ఉత్తరాఖండ్ చార్ధామ్ యాత్రలో తెలుగువాళ్లు అవస్థలు పడుతున్నారు. ఏజెంట్ మోసంతో గుంటూరు జిల్లా వాసులు చిక్కుల్లో పడ్డారు.
చార్దామ్: ఉత్తరాఖండ్ చార్ధామ్ యాత్రలో తెలుగువాళ్లు అవస్థలు పడుతున్నారు. ఏజెంట్ మోసంతో గుంటూరు జిల్లా వాసులు చిక్కుల్లో పడ్డారు. సుమారు 62మంది తెలుగువాళ్లు కేథార్నాథ్లో చిక్కుకుపోయారు. వీళ్లలో 42మంది గుంటూరు జిల్లా వినుకొండ, నరసరావుపేట యాత్రికులు ఉన్నారు. ఏజెంట్ మోసంతో చార్ధామ్ యాత్ర మధ్యలోనే నిలిచిపోయింది. శిఖర దర్శనం చేయిస్తానంటూ హెలికాప్టర్ కోసం డబ్బులు తీసుకున్న ఏజెంట్ ఆ తర్వాత పత్తా లేకుండా పోవడంతో యాత్రికులు కష్టాలు పడుతున్నారు. గడ్డకట్టిన చలిలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీళ్లలో 40మందికి పైగా మహిళలు కూడా ఉన్నారు.