కేదార్‌నాథ్‌లో చిక్కుకున్న తెలుగు యాత్రికులు | Telugu Pilgrims Stuck In Kedarnath | Sakshi
Sakshi News home page

కేదార్‌నాథ్‌లో చిక్కుకున్న తెలుగు యాత్రికులు

Published Sat, Aug 3 2024 4:48 PM | Last Updated on Sat, Aug 3 2024 6:50 PM

Telugu Pilgrims Stuck In Kedarnath

సాక్షి, ఢిల్లీ: ఉత్తరాఖండ్‌ కేదార్‌నాథ్‌లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కేదార్‌నాథ్ వరదలలో తెలుగు యాత్రికులు చిక్కుకున్నారు. క్లౌడ్ బరస్ట్, భారీ వర్షాల కారణంగా నడక మార్గం దెబ్బతింది. దాదాపు 1,300 మంది యాత్రికులు కేదార్‌నాథ్, భీంబాలి, గౌరీకుండ్‌లలో చిక్కుకుపోయారని, వారు సురక్షితంగా ఉన్నారని అధికారులు వెల్లడించారు. గౌరీకుండ్ - కేదార్‌నాథ్ మధ్య 13 చోట్ల మార్గం ధ్వంసమైంది. దీంతో ఎక్కడికక్కడ పలువురు యాత్రికులు చిక్కుకుపోయారు.

యాత్రికులను హెలీకాప్టర్లతో సహాయ బృందాలు తరలిస్తున్నాయి. సహాయ చర్యలకు ప్రతికూల వాతావరణం విఘాతం కలిగిస్తోంది. స్థానికులకే ప్రాధాన్యతనివ్వడంతో దూరప్రాంత యాత్రికులు అక్కడే నిలిచిపోయారు. ఆహారం, నీరు అందక యాత్రికులు ఇబ్బందులు పడుతున్నారు. కేదార్‌నాథ్ స్వర్గ రోహిణి కాటేజిలో పలువురు తెలుగు యాత్రికులు ఉన్నారు. సహాయం కోరుతూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కు మెసేజ్ చేశారు. ఆయన ఉత్తరాఖండ్ అధికార యంత్రాంగంతో మాట్లాడారు. వారిని సురక్షితంగా బయటకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామని జిల్లా కలెక్టర్‌ తెలిపారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement