Raveena Tandon Supports Couple Love Proposal Video At Kedarnath Temple - Sakshi
Sakshi News home page

ప్రేమికులపై ఫిర్యాదు.. వారు చేసిన తప్పేంటంటూ సమర్థించిన నటి

Published Fri, Jul 7 2023 11:05 AM

Raveena Tandon Supports Couple Love Proposal Video At Kedarnath Temple - Sakshi

కేదార్‌నాథ్ ఆలయ ప్రాంగణంలో  ఒక యువతి తన ప్రియుడికి ప్రపోజ్ చేసింది. దానిని వారి యూట్యూబ్‌లో పెట్టారు. ఆ వీడియో వైరల్ కావడంతో.. వారిపై చర్యలు తీసుకోవాలని ఆలయ సిబ్బంది పోలీసులను కోరారు. దీంతో ఉత్తరాఖండ్ పోలీసులు కూడా చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.  అదే సమయంలో, ఈ జంటకు సినిమా కారిడార్ నుంచి మద్దతు లభించింది. బాలీవుడ్ నటి రవీనా టాండన్ ఈ జంటకు తన మద్దతును అందించింది. 

(ఇదీ చదవండి: మహేష్‌ డాటర్‌ సితారకు ఇంత ఫేమ్‌ రావడానికి కారణం ఎవరో తెలుసా?)

తన ఇన్‌స్టాగ్రామ్‌లో  ఆ జంట ఫోటోతో పాటు ఇలా తెలిపారు. భక్తుడికి పవిత్రమైన ప్రదేశం దేవాలయం కాబట్టి వారి ప్రేమకు దేవుడి ఆశీర్వాదం కోరుకున్నారని రవీనా తెలిపింది. అంతేకాకుండా ప్రేమకు దేవుడు ఎప్పుడు వ్యతిరేకంగా మారాడో చెప్పాలని ప్రశ్నించింది. బహుశా అందరి మాదిరి పాశ్చాత్య మార్గంలో  గులాబీలు, కొవ్వొత్తులు, చాక్లెట్, రింగులు ఇచ్చి తమ ప్రేమను తెలపడమే మంచిదని భావిస్తున్నారా? అని పేర్కొంది. నిజంగా ఇది బాధాకరం. తమ ప్రేమ సఫలం కావడానికి దేవుడి ఆశీస్సులు కావాలని కోరుకున్న వారిపై ఎలాంటి చర్యలు తీసుకోనున్నారో చెప్పాలని రవీనా కోరింది.

(ఇదీ చదవండి: ప్రభాస్‌ 'ప్రాజెక్ట్‌-కె' నుంచి బిగ్‌ అనౌన్స్‌మెంట్‌..!)

ఇటీవల కేదార్‌నాథ్ ఆలయం సమీపంలో తన ప్రియుడితో కలిసి కనిపించిన మహిళా యూట్యూబర్ ఈ వీడియోను చిత్రీకరించింది. ఆమె మోకాళ్లపై నిల్చోని తన ప్రియుడికి ఉంగరం ఇచ్చి ప్రపోజ్ చేసింది. ఈ వీడియో కొద్ది సేపటికే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో బయటకు వచ్చిన తర్వాత, కొందరు వ్యక్తులు అభ్యంతరం వ్యక్తం చేశారు. పరమ శివుడి ముందే పరాచకాలా అంటూ పలువురు ఈ జంటపై మండిపడుతున్నారు. ఇక నుంచి ఆలయ ప్రాంగణంలో మొబైల్ బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అదే సమయంలో, బద్రీ-కేదార్‌నాథ్ ఆలయ కమిటీ కూడా ఈ వీడియోపై అభ్యంతరం వ్యక్తం చేసింది. మరీ పోలీసుల ఎలాంటి చర్యలు తీసుకుంటారో తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement