని తెలిపింది. సియాచిన్ బ్యాటిల్ స్కూల్లో కఠోర శిక్షణ పొందిన ఆమె 15,200 అడుగుల ఎత్తులో ఉన్న సియాచిన్ పోస్టులో బాధ్యతలు చేపడతారని వివరించింది. అత్యంత కఠినమైన వాతావరణ పరిస్థితుల మధ్య ఈమె బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుంది. కెప్టెన్ గీతికా కౌల్‌ను సియాచిన్‌లో మొదటి మహిళా వైద్యాధికారిగా నియమించినట్లు ఈ నెల మొదటి వారంలో ఆర్మీ ప్రకటించింది. -
రిస్క్ చేయాలేగానీ..మా తర్వాతే ఎవరైనా..!
సక్సెస్‌కి మారుపేరుగా నిలవాలంటే జెండర్‌తో పని ఏముంది. పట్టుదల ఉండాలి...దానికి తగ్గ కృషి, వీటన్నింటికీ మించిన సంకల్పం ముఖ్యం. దీనికి ఆత్మ విశ్వాసాన్ని, కఠోర శ్రమను జోడించి సక్సెస్‌తో సలాం చేయించుకుంటూ ఈ విషయంలో మేమేం తక్కువ కాదంటోంది మహిళా శక్తి. వివక్షల్నీ, అడ్డంకుల్నీ అధిగమించి వివిధ రంగాలలో రాణిస్తున్న మహిళా శక్తికి, సాధికారతకు, నిదర్శనంగా నిలిచారు ముగ్గురు ధీర వనితలు. దేశం గర్వించేలా భారత నారీశక్తిని మరోసారి ప్రపంచానికి చాటి చెప్పారు. అక్షతా కృష్ణమూర్తి అమెరికాలోని నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (నాసా)తో కలిసి మార్స్ రోవర్‌ను నిర్వహించే తొలి మహిళగా చరిత్ర సృష్టించిన భారతీయ మహిళ డా. అక్షతా కృష్ణమూర్తి. పెద్ద పెద్ద కలలు కనడం పిచ్చితనమేమీ కాదు.. మిమ్మల్ని మీరు నమ్ముకోండి.. ఆశయ సాధనలో అలుపెరుగక పనిచేస్తూ పొండి... విజయం మీదే, నాదీ గ్యారంటీ అంటారామె. అంగారక గ్రహంపై రోవర్‌ను ఆపరేట్ చేయనున్న తొలి భారతీయ మహిళగా అవతరించిన తన సక్సెస్ జర్నీని ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. 13 ఏళ్ల క్రితమే నాసాలో పని చేయాలనేది ఆమె కల. భూమి ,అంగారక గ్రహంపై సైన్స్ అండ్ రోబోటిక్ ఆపరేషన్స్‌కు నాయకత్వం వహించాలనేది చిరకాల డ్రీమ్. అలా అమెరికా ప్రయాణం ప్రారంభమైంది. ఈ ప్రయాణంలో లక్ష్యాన్ని సాధించేంతవరకు ఎవరేమన్నా పట్టించుకోలేదు. View this post on Instagram A post shared by Dr. Akshata Krishnamurthy | Rocket Scientist (@astro.akshata) కానీ ఇది అంత సులువుగా ఏమీ జరగలేదు. పీహెచ్డీ డిగ్రీనుంచి నాసాలో ఫుల్ టైం ఉద్యోగం వచ్చేదాకా ఎంతో కష్టపడ్డాను అని చెప్పారు. ఈ రోజు, అంగారక గ్రహంనుంచి అనేక శాంపిల్స్‌ను భూమికి తీసుకురావడానికి రోవర్‌తో సహా పలు కూల్ స్పేస్ మిషన్లలో పని చేస్తున్నాను అని పేర్కొన్నారు. అక్షత MIT (మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ) నుండి పీహెచ్డీ ఏశారు. నాసాలో చేరిన అతికొద్ది మంది భారతీయుల్లో ఆమె కూడా ఒకరు. నాసాలో ప్రధాన పరిశోధకురాలిగా గత ఐదేళ్లుగా పనిచేస్తున్నారు. మహిళా ఆర్మీ డాక్టర్ కెప్టెన్ గీతిక కౌల్ సియాచిన్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధభూమి సియాచిన్లోని భారత సైన్యానికి చెందిన తొలి మహిళా మెడికల్ ఆఫీసర్‌గా ఎంపికయ్యారు. స్నో లెపార్డ్ దళానికి చెందిన కెప్టెన్ గీతికా కౌల్ చరిత్ర సృష్టించారు. హిమాలయాల ఉత్తర భాగంలో ఉన్న సియాచిన్ బాటిల్ స్కూల్లో కఠినమైన ఇండక్షన్ శిక్షణను సక్సెస్‌ఫుల్‌గా ప పూర్తి చేసి మరీ ఈ కీలకమైన మైలురాయిని సాధించారు. అనేక అడ్డంకులను ఛేదించి అంకితభావంతో, దేశానికి సేవ చేయడం స్ఫూర్తిదాయకం. స్క్వాడ్రన్ లీడర్ మనీషా పాధి తొలి మహిళగా రికార్డు క్రియేట్ చేసిన మరో మహిళా శక్తి స్క్వాడ్రన్ లీడర్ మనీషా పాధి. మిజోరాంలో గవర్నర్ డాక్టర్ హరి బాబు కంభంపాటి కీలక పదవిలో పాధిని ఎంపిక చేశారు. 2015 బ్యాచ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ అయిన Sqn లీడర్ మనీషా పాధిని భారత సాయుధ దళాల నుండి భారతదేశపు తొలి మహిళా సహాయకురాలుగా (ఎయిడ్-డే-క్యాంప్) నియమించారు.అధికారికంగా ఆమె బాధ్యతలను కూడా స్వీకరించారు. Sqn లీడర్ మనీషా పాధి మూడు కీలక పదవులను కూడా నిర్వహించారు. ఎయిర్ ఫోర్స్ స్టేషన్, బీదర్, ఎయిర్ ఫోర్స్ స్టేషన్, పూణే, ఎయిర్ ఫోర్స్ స్టేషన్, భటిండాలో పనిచేశారు. ఒడిశాలోని బెర్హంపూర్‌కు చెందిన మనీషా తండ్రి ఇన్స్పిరేషన్. ఆమె భర్త మేజర్ దీపక్ సింగ్ కర్కీ ఇండియన్ ఆర్మీలో పని చేస్తున్నారు. భువనేశ్వర్‌లోని CV రామన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్‌లో గ్రాడ్యుయేషన్ చేసిన మనీషా 2015లో ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్‌లో ఉత్తీర్ణత సాధించి ఏఐఎఫ్‌లో చేరారు. Squadron Leader Manisha Padhi appointed as Aide-De-Camp(ADC) to the Governor of Mizoram. Sqn Leader Manisha is India’s first Woman Indian Armed Forces officer to be appointed as Aide-De-Camp(ADC) to the Governor in the country: Governor of Mizoram (Source: Office of Governor of… pic.twitter.com/3wsWuI5hBW — ANI (@ANI) December 4, 2023 ఏడీసీ అంటే? గవర్నర్‌కు వ్యక్తిగత సహాయకురాలిగా అధికారిక పర్యటనలలో కూడా రాజ్యాంగ అధికారంతో వెంట ఉంటారు. ప్రతి గవర్నర్‌కు ఇద్దరు ADCలు ఉంటారు, ఒకరు సాయుధ దళాల నుండి , మరొకరు పోలీసు అధికారి. మిజోరంలో,రెండో ఏడీసీ రాష్ట్ర పోలీసు అధికారిగా జోనున్ తారా ఉన్నారు. -
ప్రపంచంలోనే ఎత్తైన ప్రదేశంలో మొబైల్ టవర్!
ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా సోషల్‌మీడియాలో చురుగ్గా ఉంటారు. తనకు నచ్చిన అంశాలను ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ ఫాలోవర్లలో స్ఫూర్తి నింపుతుంటారు. అలా ఎక్స్(ట్విటర్) వేదికగా ఆయన పంచుకున్న వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. సియాచిన్ పర్వత శ్రేణుల్లో జవాన్లు మొట్టమొదటగా మొబైల్ టవర్‌ను ఏర్పాటు చేశారు. భారత జవాన్లు దీన్ని ఏర్పాటు చేయడంపై ఆనంద్ మహీంద్రా ఎక్స్(ట్వీటర్)లో స్పందించారు. ప్రపంచంలో ఇది ఒక చిన్న సంఘటన. మనల్ని రక్షించడానికి అత్యంత ఎత్తైన యుద్ధభూమిలో ప్రతిరోజూ తమ ప్రాణాలను పణంగా పెడుతున్న వారు ఇప్పుడు తమ కుటుంబాలతో కనెక్ట్ అవుతున్నారని ట్వీట్ చేశారు. అంత ఎత్తులో మొబైల్ టవర్ ఏర్పాటు చేసుకోవడం..విక్రమ్ ల్యాండర్ ఘనతతో సమానమైందని కొనియాడారు. సుమారు 15500 అడుగుల ఎత్తులో ఉన్న ఈ ప్రదేశంలో బీఎస్ఎన్ఎల్ టవర్‌ను ఏర్పాటు చేసింది. These are photos shared by @devusinh of the first ever mobile tower installed in Siachen! A seemingly small event in our turbulent world. But it means our Jawans who put their lives on the line every single day on the world’s highest battlefield to defend us are now strongly… pic.twitter.com/bn1L260hLz — anand mahindra (@anandmahindra) October 13, 2023 -
సియాచిన్‌లో ఆర్మీ చీఫ్
-
మంచు తుఫాన్లో నలుగురు సైనికుల మృతి
న్యూఢిల్లీ: సియాచిన్లోని ఉత్తర సెక్టార్లో సోమవారం మంచు తుఫాన్లో చిక్కుకుని నలుగురు సైనికులు, ఇద్దరు కూలీలు ప్రాణాలు కోల్పోయారు. సోమవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో 8 మంది సైనికులు సియాచిన్‌లో సుమారు 19 వేల అడుగుల ఎత్తులో ఉన్నప్పుడు మంచు తుఫాన్లో చిక్కుకున్నారని అధికారులు తెలిపారు. వారిని గుర్తించి, వెలికి తీసేందుకు సహాయక బృందాలను సంఘటనాస్థలికి పంపామన్నారు. మంచు కింది చిక్కుకుపోయిన 8 మందిని వెలికి తీశామని, వారిలో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారని వెల్లడించారు. క్షతగాత్రులను వెంటనే హెలికాప్టర్ల ద్వారా మిలిటరీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించినట్లు వివరించారు. వైద్యులు తీవ్రంగా శ్రమించినప్పటికీ నలుగురు జవాన్లు, ఇద్దరు కూలీలు మరణించారని వెల్లడించారు. ఈ మేరకు వారి కుటుంబసభ్యులకు సమాచారమిచ్చామన్నారు. -
సియాచిన్ గ్లేసియర్‌లో రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్
-
జవాన్‌కి జై...జాబ్‌కి గుడ్‌బై...
ఆ కుర్రాడు ఎరోనాటికల్ ఇంజనీర్. అప్పుడప్పుడు సరదాగా షార్ట్ ఫిలిమ్స్‌లో నటించేవాడు. మూడేళ్ల క్రితం మంచుకొండపై భారతీయ సైనికులు పడుతున్న కష్టాల్ని కళ్లకు కట్టిన ఓ సంఘటన అతనిపై చెరగని ముద్ర వేసింది. సియాచిన్‌పై సినిమా తీసే బృహత్తర యత్నానికి ‘తెర’లేచింది. సాక్షి, సిటీబ్యూరో/పంజగుట్ట: ‘‘–60 డిగ్రీల చలి అంటే మాటలా? పాకిస్తాన్ సైన్యం కంటే వాతావరణమే మన సైనికులకు అక్కడ పెద్ద శతృవు. అలాంటి సియాచిన్ ప్రాంతంలో రెండేళ్ల క్రితం సంభవించిన అవలాన్జ్ కారణంగా 10 మంది భారతీయ సైనికులు మంచులో చిక్కుబడిపోయారు. అందులో లాన్స్ నాయక్ హనుమంతప్ప మాత్రమే బతికారు. ఆ దుస్సంఘటన కలిచివేసింది. సియాచిన్‌లో సైన్యం కష్టాల గురించి దేశ ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందనిపించింది’’ అంటూ గుర్తు చేసుకున్నారు వినయ్ సింగ్. తన సినిమాకు సంబంధించి మరిన్ని విశేషాలను ఆయన సాక్షితో ఇలా పంచుకున్నారు... జవాన్‌కి జై...జాబ్‌కి గుడ్‌బై... నేను ఈ సినిమా గురించి ఈ రంగానికి చెందిన పలువురితో చర్చించినప్పుడు చాలా మంది సాంకేతిక నిపుణులు ఇలాంటి సబ్జెక్ట్‌కు పెద్ద బడ్జెట్ లేకుండా అసాధ్యమన్నారు. ప్రయత్నిద్దాం అన్నా ఎవరూ సహకరించలేదు. కాని నాకు ఇంత సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉండి ఎందుకు తీయలేం? అనేదే ఆలోచన. దాంతో ఈ సినిమా నేనే తీద్దాం అని సిద్ధమయ్యాను. దీని కోసం పూర్తి సమయం కేటాయించాలని అనుకున్నాను. జాబ్ వదిలేశాను. అయితే నాకు అప్పటిదాకా పూర్తి స్థాయిలో సినిమా తీసిన అనుభవం లేదు. తొలిసారే బాగా క్లిష్టమైన సబ్జక్ట్. ఒక్కడ్నే ఒంటి చేత్తో అనేక బాధ్యతలు నిర్వర్తించాల్సి వచ్చింది. కధతో మొదలుపెట్టి నటన, యానిమేషన్, విఎఫ్ఎక్స్ వర్క్, సంగీతం, మేకప్, ఎడిటింగ్, దర్శకత్వం... అన్నీ నేనే తలకెత్తుకున్నాను. ఎందులోనూ అనుభవం లేకున్నా సరే ప్రతీ అంశాన్నీ కొన్ని రోజులు స్టడీ చేయడం ఆచరణలో పెట్టడం ఇలా కొనసాగించాను. పోస్టర్ ఆవిష్కరిస్తున్న వినయ్, కుటుంబసభ్యులు డాబా మీదే...సియాచిన్ సియాచిన్ ప్రాంతం దాకా వెళ్లేంత బడ్జెట్గాని అంత మంది నిపుణుల బృందం గాని నా దగ్గర లేదు. అదే సమయంలో అవతార్, లైఫ్ ఆఫ్ పై వంటి సినిమాలు పూర్తిగా స్టూడియోలో తీశారనే విషయాన్ని గుర్తు తెచ్చుకున్నాను. ఇసిఐఎల్ దగ్గర ఆర్‌కెపురంలో ఉన్న మా బిల్డింగ్ టెర్రస్‌పైన నీలిరంగు మూవీ క్లాత్‌ను అరేంజ్ చేసుకుని షూట్ చేశాను. 90శాతం మూవీ టెర్రస్‌పైనే పూర్తయింది. అప్పటి దాకా విఎఫ్ఎక్స్ అంటే ఏంటో కూడా తెలీని నేను దాదాపు సినిమా మొత్తం విఎఫ్ఎక్స్లోనే తీశానంటే నాకే ఇప్పుడు ఆశ్చర్యం అనిపిస్తుంది. కాకపోతే చాలా టైమ్ పట్టింది. చాలా సార్లు వదిలేద్దాం అనుకున్నాను. కాని ఎప్పటికప్పుడు పట్టుదల పెంచుకుంటూ పోయాను. ఈ నెల 24న పూర్తయింది. నిజానికి ఈ చిత్రాన్ని అన్ని హంగులూ, నిపుణులతో తీస్తే కనీసం రూ.10లక్షలు ఖర్చు అవుతుంది. నేను రూ. 33 వేలతో పూర్తి చేయగలిగాను. దీనికి దాదాపు మూడేళ్లు ఖచ్చితంగా చెప్పాలంటే 1000 రోజులు పట్టింది. ఇందులో తన తల్లి ఉషా నటించారని, సినిమాటోగ్రఫర్‌గా రంజిత్, డైలాగ్ రైటర్‌గా శ్రావ్య మానస వ్యవహరించారని చెప్పారు. ప్రజలకు తెలియాలి...సైనికులకు నివాళి... ప్రపంచపు అత్యంత క్లిష్టమైన యుద్ధ ప్రాంతం వేదికగా మనకు సేవ చేస్తున్న సైనికులకు నివాళిగా డైయింగ్ సోల్జర్ చిత్రాన్ని తీశాను.. ట్రైలర్‌కి, పోస్టర్స్‌కి పాజిటవ్ రెస్పాన్స్ వస్తుంటే ఆనందంగా అనిపిస్తోంది. ఈ సినిమా ద్వారా సైనికుల త్యాగాలు అందరికీ తెలియాలన్నదే నా ఆకాంక్ష. మన సైనికుల గురించి మనమంతా గర్వించాలనే తపన. అంతే తప్ప దీని నుంచి ఆదాయం పొందాలనే ఆలోచన లేదు. రిపబ్లిక్ డే ను పురస్కరించుకుని ఈ సినిమాను ఉచితంగా ప్రసాద్ ల్యాబ్స్‌లో ప్రదర్శిస్తున్నాం. గత 1000 రోజుల పాటు నేను పొందిన భావోద్వేగాలను ప్రజలతో పంచుకోవాలనుకుంటున్నాను. ఈ షార్ట్‌ఫిల్మ్‌కు సంబంధించి శుక్రవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో పోస్టర్ ఆవిష్కరించారు. ది డైయింగ్ సోల్జర్ చిత్రాన్ని చూడాలనుకుంటే... వేదిక ప్రసాద్ ల్యాబ్స్శనివారం, సమయం మధ్యాహ్నం 2గంటల నుంచిప్రవేశం: ఉచితం. -
ఇకపై రెండు వారాలకోసారి స్నానం చేయవచ్చు!
సియాచిన్ : సియాచిన్ గ్లేసియర్‌లో విధులు నిర్వర్తించే సైనికులు స్నానం చేసేందుకు నెలల తరబడి వేచి చూడాల్సిన పనిలేదని ఆర్మీ ఉన్నతాధికారి తెలిపారు. ‘సియాచిన్ గ్లేసియర్‌లో పనిచేసే సైనికులు విధులు నిర్వర్తించే క్రమంలో 90 రోజులపాటు స్నానం చేయకుండా ఉండాల్సివస్తోంది. ఇకపై ఇలాంటి పరిస్థితులు ఉండబోవు. వీరి కోసం ప్రత్యేకంగా వాటర్‌లెస్ బాత్ ప్రొడక్ట్స్ అందుబాటులోకి రానున్నాయి. 20 మిల్లీలీటర్ల జెల్ కలిగి ఉండే ఈ సౌందర్య ఉత్పత్తులను ఉపయోగించడం ద్వారా... వారు రెండు వారాలకొకసారి స్నానం చేయవచ్చు’ అని ఆయన పేర్కొన్నారు. కాగా ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధభూమి(సుమారు 22 వేల అడుగుల ఎత్తు) సియాచిన్‌లో సుమారు 3వేల మంది సైనికులు విధులు నిర్వర్తిస్తారు. అత్యంత శీతలమైన ఈ ప్రదేశంలో ఉష్ణోగ్రతలు ఒక్కోసారి మైనస్ 60 డిగ్రీలకు పడిపోతాయన్న సంగతి తెలిసిందే. ఇక్కడ గస్తీ కాసేందుకు ప్రభుత్వం రోజుకు సుమారు ఐదు నుంచి 7 కోట్ల రూపాయలు ఖర్చుచేస్తోంది. ఇక ఇక్కడ పనిచేసే సైనికుల సమస్యలు, అవసరాలు తెలుసుకునే క్రమంలో ఆర్మీ డిజైన్ బ్యూరో(ఏడీబీ) 2016లో రీసర్చ్ అండ్ డెవలప్మెంట్ సంస్థను ఏర్పాటు చేసింది. ఇది సైనికులకు, వివిధ రకాల వస్తువులను ఉత్పత్తి చేసే పలు ప్రైవేటు సంస్థలకు మధ్య వారధిలా పనిచేస్తుంది. ఈ నేపథ్యంలో సైనికుల పరిశుభ్రత దృష్ట్యా హైజెనిక్ ఉత్పత్తులను అందుబాటులోకి తెచ్చింది. కాగా విధి నిర్వహణలో భాగంగా యుద్ధ ట్యాంకుల పనితీరులో లోపాలు, తాత్కాలిక బ్రిడ్జీల నిర్మాణం, సాంకేతిక అంశాల్లో జాప్యం తదితర సుమారు 130 రకాల సమస్యలను సైనికులు ఏడీబీ దృష్టికి తీసుకురాగా.. అందులో ప్రస్తుతం 25 సమస్యలు పరిష్కారమైనట్లు అధికారులు వెల్లడించారు. -
సియాచిన్‌లో కోవింద్
సియాచిన్: ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన యుద్ధభూమి సియాచిన్‌ను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ గురువారం సందర్శించారు. ఇక్కడ పర్యటించిన రెండో రాష్ట్రపతి కోవిందే కావడం విశేషం. ఇంతకు ముందు 2004లో అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఈ ప్రాంతాన్ని సందర్శించారు. సైనికులను ఉద్దేశించి కోవింద్ ప్రసంగిస్తూ..గత 34 ఏళ్లుగా సియాచిన్‌లో సేవలందిస్తున్న జవాన్ల అసమాన ధైర్య సాహసాలే మన సరిహద్దులు సురక్షితమన్న విశ్వాసాన్ని భారతీయుల్లో నింపాయని అన్నారు. సైనికులు, వారి కుటుంబాలకు భారత ప్రభుత్వం, ప్రజలు అండగా ఉన్నారని చెప్పడానికే తానిక్కడికి వచ్చినట్లు తెలిపారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో సేవలందిస్తున్న జవాన్లందరికీ ఆర్మీ సుప్రీం కమాండర్, రాష్ట్రపతి హోదాలో భారత ప్రజలందరి తరఫున కృతజ్ఞతలు తెలిపారు. వీలు చిక్కినప్పుడు ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌కు రావాలని వారిని ఆహ్వానించారు. సియాచిన్ బేస్ క్యాంపునకు సమీపంలోని కుమార్ పోస్ట్‌ను కూడా కోవింద్ సందర్శించారు. రాష్ట్రపతి వెంట ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్, లెఫ్టినెంట్ జనరల్ డి. అన్బు, ఇతర ఆర్మీ ఉన్నతాధికారులు ఉన్నారు. జమ్మూకశ్మీర్‌లో 2 వేల అడుగుల ఎత్తులోని సియాచిన్ పోస్టుల్లో ఉష్ణోగ్రతలు మైనస్ 52 డిగ్రీల వరకు పడిపోతాయి. -
కూర్చోని మాట్లాడుకుందాం రండి!?
ఇస్లామాబాద్ : అంతర్జాతీయంగా మారుతున్న సమీకరణల నేపథ్యంలో పాకిస్తాన్ వైఖరిలో మార్చు వచ్చినట్లు కనిపిస్తోంది. చతుర్భుజ కూటమితో భారత్ బలోపేతమవుతున్ననేపథ్యంలో పాకిస్తాన్.. రెండడుగులు వెనక్కి వేసినట్లు తెలుస్తోంది. కశ్మీర్ సహా పలు వివాదాస్పద అంశాలపై భారత్‌తో చర్చలకు తాము సిద్ధమంటూ పాకిస్తాన్ గురువారం ప్రకటించింది. దశాబ్దాలుగా అత్యంత వివాదాస్పద అంశంగా నలుగుతున్న కశ్మీర్ సహా, సియాచిన్, సిర్‌క్రీక్ వంటి అంశాలపై చర్చలు పునఃప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నామంటూ.. పాకిస్తాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మహమ్మద్ ఫైసల్ ప్రకటించారు. బుధవారం ఆయన ఇస్లామాబాద్‌లో మాట్లాడుతూ.. చర్చలకు మేం సిద్ధంగా ఉన్నాం.. భారత ప్రతిస్పందన కోసం ఎదురు చూస్తున్నామని ప్రకటించారు. పాకిస్తాన్ సైనిక చట్టాల ప్రకారం.. మిలటరీ కోర్టు ఉరిశిక్ష విధించాక.. ఎవరినీ కలిసేందుకు అనుమతించం..అయితే కేవలం మానవతా దృక్ఫథాన్ని దృష్టిలో పెట్టుకుని కులభూషన్ జాదవ్‌ను కలిసేందుకు ఆమె భార్యకు అనుమతి ఇచ్చినట్లు ఆయన తెలిపారు. ఈ మధ్య కాలంలో భారత్ క్రూయిజ్ మిసైల్‌ను పరీక్షించడంపైనా ఆయన స్పందించారు. భారత్ మిసైల్ పరీక్షలు నిర్వహించడం వల్ల రీజియన్‌లో శాంతి భద్రతలు ప్రమాదంలో పడతాయని ఆయన అన్నారు. -
సియాచిన్‌పై పాక్ యుద్ధ విమానాలు!
► మన గగనతల ఉల్లంఘనేం జరగలేదు: భారత్ ► శత్రువు గుర్తుంచుకునే జవాబిస్తాం: పాక్ హెచ్చరిక ఇస్లామాబాద్: భారత్ సరిహద్దుల్లోని ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధ క్షేత్రం సియాచిన్ గ్లేసియర్ వద్ద పాకిస్తాన్ యుద్ధ విమానాలు చక్కర్లు కొట్టాయి. ఈ విషయాన్ని పాకిస్తాన్ మీడియా వె ల్లడించింది. ఇరుదేశాల మధ్య తాజాగా నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఎటువం టి ప్రమాదాన్నైనా ఎదుర్కొనేందుకు పాక్ ఆర్మీ సిద్ధంగా ఉందని పేర్కొంది. అయితే.. సియాచిన్‌లో పాక్ యుద్ధ విమానాల చక్కర్లు, ఉద్రిక్త పరిస్థితి అంటూ ప్రసారమైన వార్తల్లో వాస్తవం లేదని భారత్ స్పష్టం చేసింది. ‘భారత గగనతల పరిధి ఉల్లంఘనేదీ జరగలేదు’ అని భారత వైమానిక దళం వెల్లడించింది. ఏ పరిస్థితుల్లోనైనా తగిన సమాధానం చెప్పేందుకు సిద్ధమేనని సంకేతాలిచ్చింది. వారం క్రిత మే సరిహద్దుల్లోని ఎయిర్‌బేస్‌లను భారత్ అప్రమత్తం చేసిన సంగతి తెలిసిందే. తరతరాలు గుర్తుంచుకునేలా..: పాక్ తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్తాన్ వైమానిక దళ చీఫ్ సొహైల్ అమన్ సరిహద్దుల్లోని స్కర్దు సమీపంలోని ఖాద్రీ ఎయిర్‌బేస్‌ను బుధవారం సందర్శించారు. మిరేజ్ యుద్ధ విమానంలో పర్యటించి సరిహద్దుల్లో భద్రత పరిస్థితి సమీక్షించారు. శత్రువు తమ జోలికొస్తే తరతరాలు గుర్తుంచుకునేలా గట్టిగా బదులిస్తామని పరోక్షంగా భారత్‌ను హెచ్చరించారు. సరిహద్దుల్లోని పాకిస్తాన్ ఎయిర్‌బేస్‌లన్నీ అప్రమత్తంగా ఉన్నాయని.. తమ దేశ సరిహద్దులను కాపాడుకోవటంలో ఎలాంటి ఎదురుదాడికైనా దిగుతామని స్పష్టం చేశారు. అటు, ‘పాక్ సముద్ర తీరాన్ని కాపాడుకునేందుకు మన నేవీ సిద్ధంగా ఉంది. భారత్ రెచ్చగొట్టే చర్యలకు సరికొత్త యుద్ధ సాంకేతికతతో సమాధానమిస్తాం’ అని లాహోర్‌లోని నౌకాదళ యుద్ధ కాలేజీలో పాక్ నేవీ చీఫ్ అడ్మిరల్ ముహమ్మద్ జకావుల్లా హెచ్చరించారు. కాగా, పాకిస్తాన్ విడుదల చేసిన వీడియో సరైంది కాదని.. పాత వీడియోకు ఎన్నో కత్తిరింపులు (ఎడిట్) చేశారని భారత్ పేర్కొంది. భారత పోస్టుల ధ్వంసం: పాక్ ఇస్లామాబాద్: కశ్మీర్లో నియంత్రణ రేఖ వెంట భారత ఆర్మీ పోస్టులకు నష్టం చేకూర్చుతున్నట్లు చూపుతున్న వీడియోను పాకిస్తాన్ సైన్యం విడుదల చేసింది. పాక్ ఆర్మీ స్థావరాలపై దాడులు చేశామంటూ భారత్ మంగళవారం వీడియో విడుదల చేయడానికి ప్రతిగానే పాక్ ఇలా స్పందించినట్లు తెలుస్తోంది. పాక్ ఆర్మీ అధికార ప్రతినిధి మేజర్ జనరల్ ఆసిఫ్ గఫూర్ 87 సెకన్ల నిడివి ఉన్న వీడియోను ఫేస్బుక్లో పోస్ట్‌చేశారు. దాంతోపాటు మే 13న భారత సైన్యం పౌరులను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపిందని ఆరోపించారు. గట్టి బదులిచ్చేందుకే నౌషేరాలోని భారత శిబిరాలను పాక్ సైన్యం నేలమట్టం చేసిందన్నారు. భారీ ఫిరంగులు భారత స్థావరాలను ధ్వంసం చేస్తున్నట్లు వీడియోలో ఉంది. -
సియాచిన్‌లో పాక్ యుద్ధ విమానాలు!
-
సియాచిన్‌లో పాక్ హడావుడి!
న్యూఢిల్లీ: పాకిస్థాన్ వైమానిక దళానికి చెందిన మిరేజ్ తరహా యుద్ధ విమానాలు సరిహద్దుల్లోని సియాచిన్ గ్లేసియర్ సమీపంలో తిరిగినట్లు ఆ దేశ మీడియా కథనాలు ప్రచురించడం కలకలం రేపింది. భారత భూభాగంలో ఉన్న సియాచిన్ ప్రాంతం సమీపంలో పాక్ వైమానిక దళ చీఫ్ తిరిగారని మీడియా చెప్పుకొచ్చింది. అయితే, ఈ కథనాలను భారత వైమానిక దళం నిర్ద్వంద్వంగా ఖండించింది. సియాచిన్లోని భారత గగనతలంలో ఎలాంటి ఉల్లంఘనలు జరగలేదని స్పష్టం చేసింది. పాక్ ఎయిర్‌ఫోర్స్ చీఫ్ మార్షల్ సోహైల్ అమన్ సరిహద్దుల్లోని స్కర్దు ప్రాంతంలో ఉన్న ఖాద్రి వైమానిక స్థావరాన్ని సందర్శించారని పాక్ మీడియా పేర్కొన్నది.ఇక్కడ ఫైటర్ జెట్ వైమానిక దళం యుద్ధ విన్యాసాలు నిర్వహిస్తున్నది. ఇక్కడ ఉన్న తమ ఎయిర్‌ఫోర్స్ స్థావరాలన్నింటినీ భారత ముప్పును ఎదుర్కొనేందుకు పాక్ క్రియాశీలం చేసినట్టు మీడియా చెప్పుకొచ్చింది. ఈ సందర్భంగా పాక్ ఎయిర్ చీఫ్ అమన్ తానే స్వయంగా మిరాజ్ జెట్ విమానాన్ని నడుపుతూ.. సియాచిన్ సమీపంలోకి చొచ్చుకొచ్చినట్టు కథనాలు వండివార్చింది. ఈ కథనాలను భారత్ తీవ్రంగా ఖండించింది. మిలిటెంట్ల చొరబాట్లకు నేరుగా సహకరిస్తూ కాల్పులకు దిగుతున్న పాక్ సైన్యానికి బుద్ధి చెప్పేందుకు జమ్మూకశ్మీర్‌లోని నౌషెరా సెక్టార్‌లోని పాక్ సైనిక పోస్టు భారత్ ఆర్మీ ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. భారత వైమానిక దళాలు పాక్ సైనిక పోస్టుపై దాడులు నిర్వహించిన వీడియోను ఆర్మీ విడుదల చేసింది. అయితే, ఈ దాడిని తోసిపుచ్చుతున్న పాక్.. తాజా సరిహద్దుల్లో దూకుడుగా వ్యవహరించాలనుకోంటోంది. ఈ నేపథ్యంలోనే సియాచిన్ గగనతలంలోకి తమ విమానాలు వచ్చాయంటూ కథనాలు ప్రచురించడం గమనార్హం. పాకిస్తాన్‌తో యుద్ధం? -
‘ట్వీట్’లో కాలేసిన సీఎం కార్యాలయ సిబ్బంది
న్యూఢిల్లీ: ఓ వాక్యములో చిన్న పదం తప్పు దొర్లితే అర్థం మారిపోతుంది. బాధ్యత గల హోదాలో ఉన్నవారు ఇలాంటి పొరపాట్లు చేస్తే వివాదం అవుతుంది. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కార్యాలయం సిబ్బంది పొరపాటుగా చేసిన ట్వీట్‌పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. చైనాకు చెందిన ప్రతినిధి బృందం కర్ణాటక సీఎంను కలిసింది. బెంగళూరు అభివృద్ధి ఇతర విషయాల గురించి వారు సిద్ధరామయ్యతో చర్చించారు. అనంతరం కర్ణాటక సీఎం పేరుతో ఆయన కార్యాలయ సిబ్బంది.. ‘చైనాలోని సియాచిన్ ప్రావిన్స్ నుంచి లీ జోంగ్ సారథ్యంలో వచ్చిన బృందంతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. పలు విషయాలు చర్చించారు’ అని ట్వీట్ చేసింది. విషయం ఏంటంటే సియాచిన్ అనేది వాస్తవాధీన రేఖ వద్ద భారత భూభాగంలో గల హిమాలయ పర్వత శ్రేణి. చైనాలో సిచువాన్ అనే ప్రావిన్స్ ఉంది. కర్ణాటకకు వచ్చిన బృందం ఈ ప్రావిన్స్‌కు చెందినవారు కావచ్చు. కాగా కర్ణాటక సీఎం కార్యాలయం చేసిన ట్వీట్లో సియాచిన్ ప్రాంతం చైనాలో ఉన్నట్టుగా అర్థం వచ్చేలా ఉంది. ఈ ట్వీట్ చూడగానే రాజకీయ వర్గాలు, నెటిజన్లు విమర్శలకు పదును పెట్టారు. ‘సియాచిన్ చైనాలో ఉందా? ప్రతినిధి బృందం సిచువాన్ ప్రావిన్స్‌కు చెందినవారు కావచ్చు’ అని కొందరు ట్వీట్ చేశారు. ‘ఓ రాష్ట్ర ముఖ్యమంత్రికి సియాచిన్‌కు, సిచువాన్‌కు గల తేడా చెప్పేవారు లేరా?’ అని మరికొందరు విమర్శించారు. -
జవాను సునీల్ రాయ్ మృతదేహం లభ్యం
శ్రీనగర్ : జమ్ముకశ్మీర్ సియాచిన్‌లో మంచు తుపానులో గల్లంతు అయిన జవాను సునీల్ రాయ్ మృతదేహం లభ్యమైంది. సియాచిన్ తుర్టక్ సెక్టార్ లడక్‌లో ఆర్మీ గస్తీ బృందంపై హిమపాతం పడటంతో ఒక జవాను మృతిచెందగా, మరో జవాను నిన్న గల్లంతు అయిన విషయం తెలిసిందే. గాలింపు చర్యల్లో భాగంగా సునీల్ రాయ్ మృతదేహాన్ని గుర్తించినట్లు ఆర్మీ అధికారి ఒకరు శనివారం తెలిపారు. మృతి చెందిన సునీల్ రాయ్‌కు తల్లిదండ్రులతో పాటు ఇద్దరు సోదరులు ఉండగా, ఇక తమాంగ్కు భార్య, ఆరేళ్ల కుమార్తె ఉన్నారు. ఇద్దరు జవాన్ల కుటుంబాలకు ఆర్మీ కమాండర్, లెఫ్టినెంట్ జనరల్ డీఎస్ హుడా తన సంతాపాన్ని ప్రకటించారు. గత నెలలో సియాచిన్ గ్లేసియర్‌లో హిమపాతం దెబ్బకు లాన్స్ నాయక్ హనుమంతప్పతో పాటు పది మంది సైనికులు మత్యు ఒడికి చేరిన విషయం తెలిసిందే. -
హిమపాతంలో జవాను మృతి
కనిపించని మరొకరి జాడ సియాచిన్‌లో మరో దుర్ఘటన జమ్మూ/శ్రీనగర్: సియాచిన్‌లో ప్రాణాలను పణంగా పెట్టి దేశ రక్షణకు పాటుపడుతున్న సైనికులపై మరోసారి హిమపాతం విరుచుకుపడింది. ఇటీవల పది మంది జవాన్లు మంచులో మృత్యువుతో పోరాడి ప్రాణాలు విడిచిన విషాదం మరువక ముందే మరో దుర్ఘటన సంభవించింది. శుక్రవారం సియాచిన్ తుర్టక్ సెక్టార్ లడక్‌లో ఆర్మీ గస్తీ బృందంపై హిమపాతం పడటంతో ఒక జవాను మృతిచెందగా, మరో జవాను గల్లంతయ్యారు. ‘ప్రపంచంలోనే ఎత్తయిన యుద్ధభూమి తుర్టక్లో పెట్రోలింగ్ చేస్తున్న ఆర్మీ బృందంపై ఉదయం 8 గంటల సమయంలో ఒక్కసారిగా మంచు పడింది. ఇద్దరు జవాన్లు అందులో చిక్కుకుపోయారు. వెంటనే డ్రిల్లింగ్‌తో మంచు తొలగించి లాన్స్ హవల్దార్ భవన్ తమాంగ్‌ను బయటకు తీశాం. తీవ్ర గాయాలతో ఉన్న అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందారు’ అని ఆర్మీ ప్రతినిధి తెలిపారు. ప్రతికూల వాతావరణంలోనూ మరో జవాను కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేశామని, అయినా అతడి జాడ తెలియలేదని చెప్పారు. డార్జిలింగ్‌లోని లోప్షూనకు చెందిన తమాంగ్ మరణం పట్ల ఆర్మీ కమాండర్, లెఫ్టినెంట్ జనరల్ డీఎస్ హుడా తన సంతాపాన్ని ప్రకటించారు. గత నెలలో సియాచిన్ గ్లేసియర్‌లో హిమపాతం దెబ్బకు లాన్స్ నాయక్ హనుమంతప్పతో పాటు పది మంది సైనికులు మత్యు ఒడికి చేరిన విషయం తెలిసిందే. -
జవాను శవపేటికనూ వదలని 'అమ్మ'
చెన్నై: తమిళనాడులో ఏఐఏడీఎంకే మంత్రుల 'అమ్మ' భజన రోజు రోజుకు పెరిగిపోతోంది. మొన్నటికి మొన్న నూతన వధూవరులు బాసికాలపై కూడా దర్శనమిచ్చిన 'అమ్మ' ఇప్పుడు అమరులైన జవానుల శవపేటికలను కూడా వదలలేదు. సియాచిన్‌లో మంచుతుపానులో చిక్కుకుపోయి అమరులైన జవాన్లకు మంగళవారం వారి స్వస్థలాల్లో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి. తమిళనాడులోని మదురైలో సిపాయ్ గణేషన్ అంత్యక్రియలు నిర్వహించారు. అయితే ఇక్కడ కూడా తమిళనాడు సీఎం జయలలిత ఫోటో దర్శనమిచ్చింది. రాష్ట్ర మంత్రి సెల్లూరు రాజు జిల్లా కలెక్టర్ వీర రాఘవరావుతో కలిసి జవాను అంత్యక్రియల కార్యక్రమానికి వచ్చారు. రూ. 10 లక్షల చెక్‌ను ప్రభుత్వం తరఫున సిపాయ్ గణేషన్ తల్లికి అందజేశారు. ఆ తర్వాత జయలలిత ఫోటోను శవ పేటికపై పెట్టి ఈ సాయం అందించింది తనే అంటూ జవాను తల్లికి సైగ చేశారు. దీంతో అప్పటికే ఏడుస్తూ ఉన్న ఆవిడ ఆ ఫోటో చూసి నమస్కారం చేసింది. దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన జవాను శవపేటిక వద్ద రాజకీయాలు చేయడం దారుణమని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జయలలిత పేరును ఎంత వీలైత అంతగా ప్రచారంలోకి తీసుకు రావాలని ఏఐఏడడీఎంకే నేతలు భావిస్తున్నారు. ఇప్పటికే అమ్మ క్యాంటీన్, అమ్మ వాటర్, అమ్మ ఫార్మసి, అమ్మ సిమెంట్, అమ్మ ఉప్పు, అమ్మ ఆముదం, అమ్మ అవార్డులు, అమ్మ థియేటర్. ఇలా అనేక పథకాలు ఏఐఏడీఎంకే అధినేత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను ఉద్దేశించి ప్రారంభించినవే. -
సియాచిన్ జవానుపై పోలీసుల దాడి.. పరిస్థితి విషమం
చిత్తూరు: దేశరక్షణ కోసం సియాచిన్ ప్రాంతంలో విధులు నిర్వర్తించి, అక్కడి నుంచి తిరిగి వచ్చిన ఓ సైనికుడిని చిత్తూరు పోలీసులు సెల్లో వేసి చితక్కొట్టారు. దాంతో అతడి పరిస్థితి విషమంగా మారింది. ఈ ఘటన చిత్తూరు జిల్లా కుప్పంలో జరిగింది. పోలీసుల చేతిలో దెబ్బలు తిన్న సియాచిన్ సైనికుడు వేమనారాయణ పరిస్థితి విషమంగా ఉంది. బెంగళూరు ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అతడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. బైక్‌పై వెళ్తున్న అతడిని పోలీసులు ఆపేందుకు యత్నించారు. అయితే అతడు బైక్ ఆపకుండా వెళ్లడంతో పోలీసులు వేమనారాయణను వెంబడించి... పట్టుకున్నారు. అనంతరం స్టేషన్‌కి తీసుకువెళ్లి విచక్షణారహితంగా కొట్టారు. ఆ క్రమంలో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. తన భర్తపై పోలీసులు దౌర్జన్యం చేశారని జవాను భార్య ఆందోళనకు దిగారు. -
సియాచిన్ అమరులకు అంతిమ వీడ్కోలు
బెంగళూరు/చెన్నై/పుణే: సియాచిన్‌లో మంచుతుపానులో చిక్కుకుపోయి అమరులైన జవాన్లకు మంగళవారం వారి స్వస్థలాల్లో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి. కర్ణాటకలోని పశుపతి గ్రామంలో సిపాయి మహేశ్‌కు.. తేజూరులో సుబేదార్ నగేశ్‌కు అంత్యక్రియలు పూర్తయ్యాయి. తమిళనాడులోని వెల్లూర్‌లో హవల్దార్ ఎలుమలై ఎం, కృష్ణగిరిలో సిపాయి ఎన్ రామమూర్తి, తెనిలో హవిల్దార్ ఎస్ కుమార్, మదురైలో సిపాయ్ గణేషన్లకు అంత్యక్రియలు నిర్వహించారు. మహారాష్ట్రలోని సాతారా జిల్లాలో సియాచిన్ అమరుడు సిపాయ్ సునిల్ సూర్యవంశీ (25), కేరళలోని మునోర్ ద్వీపంలో లాన్స్‌నాయక్ సుధీష్ (29) అధికార లాంఛనాలతో.. అంత్యక్రియలు జరిగాయి. -
ముస్తాక్ కుటుంబానికి చెక్కు అందజేసిన కేఈ
కర్నూలు : సియాచిన్‌లో మరణించిన ఆర్మీ జవాన్ ముస్తాక్ భౌతికకాయానికి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి మంగళవారం ఘనంగా నివాళులర్పించారు. మంగళవారం కర్నూలు జిల్లా నంద్యాల సమీపంలోని పార్నపల్లెలో ముస్తాక్ భౌతికకాయాన్ని కేఈ సందర్శించారు. అనంతరం అతడి కుటుంబ సభ్యులను పరామర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని వారికి భరోసా ఇచ్చారు. ఆ తర్వాత ముస్తాక్ కుటుంబసభ్యులకు రూ. 25 లక్షల చెక్కును కేఈ కృష్ణమూర్తి అందజేశారు. -
సియాచిన్.. ఓ మృత్యు యుద్ధ క్షేత్రం
న్యూఢిల్లీ: లాన్స్ నాయక్ హనుమంతప్ప అతని తొమ్మిదిమంది అనుచరులను మింగేసిన సియాచిన్ మంచు పర్వతం పైకి చల్లగా.. నిశ్శబ్దంగా కనిపించినా అదొక మృత్యుశిఖరం లాంటిదని అక్కడి ఘటనలు చెప్తున్నాయి. ప్రతి నెల మంచుకొండ చరియలు విరిగిపడటం ద్వారానో, లేక ప్రతికూల వాతావరణ పరిస్థితులు అక్కడ ఏర్పడటం మూలంగానో కనీసం ఒక సైనికుడిని బలితీసుకుంటూనే ఉంటుంది. ఇలా, మోగుతున్న భారత వీర జవాన్ల మృత్యు మృదంగం ఇప్పటిదేం కాదు.. 1984 నుంచే ఇది ప్రారంభమైంది. తొలిసారి పాకిస్థాన్ సైన్యాన్ని ఏ విధంగానైనా కట్టడి చేయాలనే ఉద్దేశంతో అత్యంత దుర్భేద్యమైన దాదాపు 22 వేల అడుగుల ఎత్తులో ఉన్న సియాచిన్ గ్లేసియర్ వద్ద భారత సైనిక శిబిరాలను ఏర్పాటుచేశారు. 1984 నుంచి అక్కడ భారత సేనలను నిలపడం ప్రారంభించారు. అంటే దాదాపు ఎవరెస్టు శిఖరం ఎత్తులో భారత జవాన్లు దేశ రక్షణ కోసం గట్టగట్టి చనిపోయే చలిలో నిత్యం గస్తీ కాస్తున్నారన్నమాట. ప్రభుత్వం లోక్ సభలో ప్రకటించిన ప్రకారం 1984 నుంచి 2015 మధ్య మొత్తం 869 మంది భారత సైనికులు సియాచిన్ గ్లేసియర్ వద్ద మృత్యువాత పడ్డారు. దాని అనంతరం జరిగిన కొన్ని ఘటనలు మొన్న జరిగిన ప్రమాదంలో పదిమంది సైనికులను కలుపుకొని మొత్తం ఇక్కడ ప్రాణాలు కోల్పోయిన సైనికుల సంఖ్య 883కు చేరుకుంది. వీరిలో 33 మంది అధికారులు, 54 మంది జూనియర్ ఆఫీసర్లు, 782 ఇతర ర్యాంకుల జవాన్లు ఉన్నారు. కాగా, అత్యధికంగా 2011లో 24 మంది సైనికులు ఈ గ్లేసియర్‌లో మృత్యువాత పడగా.. 2015 ఐదుగురు చనిపోయారు. ఏడాదికి భారత ప్రభుత్వం ఈ ప్రాంత గస్తీ కోసం దాదాపు వేల కోట్లు ఖర్చు చేస్తోంది. ఒక్క 2012-13, 2014-15 మధ్యనే రూ.6,566 కోట్లు ఖర్చు చేసింది. వీటిని అక్కడ ఉండే సైనికులకు కావాల్సిన వస్త్రాలు, పర్వాతారోహణ సామాగ్రి ఇతర వస్తువులకు ఎక్కువగా ఖర్చయ్యేవి. మరో విషయమేమిటంలో సియాచిన్ గ్లేసియర్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో ఉన్న యుద్ధ క్షేత్రం. ఇక్కడ ఉష్ణోగ్రత మైనస్ 45 డిగ్రీలు మాత్రమే ఉంటుంది. ప్రత్యేక చీతా హెలికాప్టర్లు మాత్రమే ఇక్కడికి వెళ్లగలిగి ఆహార సామాగ్రిని చేరవేస్తాయి. ప్రతి సంవత్సరం మూడు బెటాలియన్ల నుంచి 3,000 మంది నుంచి 4 వేలమంది సైనికులు ఇక్కడ భద్రతా సేవలు అందిస్తారు. ఒక్కో బెటాలియన్ మూడు నెలల వరకు ఇక్కడ గస్తీ కాస్తుంది. అయితే,ఇలా ప్రతికూల పరిస్థితులున్నాయని, ప్రాణనష్టం ఎదురవుతుందని అక్కడ నుంచి సైనికులను విరమించుకుంటే దేశ రక్షణ గాలికొదిలేసినట్లవుతుందని, ఇది ఏమాత్రం సురక్షితం కాదని ఇటీవల రక్షణమంత్రి మనోహర్ పారికర్ చెప్పిన మాటలు సరైనవే అని ఆమోదించక తప్పదేమో. -
సియాచిన్‌లో మరో జవాను మృతదేహం లభ్యం
న్యూఢిల్లీ: సియాచిన్‌లో మరో జవాను మృతదేహం లభ్యమైంది. హనుమంతప్పను గుర్తించిన చోటే ముస్తాన్ మహ్మద్ అనే వ్యక్తి మృతదేహం లభించినట్లు అధికారులు తెలిపారు. కాగా, ముస్తాన్ అహ్మద్‌ది కర్నూలు జిల్లా అని అధికారులు చెప్పారు. సియాచిన్‌లో మంచుకొండచరియలు విరిగిపడి పదిమంది జవాన్లు వాటికింద పడిపోయిన విషయం తెలిసిందే. వారిలో, హనుమంతప్ప అనే జవాను కొన ప్రాణాలతో బయటపడినా చివరకు ప్రాణాలుకోల్పోయాడు. ఆ తర్వాత తొమ్మిది మృతదేహాలు ఆచూకీ లభ్యం కాలేదు. కానీ, గురువారం జవాను ముస్తాన్ మహ్మద్ మృతదేహాన్ని గుర్తించినట్లు అధికారులు చెప్పారు. వాతావరణం అనుకూలించకపోవడంతో ఆయన మృతదేహాన్ని స్వస్థలం తరలించేందుకు ఆలస్యమయ్యే అవకాశముందని ఆర్మీ అధికారులు తెలిపారు. -
హనుమంతప్ప మనందరికీ స్ఫూర్తి:వైఎస్ జగన్
హైదరాబాద్: జవాన్ లాన్స్‌నాయక్ హనుమంతప్ప (33) మృతి పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంతాపం ప్రకటించారు. దేశం కోసం హనుమంతప్ప ప్రాణత్యాగం చేశాడని ట్విటర్లో పేర్కొన్నారు. ఆయన మనకు స్ఫూర్తిదాయకమని, ఎప్పటికీ చిరస్మరణీయుడిగా ఉంటాడని జగన్ నివాళులు అర్పించారు. హనుమంతప్ప కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు. సియాచిన్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన హనుమంతప్ప ఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రిఫరల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం 12 గంటల ప్రాంతంలో కనుమూశారు. హనుమంతప్ప మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ, ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సంతాపం ప్రకటించారు. దేశం ఓ గొప్ప సైనికుడిని కోల్పోయిందని నివాళులు అర్పించారు. -
జవాన్ హనుమంతప్ప కన్నుమూత
ఢిల్లీ: సియాచిన్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, మృత్యువుతో పోరాడి జవాన్ లాన్స్‌నాయక్ హనుమంతప్ప (33) తుది శ్వాస విడిచారు. ఆయన ప్రాణాలు కాపాడేందుకు ఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రిఫరల్ ఆస్పత్రి వైద్యులు తీవ్రంగా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. గురువారం 12 గంటల ప్రాంతంలో హనుమంతప్ప కనుమూశారు. హిమాలయ కొండచరియల పైనుంచి కిలోమీటర్ ఎత్తు.. 800 మీటర్ల వెడల్పు ఉన్న మంచు పలక వచ్చి.. సియాచిన్లోని భారత సైనిక శిబిరంపై పడటంతో 9 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. కాగా ఆరురోజుల పాటు 35 అడుగుల లోతున మంచులో కూరుకుపోయిన జవాన్ హనుమంతప్ప ప్రాణాలతో ఉండటం వైద్యనిపుణులను, సైనికాధికారులను సైతం ఆశ్చర్యంలో ముంచెత్తింది. సోమవారం హనుమంతప్పను వెలికితీసి ఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రిఫరల్ ఆస్పత్రికి తరలించారు. కాగా ఆయన ఆరోగ్య పరిస్థితి అప్పటికే విషమంగా మారింది. హనుమంతప్ప కోలుకోవాలని ప్రధాని మోదీతో సహా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రాజకీయ నాయకులు, అధికారులు ఆకాంక్షించారు. ఆయన ప్రాణాలు కాపాడేందుకు వైద్యులు నిరంతరం శ్రమించారు. అయితే మృత్యువుతో పోరాడుతూ హనుమంతప్ప ఈ రోజు మరణించారు. కర్ణాటకలోని థార్వాడ్‌కు చెందిన హనుమంతప్పకు భార్య, ఏడాదిన్నర పాప ఉన్నారు.