kedharnath
-
ఆలయంలో ప్రేమికులు చేసిన పనిని సమర్థించిన నటి
కేదార్నాథ్ ఆలయ ప్రాంగణంలో ఒక యువతి తన ప్రియుడికి ప్రపోజ్ చేసింది. దానిని వారి యూట్యూబ్‌లో పెట్టారు. ఆ వీడియో వైరల్ కావడంతో.. వారిపై చర్యలు తీసుకోవాలని ఆలయ సిబ్బంది పోలీసులను కోరారు. దీంతో ఉత్తరాఖండ్ పోలీసులు కూడా చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. అదే సమయంలో, ఈ జంటకు సినిమా కారిడార్ నుంచి మద్దతు లభించింది. బాలీవుడ్ నటి రవీనా టాండన్ ఈ జంటకు తన మద్దతును అందించింది. (ఇదీ చదవండి: మహేష్ డాటర్ సితారకు ఇంత ఫేమ్ రావడానికి కారణం ఎవరో తెలుసా?) తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఆ జంట ఫోటోతో పాటు ఇలా తెలిపారు. భక్తుడికి పవిత్రమైన ప్రదేశం దేవాలయం కాబట్టి వారి ప్రేమకు దేవుడి ఆశీర్వాదం కోరుకున్నారని రవీనా తెలిపింది. అంతేకాకుండా ప్రేమకు దేవుడు ఎప్పుడు వ్యతిరేకంగా మారాడో చెప్పాలని ప్రశ్నించింది. బహుశా అందరి మాదిరి పాశ్చాత్య మార్గంలో గులాబీలు, కొవ్వొత్తులు, చాక్లెట్, రింగులు ఇచ్చి తమ ప్రేమను తెలపడమే మంచిదని భావిస్తున్నారా? అని పేర్కొంది. నిజంగా ఇది బాధాకరం. తమ ప్రేమ సఫలం కావడానికి దేవుడి ఆశీస్సులు కావాలని కోరుకున్న వారిపై ఎలాంటి చర్యలు తీసుకోనున్నారో చెప్పాలని రవీనా కోరింది. (ఇదీ చదవండి: ప్రభాస్ 'ప్రాజెక్ట్-కె' నుంచి బిగ్ అనౌన్స్మెంట్..!) ఇటీవల కేదార్నాథ్ ఆలయం సమీపంలో తన ప్రియుడితో కలిసి కనిపించిన మహిళా యూట్యూబర్ ఈ వీడియోను చిత్రీకరించింది. ఆమె మోకాళ్లపై నిల్చోని తన ప్రియుడికి ఉంగరం ఇచ్చి ప్రపోజ్ చేసింది. ఈ వీడియో కొద్ది సేపటికే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో బయటకు వచ్చిన తర్వాత, కొందరు వ్యక్తులు అభ్యంతరం వ్యక్తం చేశారు. పరమ శివుడి ముందే పరాచకాలా అంటూ పలువురు ఈ జంటపై మండిపడుతున్నారు. ఇక నుంచి ఆలయ ప్రాంగణంలో మొబైల్ బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అదే సమయంలో, బద్రీ-కేదార్నాథ్ ఆలయ కమిటీ కూడా ఈ వీడియోపై అభ్యంతరం వ్యక్తం చేసింది. మరీ పోలీసుల ఎలాంటి చర్యలు తీసుకుంటారో తెలియాల్సి ఉంది. -
నవాబ్ చేసిన తప్పేంటి? ఎందుకీ డ్రామా?
మహాభారత స్వర్గారోహణ పర్వంలో.. యుధిష్ఠిరుడు(ధర్మరాజు) వెంట మేరు పర్వతం శిఖరాగ్రానికి చేరుకుంటుంది ఓ శునకం. అయితే ఇంద్రుడు మాత్రం శునకం అపవిత్రమైందని దాని ప్రవేశానికి అడ్డుపడతాడు. విశ్వాసానికి మారుపేరు.. పైగా ఎలాంటి లాభాపేలేకుండా నిస్వార్థంతో తన వెంట నడిచిన శునకానికి అనుమతి ఇవ్వాలంటూ ధర్మరాజు వేడుకుంటాడు. ఆపై ఆ శునకం యమధర్మరాజు పెట్టిన పరీక్షగా తేలడం.. చివరకు ధర్మమే నెగ్గుతుందని చెప్పడంతో ఆ ఘట్టం ముగుస్తుంది. ఇప్పుడు ఈ సందర్భం ఇప్పుడు ఎందుకు అంటారా?.. కేధార్నాథ్ యాత్రలో ఓ ఘటన ఇప్పుడు ఇంటర్నెట్ దృష్టిని ఆకట్టుకుంటోంది. అదే సమయంలో అభ్యంతరాలు.. ప్రతి విమర్శలు దారి తీసింది అది. నవాబ్ అనే ఓ శునకం.. తన ఓనర్‌తో కలిసి కేదార్నాథ్ పుణ్యక్షేత్రంలో కలియ దిరగడమే ఇందుకు ప్రధాన కారణం. నోయిడాకు చెందిన వికాస్ త్యాగి(33) అనే వ్యక్తి.. ఎక్కడికి వెళ్లినా తన పెంపుడు కుక్క నవాబ్ వెంటపెట్టుకెళ్లడం అలవాటు. ఈ క్రమంలో చార్ధామ్ యాత్రకు వెళ్లిన వికాస్ కూడా నవాబ్‌ను తీసుకెళ్లాడు. View this post on Instagram A post shared by Nawab Tyagi Huskyindia0 (@huskyindia0) కేదార్నాథ్ పుణ్యక్షేత్రం నంది విగ్రహం దగ్గర దాని పాదాలను ఉంచి, నుదుట కుంకుమ కూడా పెట్టాడు. ఈ వీడియో కాస్త ఇన్స్టాగ్రామ్, ఇతర ప్లాట్‌ఫామ్‌లలో వైరల్ అయ్యింది. అయితే బద్రీనాథ్-కేదార్నాథ్ టెంపుల్ కమిటీ మాత్రం ఈ వీడియోపై మరోలా రియాక్ట్ అయ్యింది. సదరు భక్తుడిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ బుధవారం ఒక ఫిర్యాదు చేసింది. ఆ విజువల్స్ మతపరమైన మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయంటూ వాదించింది. అంతేకాదు ఈ ఘటనపై ఎఫ్ఐఆర్ కూడా నమోదు అయ్యింది. అయితే వికాస్ మాత్రం తన చర్యను సమర్థించుకుంటున్నాడు. గత నాలుగేళ్లలో నవాబ్ తనతో పాటు దేశంలో ఎన్నో గుడులు తిరిగాడని, అందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అయ్యాయని, కానీ, ఇప్పుడు ఈ డ్రామాలు ఎందుకని ప్రశ్నిస్తున్నాడు. ఈ కుక్క కూడా దేవుడి సృష్టిలో భాగమనే అంటున్నాడు. View this post on Instagram A post shared by Nawab Tyagi Huskyindia0 (@huskyindia0) 20 కిలోమీటర్ల ట్రెక్కింగ్ తర్వాత ఆయాలనికి చేరుకున్నాం. దారి పొడువునా ఎంతో మంది భక్తులు.. నవాబ్‌ను దగ్గరికి తీసుకున్నారు. దానితో ఫొటోలు తీసుకున్నారు. ఆ భక్తగణానికి లేని అభ్యంతరం.. కమిటీ వాళ్లకే వచ్చిందా? అని ప్రశ్నిస్తున్నాడు వికాస్. ఇదిలా ఉంటే.. సోషల్ మీడియాలో వికాస్‌కే విపరీతమైన మద్దతు లభిస్తోంది. స్వర్గారోహణలో యుధిష్ఠిరుడు వికాస్ అయితే.. వెంట వెళ్లిన శునకం నవాబ్ అని పోలుస్తున్నారు. కడకు ధర్మమే నెగ్గుతుందని కామెంట్లు చేస్తున్నారు చాలామంది. చదవండి: అయ్యా ఎమ్మెల్యే సారూ అదేం పని.. వీడియో -
బద్రీనాథ్, కేదార్నాథ్ ఆలయాల సందర్శనకు ప్రధాని మోదీ
గోపేశ్వర్ (ఉత్తరాఖండ్): హిమాయాల్లోని బద్రీనాథ్, కేదార్నాథ్ ఆలయాలను ప్రధాన నరేంద్ర మోదీ మేలో సందర్శించనున్నారు. గంగోత్రి, యమునోత్రిలతో కూడిన చార్ ధామ్ యాత్రలో భాగమైన ఈ ఆలయాలు ఏటా శీతాకాలంలో ఆర్నెల్లు మూతబడి ఉంటాయన్నది తెలిసిందే. గంగోత్రి, యమునోత్రి ఆలయాలు మే 3న, కేదార్నాథ్ మే 6, బద్రీనాథ్ మే 8న తెరుచుకోనున్నాయి. చదవండి: (మంత్రులకు, అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసిన యూపీ సీఎం యోగి) -
కూలిన విమానం; రెండు ఐఏఎఫ్ హెలికాప్టర్లతో...
డెహ్రాడూన్ : భారత వైమానిక దళం మరోసారి సత్తా చాటింది. కేదార్నాథ్ సమీపంలో కూలిపోయిన ఓ పౌర విమానాన్ని కాపాడటంలో విజయవంతమైంది. ఈ నెల 26న ఎమ్ఐ-17, వీ5 అనే రెండు భారత వైమానిక దళ విమానాలు ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నాయి. వివరాలు.. కొద్ది రోజుల క్రితం యుటి ఎయిర్ ప్రైవేటు విమానం కేదార్నాథ్ దేవాలయం సమీపంలో 1500 అడుగులో ఎత్తులో హెలిప్యాడ్ వద్ద కూలిపోయింది. దీంతో ఆ విమానాన్ని బయటకు తీసేందుకు సహాయం చేయాల్సిందిగా సదరు సంస్థ ఉత్తరాఖండ్ ప్రభుత్వం ద్వారా భారత వైమానిక దళాన్ని కోరింది. అంతేగాక దేవాలయం మూసివేయకముందే వాటిని బయటకు తీయాలని విఙ్ఞప్తి చేసింది. ఈ నేపథ్యంలో శనివారం రంగంలోకి దిగిన ఐఏఎఫ్ హెలికాప్టర్లు.. సదరు విమానాన్ని ఘటనా ప్రాంతం నుంచి తరలించాయి. వీటిలో ఒకటి కూలిన విమానాన్ని పైకి తీయడానికి ప్రయత్నించగా, మరొకటి దానికి సహాయాన్ని అందించింది. కూలిన విమానాన్ని హెలికాప్టర్‌కు కింది భాగాన కట్టి, అనంతరం దానిని పైకి తీసి డెహ్రడూన్‌లోని సహస్త్రధార ప్రాంతానికి చేర్చారు. కేదార్నాథ్ ప్రాంతంలో ఇరుకైన లోయలు, కేవలం ఫుట్ ట్రాక్ కనెక్టివిటీ మాత్రమే ఉన్నందున విమానాన్ని వేరే ప్రాంతానకి తరలించడం ఓ సవాలుగా మారిందని, అయితే ఐఏఎఫ్ దీనిని విజయవంతంగా పూర్తి చేసిందని... ఇది ఐఏఎఫ్ నైపుణ్యతకు నిదర్శమని భారత వైమానికి దళ ప్రతినిధి పేర్కొన్నారు. #WATCH On 26 October, Mi 17 V5 helicopters of Indian Air Force evacuated a crashed aircraft of UT Air Pvt limited at 11500 feet at Kedarnath helipad. The helicopter was flown to Sahastradhara near Dehradun #Uttarakhand pic.twitter.com/fgoOxKIMSr — ANI (@ANI) October 27, 2019 -
భారీ వర్షాలు.. హై అలర్ట్
సాక్షి, న్యూఢిల్లీ : భారీ వర్షాలతో ఉత్తరాది రాష్ట్రాలు అతలాకుతలం అవుతున్నాయి. ఇప్పటికే హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కశ్మీర్, హర్యానా రాష్ట్రాల్లో భారీ వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందలు పడుతున్నారు. మరో రాష్ట్రానికి భారీ వర్ష సూచన ఉన్నట్లు అధికారులు తెలిపారు. రాగల 36 గంటల్లో ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ అధికారులు తెలిపారు. దీంతో కేదార్నాథ్, యమునోత్రి యాత్రికులకు ముందుస్తు హెచ్చరికలు జారీ చేశారు. భారీ వర్ష సూచన ఉండటంతో వరదలు సంభవించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎన్డీఆర్ఎఫ్ దళాలను రంగంలోకి దింపుతున్నట్లు అధికారులు తెలిపారు. ఉత్తరాదిన కురుస్తున భారీ వర్షాలకు వివిధ ప్రాంతాల్లో ఇప్పటికే పది మందికి పైగా మృతి చెందారు. కొండచరియలు విరిగిపడడంతో కొండ ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురైతున్నారు. హిమచల్ ప్రదేశ్‌లోని బీయాస్ నది తీవ్ర ఉదృతంగా ప్రవహిస్తుడడంతో పలు రాష్ట్రాల్లో ఇప్పటికే హై అలర్టు ప్రకటించారు. -
చార్‌థామ్ యాత్రలో తెలుగువాళ్ల అవస్థలు
చార్దామ్: ఉత్తరాఖండ్ చార్ధామ్ యాత్రలో తెలుగువాళ్లు అవస్థలు పడుతున్నారు. ఏజెంట్ మోసంతో గుంటూరు జిల్లా వాసులు చిక్కుల్లో పడ్డారు. సుమారు 62మంది తెలుగువాళ్లు కేథార్‌నాథ్‌లో చిక్కుకుపోయారు. వీళ్లలో 42మంది గుంటూరు జిల్లా వినుకొండ, నరసరావుపేట యాత్రికులు ఉన్నారు. ఏజెంట్ మోసంతో చార్ధామ్ యాత్ర మధ్యలోనే నిలిచిపోయింది. శిఖర దర్శనం చేయిస్తానంటూ హెలికాప్టర్ కోసం డబ్బులు తీసుకున్న ఏజెంట్ ఆ తర్వాత పత్తా లేకుండా పోవడంతో యాత్రికులు కష్టాలు పడుతున్నారు. గడ్డకట్టిన చలిలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీళ్లలో 40మందికి పైగా మహిళలు కూడా ఉన్నారు.