Chardam trip
-
కేదార్‌నాథ్‌లో మంచు వరద
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లోని కేదార్నాథ్ గాంధీ సరోవర్ ప్రాంతంలో ఆదివారం(జూన్30) ఉదయం మంచు వరద పోటెత్తింది. ‘కేదార్నాథ్ దామ్ వెనుకాల ఉన్న మంచుపర్వతం దగ్గర ఉదయం 5 గంటలకు మంచు వరద వచ్చింది. మంచు వరద వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టాలు జరగలేదు. పర్వతం మీద నుంచి మంచు కిందికి వచ్చింది. ఇది కేదార్‌నాథ్‌లో అలజడికి కారణమైంది’అని రుద్రప్రయాగ్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ విశాఖ అశోక్ తెలిపారు. కాగా, బ్రదినాథ్, కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రిలను కలిపి చార్దామ్ యాత్రా సర్క్యూట్‌గా పిలుస్తారు. -
ప్రారంభమైన చార్ధామ్ యాత్ర
ఉత్తర కాశీ: ఉత్తరాఖండ్‌లో చార్ధామ్ యాత్ర మంగళవారం ప్రారంభమైంది. అక్షయ తృతీయ పర్వదినాన్ని పురస్కరించుకొని మంగళవారం గంగోత్రి, యమునోత్రి ఆలయాలను తెరిచి ప్రత్యేక పూజలు చేశారు. అంతకు ముందు గంగ, యమునా దేవతల విగ్రహాలను ముకాభా, కర్సాలీ నుంచి తీసుకొచ్చి పునఃప్రతిష్టించారు. ఈ సందర్భంగా ఆలయాలకు భక్తులు పోటెత్తారు. కేదార్నాథ్ ఆలయాన్ని ఈ నెల 9న, బద్రీనాథ్ ఆలయాన్ని 10న తెరవనున్నారు. చార్ధామ్ యాత్రలో భాగంగా భక్తులు యమునోత్రి ఆలయంతో ప్రారంభించి వరుసగా గంగోత్రి, కేదార్నాథ్, బద్రినాథ్ ఆలయాలను దర్శిస్తారు. ప్రతి సంవత్సరం దేశ వ్యాప్తంగా లక్షల మంది భక్తులు యాత్రలో పాల్గొంటారు. భారీ హిమపాతం కారణంగా ఈ నాలుగు ఆలయాలను అక్టోబర్–నవంబర్ మాసాల్లో మూసివేసి మళ్లీ ఏప్రిల్– మే నెలల్లో తిరిగి తెరుస్తారు. -
చార్‌ధామ్‌లో ఇరుక్కున్న జగిత్యాలవాసులు
ఉత్తరాఖండ్‌లో విరిగిపడిన కొండచరియలు జగిత్యాల: జగిత్యాల జిల్లా కేంద్రం నుంచి చార్ధామ్ యాత్రకు వెళ్లిన సుమారు 150 మంది యాత్రికులు అక్కడ చిక్కుకున్నారు. అయితే, వారంతా క్షేమంగా ఉన్నట్లు ఇక్కడి బంధువులకు సమాచారం అందించారు. జగి త్యాలకు చెందిన అర్వపల్లి రాజేశం ఆధ్వర్యంలో 74 మంది యాత్రకు వెళ్లగా, అలాగే అంబుదాస్ ట్రావెల్స్ ఆధ్వర్యంలో మరో 50 మంది వెళ్లారు. గత మే 5న వెళ్లిన వీరు ఈనెల 28న తిరిగి రావాల్సి ఉంది. అయితే, కేదారినాథ్‌కు వెళ్తుండగా ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లాలో కొండచరియలు విరిగి పడటంతో అంతరాయం ఏర్పడింది. రాక పోకలు స్తంభించిపోయాయి. దీంతో వారు హతిపహాడ్లోని చిన్న జీయర్‌స్వామి ఆశ్రమానికి చేరినట్లు తెలిసింది. ఇందులో జగిత్యాల, కరీంనగర్, ధర్మపురి, బీర్పూర్, సారంగాపూర్ ప్రాంతాలకు చెందిన వారు ఎక్కువ ఉన్నట్లు తెలిసింది. ఓ ఆశ్రమంలో చిక్కుకున్నారన్న సమాచారంతో ఇక్కడి బంధువులు ఆందోళనకు గురయ్యారు. మే 5న అమ్మనాన్న పల్లెర్ల కిషన్ (68), భారతి (59) యాత్ర కోసం వెళ్లారు. కొండచరియలు విరగడంతో వారు ఆ ప్రాంతంలో ఉండిపోయారు.