
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్ గాంధీ సరోవర్ ప్రాంతంలో ఆదివారం(జూన్30) ఉదయం మంచు వరద పోటెత్తింది. ‘కేదార్‌నాథ్ దామ్ వెనుకాల ఉన్న మంచుపర్వతం దగ్గర ఉదయం 5 గంటలకు మంచు వరద వచ్చింది.
మంచు వరద వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టాలు జరగలేదు. పర్వతం మీద నుంచి మంచు కిందికి వచ్చింది. ఇది కేదార్‌నాథ్‌లో అలజడికి కారణమైంది’అని రుద్రప్రయాగ్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ విశాఖ అశోక్ తెలిపారు. కాగా, బ్రదినాథ్, కేదార్‌నాథ్, గంగోత్రి, యమునోత్రిలను కలిపి చార్‌దామ్ యాత్రా సర్క్యూట్‌గా పిలుస్తారు.