'త్రివిద దళాలు దేశానికి గర్వకారణం'
న్యూఢిల్లీ: త్రివిద దళాలు భారత దేశానికి గర్వకారణమని ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసించారు. మోడీ గురువారం జమ్మూకాశ్మీర్ పర్యటనకు వెళ్లారు. సియాచిన్ను సందర్శించి సైనికులనుద్దేశించి ప్రసంగించారు.
దీపావళి మీతో జరుపుకోవడానికి వచ్చానంటూ మోడీ సైనికులనుద్దేశించి వ్యాఖ్యానించారు. సైనిక దళాల వల్లే దేశ ప్రజలు సంతోషంగా దీపావళి చేసుకుంటున్నారని అన్నారు. ప్రపంచమంతా భారత సైనికుల వైపు చూస్తోందని మోడీ పేర్కన్నారు. భారత సైనికుల స్ఫూర్తి మరవలేనిదని చెప్పారు. మోడీ అనంతరం శ్రీనగర్ వెళ్లారు.