telugu pilgrims
-
కేదార్‌నాథ్‌లో చిక్కుకున్న తెలుగు యాత్రికులు
సాక్షి, ఢిల్లీ: ఉత్తరాఖండ్ కేదార్‌నాథ్‌లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కేదార్నాథ్ వరదలలో తెలుగు యాత్రికులు చిక్కుకున్నారు. క్లౌడ్ బరస్ట్, భారీ వర్షాల కారణంగా నడక మార్గం దెబ్బతింది. దాదాపు 1,300 మంది యాత్రికులు కేదార్నాథ్, భీంబాలి, గౌరీకుండ్‌లలో చిక్కుకుపోయారని, వారు సురక్షితంగా ఉన్నారని అధికారులు వెల్లడించారు. గౌరీకుండ్ - కేదార్నాథ్ మధ్య 13 చోట్ల మార్గం ధ్వంసమైంది. దీంతో ఎక్కడికక్కడ పలువురు యాత్రికులు చిక్కుకుపోయారు.యాత్రికులను హెలీకాప్టర్లతో సహాయ బృందాలు తరలిస్తున్నాయి. సహాయ చర్యలకు ప్రతికూల వాతావరణం విఘాతం కలిగిస్తోంది. స్థానికులకే ప్రాధాన్యతనివ్వడంతో దూరప్రాంత యాత్రికులు అక్కడే నిలిచిపోయారు. ఆహారం, నీరు అందక యాత్రికులు ఇబ్బందులు పడుతున్నారు. కేదార్నాథ్ స్వర్గ రోహిణి కాటేజిలో పలువురు తెలుగు యాత్రికులు ఉన్నారు. సహాయం కోరుతూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కు మెసేజ్ చేశారు. ఆయన ఉత్తరాఖండ్ అధికార యంత్రాంగంతో మాట్లాడారు. వారిని సురక్షితంగా బయటకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామని జిల్లా కలెక్టర్ తెలిపారు.#WATCH | Uttarakhand | Joint search and rescue operations of NDRF & SDRF are underway in Rudraprayag to rescue the pilgrims stranded in Kedarnath and adjoining areas." pic.twitter.com/BOTfOEyaBP— ANI (@ANI) August 3, 2024 -
అమరనాథ్ యాత్రికుల రక్షణకు చర్యలు
కొత్తపేట (హైదరాబాద్) : కశ్మీర్లో కర్ఫ్యూ కొనసాగుతున్న నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళిన అమరనాధ్ యాత్రికుల రక్షణకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప తెలిపారు. సోమవారం తూర్పుగోదావరి జిల్లా కొత్తపేటలో ఎమ్మెల్సీ రెడ్డి సుబ్రహ్మణ్యం స్వగృహంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖా మంత్రి రావెల కిశోర్‌బాబు తదితరులతో కలిసి హోంమంత్రి చిన రాజప్ప విలేకరులతో మాట్లాడుతూ.. ఏపీలో ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు తదితర జిల్లాల నుంచి సుమారు 500 మంది బయలుదేరి వెళ్ళి కశ్మీర్ కర్ఫ్యూలో చిక్కుకున్నారని తెలిపారు. వారంతా సురక్షితంగానే ఉన్నారని, ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తరఫున డీజీపీ అక్కడి డీజీపీతో సంప్రదిస్తున్నారని రాజప్ప తెలిపారు. సీఎం చంద్రబాబు కూడా పరిస్థితిని సమీక్షించారన్నారు. అక్కడ కర్ఫ్యూ సడలించిన అనంతరం యాత్రికులను సురక్షితంగా తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. -
అమర్నాథ్ యాత్ర.. తెలుగు యాత్రికులు క్షేమం
ఢిల్లీ: అమర్నాథ్ యాత్రలో చిక్కుకున్న తెలుగు యాత్రికులు సురక్షితంగా ఉన్నారని ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ శ్రీకాంత్ వెల్లడించారు. శ్రీనగర్‌లో కర్ఫ్యూ కారణంగా శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, ప్రకాశం జిల్లాకు చెందిన యాత్రికులు అవస్థలు పడిన విషయం తెలిసిందే. శ్రీనగర్ ఎస్పీతో ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ శ్రీకాంత్ ఫోన్లో మాట్లాడారు. యాత్రికులకు భోజన వసతి ఏర్పాటు చేశారు. షానీ రిసార్ట్ లో 128 తెలుగు యాత్రికులు ఉన్నారు. ఆర్మీ పర్యవేక్షణలో తెలుగు యాత్రికులు సురక్షితంగా ఉన్నారని, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి యాత్రికులను ఇక్కడికి తీసుకొస్తామన్నారు. -
నకిలీ హెలికాప్టర్ టికెట్లతో మోసం
హైదరాబాద్: కేదార్నాథ్ యాత్ర కోసం వెళ్లిన తెలుగు యాత్రికులు ఇక్కట్లు పడుతున్నారు. విజయవాడ కృష్ణలంక ప్రాంతంలోని బాబూరావు వీధికి చెందిన 54 కుటుంబాలు కేదార్నాథ్ వెళ్లగా తమిళనాడుకు చెందిన ట్రావెల్ ఏజెంట్ చేతిలో మోసపోయారు. అక్కడ తమిళనాడుకు చెందిన ఓ ఏజెంట్.. యాత్రికులకు నకిలీ హెలికాప్టర్ టికెట్లను అంటగట్టాడు. హెలికాప్టర్లో వెళ్లేందుకు బాధితులు ఒక్కొక్కరు ఏజెంట్‌కు రూ. 8,300 చెల్లించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి 130 మంది యాత్రికులు కేదార్‌నాథ్‌కు వెళ్లారు. అయితే ఒక్కొక్కరి వద్ద నుంచి రూ. 50 వేలు వరకు వసూలు చేసినట్టు బాధితులు వాపోయారు. ప్రస్తుతం ఉత్తరఖండ్‌లోని పట్టా, గుప్తకాశి, రుద్రప్రయాగ జిల్లాల్లో బాధితులు ఉన్నట్టు తెలిసింది. మొత్తం 135 మంది బాధితులు ప్రభుత్వ సాయం చేయాలని కోరుతున్నారు. నిజామాబాద్ జిల్లా నుంచి 52 మంది, విజయవాడ నుంచి 54 మంది, వేరే ప్రాంతాల నుంచి మరో 35 మంది కేదార్నాథ్ వెళ్లిన యాత్రికులు ఉన్నారు. రుద్రప్రయాగలోని పోలీసు స్టేషన్ ఎదుట ఈ యాత్రికులంతా నిరసనకు దిగారు. -
చార్‌థామ్ యాత్రలో తెలుగువాళ్ల అవస్థలు
చార్దామ్: ఉత్తరాఖండ్ చార్ధామ్ యాత్రలో తెలుగువాళ్లు అవస్థలు పడుతున్నారు. ఏజెంట్ మోసంతో గుంటూరు జిల్లా వాసులు చిక్కుల్లో పడ్డారు. సుమారు 62మంది తెలుగువాళ్లు కేథార్‌నాథ్‌లో చిక్కుకుపోయారు. వీళ్లలో 42మంది గుంటూరు జిల్లా వినుకొండ, నరసరావుపేట యాత్రికులు ఉన్నారు. ఏజెంట్ మోసంతో చార్ధామ్ యాత్ర మధ్యలోనే నిలిచిపోయింది. శిఖర దర్శనం చేయిస్తానంటూ హెలికాప్టర్ కోసం డబ్బులు తీసుకున్న ఏజెంట్ ఆ తర్వాత పత్తా లేకుండా పోవడంతో యాత్రికులు కష్టాలు పడుతున్నారు. గడ్డకట్టిన చలిలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీళ్లలో 40మందికి పైగా మహిళలు కూడా ఉన్నారు. -
తెలుగువారిని క్షేమంగా తీసుకురండి
ఏపీ భవన్ అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశం సాక్షి, హైదరాబాద్: నేపాల్‌లో చిక్కుకున్న తెలుగువారిని క్షేమంగా తీసుకురావాలని ఏపీ భవన్ అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కార్యాలయం ఆదివారం ఓ ప్రకటన విడుదల చేసింది. నేపాల్ నుంచి సురక్షితంగా ఢిల్లీకి చేరుకున్న తెలుగు యాత్రికులను స్వస్థలాలకు చేర్చేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని కేంద్ర మంత్రి వైఎస్ చౌదరి, ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ అధికార ప్రతినిధి కంభంపాటిని సీఎం కోరినట్లు తెలిపింది. నేపాల్‌లోని బాధితుల వివరాలు సేకరించడానికి అక్కడి రాయబారి కార్యాలయంతో, విదేశాంగ శాఖ అధికారులతో సంప్రదింపులు జరపాలని సూచించినట్లు పేర్కొంది. 10 విమానాల్లో తరలింపు ఏర్పాట్లు అమలాపురం: నేపాల్‌లో చిక్కుకుపోయిన 152 మందిని గుర్తించి స్వస్థలాలకు తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప తెలిపారు. అమలాపురంలో ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ, ఇద్దరు ప్రత్యేక అధికారుల పర్యవేక్షణలో కఠ్మాండు నుంచి 10 ప్రత్యేక విమానాల్లో ఢిల్లీకి తరలించే ఏర్పాట్లు చేశామని చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన 52 మంది, తూర్పు గోదావరికి చెందిన ఎనిమిది మంది, కృష్ణా జిల్లాకు చెందిన 21 మంది, నెల్లూరుకు చెందిన 40 మంది, విశాఖకు చెందిన 15 మంది, శ్రీకాకుళానికి చెందిన పది మంది నేపాల్‌లో చిక్కుకున్నారని తెలిపారు. సచివాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని, బాధితుల వివరాల కోసం 040-23456005, 23451819 నంబర్లను సంప్రదించాలని కోరారు. -
పంపా వద్ద 34 మంది తెలుగు యాత్రికులు క్షేమం
శబరిమల వెళ్లే మార్గంలో పంపా సమీపంలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. శబరిమల యాత్రకు వెళ్లి వస్తున్న 34 మంది తెలుగువారు గత అర్థరాత్రి పంపా వద్ద వరదనీటిలో చిక్కుకున్నారు. దాంతో స్థానికులు అందించిన సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన వరద ప్రాంతానికి చేరుకుని, తెలుగువారిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. అయితే వారిని కాపాడే క్రమంలో అగ్నిమాపక సిబ్బందిలో ఒకరు వరదల్లో కొట్టుకుపోయారు. దాంతో అతన్ని రక్షించేందుకు అగ్నిమాపక సిబ్బంది చర్యలు చేపట్టారు.