సియాచిన్లో మరో జవాను మృతదేహం లభ్యం | another body found in Siachen | Sakshi
Sakshi News home page

సియాచిన్లో మరో జవాను మృతదేహం లభ్యం

Feb 11 2016 4:28 PM | Updated on Sep 3 2017 5:26 PM

సియాచిన్లో మరో మృతదేహం లభ్యమైంది. హనుమంతప్పను గుర్తించిన చోటే ముస్తాన్ మహ్మద్ అనే వ్యక్తి మృతదేహం లభించినట్లు అధికారులు తెలిపారు.

న్యూఢిల్లీ: సియాచిన్లో మరో జవాను మృతదేహం లభ్యమైంది. హనుమంతప్పను గుర్తించిన చోటే ముస్తాన్ మహ్మద్ అనే వ్యక్తి మృతదేహం లభించినట్లు అధికారులు తెలిపారు. కాగా, ముస్తాన్ అహ్మద్ది కర్నూలు జిల్లా అని అధికారులు చెప్పారు. సియాచిన్లో మంచుకొండచరియలు విరిగిపడి పదిమంది జవాన్లు వాటికింద పడిపోయిన విషయం తెలిసిందే.

వారిలో, హనుమంతప్ప అనే జవాను కొన ప్రాణాలతో బయటపడినా చివరకు ప్రాణాలుకోల్పోయాడు. ఆ తర్వాత తొమ్మిది మృతదేహాలు ఆచూకీ లభ్యం కాలేదు. కానీ, గురువారం జవాను ముస్తాన్ మహ్మద్ మృతదేహాన్ని గుర్తించినట్లు అధికారులు చెప్పారు. వాతావరణం అనుకూలించకపోవడంతో ఆయన మృతదేహాన్ని స్వస్థలం తరలించేందుకు ఆలస్యమయ్యే అవకాశముందని ఆర్మీ అధికారులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement