శ్రీనగర్ చేరుకున్న ప్రధాని మోదీ | Prime Minister Narendra Modi reaches Srinagar | Sakshi
Sakshi News home page

శ్రీనగర్ చేరుకున్న ప్రధాని మోదీ

Published Thu, Oct 23 2014 2:58 PM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM

శ్రీనగర్ చేరుకున్న ప్రధాని మోదీ - Sakshi

శ్రీనగర్ చేరుకున్న ప్రధాని మోదీ

శ్రీనగర్: ప్రధాని నరేంద్ర మోదీ గురువారం శ్రీనగర్ చేరుకున్నారు. అంతకుమందు సియాచిన్ గ్లేసియర్లోని భారత సైనికులతో దాదాపు రెండు గంటలపాటు గడిపారు. ఈ సందర్భంగా మోదీ సియాచిన్లోని భారత సైనికులతో మాట్లాడుతూ... భారతీయులంతా మీ వెంట ఉన్నారని తెలిపారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో సైతం దేశం కోసం ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వహిస్తున్నారంటూ సైనికుల సేవలను ఈ సందర్బంగా మోదీ కొనియాడారు. దేశ సేవ చేస్తున్న  మీరు ఎంతో సాహసవంతులు అంటూ మోడీ సైనికులను ప్రశంసల జల్లులతో ముంచెత్తారు.

సియాచిన్ నుంచే రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు.  సియాచిన్ ప్రాంతంలో మోదీ ఏరియల్ సర్వే నిర్వహించారు. ఆ తర్వాత ఆయన శ్రీనగర్ చేరుకున్నారు. కాశ్మీర్ వరద బాధితులకు మోదీ గురువారం ఆర్థిక సహాయం ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. ఈ రోజు సాయంత్రం కాశ్మీర్ వరద బాధితులతో కలసి మోదీ దీపావళి వేడుకలు జరుపుకోనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement